Previous Page Next Page 
బెస్ట్ జోక్స్ పేజి 28


    "అయ్యో! పాపం! ఆయన చాలా మంచి వ్యక్తి మేడమ్! ఆయనకిలా జరగటం నాకు చాలా విచారంగా ఉంది-" అన్నాడతను కన్నీళ్లు తుడుచుకుంటూ.
    "అవునోయ్! నిజంగా చాలా మంచి మనిషాయన. ఇంత మంచి మనిషిని వదిలేసి నాదారి నేను చూసుకోవాలంటే నాకూ ఎంతో బాధగా ఉంది! కానీ ఏం చేస్తాం? తప్పదు కదా!" అందామె తన బాగ్ తీసుకుని ఇంట్లోనుంచి వెళ్ళిపోతూ.
    
    ఓ యువకుడు చాలా ఫాస్ట్ గా లాయర్ దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు.
    "లాయర్ గారూ! నేను విడాకులివ్వాలంటే ఏం చేయాలి?" ఆయాసంతో ఒగరుస్తూ అడిగాడతను.
    "విడాకులివ్వాలంటే ముందు పెళ్ళి చేసుకోవాలయ్యా-"
    "అలాగా! అయితే ఓకే" అంటూ మళ్ళీ పరుగెత్తు కెళ్ళిపోయాడతను.
    
    కోర్టులో బోనులో నిలబడి తన భర్త తనను పెట్టిన కష్టాలు ఆమె వర్ణిస్తోంటే జడ్జీగారికే ఏడుపాగలేదు.
    "అబ్బ! ఎంత దుర్మార్గుడమ్మా మీ ఆయన! నీ కష్టాలు వింటూంటే నాకే ఏడు పాగటం లేదు. పాపం ఎలా భరించావో ఏమో! అందుకని ఇంక ఎలాంటి విచారణా లేకుండా నీకు విడాకులు మంజూరు చేస్తున్నా" అన్నాడాయన జాలిగా.
    ఆ స్త్రీ కోపంతో మండిపడింది.
    "ఏడ్చినట్లుంది! నా భర్తకు కఠినశిక్షలు విధిస్తారేమో అనుకుని మీ కోర్ట్ కొస్తే మీరేమో నాకు విడాకులిప్పించి హాపీగా లైఫ్ ఎంజాయ్ చేసే అవకాశం ఆ దుర్మార్గుడి కిస్తానంటారా? మీకేమయినా తెలివుందా? ఛస్తే విడాకుల కొప్పుకోను-" అంది రుసరుసలాడుతూ.
    
    బ్రహ్మానందం చాలా రకాలు కాంప్లికేషన్స్ తో హాస్పిటల్లో చేరాడు. డాక్టర్లు వెంటనే అతనికి పరీక్షలు జరిపి ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. ఆ సాయంత్రం డాక్టర్ అతని దగ్గరకొచ్చి.
    "ఓకే జెంటిల్మెన్! నేను చేయాల్సిందంతా చేశాను- రేపు మాణింగ్ వచ్చి మళ్ళీ మిమ్మల్ని చూస్తాను" అన్నాడు.
    బ్రహ్మానందం డాక్టర్ వేపు డౌటుగా చూశాడు.
    "నన్ను మీరు చూడగలరు గానీ- నేను రేపు మిమ్మల్ని చూడగలనంటారా?" అడిగాడతను.
    
    అర్ధరాత్రి డోర్ బెల్ మోగటం విని డాక్టర్ కోపంగా నిద్రలేచి బయటికొచ్చేసరికి ఎదురుగ్గా ఒక పేషెంట్ నిలబడి ఉన్నాడు.
    "ఏమిటయ్యా ఇది? ఇది ట్రీట్ మెంట్ కొచ్చే టైమా? ఆ బోర్డ్ చూడు! ఏమని ఉందందులో? 'సాయంత్రం ఆరునుంచి రాత్రి పదిగంటల వరకూ మాత్రమే' అని తాటికాయంత అక్షరాలతో రాయించి పెట్టాను కదా! కనబడటం లేదా? కనబడటం లేదా అనడుగుతున్నా-"
    "నాక్కనబడక పోవటమేంటి సార్! నాకేం కంటి చూపు ట్రబుల్ఉందనుకున్నారా? సంగతేంటంటే నన్ను అకారణంగా అర్ధరాత్రి కరచింది చూడండి! ఆ కుక్కకి చదువురాదు కద్సార్- అక్కడ తేడా వచ్చింది"
    డాక్టర్ మారు మాట్లాడకుండా ట్రీట్ మెంట్ మొదలుపెట్టాడు.
    
    బాగా పేరు ప్రఖ్యాతులున్న సినిమా రైటర్ కి సడెన్ గా డిమాండ్ పడిపోవడంతో అప్పుల పాలయ్యాడు. ఎవరికీ కనబడకుండా తప్పించుకుని తిరగటం మొదలుపెట్టాడు.
    ఓ రోజు బాగా పెరిగిపోయిన గడ్డం చేయించుకోడానికని ఒక హెయిర్ కటింగ్ సెలూన్ కొచ్చాడు.
    తీరా చెయిర్లో కూర్చొని గడ్డానికి సబ్బు పెట్టించుకున్నాక- మోహన్ రావ్ సడెన్ గా వచ్చి అతనిని గుర్తుపట్టి కాలర్ పట్టుకున్నాడు.
    "ఒరే! రైటరూ! మర్యాదగా నా డబ్బు నాకిస్తావా- ఛస్తావా?" అన్నాడావేశంగా.
    "అరెరె-! ఇస్తానయ్యా! గడ్డం చేయటం పూర్తికానీ- నీ డబ్బు మొత్తం నీకిచ్చేస్తా' అన్నాడు రైటర్.
    మోహన్ రావ్ ఆశపుట్టింది.
    "నిజంగా ఇచ్చేస్తావా" అడిగాడు అనుమానంగా.
    "గడ్డం చేసుకోగానే ఇస్తాను బాబూ! ఈ షాపులో ఉన్న పెద్దమనుషులందరి సాక్ష్యంగా చెప్తున్నాగా- అరుగో- ఆ ఇన్ స్పెక్టర్ గారు కూడా ఉండనే ఉండె-"    
    "సరే లేవయ్యా! గడ్డం చేసుకోగానే ఇస్తానంటున్నాడుగా! అంతవరకు ఆగు" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    మోహన్ రావ్ అతనిని వదిలేశాడు.
    వెంటనే రైటర్ కుర్చీ దిగి గడ్డానికి కున్న సబ్బు టవల్ తో తుడిచేసుకుని మోహన్ రావ్ దగ్గరకొచ్చాడు.
    "గడ్డం చేసుకోగానే నీ డబ్బు ఇస్తానన్నా గదా! ఇప్పుడు నేను గడ్డం చేసుకోవటం లేదు- చేసుకున్నప్పుడు కబురు చేస్తా! అప్పుడొచ్చి డబ్బు తీసుకుపో" అనేసి బయటికెళ్ళి పోయాడు.

    ఓ వర్ధమాన కవి కోపంతో చిందులు తొక్కుతూ తన ఫ్రెండింటి కొచ్చాడు.
    "చూశావా! నిన్న నా కవితాసంకలనం బుక్ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేసి, కవితలన్నీ ప్రెస్ వాళ్ళముందు చదివి వినిపించి, వాళ్ళందరికీ మందుపార్టీ ఇచ్చి- నా సంకలనం తలో కాపీ ఇచ్చాను. ఇచ్చానా? కానే వాళ్ళు చెసిందేమిటి? ఇవాళ ఉదయం ఒక్క పత్రిక కూడా నా గురించి గానీ, ఫంక్షన్ గురించిగానీ, కవితా సంకలనం గురించి గానీ ఒక్క ముక్క రాస్తే వట్టు!
    ఇలా కావాలని అందరూ సైలెంట్ గా ఊరుకోవటం ఒక పెద్ద కుట్రగా నేను భావిస్తున్నా! నువ్వేమంటావ్?" అంటూ నిలదీశాడు కవి.
    "నీ ఆలోచన కరెక్టేనేమో" అన్నాడు ఫ్రెండ్.
    "అయితే ఇప్పుడు నేనేం చేయాలంటావ్! వాళ్ళందరి మీదా ఎలా రివెంజ్ తీసుకోవాలంటావ్?" ఆవేశంగా అడిగాడు కవి.
    "ఒక పని చెయ్! నువ్ కూడా అదే కుట్ర  చెయ్- తిక్క వదిలిపోతుంది-" అన్నాడు ఫ్రెండ్.
    
    ఒక స్వామీజీ ఆశ్రమం విస్తరణ అనే వంకతో భక్తులందరి దగ్గరా విరాళాలు గుంజటం ప్ర్రారంభించాడు.
    ఓ రోజు ఒక స్టూడెంట్ స్వామీజీ దగ్గర కొచ్చి పదివేల రూపాయలు ఇచ్చాడు.
    "మా అమ్మగారు ఈ డబ్బు మీకు విరాళంగా ఇమ్మని పంపించారు స్వామీజీ" అన్నాడతను వినయంగా.
    "ఆహా! ఎంత గొప్ప భక్తురాలు మీ అమ్మగారు! ఆమె ఫోన్ నెంబర్ రాసివ్వు నాయినా! ఆమెకు నా ధన్యవాదాలు తెలుపుకుంటాను" అన్నాడు స్వామీజీ-
    స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఓ కాగితం మీద రాసిచ్చాడు.
    "చూడండి స్వామీజీ! మా అమ్మగారికి థాంక్స్ చెప్పేప్పుడు దయచేసి పదివేలకు బదులు పాతికవేలకు థాంక్స్ చెప్పండి! ఆమె సంతోషిస్తుంది" అన్నాడు వినయంగా.
    
    ఒక డాక్టర్ గదిలోకి ఒక స్త్రీ చాలా వర్రీడ్ లుక్ తో హడావుడిగా వచ్చింది.
    "డాక్టర్! ప్లీజ్ నాకు మీరే హెల్ప్ చేయాలి. నాకు హెల్త్ బాగోటం లేదు- అయితే ఫలానా ప్రాబ్లెమ్ అని మాత్రం చెప్పలేను- కానీ డెఫినెట్ గా ఏవో ప్రాబ్లెమ్స్ ఉండటం మాత్రం ఖాయం-"
    డాక్టర్ చిరునవ్వు నవ్వాడు.
    "చూడండి మేడమ్! మీకు చాలా ప్రాబ్లెమ్స్ ఉన్నట్లు తెలుస్తూనే ఉంది! మీ చీరా జాకెట్ చూడండి! మిస్ మాచ్! మీ పెదాలకు రాసుకున్న లిప్ స్టిక్ కలర్ మీ కలర్ కి మాచ్ కాలేదు! రాంగ్ కలర్ యూజ్ చేశారు. అలాగే మీ హెయిర్ స్టయిల్ కూడా మీ పర్సనాల్టికీ సూటవదు. మీ కాళ్ళకున్న చెప్పులు కూడా రాంగే. ఒక కాలి చెప్పు ఇంకో కాలికేసుకున్నారు. ఇవన్నీ కాకుండా మీరు వచ్చింది రాంగ్ రూమ్ లోకి! ఎందుకంటే మీక్కావలసిన డాక్టర్ వేరే రూమ్ లో ఉంటాడు. కానీ ఇప్పుడు అతని దగ్గరికెళ్ళినా వేస్టే- రాంగ్  టైమ్! ఇంక మీరు లేస్తే - బాగుంటుంది రాంగ్ చెయిర్ లో కూర్చున్నారు- అది ఇంకో డాక్టర్ ది- పైగా ఆ డాక్టర్ ఆ కుర్చీలోనే ఉన్నాడిప్పుడు".

 Previous Page Next Page