"ఓకే డియర్! అయ్ సపోర్ట్ యూ" అన్నాడు భర్త. "కానీ దెబ్బలాడుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి?"
"వెరీ సింపుల్- నీ గురించి నేనెవరికీ అబద్దాలు చెప్పను-" అంది భార్య.
"థాంక్ యూ డియర్! లాటాఫ్ రిలీఫ్ ఫర్ మి" అన్నాడు భర్త.
"మరి నీ సైడ్ నుంచీ నువ్వేం చేయబోతున్నావ్?" అడిగింది భార్య.
"ఏముంది? నేను నీ గురించి ఎవరికీ నిజాలు చెప్పను-"
ఇద్దరూ హాపీగా కౌగలించుకుని ఒకటయిపోయారు.
ఆ రోజునుంచీ దెబ్బలాటలు లేవు-
కూతురు కోపంగా అవమానంతో దహించుకుపోతూ పుట్టింటికొచ్చేసింది.
తల్లీ తండ్రీ షాకయిపోయారు.
"ఏంటమ్మా! ఏం జరిగింది? మళ్ళీ మీ ఆయనా, నువ్వూ పోట్లాడుకున్నారా?"
"అవును" అందా అమ్మాయ్.
"ఎందుకు? ఏం జరిగిందసలు?"
"మాకు ముగ్గురు పిల్లలు పుట్టారు కదా! ఇంతకాలం 'అయ్ లవ్ యూ' అంటూ వెనుకెనుకే తిరిగిన మనిషే కదా! ఇవాళేమంటున్నారో తెలుసా? తను నన్నసలు ప్రేమించనే లేదంట"
తల్లి కూతుర్ని ఓదార్చింది.
"పిచ్చితల్లీ! ఇదంతా నీ అదృష్టమే! అతను నిజంగా నిన్ను అంతగా ప్రేమించి ఉంటే నీ జీవితం ఎంత నరకమయిపోయేదో ఒక్కసారి ఊహించుకో! నీ మీద అతి ప్రేమతో ఇంకో ఇద్దరు పిల్లల్ని కనేవాడు. ఈ కాన్పుల్తో నీ ఆరోగ్యం నాశనం అయిపోయేది"
అది ఒక చీకటి గది.
గదిలోనుంచి ముద్దగా మత్తుగా రాధ డైలాగ్ వినిపించింది.
"కృష్ణా! ఇందాకటిలాగా ఇంకొక్కసారి ఎవర్ లాస్టింగ్ కిస్ ఇచ్చావంటే నా జీవితాన్ని నీకే అంకితం చేసి జీవితాంతం నీతోనే సెటిలయిపోతా" అంది రాధ పెదాలు అందించడానికి సిద్దమవుతూ-
"ఓర్నాయనో - ముందే వార్నింగిచ్చి రక్షించావ్" అంటూ గావుకేకపెట్టి గది తలుపులు దభేల్ మని తీసి బయటకు పరుగెత్తాడు రాధాకృష్ణమూర్తి.
ఒకడు తూలుతూ బార్ లో కొచ్చాడు. తిన్నగా కౌంటర్ దగ్గరకెళ్ళి '8 పీఎమ్ టు 8 ఏఎమ్' అన్నాడు.
"ఓహో విస్కీయా? ఇప్పుడే పంపిస్తా- కూర్చో" అన్నాడు కౌంటర్ క్లర్క్.
"ఏయ్ నేనడిగేది విస్కీకాదు బే- ఆ బేరర్ గాళ్ ఉంది చూడు! అది కావాలి 8 పీఎమ్ టు 8 ఏఎమ్"
బేరర్ గాళ్ వచ్చి లాగి అతని చెంపమీద కొట్టింది.
"థాంక్యూ" అని తూలుకుంటూ వెళ్ళిపోయాడతను.
"వాడు నా హజ్ బెండేలే- 8 పీఎమ్ కి రోజూ చెంప దెబ్బ కొడితేగానీ 8 ఏఎమ్ కి లేవడు" అందా అమ్మాయ్.
"ఏమేవ్! రోజూ పొద్దున్నే టెర్రస్ మీదకెళ్ళి యోగాసనాలు వేస్తున్నావ్ కదా! బాడీ ఏమయినా ట్రిమ్ అయిందా?"
"అవకపోవటమేంటండీ! వారం నుంచీ చుట్టు పక్కల అపార్ట్ మెంట్స్ వాళ్ళు రోజుకో లవ్ లెటర్ రాస్తున్నారు- అదిగాక రెండ్రోజుల నుంచీ నిన్నటివరకూ ఆరుగురు ఫోన్లు చేసి మారేజ్ ప్రపోజల్స్ చేశారు- నిన్నటి నుంచీ ఇవాళ్టి సాయంత్రం వరకూ.."
"వద్దు వద్దు- ఇంకేం చెప్పొద్దు" అంటూ గావుకేక పెట్టాడు భర్తారావ్.
రంగరాజు, రామరాజు చాలా రోజుల తర్వాత కలసి మందు కొడుతున్నాడు.
"ఏంట్రా రామరాజూ! కొంచెం డల్ గా ఉన్నావ్?" అడిగాడు రంగరాజు.
"కిందటసారి జరిగిన పాకిస్తాన్ యుద్ధం తల్చుకుంటేనే గుండెలు పగిలి పోతున్నయ్ రా! నా జీవితం సర్వ నాశనం అయిపోయింది!" విచారంగా అన్నాడు రామరాజు.
"అదేంట్రా ఆ యుద్దానికీ నీకూ ఏం సంబంధం? నువ్వసలు ఎప్పుడూ ఆర్మీలో కూడా చేరలేదు కదా?"
"నేను చేరలేదు గురూ! నిజమే! కానీ నా రెండోభార్య మొదటి భర్త ఆయుద్ధంలోనే కదా పోయాడు-"కన్నీళ్ళు పెట్టుకుంటూ అన్నాడు రామరాజు.
జడ్జీగారు ఒక డైవర్స్ కేస్ విచారిస్తున్నారు.
బోనులో నిలబడ్డ అట్రాక్టివ్ యంగ్ గాళ్ ని జాలిగా చూశారాయన.
"ఏంటమ్మా? నీకు విడాకులు కావాలా?"
"అవునండీ!"
"ఎందుకని?"
"రాత్రుళ్ళు ఆయన ఒకటే గురకండీ- తెల్లారే వరకూ గురకే"
"మీ పెళ్ళయి ఎంతకాలమయింది?"
"ఇవాళ్టికి నాలుగోరోజండీ"
"వాట్? నీలాంటి గాళ్ పక్కనుండగా- నాలుగో రోజే గురక కొడుతున్నాడా? ఓకే డైవర్స్ గ్రాంటెడ్!"
జనాభా లెక్కల వాళ్ళు ఓ ఇంటికొచ్చారు.
ఇంటావిడ ముగ్గురు పిల్లలతో బయటికొచ్చింది.
"పిల్లల పేర్లు, వాళ్ళ తండ్రిపేరు చెప్పమ్మా" అన్నాడు అధికారి.
"పెద్దాడి పేరు రాజు- తండ్రి పేరు వీరస్వామి, రెండోవాడిపేరు రమణండీ! వాడి తండ్రిపేరు రామ్మూర్తి"
అధికారి పజిలయ్యాడు.
"అదేంటమ్మా- మీ ఆయన పేరు ఇందాక వీరస్వామి అన్నావ్- ఇప్పుడు రామ్మూర్తి అంటావేంటి?"
ఆవిడ కొంచెం సిగ్గుపడింది.
'ఛీ పాడు- భర్త పేరు చెప్పాలంటే ఒకటే సిగ్గండీ నాకు- సంగతేంటంటేనండీ నా కిద్దరు భర్తలండీ-మొదటాయన వీరస్వామి- ఆయన పోయాక రెండో భర్త రామూర్తి"
"ఓహో- అర్ధమయిందమ్మా! అర్ధమయింది- మరి మీ మూడో వాడిపేరు?"
"శీను అండీ!"
"అంటే వాడి తండ్రిపేరు రామ్మూర్తే కదా?"
"ఆయన పోయిన రెండేళ్ళకు కదండీ వీడు పుట్టిందీ?"
"అలాగామ్మా! మరి శ్రీను తండ్రి..."
"వాడు నా స్వంత కొడుకండీ- తండ్రిలేదు-"
ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర కొచ్చాడు. అతనికి రకరకాల టెస్ట్ లు చేశాక డయాగ్నైజ్ చేశాడు డాక్టర్.
"చూడు బాబూ- నీకు బాడ్ న్యూస్"
"ఏమిటి సార్ అది?"
"నీకు సిఫిలిస్ అనే సుఖరోగం వచ్చింది- ఈ మధ్య ఏ అమ్మాయితో లవ్మేకింగ్ చేశావో గుర్తుతెచ్చుకో-"
"ఆ! గుర్తొచ్చింది సార్-"
"ఎవరా అమ్మాయ్?"
"నిజం చెప్పమంటారా సార్"
"చెప్పక పోయినా నాకేం నష్టం లేదు-"
"మీ హాస్పిటల్లో నర్సే సార్ ఆ అమ్మాయ్-"
"అలాగా! పేరేంటి?"
"సంధ్య"