Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 22

 

    ఈలోగా స్మిత రెండు కప్పుల్లో "టీ" తీసుకొచ్చింది.
    ఇద్దరూ "టీ" తాగాసాగారు.
    "ఆహా! స్వర్గానికి అరంగుళం దూరానికి నెడుతోంది స్మిత మీ చేతి "టీ" అంత అద్భుతంగా చేశారు - " మెచ్చుకున్నాడతను.
    "ఇప్పుడు మనమేమి చెయ్యాలి?" పోలీస్ రిపోర్టు ఇద్దామా." అడిగిందామె.
    హటాత్తుగా అతను పగలబడి నవ్వటంతో అతని చేతిలోని "టీ" ఒలికి అతని ఫాంట్ మీద పడింది.
    "ఎంత గొప్ప జోక్ చేశారు స్మితాజీ, పోలీసులకు రిపోర్టు చేయటమా? వాళ్ళెం చేస్తారు? ముందు వాళ్ళను అరెస్టు చేస్తారు. తరువాత మన దగ్గర కొస్తారు. రెండొందలు అడుగుతారు. మళ్ళీ వాళ్ళ దగ్గర కేళతారు నాలుగొందలు అడుగుతారు - మళ్ళీ మన దగ్గర కొస్తారు మూడొందలు తీసుకుంటారు. తరువాత అయిదొందలు - మన దగ్గర నాలుగొందలు - వాళ్ళ దగ్గర ఆరొందలు -
    ఇలా జీవితాంతం మనం ఓవర్ టైములూ, నైట్ డ్యూటీలూ పార్ట్ టైములో , విరామ సమయాల్లో బిచ్చమెత్తుకుని పోలీసు వారికీ అందిస్తూ చివరకు పశ్చాత్తాపంతో సలసల కాగిపోతూ "హూ! పోలీస్ రిపోర్టు - హా - పోలీస్ రిపోర్టు - హహ " అనేసి ఆఖరి శ్వాస వదిలేస్తాం సినిమా హాలు గేటు బయట బఠాణీలమ్ముతూ "స్మితకు నవ్వాగలేదు.
    ఆమె మనసులోని భయం కొంతవరకూ తొలగిపోయిందిప్పుడూ .
    "ఏం చేద్దామంటారు మరి?"
    "మీరు వెంటనే ముఖ్యమయిన బట్టలు, ఇతర సామగ్రి ఓ సూట్ కేసులో సర్దుకుని రడీ అయితే - మనం ఆర్.కె. శ్యామ్ ఇంటికి జేరుకుందాం. తరువాయి కార్యక్రమం వచ్చే సంచికలో."
    స్మితారాణి కొద్ది క్షణాలు ఆలోచించింది.
    'అంటే వాళ్ళు మళ్ళీ ఎటాక్ చేస్తారని మీరనుకుంటున్నారా?"
    "అనుకోవటం కాదు మిస్! చేస్తారు - మీరింకా క్విజ్ ఫ్రోగ్రాం ఆపి త్వరగా రడీ అయితే -"
    "ఇప్పుడే రెడీ అవుతాను" అంటూ లేచి తులసిని తీసుకుని బెడ్ రూంలోకి వెళ్ళిందామే. పది నిమిషాల్లో తులసి సంచీ తగిలించుకుని బయటికొచ్చింది.
    ఆమె వెనుకే స్మిత సూట్ కేస్ తో వచ్చేసింది.
    "ఆ సూట్ కేస్ ఇటివ్వండి స్మితాజీ! మీలాంటి సుకుమారి మణులు ఇలా ఫిజికల్ లేబర్ చేయకూడదు. మీకు హెల్ప్ చేయటానికే గాడ్ ది గ్రేట్ మాలాంటి ఎనర్జిటిక్ యంగ్ మెన్ ని ప్రపంచం మీద వదిలాడు."
    "ఊహు! మీ చేతికి అసలే దెబ్బ తగిలింది - నేనే పట్టుకుంటాను."
    :పహలే అప్ - పవలే అప్ - వ్యవహారంలా వుంది మనది! అల్ రైట్ కొంచెం సేపు నేను పట్టుకుంటాను - కొంచెం సేపు మీరు పట్టుకుందురు గాని? ఓ.కే.?"
    అతనికి సూట్ కేస్ అందించిందామె.
    "అంకుల్ గ్రేట్ ఫఫ్" పిక్చర్ లో కూడా ఇలాంటి సీనే వుందని చెప్పావ్ కదంకుల్. హీరో హీరోయిన్ నేనంటే నేననీ పోట్లాడుకుంటారు గార్డెన్ వర్క్ చేయడానికి."
    "కరెక్టు లిటిల్ ఫ్రెండ్ - వండర్ ఫుల్ జ్ఞాపశక్తి నీది?"
    ముగ్గురూ రోడ్ మీద కొచ్చారు. అప్పటికే రోడ్ నిర్మానుష్యంగా తయారయింది.
    టైం చూసుకున్నాడు భవానీశంకర్. పన్నెండవుతోంది.
    బస్ స్టాప్ దగ్గర కనిపించింది ఖాళీ అటో. అయిదు నిమిషాలు లేపాక అటో డ్రయివర్ బద్దకంగా నిద్రలేచాడు.
    "డబల్ మీటర్ సార్" అన్నాడు నిద్రమత్తులోనే.
    "నాకు తెలుసు కామ్రేడ్! నిద్రలో కూడా మీరదే కలవరిస్తారని కమాన్ త్వరగా పోనీ!"
    పావుగంటలో శ్యామ్ ఇల్లు చేరుకోగలిగారు వాళ్ళు. డోర్ బెల్ కొద్ది సేపు మోగించాక గానీ తలుపులు తెరుచుకోలేదు.
    భవానీశంకర్ నీ, స్మితారాణినీ చూస్తూనే ఆశ్చర్యపోయాడు శ్యామ్.
    "ఏమిటి సంగతి" ఏమయినా జరిగిందా" అనుమానంగా అడిగాడతను.
    భవానీశంకర్ సమాధానం చెప్పకుండా సూట్ కేస్ తో లోపలి జొరబడ్డాడు. వెనుకే స్మితారాణి, తులసి కూడా లోపలికి కొచ్చేశారు. అఖిలభాను మాక్సితో బెడ్ మీద నుంచి దిగి వచ్చింది నిద్రమత్తులో.
    ":హలో సిస్టరిల్లా! ముందీ ముక్కుపచ్చలారని ముద్దు పాపని తీసుకెళ్ళి ఓ బెడ్ మీద పడక ఏర్పాటు చేస్తే మిగతా వివరాలన్నీ కళ్ళకు కట్టినట్లు వర్ణించి చెపుతాను" అన్నాడు తులసి చేతిని ఆమె కందిస్తూ.
    తులసి ఆమెతో పాటు వెళ్ళి మంచం మీద పడుకుంది.
    "మనం అనుకున్నదంతా జరిగింది కామ్రెడ్. నేను స్మితారాణి ఇంటికెళ్ళి జాగ్రత్తగా వుండమని చెపుతూనే వున్నాను. అంతలోనే మన గాంగ్ స్టర్స్ వచ్చేశారు. వాళ్ళను మన పవర్ ఫుల్ బాక్సింగ్ తో పంపించి వేసి వీళ్ళను తీసుకోచ్చేశాను" సోఫాలో కూలబడి చెప్పాడు భవానీ శంకర్.
    "ఎవరు వాళ్ళు?"
    "అదే తెలీదు కామ్రెడ్. కారు నెంబర్ మాత్రం దొరికింది. దాన్ని బట్టి ఆ గాంగ్ స్టర్స్ ఎవరో కనుక్కోవాలి మనం."
    శ్యామ్ నవ్వేశాడు.
    "ఇన్ని డిటెక్టివ్ పుస్తకాలు చదివినా ఇంకా కారు నెంబరు నోట్ చేసుకునే బుద్ది పోలేదన్న మాట నీకు? ఇలాంటి నేరాలు చేయడానికొచ్చే వారు దొంగ నెంబరు ప్లేట్లు పెడతారు. లేదా ఇంకెవరిదయినా కారు దొంగలిస్తారు. కావాలంటే రేపు పోలీసు కంట్రోలింగు రూంకి ఫోన్ చేసి కనుక్కో."
    "యూ ఆర్ కరెక్టు కామ్రేడ్! ఆ పాయింట్ నా బుర్రలో ఉంది గానీ ఏదో ఆశ పొరబాటున సొంతకారు తెస్తారేమోనని."
    "ఇంతకూ వాళ్ళు మన స్మిత మీద ఎందుకు ఎటాక్ చేసినట్లు అడిగింది అఖిలభాను.

 Previous Page Next Page