అతని వేడి ఉచ్చ్వాస ఆమె భుజానికి తగులుతోంది.
"బిజినెస్ వరల్డ్ లో ఈ జ్వాలాముఖిరావును దెబ్బ తీయడానికి ప్రయత్నించిన చాలామంది బిజినెస్సుల్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. మరికొంతమంది మనుషులే పైకి పోయారు.
ఎందుకో తెలుసా? బిజినెస్ లో నా లక్ష్యం అంత పదునుగా వుంటుంది. అలాంటి నేను నీ అల్లరిచేష్ట ద్వారా దెబ్బ తీసావు నువ్వు. ఆ రోజు నువ్వు పెద్ద ఇష్యూగా మార్చిన భార్గవి కేసుని నేను డబ్బుతో మాయం చేసినా, నువ్వు చేసిన ఆ సెక్స్ స్కాండల్ ద్వారా తలెత్తుకో కుండా చేసావ్. నా జీవితంలో నేనెప్పుడూ అంతలా అవమానాన్ని పరాభవాన్ని ఎదుర్కోలేదు. నా మనసులో నువ్వు గాయం చేసావ్. నేను కూర్చున్నా, పడుకున్నా, కారులో వెళుతున్నా నన్ను నిరంతరం దావానలంలా దహించి వేస్తున్న గాయాన్ని భరించలేకపోతున్నాను. స్లో పోయిజన్ లా నా నరనరాన్ని కోసేస్తున్న గాయం, రక్తం కనబడని గాయం అది" ఒక్కొక్క మాటా జ్వాలాముఖిరావు గొంతులోంచి కసిగా వస్తోంది.
ఆమె కళ్ళెత్తి అతని ముఖంలోకి చూసింది. ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయిపోయిన ఆమె కళ్ళలోకి చూస్తూ-
"చెట్టుకి పురుగుపడితే నిర్దాక్షిణ్యంగా చెట్టుని నరికేసే మనస్తత్వం నాది. అందుకే నా గాయానికి ఏ మందువేస్తే నా మనసు ప్రశాంతంగా వుంటుందో ఆ క్షణంలోనే నేనొక నిర్ణయానికొచ్చాను.
సెక్స్ స్కౌండల్ ద్వారా నువ్వు నన్ను రచ్చకీడ్చావు. నలుగురి దృష్టి నామీద పడేట్టు చేసావ్.
మొదటిరోజు పేపర్లలో వార్తలు రాసిన పత్రికలు మర్నాడెందుకు రాయడం మానేసాయో తెలుసా?
ఆ రిపోర్టర్ల ఖరీదు ఓన్లీ టెన్ లాక్స్ మొత్తం పత్రికల నోళ్లన్నీ మూతపడిపోయాయి.
నీ కారణంగా పెద్ద అమెరికన్ ప్రాజెక్టు నా చేతుల్లోంచి జారిపోయింది. దాని ఖరీదు కొన్ని కోట్ల రూపాయలు.
ఇన్ని రోజులు నాకు నిద్రపట్టకుండా చేసిన నువ్వు-
జీవితాంతం నిద్రలేకుండా కుమిలి, కుమిలి ఏడ్చేటట్టు చేయాలని ఆరోజే నిర్ణయించుకున్నాను"
అతను చెప్పిన ఒక్కొక్క మాటనూ ఆశ్చర్యంగా వింటోంది మయూష.
అంతవరకూ పగ, ప్రతీకారాల గురించి నవల్లో మాత్రమే చదివిన మయూషకు జ్వాలాముఖిరావు విచిత్రమైన జంతువులా కన్పిస్తున్నాడు. వికృతమైన ఆక్టోఫస్ ల కన్పిస్తున్నాడు.
మళ్ళీ చెప్పడం ప్రారంభించాడతను.
"అందుకే నీ తండ్రి నేను సృష్టించిన ఫైల్ మాయలో ఇరుక్కున్నాడు. ఎ సి బి దాడితో గిలగిల్లాడాడు. మళ్ళీ నా చేత విడిపించబడ్డాడు. కేసు పుట్టడం ఒక మాయ. కేసు విడిపోవడంకూడా మాయే" అని పెద్దగా నవ్వి అలిసిపోయి-
ఫ్రిజ్ లోంచి వైన్ బాటిల్ ను తీసుకుని గడగడ తాగి-
"అక్కడితో వదిలేద్దామనిపించింది. కానీ నా సంగతి నీకు తెలియాలి కదా అందుకే-
అద్భుతమైన నవనీత్ పాత్రను సృష్టించాను. నీ తండ్రికి నీకు తెలియాలి కదా అందుకే-
అద్భుతమైన నవనీత్ పాత్రను సృష్టించాను. నీ తండ్రికి ఆశల్ని సృష్టించాను. నేను సృష్టించిన కృత్రిమ స్వర్గంలో నువ్వూ, నీకుటుంబం పూర్తిగా మునిగిపోయారు.
నేను సృష్టించిన ఒక్కొక్క అబద్దపు ఊబిలో నువ్వు దిగిపోతున వార్త విన్నప్పుడల్లా నా మనసులోని గాయం మానుతున్న సంతృప్తి.
ప్రతిక్షణం నేను ఎంత ఆనందాన్ని అనుభవించేవాడినో తెల్సా?" దగ్గరగా వెళ్ళి ఆమెమీద చెయ్యి వేసాడు జ్వాలాముఖిరావు.
ఆ చేతిని విసిరికొట్టింది మయూష.
"నేనిప్పుడు నీ భర్తను డియర్" అంటూ నవ్వి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు.
"నిన్నేం చేయాలో రెండు రోజులపాటు ఆలోచించాను. ట్రాప్ లో పడిపోయిన నిన్ను కసిదీరా అనుభవించి నీ ద్వారా అందుకున్న సుఖానికి ఖరీదుకట్టి కరెన్సీని విసిరేయాలనుకున్నాను.
ఆ ఆలోచన ఎందుకో నాకు నచ్చలేదు.
మళ్ళీ నీకోసం ఇంకెవరయినా ఉద్యమాలు చేస్తే?
ఇంకెవరిచేతనయినా నిన్ను రేప్ చేయించి నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీ శవం మీద అందమైన పూలదండను వేయాలనుకున్నాను.
ఎందుకో ఆ ఐడియాకూడా నాకు నచ్చలేదు.
అప్పుడొచ్చింది. ప్లాష్ లాంటి ఆలోచన.
అందమైన నిన్ను నేనే పెళ్ళిచేసుకుంటే. అందుకే మన పెళ్ళి ఇంత వైభవంగా జరిగింది. ఇది హిస్టరీలో ఎవరూ ఎప్పుడూ చెయ్యని ట్రాప్ గదూ విశాలమైన యూ ఫోమ్ బెడ్ మీదకొచ్చి కూర్చున్నాడు జ్వాలాముఖిరావు.
నిరుత్తరురాలయి అతనివేపే చూస్తోంది మయూష. గబుక్కున ఆమె పైటచెంగును అందుకున్నాడు. ఆమె విసిరికొట్టింది.
"యూ ఆర్ ఎ బీస్ట్. నన్ను ముట్టుకుంటే షూట్ చేసేస్తాను" కోపంగా అరిచింది ఆమె.
నువ్వెంత గట్టిగానైనా ఇక్కడ అరవొచ్చు ఈ ఫ్లోర్ కి పిలిస్తేనే తప్ప ఎవరూ రారు నువ్వు నా భార్యవు నేను నిను హాయిగా అనుభవించగలను దారుణంగా చిత్రహింసలు చేసి మరీ అనుభవించగలను. చంపేసి నీ శవాన్ని అనుభవించగలను.
ఐ హేవ్ ఎవ్విరి రైట్ మై డియర్ ఎనిమీ.
బట్-నేనలా చెయ్యను. ఎందుకో తెల్సా? ఏ సెక్స్ తెల్సా? ఏ సెక్స్ స్కౌండల్ కి నన్ను గురిచేసి నువ్వు ఆనందించి నా ప్రిస్టేజ్ తో ఆడుకున్నావో ఆ సెక్స్ ని నీకు జీవితాంతం లేకుండా చేస్తాను. సెక్స్ అనేది నీకు తెలీకుండా చేస్తాను. ఆ అనుభవం నీకు ఆమడదూరంలో వుండేలా చేస్తాను" అన్నాడు జెమ్ సర్ క్లాస్టిగ్గా.
ఆ మాటకు ఒక్కసారి విషం చిమ్మి వంటిమీద పడినట్లు భయపడింది మయూష.
"ఈ వయసులో నీలాంటి అమ్మాయికి నీలాంటి అందమైన ఆడ పిల్లలకు కావల్సింది సెక్స్ కదూ?
అందుకే ఆ సెక్స్ కు నువ్వు దూరంకావాలి. సెక్స్ కోసం నువ్వు వెర్రిగా వెంపర్లాడుతుంటే.
అది చూసి నేను ఆనందిస్తాను.
ఈ యింట్లో నువ్వూ, నేనూ భార్యాభర్తలం. కానీ ఈ రూమ్ లో కాదు. నాద్వారా నువ్వు ఏ క్షణంలోనూ సెక్స్ సుఖాన్ని పొందలేవు.
అంతమాత్రంచేత-
నాకు వయసైపోయిందని సెక్స్ సుఖాన్ని ఇవ్వలేక నేనలా అంటున్నానని అనుకుంటే పొరపాటే.
ఎందుకో తెలుసా? ప్రతిరోజూ నాకు సెక్స్ కావాలి. నా ఆరోగ్యానికి ఏకైక రహస్యం బూస్ట్ కాదు. సెక్స్... సెక్స్....
నానుంచి సెక్స్ నీకందదు. జీవితాంతం నువ్వు కుమిలిపోవడానికి క్రుంగిపోవడానికి ఈ శిక్ష చాలనుకుంటాను. వెరైటీ పనిష్ మెంట్. ప్రపంచంలో ఏ భార్యకూ, ఏ భర్తా వెయ్యని శిక్ష" లేచి నిలబడ్డాడు జ్వాలాముఖిరావు.
జ్వాలాముఖిరావు మాటల్ని వింటున్న ఆమె మెదడు మొద్దుబారి నట్లయిపోయింది.
వివాహ జీవితహానికి సబంధించి ఊహించుకున్న అందమైన కలలు తెగి రాలిపోతున్నట్లుగా ఉందామెకు.
కళ్ళెదురుగా ఇంద్ర ధనుస్సులోని రంగులు ఒక్కటొక్కటీ మాయమైపోతున్నట్టుగా వుంది.