Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 20

    "యూ......యూ....." అంటూ కోపంగా ముందుకు వచ్చాడు కృష్ణ.

    అతని రౌద్ర రూపం చూసి భయం వేసింది అమలకి. ఓ అడుగు వెనక్కు వేసి "నీకే రాశాను" గోణుకుతూ అంది. సరీగ అప్పుడే ఎదుటి గది కిటికీలోంచి ఓ ఆకారం తప్పుకోటం అమల కంట పడింది. తమని ఆ భగవాన్ మనుషులు కనిపెడుతున్నారు. యిప్పుడు లెటర్ బయట పెట్టకూడదు. తన ప్లాను శ్రమ వృధా అవుతాయి అనుకుంది.

    "నాకు లెటర్ రాశావా? ఏంటి ప్రేమ లేఖా!" అంటూ కృష్ణ అమల చెయ్యి పట్టుకుని బలవంతానా కుర్చీలో కూలేసి కుర్చీలోంచి అమల లేవకుండా భుజాలు రెండునొక్కి పట్టి వుంచాడు. అమల కాలిమీద తన బూటుకాలు వుంచాడు.

    బాధతో అమల "అబ్బా!" అంది.

    నిజం చెప్పు. అన్నాడు కృష్ణ.

    "రామప్రభ లక్ష్మణ ప్రభ. కృష్ణ ప్రభ. విష్ణు ప్రభ" అంది అమల.

    "నీ పిచ్చి నాకు తెలుసు. పిచ్చి వేషాలు వేయకు. నేను రోజాని కాను. పిచ్చిదాన్ని అంతకన్నా కాను. అని వక్క నిజం చెప్పు వదిలేస్తాను."

    వళ్ళు మండింది అమలకి. అవతల తన్ని ఎవరో కనిపెడుతున్నారు. ఇవతల ఇతని బలవంతం. ఎలా తప్పించుకోవటం! కృష్ణ కళ్ళల్లో పట్టుదల చూస్తుంటే నయానో భయానో బలవంతానో ఈ నిమిషానే నిజం కక్కించేట్లు వున్నాడు. ఎలా! ఎలా!

    "చెప్పను" అంది అమల.

    "పళ్ళు రాలగోడతాను అన్నాడు అతను.

    "రాలిన పళ్ళు ఏరుకుని జేబులో వేసుకో." అంది అమల.

    "ఏం! వేళాకోళంగా వుందా! తాట వలుస్తాను.

    "డప్పు డమారు చేయటానికి పనికి వస్తుంది" అంది అమల.

    అతను బూటు కాలితో అమల కాలిమీద గట్టిగా నొక్కాడు.

    అమల బాధతో "అబ్బా" అంది.

    "అబ్బ వక్కడే కాదు అమ్మడూ. నా దెబ్బకి అమ్మ కూడా దిగివస్తుంది." అన్నాడు అతను.

    "గట్టిగా అరుస్తాను. అందరూ పరుగెత్తుకుంటూ వస్తారు హి హి హీ" అంది అమల.

    "అరిచి చూడు ఏం జరుగుతుందో. నోరు నొక్కేస్తాను." అన్నాడు అతను.

    అంతకు మించి ఏం చేయగలవులే.

    "ఎంత పొగరు! ఎంత ధైర్యం! ఏం చూసుకుని!"

    "నిన్ను......నిన్ను."

    "ఏయ్, నన్నే తెలివితక్కువ వాడికింద జమకడుతున్నావ్. నీ అదృష్టం బాగుండి ఇప్పుడు తప్పించుకున్నారేపెక్కడికి పోతావ్! నీ పిచ్చి పరీక్ష చేయాలని చెప్పి వంటరిగా నిన్ను నాలుగు గంటలసేపు నా దగ్గర వుంచుకుని అప్పుడు ఏకీలుకాకీలు వూడదీసి నీముందు పెట్టి నీ నోటంట నిజం చెప్పిస్తాను."

    "అంతపనీ చేస్తావు. కాని ఆ పని అసాధ్యం గురూ!" కృష్ణని చూస్తుంటే ఏడిపించాలన్న బుద్ధిపుట్టింది అమలకి.

    "గురూ, వ్యవహారం చాలాదూరం పోయిందే. నేను నీకు గురువునా వాహ్వా చాలా గొప్పగా వుంది." అన్నాడు కృష్ణ.

    "చూడు గురూ!" అంది అమల కొంటెగా నవ్వుతూ.

    వెంటనే తెలివి తెచ్చుకున్నాడు కృష్ణ. ఈ మోసగత్తె తనని మాటల్లోపెట్టి మామయ్య వచ్చేదాకా టైం గడుపుతున్నదని గ్రహించుకున్నాడు. "అహ ఏం తెలివి! గుండెలు తీసిన బంటువి. కాకపోతే రోజా స్థానంలో ఈ ఇంట్లో అడుగు పెట్టావంటే నీ ధైర్యం నీ......

    "నీ అందం అంటే బాగుంటుందేమో!" కొంటెనవ్వు నవ్వింది.   

 Previous Page Next Page