Previous Page Next Page 
శతఘ్ని పేజి 24

 

    1990సంవత్సరాన్ని 'సార్క్' దేశాలు బాలికల సంవత్సరంగా ప్రకటించడంతో నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే అందమైన సౌందర్య పై ఓ పత్రికావిలేఖరి అత్యాచారం అంటూ ఈ పాటికే పత్రికలు ప్రచురించి వుండేవి.
    
    1971లో మన జనాభాలెక్కల ప్రకారం వెయ్యిమంది పురుషులకి 972 మంది స్త్రీలు వుండగా స్త్రీల పై వివక్షత మూలంగా 1981 నాటికి స్త్రీ జనాభా 933 కి తగ్గిపోయింది. అలాంటి స్థితిలో పురుషులతో బాటు అన్ని రంగాల్లో నూ మేమూ సమానంగా దూసుకుపోగలమని నీలాంటి ఫెమినిస్ట్ లు ఉత్సాహాన్ని ప్రదర్శించడం అభినందించదగ్గ విషయమే అయినా అసలు మగాళ్ళనే ద్వేషించడం గాని నాలాశారీరకంగా బలవంతుడైన మగాడిపై నీలా సుకుమారంగా వున్న అమ్మాయి ఫిజికల్ గా గెలుపు సాధించాలనుకోవడం గానీ ఎంతవరకూ న్యాయం. నిజమేకలలకి అతీతంగా బ్రతికే ఓ యువకుడి చీకటి కనుపాపయై ప్రతిబింబించగల శ్వేత పుష్పం లాంటి సౌందర్యం నీది కావచ్చు....... మగాడి గుండె చప్పుళ్ళ మధ్య అనివార్య విరామంలో రెక్కలు సవరించుకు నిశ్శబ్దం చేసే భ్రమరంలా కదిలే లాలిత్యం నీ సొత్తు కావచ్చు పెదవి విప్పి చెప్పలేని మాట మాటకీ మధ్య శూన్యంలా విస్తరించి కలలు మౌనాన్ని నీకు మాత్రమే పరిమితంకావచ్చు. అలా అని ఆలోచనలనీడల ప్రమధగడాన్ని నేను లెక్కించుకుంటున్న సమయాన అందంగా దాడిచేసినన్ను ఓడించాలని ప్రయత్నించడం న్యాయమా......
        
    నా ఏకాంత సైకత శిఖరాల మీద మౌన యుద్దభేరీనినాదాలతో ఇప్పటికే నర్తిస్తూ నన్ను కలవరపరచిన సౌందర్యా......నీ ఆలోచనలింకా అక్షరాలుగానే వున్నా నాకు మాత్రం ఓ వాక్యం మొగ్గ తొడిగింది. అదిబహుమతోలేక అపశ్రుతో నాకు అర్ధంకావడం లేదు.
    
    అయినానాకో నమ్మక ఏర్పడిపోయింది.......నువ్వు తప్పకుండా వస్తావు......నేనుకోరింది కాదనకుండా యిస్తావు......ఎందుకోతెలుసా......నిన్ను నీ నమ్మకాన్ని నీ స్నేహితురాళ్ళ ముందు గెలిపించినందుకు......వాళ్ళు నన్ను అపార్ధం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు సౌందర్యా.....నీనుంచి నేను కోరిందే ననాకు దక్కినపుడు ఆనందం ఆ మాత్రం నిందని నేను భరించగలను......అదిమాత్రమే కాదు......ఈరోజు నేను పత్రికలో రాసింది నీ అభీష్టంగానే కాబట్టి నువ్విచ్చిన డబ్బుని నామూలంగా నువ్వు పొందబోయే అనుభవానికి నువ్వు ముందే పెట్టిన పెట్టుబడిగా భావిస్తూ నీకోసం అదే ఎదురు చూస్తుంటాను. ఈసారి ఒంటరిగానే రా......ఎందుకంటే ఆ దృశ్యం నీ మిత్రబృందంకళ్ళ బడడం నీకూ యిష్టం వుండదుగా......."
    
    తనపేరుతోనే ఇలా రాయటానికి ఎన్ని గట్స్ వుండాలి.....అసలు తన గురించి ఏమనుకుంటున్నాడు......!
    
    ఇచ్చిన పదివేలు అనుభవానికిచ్చిన అడ్వాన్సా?
    
    ఏంచేయాలిపుదు......రోషంతో కంపించిపోతూంది ఎవరికీ చెప్పుకోలేని సమస్య యిది....... ఎలా బుద్ది చెప్పాలీ వ్యక్తికి......చీకటిపడుతున్నా గది దాటిబయటకు రాలేకపోయింది. నిజానికి పార్కుకి వెళ్ళాలని వున్నా ఎందుకో భయమనిపించింది. మాఫియా డాన్స్ లా వ్యవహరిస్తున్న వాడు నిజంగా తను వెడితే వూరికనే వదిలేస్తాడా......
    
    ఏనాడూ పిరికితనం అంటని సౌందర్య ఇలా ఆలోచిస్తుండగానే ఫోన్ రింగయింది. కేజువల్ గా రిసీవర్ని అందుకుంది" మాట తప్పావుకదూ....."
    
    త్యాగికంఠం వినిపించింది "యూ......"
    
    "యూ........నేనే"
    
    "నేనెవరనుకుంటున్నావ్" తెలియకుండా నీ యింటికి ఎలా ఫోన్ చేశాననుకున్నావ్. అంటే నీకు నేను ముందే తెలుసునన్నమాట" రోషంగా ఒత్తి పలికింది.
    
    "తెలుసు సౌందర్యా...... మీ డాడీ ఛాంబర్ లో ఆ రోజు అడుగు పెట్టినప్పుడు అక్కడ నీ ఫోటోని చూశాను. అంతవున్న వాడికి అందమైన అమ్మాయివుండడమేమిటి అని ఆశ్చర్యపోయాను. అందుకే నిన్ను చూడగానే మూగవాడి నయ్యాను......"క్షణం ఆగి అన్నాడు "చెప్పు......వస్తావా"
    
    "షటప్......"
    
    "అరుదైన అవకాశాన్ని చేజార్చుకుంటున్నావ్......."
    
    "ఇలాపిచ్చి పిచ్చిగా ఫోన్ చేయకు."
    
    "ముందు ఫోన్ చేసింది నువ్వు నీ స్టుపిడిటీ ని నా ఫ్రెండ్ ముందు నిరూపించాలనుకున్నాను."
    
    "నిరూపించావుగా.....నేనేమిటో ఇంకా నిరూపించుకునే అవకాశమివ్వకు......నిన్ను రమ్మంటున్నది మగాడిగా నేనే నిరూపించుకోటానికి"
    
    "మిస్టర్ త్యాగీ....."ఎదురుగా వుంటే కలియబడి రక్కేసేదే."నన్ను రెచ్చగొట్టకు"
    
    "ఇదిరెచ్చగొట్టడమాకాదే......మరేమిటి"
    
    "మరేమిటి"
    
    "గమనిస్తున్నాను"
    
    "దేన్ని"
    
    "మాక్ ప్రొటెస్ట్ ని .......సైకాలజీలో ప్రియురాలు ప్రియుడిపై చేసే వ్యంగ్య ప్రతిఘటన్ని మాక్ ప్రొటెస్ట్ అంటారు కదూ......
    
    "అదీనీకు తెలుసా" అవహేళనగా అంది.
    
    "భలేదానివే సైకో అనలిస్ట్ డాక్టర్ పాల్ హాక్ థియరీ ప్రకారం నీలాంటి పొగరున్న అమ్మాయి నాలా తెగువని ప్రదర్శించే అబ్బాయిని ప్రతిఘటిస్తూనే యిష్టపడడాన్ని మాక్ ప్రొటెస్ట్ అంటారటకదూ"
    
    "ఫోన్ పెట్టేస్తున్నాను......"
    
    "దీన్ని కండిషనల్ ఎక్సెప్టెన్స్ అంటారు. అవును, సౌందర్యా అసలు ఏక్సెప్టెన్స్ అంటూ లేకపోతే ఐ మీన్ టోటల్ ఏక్సెప్టెన్స్ కి ముందు దశలో మాత్రమే ఇలా రిసీవర్ పట్టుకుని ఇంకా వినాలనుకుంటూనే ఫోన్ పెట్టేస్తానంటూ బెదిరించేది"
    
    గభాలున ఫోన్ క్రెడిల్ చేసింది. ఉక్రోషంగా నేల చూపులుచూస్తూ ఉండిపోయింది........ ఇదేమిటి తనుగుణపాఠం చెప్పాలనుకున్నవ్యక్తి తిరిగి ఇలా సాధిస్తున్నాడేం.......
    
    ఆమె ఆలోచనలనుకున్న మధ్య సతమతమవుతూనే అనుకుంది త్యాగికి తిరుగులేనిబుద్ది చెప్పాలని......అనుకున్నదే తడవుగా అబ్జర్వర్ కి ఫోన్ చేసి రెండునిముషాలలో త్యాగిని లైన్ లోకి రప్పించింది. "లుక్ మిస్టర్ త్యాగీ......నేను నీకు గుణపాఠం చెప్పగలయూనివర్సిటీ విద్యార్దునిగా నువ్వు గుర్తుంచుకోవడం బెటర్. పైగా నేనుక్యాంపస్ లో చాలా పలుకుబడిగలదాన్ని....."
    
    "పాపండి ఫెన్స్ లో అడుగు పెట్టావేం."
    
    "రేపు నువ్వు అఫెండ్ కాకుండా......వుండాలి....."
    
    మాటల్తో అతడ్ని గెలవటంకష్టంగా వుంది. ఇకపోతే నేనిచ్చిన పదివేల సంగతంటావా.......ఆ డబ్బు నేను నెలాఇచ్చే దానధర్మాలలో సగం, నేను నా కాస్మోటిక్స్ కి ఖర్చు చేసే దానిలో పాతిక శాతం మాత్రమే ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకో......యిదా రేళ్ళకి రెండింతలవుతుంది" అనాల్సింది అనేసి ఫోన్ క్రెడిల్ చేసింది ఎందుకో కాస్త వూరటనిపించింది.
    
    అదీ అయిదు నిమిషాల పాటే....
    
    "నామాటేమిటి" బంద్ రోజు సాయంకాలం గుండెల్నిబాదుకున్నాడు బ్రహ్మాజీ ముకుందాన్ని చుట్టేసి.
    
    "మీరంతాకలిసి నన్ను రెచ్చగొట్టారు........ఇప్పుడు నేనేం కావాలి."
    
    టెంట్ లో వున్న కార్యకర్తల్ని పట్టించుకోకుండా నీరసంగా ముకుందాన్ని నిలదీస్తున్నాడు....... ముకుందమూ జవాబుచెప్పలేకపోయాడు......అతడికీ ఆందోళనగా వుంది దానిక్కారణం ఏదో జరుగుతుందనుకున్న బంద్ రోజు ఏమీ కాకపోవడం.......ఒక్క ఆర్టీసీ బస్సు తగలబడలేదు. ఒకటీ అరా చెదురుమదురు సంఘటనలు తప్ప రాష్ట్రంలో ఒక్క చోటాకాలుపులు జరగలేదు. ప్రభుత్వ కార్యాలయాలూ, స్కూల్సు యధావిధిగా పనిచేశాయి. బంద్ దారుణంగా విఫలమైపోయింది.
    
    సీతారామరాజుసంస్మరణ సంఘానికి పతిపక్షాల సంయుక్త కార్యా చరణకి సుమతి చెందిన ముఖ్యులందరూ ముందు రోజే అరెస్ట్ చేయబడడంతో ఉద్యమాన్ని నడపగలిగే వ్యక్తులు లేకపోయారు.
    
    "మాట్లాడు ముకుందం.....నేను ఏ క్షణంలో అయినా పోయేట్టున్నాను"
    
    లక్షలు విరజిమ్మిన ముకుందంగొంతు పెగలడం లేదు. వారం రోజులపాటు చాలా కలసి ఆశల్నిరగిల్చిన ఉద్యమం ఇప్పుడు శుష్కించిపోయింది.
    
    ఇప్పుడెలా...కనీసం ప్రభుత్వం చర్చలకి సైతంపిలవడం లేదూ అంటే ఇటు బ్రహ్మాజీ ప్రాణాలు పోవడం తప్పనిసరి మాత్రమేకాదు అటు అలజడి ఉధృతం చేసే అవకాశాలూ సన్నగిల్లుపోతాయి.
    
    రెండుపక్కలా రాపిడి వుంటే తప్ప అగ్నిశిఖ పుట్టదు. అగ్నికీలలతో తప్ప ఉద్యమం పెరిగే అవకాశంలేదు. రోడ్డు మీదమమోలుగా సంచరిస్తున్న జనాన్ని ఫుట్ పాత్ పై ఆకలితో వున్న బిక్షగాళ్ళతోపాటు కోరి నిరాహారదీక్షతో ఆకలి చావుకి సిద్దంగా వున్న బ్రహ్మాజీని చూస్తూ పైకి లేచిన ముకుందం వెంటనే పరమహంస వున్న గెస్టు హౌస్ కి బయలుదేరాడు.
    
    అంతటి మేథావి కూరుకు పోయినట్టు అప్పటికే పరమహంస మొహం పాలిపోయివుంది. "అయిపోయింది పరమహంసగారూ" ముకుందం ఉద్రేకంగా అన్నాడు. "మీరేదో ఉద్దరిస్తారనుకుంటే మొత్తం నా డబ్బుతగలడ్డంతో పాటు అటు బ్రహ్మాజీచావుకి సిద్దంగా వున్నాడు"
    
    నేలచూపులు చూస్తున్నాడు పరమహంస ....."ఏం జవాబు చెప్తారు.......ఇపుడేం చేద్దామనుకుంటున్నారు.....మొత్తం ఉద్యమం చప్పబడిపోయింది. మన ప్రతినిధుల్ని కటకటాల వెనక్కి నెట్టిన ముఖ్యమంత్రి మనమీద తిరుగులేని గెలుపు సాధించారు"
    
    "దానికి అభినందించాల్సింది రాజారాంని కాదు ముకుందం. అతనికి ఇంత తెలివైన మార్గం చూపించిన త్యాగిని...."
    
    క్షణం ఆపాడు సాలోచనగా......పరమహంస నేత్రాలూ ఇప్పుడు అరుణిమని పుంజుకుని వున్నాయి.
    
    "అవును ముకుందం ఒకే పటిష్టమైన ఉద్యమాన్ని పత్రికాముఖంగాదెబ్బ తీయడమేగాక ఏం చేస్తే ఈ బంద్ విఫలమయ్యేదీ ప్రభుత్వానికి తెలివిగా తెలియజెప్పిమనపై అసాధారణమైన గెలుపు సాధించాడు త్యాగి ఎవడన్నా కానీ"

 Previous Page Next Page