శ్రీహర్షా! ప్రపంచంలో ఎవరి దెంత స్వార్ధమో నాకు తెలుసు. నా బంధువులెవరు నా పిల్లల్ని చేరదిస్తారనే నమ్మకం నాకు లేదు. నాకున్న ఓకె ఒక్క ఆశాకిరణం- శ్రీహర్షా- నువ్వే!
అబ్బ! తల తిరుగుతోంది. ఈ ఉత్తరం తక్షణం పోస్టులో వేసేయ్యాలి.
ముకుందరావు."
"పాపం" అంది లావణ్య, తలఎత్తి శ్రీహర్ష మొహంలోకి చూస్తూ - "ఏం చేస్తారిప్పుడు?" అంది.
"ఏం చెయ్యాలి? వాళ్ళని తెచ్చి నా దగ్గరే పెట్టుకోవాలి. వేరే మార్గం లేదు."
"ఎన్నాళ్ళు?"
"వాళ్ళ బతుకులోక దారికి వచ "పెళ్ళి కాకుండానే మనకి ఎదిగిన పిల్లలిద్దరా?"
"అలాంటిదే."
"శ్రీహర్హా! నా కసలు పిల్లలంటే పెద్ద ఇష్టం లేదు. కారణం , మా అమ్మ నాన్నలకు నేనొక్కదాన్నే అయి ఉండడం, ఇప్పటిదాకా నన్ను వాళ్ళు చిన్నపిల్లలాగానే చూస్తూ ఉండడం అయి ఉండొచ్చు. పెళ్ళి చేసేసుకున్నా, ఇప్పుడప్పుడే పిల్లలుండకూడదనుకున్నాను నేను. మరి ఇంకోళ్ళ పిల్లల్ని దగ్గరుంచుకుని వాళ్ళతో కలిసి పోగలనా?"
"మరి ఏం చెయ్యమంటావు లావణ్యా?"
"శ్రీహర్షా! వాళ్ళు కష్టాల్లో ఉన్నారు నిజమే! ఆ పిల్లలకి సాధ్యమైనంత సహాయం చేద్దాం. కాని మన దగ్గరే ఉంచుకోవడం అంత తెలివైన పని కాదేమో! ఎక్కడన్నా బోర్డింగ్ స్కూల్లో చేర్పిద్దాం. డబ్బుకి లోటేం చెయ్యొద్దు మనం."
"ఊరికే డబ్బు వాళ్ళ మోహన పారేద్దాం. వాళ్లేలాగో లాగ బతుకుతారులే అంటావా? నో నో డబ్బొక్కటే ముఖ్యం కాదు లావణ్యా! కాస్త ప్రేమా, మమకారం చూపించే మనుషులుండాలి. అభిమానం ఆసరా కావాలి వాళ్ళకి . అసలే మానసికంగా కృంగిపోయి ఉంటారు. లవనయా! ఒక్క మాట చెప్పనా? వాళ్ళు బిచ్చగాళ్ళు కారు. ముకుందరావుగారి పిల్లలు- మా ముకుందరావుగారి పిల్లలు" అన్నాడు ఆవేశంగా.
లావణ్య తెల్లబోయింది.
"అరె! అంత ఆవేశపడిపోతున్నరేమిటి? ఇప్పుడు నేనేమన్నానని సరే! మీ ఇష్టం. ముందు ముందు మనకి ఇబ్బంది అవుతుందని హెచ్చరించానంతే!"
"ఎంత ఇబ్బందయినా, ఎంత కష్టమయినా, వాళ్ళని మన దగ్గర ఉంచుకోక తప్పదు లావణ్యా!"
"సరే! అంది లావణ్య, ముభావంగా.
"నేను రేపే ఊరెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను."
"ఊ"
"మ ఇంట్లో స్టోర్ రూంలా వాడుతున్న గది ఖాళి చేయింది వాళ్ళకిస్తాను."
"సరే."
"నువ్వు సరిగ్గా మాట్లాడడంలేదు."
"నాకు మూడ్ పోయింది. ఈ గొడవతో సరదా చచ్చిపోయింది."
"సారి లావణ్యా!"
"ఫర్వాలేదులెండి. ఇంక ఇంట్లో కెళదామా?"ఇద్దరూ లేచారు.
* * *
"కంగ్రాట్స్ బేబీ" అన్నాడు రాజేష్.
"ఫంచ్' చదువుతున్న లావణ్య ఉలిక్కిపడి చూసి, "నువ్వా" అని పమిట సర్దుకుని కూర్చుంది.
"కంగ్రాట్స్ చెప్పాను."
"దేనికి?"
"నీ పెళ్ళి సెటిలవలెదూ?"
"ఓహ్! అదా? నీకెవరు చెప్పరప్పుడే? వచ్చే నెల ఫార్మల్ గా ఒక పార్టీ ఏర్పాటు చేసి అందరికి చెబుదామనుకున్నాం."
"నేనూ 'అందర్లో' ఒకన్నా లావణ్యా! ఇంకేం కాదా?"
"ఎందుకు కాదు. నాకు మంచి ఫ్రెండ్ వి. నాకున్న ఇంకో మంచి ఫ్రెండుకి అన్నయ్యవి."
"అంతేనా ? ఇంకేమి కాదా?"
ఇబ్బందిగా కదిలింది లావణ్య.
"ఇంకేం కానా లావణ్యా!"
అమోఘమైన తెలివితేటలున్న బిజినెస్ మాన్ వి."
"ఇంకా."
" చాలా అందగాడివి. ఇంక చాలా?" అంది నవ్వేస్తూ.
"పోనీ నాలో దుర్గుణాలేమన్నా ఉన్నాయా? అది చెప్పు."
"నీలో ఉన్న ఓకె ఒక్క దుర్గుణం- పరమ బద్దకస్తుడివి. 'ఫూల్స్ డై' తెచ్చి పెట్టమన్నాను. నెల రోజులయింది తెచ్చావా?"
"సారీ లావణ్యా! నాకు బద్ధకం ఎక్కువ. అందుకే 'ఫూల్స్ డై' రేపు రెపనుకుంటూ తేవడం వాయిదా వేశాను. ఆ బద్దకం వల్లె మనసులో ఉద్దేశాల్ని బయట పెట్టలేకపోయాను. అవును. ఫూల్స్ డై. నా లాంటి మూర్ఖులు."
విచిత్రంగా చూసింది లావణ్య.