"హల్లో" పలకరించాడు. సౌందర్యనికాదు సమీపించి నిలబడ్డ నీలిమనీ, సౌందర్య మిగతా స్నేహబృందాన్నీ అవాక్కయి చూస్తున్నారంతా.....
"మీ తెల్ల మొహాలు చూస్తే అర్ధమైపోయింది"
"ఏమిటి త్యాగి అంటున్నది. మొత్తానికి మాటప్రకారం సౌందర్య మీ అందర్నీ ఫూల్స్ ని చేసేసిందన్నమాట"
రూపిక్షకి చిర్రెత్తుకొచ్చింది కాని నిభాయించుకుంది. "ఎక్స్ క్యూజ్ మీ.......సౌందర్యతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి"
దూరంవెళ్ళమన్నట్టుగా చూశాడు కాని కదల్లేదెవరూ.
"వయసులో వున్న ఇద్దరు ఆత్మీయుల మధ్య ప్రశాంతానికి అవకాశమివ్వకపోతే అది మంచి స్నేహం అనిపించుకోదు" నచ్చచెబుతున్నట్టుగా అన్నాడు మళ్ళీ.
ఆవాక్యం పూర్తికాకముందే ట్రాన్స్ లో వున్నట్టు అంతా కదిలారు. ఇక నిగ్రహించుకోలేని సౌందర్య ఆవేశంగా పిలవబోయింది కాని వారించాడు త్యాగి "నీపరువు పోకూడదూ అనుకుంటే వాళ్ళని పిలవకు......"
"ఏం చేస్తావ్?" అడిగింది రౌద్రంగా.
"మగాడ్ని పైగా బరితెగించినవాడ్ని అడగాల్సిన ప్రశ్న కాదిది" గొంతుస్థాయి తగ్గించి మాట్లాడుతున్నాడు.
"ఇది యూనివర్సిటీ క్యాంపస్ అని గుర్తించుకో"
"చేవగలనాలాంటి వాడికి అదో అభ్యంతరం కాదు" మరో రెండడుగులు ముందుకేశాడు.
"అరుస్తాను." నవ్వాడు మృదువుగా.
"అలా అరవడం అందరి అమ్మాయిల్లా గగ్గోలు పెట్టడం నీ వ్యక్తిత్వానికి విరుద్దమని ముందే గ్రహించగలిగాను సౌందర్యా"
"తీసుకో" ఓ చిన్న గందపు పెట్టెనితెరిచారు. లోపల రవ్వల నెక్లెస్.
విస్మయంగా చూసింది "ఇదేమిటి?"
"ప్రేమకానుక."
"య్యూ...."
"అరవకు నువ్వు నాకిచ్చినడబ్బుతో కొన్నదే."
"ఎలాతీసుకుంటాననుకున్నావ్?"
"చెప్పానుగా సౌందర్యా......పదిమంది ముందూ రాద్దాంతానికి నీ వ్యక్తిత్వం తీసిపోనిది. మర్యాదగా తీసుకో...."
"లేకపోతే?"
"నీ స్నేహితురాళ్ళను పిలిచి అందమైన కథ చెప్పి నమ్మించాల్సి ఉంటుంది"
"వాళ్ళంతా వెర్రి గొంగళాయులుకారు."
"కానప్పుడు మనిద్దరం ఆత్మీయులమనినేను అనేసరికి అంతదూరం ఎందుకెళ్ళారు?"
అవాక్కయిపోయింది సౌందర్యా.....నిజమే......వస్తూనే తన వాళ్ళను ఫూల్ చేసిన త్యాగిలాంటిమాటకారికి అదో పెద్దపని కాదు. ఇప్పుడేం చేయాలి?
"అటుచూడు" హెచ్చరికలా అన్నాడు.
దూరంగా స్థంభాలకు చారగిలబడ్డ అమ్మాయిలు నెమ్మదిగా సౌందర్య ఉన్న చోటుకి నడుచుకొస్తున్నారు.
"నీబలగం ఇటోస్తోంది" తొందర చేశాడు "నేను కరెక్ట్ కాదని వాళ్ళకి తెలియకూడదూ అనుకుంటే అర్జెంటుగా ఈ నెక్లెస్ తీసుకో ఒకవేళ ఈ ప్రేమ కానుక చూస్తే నీమాట పోతుంది. నీ మీద వాళ్ళకి నమ్మడం సన్నగిల్లి పోయింది."
నిజమే అనిపించిందేమో తొందరపాటులో అనాలోచితంగా నెక్లెస్ అందుకుని బేగ్ లో దాచేసింది. ఇక్కడ యింత సేపూ త్యాగితీసుకున్న జాగ్రత్త ప్రతి లిప్తా చిరుదరహాసాన్ని చిందిస్తూ మాట్లాడడం.
అదే సౌందర్య స్నేహితురాళ్ళను తప్పు దోవ పట్టించింది కూడా ఇద్దరు ప్రత్యర్ధుల్లాకాక ఇద్దరు ప్రేమికుల చర్చలు కనిపించడంతో రూపిణివస్తూనే అడిగింది- "సో......గుసగుసలు, ఇచ్చిపుచ్చుకోవడాలూ పూర్తయ్యాయన్నమాట....."
"ఉండడమే కాదు అంతా చూసేం కూడా" మరో విద్యార్ధిని అంది ముసిముసిగా నవ్వుతూ.
"చూడడానికి మేమేం చేసామని?" అన్నాడు త్యాగి.
"మీరలా మభ్యపెట్టక్కర్లేదు....నెక్లెస్ ఇవ్వడమూ...."
"గాడ్" క్రోధారుణ నేత్రాలతో చూస్తున్న సౌందర్యపై గెలుపులా నవ్వాడు త్యాగి.
"సౌందర్య అనుకున్నంత అమాయకురాలుకాదు మీరు."
"ఏం సౌందర్య అలా అందా" రూపిణి సీరియస్ గా అడిగింది.
"అనడమా......ఛాలెంజ్ చేసింది."
"వ్వాట్?"
ఇలాంటి సన్నివేశమొకటి ఎదుర్కోవాల్సి వుంటుందని ఊహించని సౌందర్య స్తబ్దంగా చూస్తుండగానే చెప్పుకుపోయాడు త్యాగి "మీరింత మంచి స్నేహితులని అర్దమైంది కాబట్టి ఇంత దాకా వచ్చాక అసలు నిజాన్ని దాచడంలో అర్ధంలేదు ఎస్.....నేను కరెక్టివ్ జర్నలిస్టునని నిరూపిస్తానని సౌందర్య మీతో అందటగా. అప్పుడెప్పుడో ఆ మాట నాకూ చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. నువ్వన్న ప్రతిమాటా అంగీకరించటానికి మీ ఫ్రెండ్స్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కాదని వాదించాను. అంతకుమించి ఎదగలేదంటూ ఆ రోజు నన్ను పార్క్ కి పిలిపించింది, అక్కడ నేను నచ్చచెప్పాను. వింటేగా అప్పుడే అన్నాను. ఒకవేళ మీవాళ్ళు నిజంగా అంత ఫూల్స్ అని నువ్వు నిరూపిస్తే ఆ పదివేలకి మరోపదివేలు కలిపి నీకు నెక్లెస్ కొని తెస్తానని ఓ అరగంట క్రితం ఫోన్ చేసి మా చెల్లెలు పూర్తిగా మీమీద కారాలు, మిరియాలు నూరుతున్నారనేసరికి వస్తూ నెక్లెస్ తెచ్చి తనే గెలిచిందని అంగీకరించేశాను."
"డామిట్" అరిచింది సౌందర్య- "ఇదంతా..."
"కట్టుకథని నమ్మించకు సౌందర్యా. అసలు మనం ప్రేమికుల మన్న సత్యాన్ని ఇంత కాలమూదాచిన నువ్విక ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. యామై రైట్...."
"యస్" రూపిణి సపోర్టులా అంది "నమ్మం."
"ఎందుకు?" ఆవేశపడింది సౌందర్య.
"మీకేమైంది?"
"సింపుల్ సౌందర్య" నవ్వేడు త్యాగి "అంత పరిచయం అంటూ వుండనపుడు ఏ అమ్మాయీ ఇందాక నెక్లెసు లాంటి ప్రేమ కానుక అంగీకరించదు కాబట్టి"
"హియర్ హియర్" తెలుగు పీజి విద్యార్ధిని ఆ ఉత్సాహంలో ఇంగ్లీషులో అభినందించింది" ఎనీహౌ....హార్టీ కంగ్రాట్స్ సౌందర్యా! బోతాఫ్ యూ లుక్ లైక్ మేడ్ ఫర్ యీచదర్....." అందరిలోనూ చాలా ఆత్మీయురాలనిపించే నీలిమ నిశ్శబ్దంగా వుండి పోవడంతో ఏం చేయాలో పాలుపోని సౌందర్య విజయగర్వంతో నడవబోయిన త్యాగిని చూస్తూ పిలిచింది. "అదేమిటి, అప్పుడే వెళ్ళిపోతున్నావ్......"
సౌందర్యలో యిప్పుడు యిందాకటి ఆవేశం లేదు...అదినటనే కాని నటనకాదన్నంత ప్రసన్నంగా నవ్వుతూంది "యస్.....నిజంగానే అమాయకులైన నా స్నేహితురాళ్ళ పై నేను ప్లే చేశాను. దానికి నేను మా వాళ్ళను క్షమార్పణలు అడుగుతాను....కాని యింతదాకా వచ్చేక మీ గురించి పూర్తిగా చెప్పాలిగా. "ఇప్పుడు ఆశ్చర్యపోవడం త్యాగి వంతైంది.
"ఫ్రెండ్స్.....త్యాగినాకు చాలా కావల్సినవాడని పూర్వం మీకు చెప్పినమాట నిజమే అయిన అతని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం మరోటుంది. ఆఫ్టరాల్ పది వేలు తీసుకోవదానికి త్యాగి మామూలు కుటుంబంనుంచి వచ్చినవాడు కాదు....." .....
"మరి" రూపిణి అబ్బురంగా చూసింది "సీతానగరం జమీందారుగారి మనవడు....." ఈ చర్చ పర్యవసానం గురించి ఆలోచిస్తున్నాడు త్యాగి ఏకాగ్రతగా.
"సీతానగరమెక్కడ?" విస్మయంగా అడిగింది మరో విద్యార్ధిని. "తుంపాల పక్కన." "తుంపాలెక్కడ?"
"వెంకుపాలేనికి ముందు."
"నాన్సెన్స్..." రూపిణి విసుగ్గా అంది "ఆ నైసర్గికస్వరూపం పరిచయం చేయనక్కర్లేదు....త్యాగి తాతగారి గురించి చెప్పు...."
"యస్..." సౌందర్య చెప్పుకుపోయింది. "త్యాగి తాతగారు ఓ స్వాతంత్ర్య సమరయోధుడు......బ్రిటీష్ వాళ్ళ హయాంలోనే జమీనంతా సంపాదించి ఒకప్పుడు చాలా వెలిగినవాడు.....ఎలా సంపాదించినాగాని కోట్ల ఆస్థి ఈ మనవడికి అప్పజెప్పి వెళ్ళిపోయాడు...."
"నిజమా?"
"యస్....అయినా ఆత్మాభిమానంగల త్యాగి సీతానగరంలోని తాతగారి ఆస్థిని అడపాతడపా పేదప్రజలకు దానం చేస్తూ తను మాత్రం సింపుల్ గా ఉద్యోగం వెలగబెడుతుంటాడు......ఫారెన్ కార్స్ లో తిరిగే అవకాశమున్నా ఇండియన్ మేడ్ మోటార్ బైక్ పై ఇలా స్వారీ చేస్తుంటాడు "క్షణమాగి అంది "అలాంటి వాడికి అంటే మీరు లక్ష రూపాయలు డొనేట్ చేయమన్నా అలవోకగా యివ్వగలిగేవాడికి మనమిచ్చేపది వేలెంతని..."
"గాడ్...." రూపిణి దిగ్బ్రాంతిగానే అంది. "నిజంగా మమ్మల్ని పూర్ చేశావ్."
"ఏమిటది?"
"త్యాగిచేత ఓ లక్షరూపాయలు డొనేషన్ ఇప్పించివారి తాతగారి పేర్న పేద విద్యార్ధులకి స్కాలర్ షిప్స్ ఏర్పాటు చేయబోతున్నాను"
"ఇట్స్ మార్వెలస్."
"ఇన్ క్రెడిబుల్" సౌందర్య విసిరిన వలలో ఓ చిక్కుకుపోయిన త్యాగిలో ముందు రియాక్షన్ లేదు.
"మాటిచ్చెయ్ త్యాగి......పాతిక వేలుపెట్టి సునాయాసంగా నాకు నెక్లెస్ కొనివ్వగలిగిననీకు లక్షెంత...."
వెళ్ళబోయాడు.
"ఆగు.....మన ప్రేమ కోసం మీతాతగారికి కీర్తికోసం నేను నా స్నేహితురాళ్ళకిచ్చిన మాటకోసం నువ్వు లక్ష రూపాయలు ఇవ్వాలి.....ఎప్పుడో కాదు.....రేపే ప్లీజ్....." హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
త్యాగిని ఘాటుగానే ఎదుర్కోగలిగానన్న ఆనందంతో సౌందర్య విజయగర్వంతో చూస్తూంది. "రేపు కాకపోతే ఎల్లుండి...."
"యస్.....అలాగే" టక్కున అన్నాడు.
"నిజంగా?"
త్యాగి అంత సులభంగా లక్ష యివ్వడానికి అంగీకరించడం రూపిణికి యింకా ఆశ్చర్యపరిచింది.
"నిజంగాయిస్తారా"