Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 21

   
    అతని వేళ్ళు లంగా ముడికోసం శోధిస్తూ కదులుతున్నాయి. అతను ఇక తట్టుకోలేక ఆమెను బలంగా ముందుకి లాక్కున్నాడు.

    అదిగో ఆ క్షణంలో ఆమెకేదో అయింది. ఠక్కున పైకి లేచింది. అతను హతాశుడై చూస్తున్నాడు.

    ఆమెలోని మోరల్ వాల్యూస్ ఆమె కోరికమీద నీటితుంపరల్లా పడడంతో తను ఎంత తప్పు చేస్తున్నదీ తెలిసింది. తనమీద తనకే అసహ్యమేసింది.

    తను అన్ని రోజులూ ఊరకే వుండి ఇప్పుడు చెల్లెలి భర్తనేవంచుకోబోయింది. తనంత భ్రష్ఠురాలు ప్రపంచంలో వుండదు. ఏమైంది తనకి? దెయ్యం మనసులో దూరిందా? లేదూ దేవత శపించిందా?ఛీఛీ - తనెంత పాపానికి ఒడిగట్టబోయింది. అయ్యో! దేవుడా నన్ను క్షమించు.  చెల్లీ నన్ను మన్నించు. ఆమె తనలో తానే ప్రార్ధిస్తూ వుంటే ఆమెకి తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు కారిపోతున్నాయి.

    ఆమెను ఆ స్థితిలో చూసి అతను భయపడ్డాడు.

    ఎలా ఓదార్చాలో తెలియడంలేదు. మధ్యలో హఠాత్తుగా ఆమె ఎందుకు అలా లేచిపోయిందో అంతుబట్టడంలేదు.

    మొత్తానికి ఆమె అందుకు ఒప్పుకోదని అతనికి తెలిసిపోయింది. "పోదాం రా వదినా, వర్షం ఆగిపోయింది" అన్నాడు ఆమె ముఖంవంక చూడలేక తల కిందకు వంచుకుని.

    ఆమె కదిలింది. ఇద్దరూ ఇల్లు చేరేటప్పటికి ఉజ్వల, రఘురామయ్య వాళ్ళకోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

    "ఎమైందక్కా! అలా ఉన్నావ్" ఉజ్వల అక్కను చూసి అడిగింది. ఒక్కరోజుకే అయిదు సంవత్సరాల వయసు మీదపడ్డట్టు అయిపోయింది ఆమె.

    "వర్షం -అందులోనూ పొద్దు పోయిందికదా. అంతే" వెంకటాచలం సర్ది చెప్పాడు.

    అప్పటికి ఆ గండం అలా గడిచిందిగానీ ఊర్మిళ ఆ తరువాత కూడా మరిదిమీద పుట్టిన ఆకర్షణని చంపుకోలేక పోయింది. ఎంత బలవంతంగా అణగదొక్కుతుంటో కోరిక అంతగా అంతరాంతరాల్లో  రాజుకుంటోంది.

    తనని తాను రక్షించుకోవాలంటే , చెల్లెలికి మోసం చేయకుండా వుండాలంటే వెంకటాచలంతో దూరంగా వుండడం ఒక్కటే మార్గంగా తోచింది.

    అందుకే సాధ్యమైనంతవరకూ అతనికి ఎదురుపడకుండా తప్పించుకుని తిరిగేది.

    తామిద్దరే వుండకుండా జాగ్రత్తపడేది. హాల్లో రాకుండా వాళ్ళ గది కనపడకుండా లోపల వంటగదిలో పడుకోవడం ప్రారంభించింది.

    ఇలా జరుగుతుండగా ఓ రోజు హఠాత్తుగా ఉజ్వలకు కడుపునొప్పి ప్రారంభమైంది. కషాయం పోశారు! తులసి రసం తాగించారు. అల్లం నీళ్ళను కడుపులో పోసారు. ఉహూఁ వీమాత్రం కడుపునొప్పి తగ్గలేదు. చివరికి ఏం చేయాలో తోచక పక్కఊర్లో ఓ ఎమ్ బి బి ఎస్ డాక్టర్ వుంటే, రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వెంకటాచలం అతన్ని పిలుచుకువచ్చాడు.
   
    మామూలు కడుపునొప్పేనని, మందులు రాసిచ్చి వాడమని, ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు. మందుల కగోసం అంత రాత్రి టౌన్ కెళ్ళి తెచ్చాడు. ఆ మందులు వాడినా ఫలితం కనపడలేదు. ఉజ్వల నొప్పి భరించలేక మెలికలు తిరిగిపోతోంది. ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడం లేదు. తడిబట్టను కడుపుకేసి కట్టారు.

    అయినా లాభంలేదు -నొప్పి కాసింత కూడా తగ్గలేదు. ఉజ్వలకు ఏదో అయిందని ,ఇక బతకదని అర్ధమైంది ఊర్మిళకు.. ఆమెను అలా చూస్తుంటే ఓ దుష్ట ఆలోచన కూడా వచ్చింది.

    ఒకవేళ ఉజ్వల చచ్చిపోతే తను మరిదిని పెళ్ళి చేసుకోవచ్చన్నదే ఆ ఆలోచన.

    ఆ ఆలోచన రాగానే ఊర్మిళ ఒక్కసారిగా గాలివానలో చిక్కుకున్న చిగురుటాకులా వణికిపోయింది. ఆ క్షణంలోనే ఆమెలో జబ్బు బయల్దేరింది.

    మంచంమీద నుంచి కిందకి దిగలేకపోయింది! కాలి పిక్కల్లో డైనమేట్ కూరి అంటించినట్లు బాధ అంత బాధలోనూ చెల్లెలికి తను చేస్తున్న ద్రోహం తప్ప ఆమెకు మరేదీ గుర్తుకురాలేదు. తనను తాను నిందించుకోవడం ప్రారంభించింది.

    ఉజ్వలకు నొప్పి మరింత ఎక్కువైంది.

    "పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళితే తప్ప లాభంలేదు" అని నాటు వైద్యుడు తేల్చి చెప్పాడు.

    హడావుడి ప్రారంభమైంది.

 Previous Page Next Page