Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 27



    మీరే ఆమెను ఏదో చేసి వుంటారేమోనని సందేహంగా వుంది తప్పు సుధాకర్ అమాయకుడని చెప్పాను. అంతకుమీంచి నేను మీకు చెరువు చేసిందేమీలేదు ప్లీజ్ బిలీవ్ మీ...."

    దాదాపు ఏడుపు గొంతులో చెప్పాడు ప్రేమ్ చంద్.

    ప్రత్యేకించి ఇన్స్ పెక్టర్ ధీరజ తమను అనుమానించడానికి కారణం ఏమిటో ఆ ముగ్గురికి  అప్పుడు భోధపడింది.

    ప్రేమ్ చంద్ కు ఏమీ తెలియదని అర్ధం కావడంతో, అతఃన్ని వదిలి ఆ గదిలోనించి బయటకు నడిచారు మిత్రులు ముగ్గురూ.

                      *    *    *    *

    వ్తెస్ చాన్స్ లర్  రూం అది!

    టీచర్స్ కాలనిలో....సుధాకర్ ప్లాట్ కు  పది ప్లాట్స్ దాటినా తరువాత వస్తుంది అతని రెసిడెన్స్ హౌస్.

    ఆ రోజూ ఉదయమే యూనివర్శిటికి వెళ్ళబోయేముందు....

    అతనికి ఫోన్ రావడంతో దాదాపు పావుగంటనుంచి మాట్లాడుతూనే వున్నడతను.

    "అవును....రాత్రి చాలా పొద్దుపోయేవరకూ ముకుందరావు నాతోనే వున్నాడు.

    "....."

    "మనిషి చాలా వర్రిగా వున్నాడు....ఏ విషయంలోనూ స్పష్టంగా బయట పడలేకపోతున్నాడు. మాటలన్నీ ఆచితూచి వుపయోగిస్తున్నాడు."

    ఏవో అర్ధం, పర్ధంలేని మాటలు మాట్లాడుతున్నాడు తప- అవతలి వ్తెపు వ్యక్తి ఎవరో, ఏం మాట్లాడుతున్నాడో....ఆ మాటలు విన్నవాళ్ళకు ఒక పట్టాన అర్ధంకావని నిస్సందేహంగా చెప్పవచ్చు.

    "ఎస్...ఇన్స్ పెక్టర్ ధీరజ చాలా శ్రద్దగా పరిసోదిస్తోంది. మరి ఆమె పరిశోధన ఎంతవరకూ వచ్చింది.....ఎవరెవరిని అనుమానిస్తుంది....ఆ వివరాలు మాత్ర్హం ఏమీ తెలియకుండా జాగ్రత్తపడుతున్నట్టుంది."

    మరో రెండు నిమిషాల తరువాత ఫోన్ పెట్టెశాడతను.

    అంతవరకూ వ్తెస్  చాన్స్ లర్ తో  మాట్లాడిన వ్యక్తి, రిసీవర్ పెట్టేస్తూ అతను వెయిట్ చేస్తున్న గదిలో సీరియస్ గా  పచార్లు చేస్తున్నాడు.

    అతను శేఖర్!

                                            *    *    *    *

    అనుమానితుల జాబితా కొల్లేరు చేంతాడులా భారీగా ప[ఎరిగిపోతున్నా అసలు దోషులెవరో అంతుచిక్కడంలేదు. అసలు దోషుల్ని తమంతట తామే బయటపడేటట్టు చేయాలంటేఏంచేయాలి?

    ధీరజ ఆలోచనలు ఒక కొలిక్కి రావడంలేదు.

    అబ్బులు మెడికల్ రిపోర్టు మరొకసారి పరిశిలించింది.

    కొత్తవిషయాలేమీ అందడంలేదు.

    గతంలో వచ్చిన అనుమానాలే మళ్ళి వస్తున్నాయి.

    స్నేక్  బిట్ వలెనే అతను  మరణించినట్టు  భావిస్తున్నప్పటికీ, ఆ పాము విషం గుండేవరకూ చేరకముందే అతను గుండాగి మరణించడం ఎలా సంభావించిందో అర్ధంకావడంలేదు.

    సరిగ్గా  ఆ పాయింట్ దగ్గరే ఆమె ఆలోచనలు కేంద్రికృతమావుతున్నాయి.

    అతను భయం కారణంగా  మరణించి వుండవచ్చునన్న అనుమానం వ్యక్తం అయింది. అంటే.... అభయం  ఎలాంటిది?

    పాము కరవడంవలన ఆ విషం తన నరనరాన  కలిసిపోయి తను అంతం చేస్తోందన్న భయమా? లేక తను పాము కాటుకు గురయ్యానన్న భీతా?

    ఇవేమి లేకుండా అతను అంతగా భయపడడానికి కారణం ఇంకేమ్తెనా వున్నా?

    ధీరజ ఆలోచనకు ఆ దిశాగానే ఎక్కువగా వెళుతున్నాయి.

    సరిగ్గా అదే సమయంలో....

    ఫోన్ 'ట్రింగ్' మంటూ మ్రోగింది.

    ఒక్కసారిగా ఫోన్ మ్రోగేటప్పటికి ఆమె ఆలోచనలకు ఆటంకం కలిగింది.

    విసుగ్గా ఫోనేత్తి 'హలో....'అంది.

    "ఏమిటోయ్! అంత విసుగు? ఏమ్తేనా క్రిటికల్ కేసు డిల్ చేస్తున్నావా ఏమిటి?"

    ఫోన్ లో గొంతు హనువుగా ప్రశ్నించింది.

    ఆ గోంతు వినగానే దిరజకు ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినట్టయింది.

    అదేవిధంగా కోపంకూడా ముంచుకోచ్చింది.

    "నువ్వింత మోసగాడివనుకోలేదు....ఒకప్రక్క నన్ను అభిమానిస్తూనే నన్ను మోసగించాలని చూస్తావా?ప్తెగా ఏమీ ఎరగానట్టుగా ఫోన్ చేసి అప్యాయంగా మాట్లాడతావా?" వాడిగా వేడిగా ప్రశ్నించింది ధీరజ.

    ఆమె గొంతులో అంత కోపాన్ని శేఖర్ ఎన్నడూ వినివుండలేదు. ఆమె అంత  ఆగ్రహంగా వుందంటే ఒకవేళ తన గురించి తెలిసిపోయిందా?

    శేఖర్ గుండె దడదడలాడింది.

    ఆమె అలా కోపంగా ప్రశ్నించేసరికి అతను ఖంగారుపడ్డాడు.

    ఆ ఖంగారులో______

    'అది....అది....' అంటూ తడబడ్డాడు.

    "ఆ....అది అంటూ సాగదియకుండా నిజం ఒప్పేసుకో ...నన్నేందుకు మోసంచేశావో!అసలు నన్ను మోసంచేయాలనీ ఎందుకనిపించిందో చకచక చెప్పేయ్" ధీరజ మరింత వాడిగా అడిగింది.

    శేఖర్ ఆగిపోయాడు.

 Previous Page Next Page