Previous Page Next Page 
హృదయాంజలి పేజి 28

        నీలి నీలి మబ్బుల్ని రంగులుగా కలిపి వేశారా అన్నట్లున్న ఓ అందమైన నీలిరంగు మేడ!
 
    గూర్ఖా ఎవరూ లేకపోవడంవల్ల నిరాటంకంగా గేటు తెరుచుకొని లోపలికి అడుగుపెట్టింది అపురూప.మేడముందు నయన మనోహరంగా పూలతో స్వాగతం చెబుతున్నట్టుగా వుంది చిన్న పూలతోట.
 
    చెట్లపాదులు పారతో సరిచేస్తున్న మాలి అపురూపను చూసి లేచి నిలబడ్డాడు. "ఎవరు కావాలమ్మా?"
 
    "అమ్మగారున్నారా?"
 
    "ఉన్నారు!"
 
    "కుక్కలున్నాయా?"
 
    "కట్టేసుంది!"
 
    చక చకా వరండాని సమీపించి కాలింగ్ బెల్ నొక్కింది.

    రెండే రెండు నిముషాల్లో ఒకావిడ వచ్చి తలుపు తీసింది, ఆమెకు వయసు నలబై వుంటుంది!

    ప్రశ్నార్దకంగా చూడసాగింది.

    "నేను ఉషోదయం పత్రిక నుండి వచ్చాను మేడమ్! ఒక్క ఐదు నిమిషాలు నా కోసం స్పెండ్ చేయగలరా?"
    నమ్రతగా అడుగుతున్న ఆ తీరు ఎలాంటివాళ్ళనీ కాదనలేనట్టుగా వుంది.
 
    ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడకుండా ఊరుకోలేని సౌందర్యం! తీరైన అవయవ సౌష్టవం. నిండైన తలకట్టు. ఆ ముఖంలో ఆ కళ్ళు ఒక ప్రత్యేకం. విశాలమైన రెప్పలకి విసనకర్రల్లా వెంట్రుకలు.
 
    మంత్రముగ్దురాలయినట్టుగా ఆమెను వరండా దాటించి హాల్లోకి తీసుకెళ్ళి "కూర్చోండి" అంది.

    "మీరు ఏ ఏ మాగజైన్సు, డైలీపేపర్లు తెప్పిస్తుంటారు మేడమ్?"
 
    ఆమె చెప్పింది. అవన్నీ ఇంగ్లీషువే!

    "ఇంగ్లీషు వచ్చినవాళ్ళు ఇంగ్లీషుని చదవడంలో తప్పులేదుగాని తెలుగు పత్రికల్ని అనాదరం చెయ్యకూడదుగా , మేడమ్? మీ యింటికి ఒక్కటైనా తెలుగు పత్రికవస్తే బాగుంటుంది. అది మా ఉషోదయం అయితే మరీ బాగుంటుంది!" అంటూ ఉషోదయం అందించింది.

    "ఓ! పత్రిక కాన్వాసింగుకి వచ్చావన్నమాట! సెన్సెస్ కో, మరే సర్వేకో వచ్చావనుకొన్నాను" ఆవిడ స్నిగ్ధంగా నవ్వింది. "తెలుగైనా ఇంగ్లీష్ అయినా అంతగా చదివే ఇంట్రెస్టు లేదమ్మాయ్! అసలు చదివే ఇంటరెస్టే పోయింది. ఇరవయ్యేళ్ళ క్రితం అయితే మన పత్రికల్లో వచ్చే సీరియల్స్ ని పిచ్చిగా చదివేదాన్ని. అవి ఇప్పుడైనా ప్రతి సంఘటనా కళ్ళకు కట్టినట్టు చెప్పగలను! ఇప్పుడు పత్రికల్లో చదవడానికి ఏముంది? గూండాయిజం, రేపులు, మర్డర్లు! అన్ని సీరియల్స్ ఒకేలా అనిపిస్తాయి. మళ్ళీ వారం వచ్చేసరికి ఏ కథ ఏదో గుర్తుండదు!" నీలి నీలి మబ్బుల్ని రంగులుగా కలిపి వేశారా అన్నట్లున్న ఓ అందమైన నీలిరంగు మేడ!
 
    గూర్ఖా ఎవరూ లేకపోవడంవల్ల నిరాటంకంగా గేటు తెరుచుకొని లోపలికి అడుగుపెట్టింది అపురూప. మేడముందు నయన మనోహరంగా పూలతో స్వాగతం చెబుతున్నట్టుగా వుంది చిన్న పూలతోట.
 
    చెట్లపాదులు పారతో సరిచేస్తున్న మాలి అపురూపను చూసి లేచి నిలబడ్డాడు. "ఎవరు కావాలమ్మా?"

    "అమ్మగారున్నారా?"
 
    "ఉన్నారు!"
 
    "కుక్కలున్నాయా?"
 
    "కట్టేసుంది!"
 
    చక చకా వరండాని సమీపించి కాలింగ్ బెల్ నొక్కింది.

    రెండే రెండు నిముషాల్లో ఒకావిడ వచ్చి తలుపు తీసింది, ఆమెకు వయసు నలబై వుంటుంది!

    ప్రశ్నార్దకంగా చూడసాగింది.

    "నేను ఉషోదయం పత్రిక నుండి వచ్చాను మేడమ్! ఒక్క ఐదు నిమిషాలు నా కోసం స్పెండ్ చేయగలరా?"
    నమ్రతగా అడుగుతున్న ఆ తీరు ఎలాంటివాళ్ళనీ కాదనలేనట్టుగా వుంది.
 
    ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడకుండా ఊరుకోలేని సౌందర్యం! తీరైన అవయవ సౌష్టవం. నిండైన తలకట్టు. ఆ ముఖంలో ఆ కళ్ళు ఒక ప్రత్యేకం. విశాలమైన రెప్పలకి విసనకర్రల్లా వెంట్రుకలు.
 
    మంత్రముగ్దురాలయినట్టుగా ఆమెను వరండా దాటించి హాల్లోకి తీసుకెళ్ళి "కూర్చోండి" అంది.

    "మీరు ఏ ఏ మాగజైన్సు, డైలీపేపర్లు తెప్పిస్తుంటారు మేడమ్?"
 
    ఆమె చెప్పింది. అవన్నీ ఇంగ్లీషువే!
 
    "ఇంగ్లీషు వచ్చినవాళ్ళు ఇంగ్లీషుని చదవడంలో తప్పులేదుగాని తెలుగు పత్రికల్ని అనాదరం చెయ్యకూడదుగా , మేడమ్? మీ యింటికి ఒక్కటైనా తెలుగు పత్రికవస్తే బాగుంటుంది. అది మా ఉషోదయం అయితే మరీ బాగుంటుంది!" అంటూ ఉషోదయం అందించింది.

    "ఓ! పత్రిక కాన్వాసింగుకి వచ్చావన్నమాట! సెన్సెస్ కో, మరే సర్వేకో వచ్చావనుకొన్నాను" ఆవిడ స్నిగ్ధంగా నవ్వింది. "తెలుగైనా ఇంగ్లీష్ అయినా అంతగా చదివే ఇంట్రెస్టు లేదమ్మాయ్! అసలు చదివే ఇంటరెస్టే పోయింది. ఇరవయ్యేళ్ళ క్రితం అయితే మన పత్రికల్లో వచ్చే సీరియల్స్ ని పిచ్చిగా చదివేదాన్ని. అవి ఇప్పుడైనా ప్రతి సంఘటనా కళ్ళకు కట్టినట్టు చెప్పగలను! ఇప్పుడు పత్రికల్లో చదవడానికి ఏముంది? గూండాయిజం, రేపులు, మర్డర్లు! అన్ని సీరియల్స్ ఒకేలా అనిపిస్తాయి. మళ్ళీ వారం వచ్చేసరికి ఏ కథ ఏదో గుర్తుండదు!"

 Previous Page Next Page