ఆమెకు తన గురించి ఖచ్చితంగా తెలిసిపోయింది.
అంతా ఆమెకు తెలిసిపోయిందంటే తమా మధ్యనున్న ప్రేమనుకూడా లెక్కచేయనంత మొండిగా మారిపోతుంది. ఆమె పట్టుదల ఎలాంటిదో , అబద్దాలను సహించలేని ఆమె మనస్తత్వం ఎలాంటిదో తనకు బాగా తెలుసు.
అతనలా ఆలోచిస్తుండగానే.....
"హల్లో శేఖర్ ....ఏమిటోయ్....సమాధానం చెప్పకుండా అలా మౌనంగా వుండిపోయావు....అసలే మొండికేసులతో టెన్షన్ లో పడి మన శ్శాంతి కరువ్తేన నాకు కనిసం నీ పలకరింపుకూడా కారువ్తేతే నేనేమ్తే పోయేది చెప్పు" ఆమె చెప్పకుపోతోంది.
ధీరజ గొంతులో పూర్వమంత ఆగ్రహంకనిపించలేదు.
అంటే....ఆమె అలా కోపాన్ని కావాలని ప్రకటిస్తుందన్నమాట! అలా అయితే ఆమె కోపం నిజంకాదు కాబట్టి ఏం ఫరవాలేదన్నమాట.
"శేఖర్! వసపోసిన పిట్టలా నేను వాగుతున్నానే తప్పు....నువ్వు మాట్లాడవేమిటి?" చిరుకోపంతో ప్రశ్నించింది.
"అవును....మరేం చేయమంటావు దిరజా? ఈ దినుడి ప్తే ఆకారణ ఆగ్రహం ఎందుకోచ్చిందో తెలియలికదా...దేవిగారిపట్ల ఈ దీనుడు చేసిన అపరాధం ఏమిటో సెలవిసతారా దేవి?" నవ్వుతూ ప్రశ్నించాడు.
అతనికి లోలోపల బెరుగ్గానే వుంది.
ఆమె చెప్పే జవాబుకోసం నిరీక్షించాడు.
ఒక్క క్షణం మౌనం తరువాత.....
ఫోన్ లో పకపకా నవ్వు వినిపించింది.
ఆమె నవ్వు అతనిని తన్మయత్వంలోకి తీసుకెళ్ళింది.
"మరి నువ్వు నిన్న సాయంత్రం వస్తానని చెప్పి రాకుండా ఎగ్గొడితే కోపం రాదా ఏమిటి?" చిరుకోపంతో ప్రశ్నించిందామె.
ఆమె జావాబు విని 'హమ్మయ్య' అని తేలిగ్గా ఊపిరిల్చుకున్నాడు.
అంటే, అంకు తన గురించి ఏమీ తెలియదన్నమాట...ఇదే సిటిలో తను వున్న విషయం ఆమెకు ఎక్కడ తెలిసిపోయిందోనని తను అనవసరంగా ఖమ్గారుపడ్డాడు. నిన్న సాయంత్రం తను ఆమెను కలవనందుకుగాను అలిగిందని తేలిపోయింది.
"సారి ధీరూ! నిన్న సాయంత్రం పనుల హడావుడిలో కుదరలేదు. ఈ వేళ సాయంత్రం తప్పనిసరిగా కలుసుకుంటాను" అన్నాడతను.
"నీ మాటలు నమ్మమంటావు...."
"నిజం ధీరూ!"
"ఓ.కే....ఈవేళ సాయంత్రం రావడం ఎగ్గోట్టేవో ....నీ పని పడతాను అంతే" ఆల్తిమెటామ్ జారిచేసింది.
"ఘ్యోర్! ఈవేళ దేవిగారి దర్శనం చేసుకోవడం గ్యారంటి" నవ్వుతు అన్నాడు శేఖర్.
"నీ గురించి ఎదురు చూస్తుంటాను. నీ మాట ఎంతవరకు నిలబెట్టు కుంటావో చూస్తానుగా" అని చెప్పి రిసీవర్ పెట్టేసింది ధీరజ.
అక్కడ ఫోన్ క్రేడిల్ చేసిన శేఖర్ తలపట్టుకు కూర్చుండి పోయాడు.
* * * *
లెక్చరర్ నిలిమను హాస్పిటల్ లో చేర్పించిన రోజు.....
రాత్రి పన్నెండు గంటలు కావడానికి ఇంకా మూడు నిమిషాలు వ్యవధి వుంది.
ఆ హాస్పిటల్ సిబ్బందిలో వార్డుబోయ్స్ , న్తెట్ షిఫ్ట్ లో వున్న డ్యూటి నర్సులు తప్పు పేషెంట్లు కానీ, వారితో వున్న బంధువులుకానీ దాదాపుగా ఎవరూ మెలకువగ లేరనే చెప్పొచ్చు!
అంతకుముందు పది నిముషాల క్రితమే ఒక అర్జెంట్ ఆపరేషన్ కేసుకు ఆరేండ్ కావడానికి వచ్చాడు ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్.
ఆయన ఆపరేషన్ ధియేటర్ లోకి వెళ్ళిన మరునిమిషంలోనే జరిగిపోయిందొక సంఘటన.
అంతవరాకూ సపితల్ కాంపౌండ్ ఆవరణలో చెట్లప్తె విశ్రాంతి తీసుకుంటున్న రాబందు వున్నట్లుండి ఎవరో తట్టిలేపినట్టు చటుక్కున కళ్ళు తెరిచింది దాని కళ్ళల్లో ఏదో వింత వుత్సాహం ...రెక్కలు తపతప లాడిస్తూ ఒక్క సారిగా గాలిలోకి ఎగిరి హాస్పిటల్ చుట్టూ రౌండ్లూ కొడుతోంది....
మెయిన్ గేటు ముందున్న గూర్ఖా కునికిపాట్లు పడుతున్నాడే తప్ప తెల్లని దుస్తులు ధరించి ఒక యువహీ తన ముందునుంచే హాస్పిటల్ లోకి వెళుతోందనీ గమనించలేదు.
ఒకవేళ అతనే గనుక...ఆమెను పరీక్షగా చూడటం జరిగినట్టయితే తెల్లని దుస్తులు ధరించి, మామూలు మనిషికన్నా వేగంగా తనను దాటి వెళ్ళిపోతున్న ఆమెవ్తేపు వింతగా చూసివుండేవాడు.
ఒక నమ్మలేని నిజాన్ని ఆ సమయంలోనే తెలుసుకుని వుండే వాడు.