"యస్! మిగతావన్నీ కూడా త్వరలో షేర్ చేసుకోవచ్చని చెప్పాను"
అతని ఆశ్చర్యం మరీ అవధులుదాటింది.
"ఆమె ఊరుకుందా?" అనుమానంగా అడిగాడు.
"ఏం?"
"అదేమాటనేనోసారి అంటే వార్నింగ్ ఇచ్చింది."
సురేష్ నవ్వాడు.
"సురేష్! నాకో ఫేవర్ చేస్తావా?"
జస్ట్ నేమిట్!"
"సుచిత్ర ఎలాగయినా నువ్వు వల్లో వేసుకోవాలి!"
"ఎందుకు?"
"అయ్ వాంట్ టు కాచ్ హర్ రెడ్ హాండెడ్"
"ఏమిటి ఉపయోగం?"
"పార్టీకి ఇన్ వైట్ చేస్తే పతివ్రతలాగా ఫోజులు కొట్టింది"
"అది ఆ అమ్మాయి ఇష్టం కదా?"
"ఆ మాటేఫ్రాంక్ గా చెప్తే గౌరవించేవాడిని. కానీ నాకు నీతిబోధలు చేసింది. నిజం చెప్తున్నాను అంత భయంకరమైన అవమానం నా జన్మలోపొందలేదనిపించింది నాకు" అతని కళ్ళల్లో రోషం తొంగి చూసింది.
"అయితే నన్నేం చేయమంటావ్?"
"మేక్ లవ్, నో వార్"
"నా జీవితధ్యేయమే మేక్ లవ్ .....కానీ ఇన్ థీయరీ."
"సుచిత్ర విషయంలో.....బి ప్రాక్టికల్?"
సురేష్ ఆలోచనలో పడ్డాడు.
"ఆలోచిస్తున్నావేమిటి? నీ బెస్ట్ ఫ్రెండ్ కి ఆ మాత్రం సహాయం చేయలేవా?"
"బెస్ట్ ఫ్రెండెవరు?"
"నేనే?"
"మనకి స్నేహమయి వారంరోజులేగా అయింది."
"వారం రోజులు చాలా ఎక్కువ. "బెస్ట్ ఫ్రెండ్స్ ఎట్ ఫస్ట్ మీట్" కేస్ లు చాలా తెలుసు నాకు! అదీగాక మనిద్దరి అభిరుచులూ ఒకటేకదా?"
సురేష్ ఆశ్చర్యంగా చూశాడు.
"మన అభిరుచులు ఒకటేనా?"
"యస్! ఫర్ ఎగ్జాంపుల్ గాళ్స్?" వప్పుకున్నాడు సురేష్.
"మనిద్దరం గాళ్స్ విషయంలో క్రేజీ....."
"అఫ్ కోర్స్.....థీయరీ, ప్రాక్టికల్స్ దగ్గరే కొంచెం తేడావస్తుంది.
"చాలా మైనర్ తేడాలవి"
"అఫ్ కోర్స్ వెరీమైనర్ నేచర్"
"బెస్ట్ ఫ్రెండ్ కోసం భయంకరమయిన త్యాగాలు చేసినవాళ్ళు ఉన్నారు"
సురేష్ నిర్ణయించుకోలేకపోతున్నాడు.
తనీమధ్య మానీటర్అయిపోతున్నాడు.
అన్ కాంషస్ గా ఆ రోజు రాత్రి.... హేపీ డ్రింక్స్ మహిమలో... రాజ్యలక్ష్మీని తులసనుకుని.... అన్ని గంటలపాటు.....
అదే మొదలు....
పులి మనిషి రక్తం రుచి చూడటం!
ఆ పులి కొద్దిగా పశ్చాత్తాపపడి మళ్ళీ అందంతా మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ లేచి గాండ్రించింది మాయను చూడగానే.
అతనికి మానిటర్ మీద కోపం వచ్చింది.
కానీ అంతలోనే జాలికూడా వేసింది.
మాయలాంటి సెక్స్ గాళ్ ని..... నగ్నంగా వీడియోలో చూస్తే.... తనే కాదు! నిజంగా పెద్దపులులూ, సింహాలూ కూడా గర్జిస్తాయి.
వాటిముందు తనెంత?
నెగ్లిజబుల్!
ఇప్పుడు మళ్ళీ సుచిత్రాదత్!
మానిటర్ మళ్ళీ పెదాలు తడుపుకుంటోంది.
లేచి బయటకు నడవసాగాడతను.
కౌంటర్ లోనుంచి సుచిత్రదత్ తనను చూసి చిలిపిగా నవ్వుతోంది.
ఆహా! మొనాలిసా!
నో! వాళ్ళ మదర్!
ఉహు.....గ్రాండ్ గ్రాండ్ మదర్.... నో చైల్డ్!
రోడ్ మీద కొచ్చేశాడు.
ఇంటికెళ్ళాలనిపించటంలేదు. తులసి లేని ఆ ఇల్లు చూడ్డానికి కూడా మనసొప్పటం లేదు.
కానీ...
ఎప్పుడు బస్ ఎక్కాడో, ఎప్పుడు దిగాడో తెలీదు.
గంగాభవాని తలుపు తెరిచింది.
ఆమె వెనుకే లోపలకు నడువబోతుంటే ఛటుక్కున ఆగి వెనక్కు తిరిగింది అప్పటికే నడుము తగిలివెనక్కు జరిగాడు.
"ఇటెక్కడి కొస్తున్నారు? వెళ్ళండెళ్ళండి"
"తులసి లేదుగా."
ఆమె ముఖం ఎర్రబడింది.
"అందుకే మీ మొఖం చూడాలన్న చిరాకు నాకు"
చటుక్కున లైట్ స్విచ్ తీసేశాడతను. గదిలో వెంటిలేషన్ సరిగ్గా లేకపోవటంతో చీకటి అలుముకుపోయింది పట్టపగలే.
ఆమె గొంతులో గాబరా!
"అదేమిటీ?లైటెందుకు తీసేశారు?"
"మీరేగా నా ముఖంచూపించకూడదన్నారు"
"అయితే?"
"చీకట్లో అయితే మొఖాలు చూసుకోనక్కరలేదుగా! హాపీగా ఎవరికెవరో, ఎవరికెవరో తెలుసుకోవాల్సినపని లేకుండా."
"బయటికెళ్తారా లేదా ముందు?"
"బయట అసహ్యంగా వుంటుంది. అందరూ చూస్తారు."
"ఏమిటి చూడటం? మీకు పిచ్చెక్కినట్లుంది"