"అవన్నీ బుక్స్ వల్ల సాధ్యమయినయ్-"
"అంటే మీరు బుక్స్ రాస్తారా, లేక చదువుతారా?"
"అబ్బే! ఆ టైప్ బుక్స్ కాదు - వేరే టైప్ బుక్స్-"
"ఏంటవి?"
"మా మదర్ కుక్ బుక్ - మా అయన చెక్ బుక్-"
"ఇదిగో చూడండి! మీతో నాకు చాలా న్యూసెన్స్ గా ఉంది- మీరు నా మొగుడవబట్టి ఊరుకుంటున్నాగానీ- లేకపోతే మన పెళ్ళయిన ఈ రెండేళ్ళల్లో రోజూ మీరు తాగే 'టీ'లో ఇంత విషం కలిపివుంటే ఈ పాటికి పైకెళ్ళి పోయే వాళ్ళు-"
"నువ్ వేరే విషం కలపాల్సిన అవసరం ఏముందే! రెండేళ్ళ నుంచీ నేను తాగే 'టీ' విషమేగా!"
"అలాగా! అయితే - మరా విషయం ఇంతకాలం ఎందుకు చెప్పలేదు?"
"నీ భర్తగా బ్రతకడం కంటే పోవటమే మంచిదని అలాగే తాగుతున్నా!"
"ఇదిగో చూడు మొదటినుంచీ కనిపెడుతూనే ఉన్నా! నువ్ చేసేవన్నీ రాంగ్ థింగ్సే! మొదటిసారి మా ఇంట్లో కొచ్చేప్పుడు కుడికాలు ముందుపెట్టి రమ్మంటే రాంగ్ స్టెప్ వేశావ్-
పొద్దున్నే బెడ్ మీద నుంచీ రాంగ్ సైడ్ దిగుతావ్! వంట కూడా రాంగ్ పద్దతుల్లో చేస్తావ్! రాంగ్ టైమ్ లో లవ్ మేకింగ్ కావాలంటావ్- ఒకటేంటి? అసలు అన్నీ రాంగే! ఆఖరికి వెడ్డింగ్ రింగ్ కూడా నీ రాంగ్ ఫింగర్ కి పెట్టుకున్నావ్! ఎందుకని?"
"రాంగ్ పర్సన్ ని చేసుకున్నా కాబట్టి-"
"ఇదిగో చూడు రాజ్యం- ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నాళ్ళు చెప్పినా నువ్ నీ పద్దతులు మార్చుకోవటం లేదు - ఇలా ఒక టైమ్ లిమిట్ లేకుండా నేను నా లైఫంతా ఒక జంతువుతో గడపటం నాకిష్టం లేదు-"
"ఆ మాటకొస్తే నాకు ఇష్టం లేదు! అయిన నేను నోరు మెదపకుండా గడుపుతున్నా గదా! మీరెందుకు గడపలేరు?"
"ఎందుకలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు- నాకేం తక్కువని? అన్నింటిలోనూ మీకంటే బెటరే-"
"అలాగా! ఎందులో బెటరే నువ్వు?"
"అందం, చదువు, గుణం, తెలివీ - అన్నీ ఉన్నాయ్ నాకు! అయినా మీలాంటి చిల్లర టైప్ మొగుడు దొరికాడు-"
"నేనూ నీ గురించి అచ్చం అలాగే అనుకుంటున్నా-"
"నా అందచందాల గురించి నేనే పొగుడుకుంటున్నాననుకోకండి నా బాయ్ ఫ్రెండ్స్ అందరూ ముక్తకంఠంతో అదే మాట చెప్తూండేవారు-"
"అంటే మజాచేసేది వాళ్ళు- పెళ్ళి చేసుకునేది నేనూనా?"
"చూడండి ఇవాళ శుక్రవారం అంటే టైమ్ టేబుల్ ప్రకారం మీరు సగం అంట్లు తోమాలి! గుర్తుంది కదా!"
"తోముతాగానీ ఆ టైమ్ టేబుల్ అలా హాల్లో వేలాడేస్తే అందరూ చూస్తారు కదే-"
"అందరూ చూసేశా రెప్పుడో - ఇంకా కొత్తగా చూసేదేముంది?"
"అంటే కొంపదీసి సగం అంట్లు నేనే తోము తున్నానని అందరికీ చెప్పేశావా ఏమిటి?"
"భలేవారే - అల ఎందుకు చెప్తాను. మొత్తం మీరే తోముతారని చెప్తా-"
అర్ధ రాత్రి ఒక ఇంట్లోనుంచి ఒకావిడ కేకలు వేయటం వినిపించింది. చుట్టుపక్కలాళ్ళందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు.
"ఏంటొదినా? ఏం జరిగింది?" అడిగారు పక్కింటివాళ్ళు.
"ఆయన తాగొచ్చి కొడుతున్నారు-" ఏడుస్తూ చెప్పిందామె.
"కానీ అతను రోజూ తాగొచ్చి కొడుతూనే ఉన్నాడు కదా!" ఇంకో అతను అడిగాడు.
"మరి రోజూ ఎందుకు గొడవ చేయటం లేదు?"
"ఆ మాట నిజమేనండీ! కానీ కొట్టినప్పుడల్లా ఏడుపు ఆపమని రెండొందలు ఇస్తూంటాడు కదా!"
"మరి ఇవాళ ఏమయింది"
"ఇవాళ నూటయాభయ్యే ఇచ్చాడు"
యుద్ధం సమయంలో ముసోలినీ తన బొమ్మతో ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయించాడు.
కానీ ఒక సర్వేలో తేలిందేంటంటే ఆ స్టాంపులు కొన్న జనం - బొమ్మమీద ఉమ్మువేసి, రాంగ్ సైడ్ అంటిస్తున్నారని-
ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లో నిలబడ్డాడు. ఎలక్షన్స్ ఇంకో రెండు నెలలుందనగా తన అవకాశాలెలా ఉన్నాయో చెక్ చేయలని ఒక ఏజెన్సీని అపాయింట్ చేశాడు.
వాళ్ళు పెద్ద ఎత్తున సర్వేచేసి "తొంభయ్ తొమ్మిది శాతం ఓటర్లు మీకే ఓటేయాలని అనుకుంటున్నారు సార్! కానీ తమాషా ఏంటంటే మాకు ఆ మిగిలిన ఒకశాతం వాళ్ళే కనబడుతున్నారు ఎక్కడికెళ్ళినా"
జార్జ్ బెర్నార్డ్ షా ఒక డిన్నర్ పార్టీలో చాలాసేపు తన గురించి మాట్లాడాడు.
అందరికీ బోర్ కొడుతోందని గ్రహించి చివరకు టాపిక్ మార్చాలని అనుకున్నాడు.
"ఓకే లేడీస్ అండ్ జెంటిల్మన్- ఇప్పటిదాక నా గురించి మాట్లాడాను. ఇప్పుడు మీరు మాట్లాడండి. ఏం మాట్లాడాలంటే నా లేటెస్ట్ బుక్ గురించి మీ అభిప్రాయాలేంటి?"
"హీరోయిన్ గారూ! మీ ముఫ్ఫయ్ ఒకటవ బర్త్ డే ఏ రోజొస్తుందో తెలుసుకోవచ్చా?"
"ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆరోతారీఖున"
ఏంటి బ్రదరూ! వారం రోజులు జైలు శిక్ష అనుభవించి బయటికొచ్చావంటగా"
"అవును! చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వచ్చింది"
"ఆలాంటప్పుడు మంచి లాయర్ ని పెట్టుకుని ఉండాల్సింది"
"మంచి లాయర్ నే పెట్టానుగానీ ఒక లేడీ జడ్జ్ వల్ల నాకేస్ పోయింది"
"అంటే?"
"మా లాయర్ ఆమెకే లైట్ కొట్టటం మొదలుపెట్టాడు-"
జడ్జీగారు బోనులో నిలబడ్డ వ్యక్తి వేపు చూశారు.
"పోలీసులు నీ వెంటపడి, ఛేజ్ చేసి నీకారుని ఆపిన సమయంలో నువ్ గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేస్తున్నావ్! మరి దీనికేం సమాధానం చెప్తావ్?"
"వెళ్ళకేం చేయమంటారండీ! అంతకంటే తక్కువ స్పీడ్ లో వెళ్తే వెనుక ఛేజ్ చేస్తున్న ఆ కారు ఓనర్ కి దొరికిపోతాను కదా-"
జడ్జీగారు బోనులో నిలబడ్డ ఆ దొంగను చూస్తే చిరాకేసుకొచ్చింది.
"నువ్ దొంగతనాలు చేసి కోర్టుకి రావడం - ఇది పదహారోసారి! అందుకని నీకు ఫైన్ పెంచుతున్నారు- పాతిక వేలు కట్టు-"