"అవును కదూ?... నాకు ఈ ఆలోచనే తట్టలేదు...అన్నాడు నసుగుతూ.
మర్తెతే ఏం చెయ్యాలి!?...ఏం చెయ్యాలి!!?
తీవ్రంగా ఆలోచించాడు కన్నారావు.
వెంటనే అతనికి మరో దివ్యమైన ఆలోచన తట్టింది.
"మనం ఓ పని చేస్తే సరిపోతుంది" హుషారుగా అన్నాడు.
"ఏంటిది?" కుతూహలంగా అడిగాడు చిట్టబ్బాయి.
"మనం పండుని కిడ్నాప్ చేసి తేస్కేళ్లేటప్పడు మారువేషాలేస్కుని తేస్కేళ్దాం. వాళ్ళ నాన్నని ఫోన్లో బెదిరించిన తరువాత పండుగాడికి నిద్ర మాత్రలు ఇచ్చి పడుకోబెట్టి అ తరువాత మారువేషాలు తీసేసి వాడిని వాళ్ళింట్లో అప్పజేప్పెస్తాం... అంతే!... పండుగాడు వాడిని మనమే కిడ్నాప్ చేశామని గుర్తిచలేడు... ఎలా ఉంది మన ఐడియా?" కళ్లేగురవేస్తూ అడిగాడు కన్నారావు.
"ఫెంటాస్టిక్..... చాలా బాగుంది... కాని వాడిని కొడ్నాప్ చేసి ఎక్కడికి తెస్కేళ్లలి?" అన్నాడు చిట్టబ్బాయి.
"జూబ్లి హిల్స్ లో ఆ కొండలూ గుట్టల మధ్య అక్కడా, అక్కడా సగం సగం కట్టి ఇంకా పూర్తికాని ఇళ్లు ఉన్నాయి... అక్కడికెక్కడిక్తెనా తిస్కెళ్దాం..."
కన్నారావు ప్లాన్ ని ఒకే చేసేశాడు చిట్టబ్బాయి.
ఆ మర్నాడు ఇద్దరూ ఆఫీసుకి సెలవు పెట్టేశారు. మారువేశాలేస్కుని ఒక రిక్షా అద్దెకి తీస్కుని శాంతినగర్ వెళ్లారు. ఆ తరువాత రిక్షా రామయ్యని కానరావు మాయమాటలు చెప్పి పంపించేసింది తెలిసిన విషయమే.
చిట్టబ్బాయి రిక్షా ముందుకి పోనిచ్చాడు.
"నేను ఆ సెంటర్లో నీకోసం ఎదురుచూస్తుంటా... పండుని ఎక్కించుకుని వచ్చేయ్....." అని చెప్పి సందులోకి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కన్నారావు.
చిట్టబ్బాయ్ రిక్షాని రజని వాళ్ళ యింటి ముందు ఆపాడు.
గుండె దిటవు చేస్కుని కాంపౌండ్ లోంచి లోపలికి వెళ్లాడు.
విధి తలుపులు మూసివున్నాయి.. భయం భయంగా కాలింగ్ బెల్ నొక్కాడు. అయిదారు క్షణాలు ఎదురుచూశాడు.
మళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు.
నాలుగు క్షణాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి.
ఎదురుగా నిల్చుని ఉన్న వ్యక్తిని చూస్తూనే చిట్టబ్బాయి కళ్ళుపూర్తిగా విప్పారాయి. అతని నోరు కూడా విప్పారింది. ఆనందంతో అతని గుండె వేగంగా టకటకా కొట్టుకుంది.
రజని!...
నారజని!!...
నా అందాల రజని!!!..
ఆమె అప్పడే తలకి స్నానం చేసినట్టుంది. తలారబెట్టుకుంటా ఉంది. లేత నిలం రంగు షిఫాన్ చిరెలో దేవతలా వెలిగిపోతుంది.
"ఏంటి?..."
నోరు తెరుచుకుని చూస్తున్న చిట్టాబ్బాయ్ తో అంది కళ్ళు చిట్లించి చూస్తూ.
"రిక్షా తోక్కుతాడే... రామయ్య!... వాడు నాకు అన్నయ్య అవుతాడండి. నేను వాడికి తమ్ముడిని అవుతానండి... ఈవేళ మా అన్నయ్యకి జ్వరం వచ్చిందండి..." గబగబా చెప్పాడు చిట్టబ్బాయ్.
అంతలోనే తన పొరబాటు గ్రహించి నాలుక కొరుక్కున్నాడు.
తానిప్పుడు రిక్షావాడు. ఇలా మంచి బాషలో మాట్లడ్తే ఎలా?.... యాసలో మాట్లాడోద్దూ??... రజనిని చూసిన ఆనందంలో తను రిక్షావాడినని మార్చిపోయాడు చిట్టబ్బాయి.
తన తప్పని దిద్దుకుంటూ మళ్లి యాసలో చెప్పడం మొదలుపెట్టాడు.
"అదేనండమ్మగోరూ .....రిచ్చా తొక్కే రామయ్య నాకన్నవర్స అవుతాడండి... నేనేమో ఆడికి తమ్ముడి వర్స్ అవుతానండి. మా అన్నకియాల జోరమొచ్చిం దండి.... ఆడు రాలేడు కదండి?... అందుకుని పండు బాబుగార్ని స్కూలుకి తిస్కెల్లడానికి నన్ను పంపించాడండి మా అన్న..."
"ఓ...రిక్షా అబ్బాయివా?.... ఇందాక బాగానే మాట్లాడావు ఇప్పడేమ్తెంది?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది రజని.
"పొరబాట్ల నోరు జారుపోయానండి... అవి గొప్పోల్ల బాసండి.. మేము మీ బాస మాట్లాడోచ్చాండి?...."
నాలుక్కరుచుకుని చేంపలేస్కున్నాడు చిట్టబ్బాయి. "తప్ప కందడి... అందుకే మా బాసలోనే మాట్లాడుతున్నానండి".
రజని ఓసారి వింతగా చిట్టబ్బాయి వంక చూసింది.
ఆ తరువాత "ఒరేయ్ పండూ... రిక్షా అబ్బాయి వచ్చాడు... స్కూలుకి లేటయిపోతుంది త్వరగా రా..." అంది రజని లోపలి నుండి చిన్న పిల్లాడి కంఠం వినిపించింది.
కొన్ని క్షణాలు మౌనంగా దొర్లాయి. రజని విరబోసుకున్న జుట్టు లోంచి వెళ్ళుదూర్చ చిక్కులు విడదీస్తూ వెళ్ళతోనే దువ్వుతోంది. చిట్టబ్బాయి ఆమెను నోరు తేర్చుకుని చూస్తున్నాడు.
అతను అలా చూస్తూంటే రజనికి ఇబ్బంది గా అనిపించింది.
"చూడు బాబూ.... రిక్షా తొక్కితే నీకు రోజుకి ఎంతోస్తుంది?" ఏమి తోచక అడిగింది రజని.
"ఆ....రోజుకా.... రోజుకే కాదడంమ్మాయి గోరూ? మరేమో రోజుకి..." ఆలోచిస్తూ అన్నాడు చిట్టబ్బాయి.
"ఆదేంటి అంత ఆలోచిస్తావ్ ?"
"రోజుకి పది పదిహేను రూపాయలు మిగులుతాయండి రిక్షా కిరాయి పోను" ఠకి మని సమాధానం చెప్పాడు.
"అంతేనా.... మరి నీకు ఎలా గడుస్తుంది?"
"గడవడానికేముందిఅమ్మాయి గోరూ!.. నేనొక్కడినే కదండి.. హిహి"
"అంటే నీకు పెళ్ళి కాలేదా?"
"లేదండి...అందుకెనండి ఈ తాపత్రయం అంతాను....అన్నట్టు మీ పేరు రజని అండి!"
"అవును!...నికేలా తెల్సు?"
"మా అన్న సేప్పాడండి....హి!"
"ఏంటమ్మా చిన్నమ్మాయి ఆ సంత?" గట్టిగా ఆరుస్తూ లోపలి నుండి వచ్చాడు రజని తండ్రి.
"పండుని స్కూలుకి తేస్కేళ్ళదానికి వచ్చాడు నాన్నా..." చెప్పింది రజని.
అయితే రజనిని ఇంట్లో చిన్నమ్మాయి అని పిలుస్తారన్న మాట! అనుకున్నాడు చిట్టబ్బాయి.
"ఇతనోచ్చాడేం?
రామయ్యకి జ్వరం అట నాన్నా!.... ఇతన్ని పంపించాడు"
"ఏం పాడు సంతో!... చూడబ్బాయ్ పిల్లాడ్ని జాగ్రత్తాగా తిస్కెళ్తావ్ కదూ?"
"అయ్యబాబో.... తమరు చెప్పలటండి.." వంగి చేతులు కట్టుకుని అన్నాడు చిట్టబ్బాయి!
"ఊ....ఊ.. సర్లె సర్లె.. స్కూలుకి టైమ్ పోతే ఈ పండుగాడు లోపలేం చేస్తున్నాడూ. మాయదారి సంత...." అరుస్తూ లోపలికి వెళ్లాడు రంగనాయకులు.
"ఈయన రంగాయకులు గారే కదండి?"
రజనిని అడిగాడు చిట్టబ్బాయి.
"అవును!... ఇది కూడా మీ అన్నయ్యో చెప్పాడా?" నావ్వుతూ అడిగింది రజని.
"అవునండి.. మామయ్యగారే కదండి?"
"కాదు... మా నాన్నగారు!" చెప్పింది రజని.
తను చేసిన పొరబాటు అర్ధం అయ్యి నాలుక కోరుకున్నాడు చిట్టబ్బాయి.
"అదేలెండి... మీ నాన్నగారే లెండి - హిహి - అవున్లెండి" అన్నాడు బలవంతంగా నవ్వు తెప్పించుకుని.
అంతలో లోపల్నుండి పండు తుర్రుమని బయటికి పరుగెత్తుకుని వచ్చాడు వాడి భుజానికి స్కూల్ బ్యాగ్ వేళాడుతోంది.
"నేన్రేడి" అన్నాడు వాడు రజనిని జూస్తూ.
"ఏది? నాకు ముద్దిచ్చేయి" వంగి బుగ్గని పండుకి అందించింది రజని.
పండు ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఆమె కూడా పండుని ముద్దు పెట్టుకుంది.
"ఆ పెదాలు తన్నెప్పుడు తాకుతాయో!" అనుకున్నాడు చిట్టబ్బాయి.