Previous Page Next Page 
శతఘ్ని పేజి 25


    
    "మొన్నెపుడో ముఖ్యమంత్రిగురించి అవాకులూ చెవాకులూరాసిన త్యాగిలాంటినిజాయితీపరుడైన జర్నలిస్టు రాజకీయ ప్రపంచానికి ఎంత ప్రమాదకరమైన వ్యక్తో చెప్పలేదు.....ప్రస్తుతానికి అది అప్రమత్తం" అనుకున్నాడు.
    
    "లాభంలేదు......ఉద్యమానికి తిరుగులేని ఆయుధాల్ని సమకూర్చాలి......" అన్నాడు పరమహంస.
    
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
    
    "ఎలా" అడిగాడు ముకుందం.
    
    "విద్యార్ధుల్ని ఉద్యమంలోకి నెట్టాలి"
    
    "అదంత సులభం కాదేమో."
    
    రెండుక్షణాల విరామం తర్వాత అన్నాడు పరమహంస. "నిజమే......యూనివర్సిటీ స్థాయి అంత సులభంగా ఇలాంటి ఉద్యమాల్లో అడుగుపెట్టరు. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ వుంటుంది. కాబట్టి డిగ్రీ కాలేజి స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి రంగంలోకి దింపలేం. కారణం వాళ్ళకి జీవితంలో స్థిరపడాలనే ఆలోచన వుంటుంది కాబట్టి.
    
    కానీ......"
    
    "చెప్పండి"
    
    "ఇంటర్మీడియట్ స్థాయి స్టూడెంట్సుని రెచ్చగొట్టొచ్చు. ఎందుకంటే పసితనంక్లాసులు ఎగ్గొట్టేఆకతాయితనం అధికంగా వుండేది. ఆ వయసులోనే కాబట్టి.... కాని ఎలా......?"
    
    "ఆత్మాహుతులతో"
    
    ఓ శతఘ్నిలా వినిపించిందేమో ముకుందం అదిరిపడ్డాడు.
    
    "ఆత్మాహుతా"
    
    "అవును మన ఉద్యమానికి అండగా అమరవీరుడు సీతారామరాజు అభిమానిగా ఓ విద్యార్ధి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాడు. వేల మంది చూస్తుండగా శరీరంపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు" యువత్యాగం చిత్రించే రక్తాక్షరాల కార్యాన్ని ఉద్యమ నేపధ్యసంగీతంలా వివరిస్తూ చెప్పుకుపోతున్నాడు. అంతటితో జరిగేదేమిటో అని అడక్కు అది ఏ ప్రభుత్వమూ చల్లార్చలేనిదావాలమై మనఉద్యమానికి సరికొత్తవూపునిస్తుంది.
    
    జేబులో వున్న అణుబాంబులాంటి పధకం గురించి చెప్పిన పరమహంసని చూస్తూ అడిగాడు ముకుందం....." మరి ఆత్మాహుతికిసిద్దపడే ఇంటర్మీడియట్ విద్యార్ధి కావాలిగా"
    
    నవ్వాడు పరమహంస కుతకుతఉబుకుతున్న అగ్నిపర్వతంలా "ఈ సంఘం కోటానుకోట్ల సగటు జీవులకి నిలయం ముకుందం......దగాకోరు లోకంలో నిరంతరభుక్తి.
    
    అన్వేషణ లో కాలుతున్న సృజనాత్మక ఓ వర్గమూ మనకి తారసపడుతుందని ఉన్నవాడిగా నీకు అర్ధం కాని విషయమైనా మేథావిగా నాకు అనుభవమే...రా యిలా...."
    
    ఆవేశంగా పక్క గదిలోకి లాక్కుపోయాడు ముకుందాన్ని అక్కడ మసకవెలుతురులో కనిపించింది....... ఓ యువకుడు కాదు యిప్పుడిప్పుడే బాల్యపు నీడలు చెరిగి యవ్వనంలో అడుగుపెడుతున్నట్టు కనిపించే ఓ అబ్బాయి మోకాళ్ళ పైతల వంచి కూర్చుని వున్నాడు. అడుగుల చప్పుడు వింటూ బడలికగా తల పైకెత్తాడు. వయసు పద్దెనిమిదిదాటి వుండదు. కాని అతడి కళ్ళకింద ఇంకా ఆరని కన్నీటిచారికలు మోయలేని విషాదాన్ని స్పుటంగా వ్యక్తం చేస్తున్నాయి. ముకుందంనడవబోతుంటే వారించాడు పరమహంస. నిన్న రాత్రి చేసుకోబోయిన ఆత్మహత్యా ప్రయత్నపు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదుముకుందం......ఇప్పుడే కదిలించకు ఈ శలభాన్ని కాస్త విశ్రమించనీ.
    
                                                                 * * * *
    
    "త్యాగి చాలా చిత్రమైన వాదిలా కనిపిస్తున్నాడు సుమా" ఉదయం పదిగంటల సమయంలో సౌందర్యతో బాటు యూనివర్సిటీ క్యాంపస్ లో నడుస్తూ అంది నీలిమ.
    
    ఆమెచేతిలో ఆరోజు అబ్జర్వర్ డెయిలీ వుంది. అందులో విఫలమైన బంద్ గురించి మాత్రమేగాక సమర్ధవంతంగా బంద్ ని ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ త్యాగి రాసిన ఆర్టికల్ కూడా వుంది. ఉన్నట్టుండీ మిత్రబృందంలోని ఓ అమ్మాయి అంది "అసలు ఇతనితో స్థిరమైన అభిప్రాయమేమిటి?"
    
    మరో అమ్మాయి అనుమానంగా అంది "త్యాగి చాలా తెలివైన జర్నలిస్టు నీలూ "సాలోచనగా అంది సౌందర్య.
    
    కాబట్టే పరోక్షంగా తన మేథస్సుని ప్రదర్శించాడు బ్రహ్మాజీ ముఖ్యమంత్రి ప్రత్యర్ధి వర్గానికి చెందినవాడు అతడ్ని తూర్పారబట్టడంగాని బంద్ వైఫల్యానికి పత్రికాపరంగా కారణం కావటంగాని ముఖ్య మంత్రికి సానుకూలంగా రాయడమేగా స్నేహితురాళ్ళంతా అబ్బురంగా చూశారు పూర్తిగా అర్ధమైనట్టు....
    
    "గాడ్......ఇదంతా తను తీసుకున్న డబ్బు ప్రభావమే అన్నమాట"
    
    "అంటే మనం ఇక అతడ్ని విడిచిపెట్టకూడదు. ముందు అనుకున్నట్టు అతడి అసలు రంగు తెలిపేట్టు పత్రికాఫీసుకు వెళ్ళి గొడవ చేద్దాం. అతడ్ని ఫేక్ జర్నలిస్టుగా యాజమాన్యం గుర్తించి యాక్షన్ తీసుకునేట్టు ధర్నా ప్రారంభిద్దాం"
    
    "వదిలేయండి"
    
    వదిలిపెట్టడం సౌందర్యకీ ఇష్టం లేని విషయమే అయినా తనూ రాజకీయాన్ని ప్రదర్శించింది." మనం పదిమందీ కలిసి కేకలు పెట్టినంత మాత్రాన త్యాగికి జరిగేనష్టం ఏమీ వుండదు"
    
    "నాన్సెన్స్" కాస్త దూకుడుగా వ్యవహరించగలరూపిణి ఉద్వేగంగా అంది "మనం పదిమంది మాత్రమే అనుకుంటూ కూర్చోవాల్సిన అవసరంలేదు సుందూ. నువ్వు స్టూడెంట్స్ ని కూడగట్టుకొస్తాను"
    
    "అదంత సులభం కాదే" ఇంకా రెచ్చగొట్టింది సౌందర్య. "నన్ను అవమానిస్తున్నావ్ సుందూ ఇది నీకు సంబంధించిన ఉద్యమం అంటే వెయ్యిమందేకాదు రెండు వేలమంది అబ్బాయిలు మీ ముందు పెరేడ్ కి సిద్దపడతారు. అవును, సమస్య డబ్బు కాదు నీలూ అవినీతిపరుడైన జర్నలిస్టుని విడిచిపెడితే రేపు జరగబోయే అనర్ధాలగురించి ఆరాటం" టెంపోని మరింతగా బిల్డప్ చేసింది సౌందర్య" అసలు పత్రికలంటే ఏమిటి? అక్షరాల్ని తూటాలుగా మార్చి ప్రజల్ని జాగృతం చేయగల సాధనాలు. అంతేకాదు. ఆ సమస్యల్ని నినాదాలుగా సంఘాన్ని కదిలించే ప్రణవనాదాలుగా ప్రతిబింబింపచేసే శతఘ్నలు......" ఓ తెలుగు పి.జి స్టూడెంట్ ఆవేశంగా అరిచింది మంచిభాషని ఉపయోగించగల అవకాశానికి ఆనంద పడుతూ.
    
    "రాజకీయ సర్పబంధ ఛేదనానికి సాంఘిక అదృశ్య శృంఖలాల విచ్చేధనానికి విష జిహ్వ సమరానికి ప్రజల్ని సమాయత్తం చేయగల అక్షర తూణీరాల్ని విరజిమ్మి మహాప్రస్థానం వేపు జాతిని మళ్ళించగల......." వాతావరణం వేడిని పుంజుకుంటోంది. దేశ భాషలన్నింటిలోనూ త్యాగిని తిట్టడం ప్రారంభించిన అమ్మాయిల ఉద్యమానికి నడుం గట్టబోతుండగా హఠాత్తుగా అక్కడో సంఘటన జరిగింది. అందరికన్నా అధికంగా షాక్ తిన్నది సౌందర్య. ఏ వ్యక్తి గురించి ఇంతసేపూ వాళ్ళంతా చర్చించుకుంటున్నారో ఆ త్యాగి సరాసరి సౌందర్య ముందుకొచ్చాడు మోటార్ బైక్ పై.

 Previous Page Next Page