"మనకిప్పుడు అర్జంటుగా చీఫ్ సెక్రెటరీ పోస్ట్ కి ఒక మంచి కాండేట్ కావాలి! ఆ కాండేట్ ఎలాంటి వాడై ఉండాలంటే నీతిపరుడూ, నిజాయితీ గలవాడూ, ప్రజల బాగోగులు కోరేవాడూ, స్వార్ధం అంటే తెలియనివాడూ, త్యాగపురుషుడూ అయి ఉండాలి-"
అందరూ అలాంటి కాండేట్ గురించి ఆలోచించారు.
"అలాంటి వ్యక్తి దొరకడు సార్-" అన్నాడో మంత్రి లేచి నిలబడి.
"ఎందుకని?" ఆశ్చర్యంగా అడిగాడు ముఖ్యమంత్రి.
"అతనిని షుమారు రెండువేల సంవత్సరాల క్రితమే శిలువ వేసేశారు సార్!"
త్యాగరాయగాన సభలో ఓ కార్యక్రమం జరుగుతోంది. చాలామంది వక్తలు మాట్లాడాక ఓ వ్యక్తికి మాట్లాడే ఛాన్స్ వచ్చింది.
"సోదరసోదరీమణులారా! అధ్యక్షుల వారు నాకు కేవలం పది నిమిషాల సమయమే కేటాయించారు- ఈ పదినిమిషాల్లో నేను చెప్పదలుచుకుంది ఎక్కడనుంచి ప్రారంభించాలో తెలీటం లేదు-"
జనంలోనుంచి ఎవరో అరచాడు.
'తొమ్మిదో నిమిషం నుంచీ ప్ర్రారంభించు"
ఇన్ ఫిరియారిటీ కాంపెక్స్ తో బాధపడే వ్యక్తి స్నేహితుల సలహామీద సైకియాట్రిస్ట్ దగ్గర కెళ్ళాడు.
చాలా రోజులు స్టడీ చేశాక సైకియాట్రిస్ట్ అసలు విషయం చెప్పాడు.
"నీకు ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉందని నువ్వు అనుకుంటున్నావ్ గానీ నిజానికి నీకే కాంప్లెక్సూ లేదు రంగారావ్ - కాపోతే నువ్ నిజంగా ఇన్ ఫిరియర్ వే!"
ఓ రాజకీయ నాయకుడు మెంటల్ హాస్పిటల్లో కొత్తబ్లాక్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. కార్యక్రమం అంత అయిపోయాక పాత వార్డ్స్ లో రౌండ్స్ కొడుతూంటే ఓ రూమ్ లో ఓ పేషెంట్ గోడలనిండా అమ్మాయి బొమ్మలు గీస్తూ కనిపించాడు.
"మిస్ ఇండియాని ప్రేమించాడు గానీ ఆ అమ్మాయి తిరస్కరించి సార్ అందుకని ఇలా అయిపోయాడు" చెప్పాడు సైకియాట్రిస్టు.
మరో రూమ్ దగ్గరకొచ్చేసరికి ఇంకో పేషెంట్ భీకరంగా అరుస్తూ, తనను పట్టుకోడానికొచ్చిన వాళ్ళను కిందపడేస్తూ, సామాన్లన్నీ తన్నేస్తూ కనిపించాడు.
"ఇంతని కేసేంటి?" అడిగాడు రాజకీయ నాయకుడు.
"ఆ మిస్ ఇండియాని పెళ్ళి చేసుకున్న మొదటి భర్త సార్-"
"నువ్వుట్టి పనికిరాని వెధవ్వి! తెలివిలేని వెంగళాయివి, చేతగాని సన్యాసివి అన్న ఫీలింగ్ ఎప్పటి నుంచి కలిగింది నీకు?" అడిగాడు సైకియాట్రిస్టు తన పేషెంట్ ని.
నా మారేజ్ అయిన మర్నాటి నుంచేనండీ!"
జడ్జీ బోనులో నిలబడ్డ ముద్దాయి మీద చిరాకుపడ్డాడు.
"నువ్ మర్డర్ చేసినట్లు ఎనిమిది సాక్ష్యం చెప్తున్నా కూడా ఇంకా నిర్దోషి నంటావేంటోయ్?"
"అదేసార్ నేనూ అనేది- విట్ నెస్ ల మాటలు విని మోసపోకండి! నేను ఆ మర్డర్ చేయలేదని రెండొందల మందిని సాక్షులుగా తేగలను-"
హైద్రాబాద్ లో కార్పొరేట్ ఆస్పత్రుల సంగతి తెలీని ఓ పెద్దమనిషి బాత్ రూమ్ లో కాలుజారి పడ్డాడు.
"పది రోజులు ట్రీట్ మెంట్ తీసుకోండి! చాలు- ఆ తర్వాత బ్రహ్మాండంగా సిటీ అంతా నడుస్తారు" అన్నాడు డాక్టర్.
పెద్దమనిషి పదిరోజులూ ట్రీట్ మెంట్ తీసుకొని హాపీగా నడుస్తూ ఇంటికెళ్ళాడు- ఫీజు కింద కారు డాక్టర్ కిచ్చేసి-
"మన సీతారామ్ సింగ్ కి ఈ మధ్య తెగ మతిమరుపు ఎక్కువైపోయింది బ్రదర్!"
"ఎందుకు? ఏం చేశాడు"
"పొరబాటున ఒకమ్మాయిని ముద్దుపెట్టుకున్నాడు"
"అంటే- కొంపదీసి ఆ అమ్మాయి తన భార్యనుకున్నాడా ఏంటి?"
"భార్యనుకుంటే సమస్యేముంది? భార్యకాదనుకున్నాడు-"
"అంటే ఆ అమ్మాయి అతని భార్యేనా?"
"భార్య అనుకుంటే ఎందుకు అంత తొందరపడి ముద్దుపెట్టుకుంటాడు-"
"ఇంతకూ ఆ అమ్మాయి ఎవరు అసలు?"
"అదే తెలీదు. భార్యని ఇంకెవరో అమ్మాయి అనుకోని తొందరపడ్డాడు. తీరా చూస్తే ఆ అమ్మాయి ఆ ఇంకో అమ్మాయి కూడా కాదు. మరెవరో అమ్మాయ్ అట"
"చూడు మిస్టర్! నీకు నేను ఉద్యోగం ఇవ్వాలీ అంటే మిగతావాళ్ళల్లో లేని గొప్పతనం నీలో ఏ ఒక్కటైనా ఉంటే చెప్పు! చాలు! జాబ్ గ్యారంటీ!"
"మిగతావాళ్ళందరూ చేయలేని పని నేను చేయగలనండీ!"
"ఏమిటది?"
"నా దస్తూరీ నేనే చదవగలను! ఇంకెవడివల్లా కాదది-"
న్యూస్ పేపర్లో ఓ ప్రకటన-
మా కంపెనీలో సెక్రటరీగా పనిచేయడానికి ఎం.బీ.ఏ. చదివిన ఓ అందమయిన అమ్మాయి కావాలి! ఆమెకు ఎలాంటి చెడు నడవడీ, అలవాట్లు ఉండకూడదు. కానీ నేర్చుకోడానికి సిద్దంగా ఉండాలి!"
"సింపుల్ కొశ్చెన్ అడుగుతాను తడుముకోకుండా జవాబు చెప్తే లెక్కల్లో మీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్లు లెక్క! 1950లో పుట్టిన వ్యక్తికి ఇప్పుడు ఎంత వయసుంటుంది?"
"ఆ వ్యక్తి ఆడా? మగా?"
"మగ అనుకోండి-"
"ఏ సిటీలో పుట్టాడు?"
"అదేమిటి? ఎక్కడపుడితేనేం?"
"భలేవారే! బాంబేలో పుడితే పొల్యూషన్ ఈపాటికి చచ్చి ఉంటాడు. పాట్నాలో పుడితే ఈపాటికి మర్డరయిపోయుంటాడు. హైద్రాబాద్లో పుడితే యాక్సిడెంట్లో పైకెళ్ళిపోయి ఉంటాడు. మద్రాసులో పుడితే ఆవేశంతో అరచి అరచి గుండె పగిలి పోయి ఉంటాడు. భువనేశ్వర్ లో పుడితే..........."
"చాల్చాలు! నా కొశ్చెన్ విత్ డ్రా చేసుకుంటున్నా-"
కొంచెం వయసు ఎక్కువగా ఉన్న పెద్దమనిషి డాక్టర్ దగ్గరకొచ్చాడు.
"డాక్టర్! నాకీమధ్య అమ్మాయిల మీద కోరిక కలుగుతోంది- ఏం చేయాలంటారు?"
"దాన్దేముంది! టాబ్లెట్స్ రాసిస్తాను- వేసుకుంటే ఆ ఫీలింగ్ తగ్గిపోతుంది-"
"భలేవారే! అది ఇంకా పెరగటానికి టాబ్లెట్స్ ఇవ్వమని అడగటానికొచ్చా-"
"ఏమిటండీ మీ న్యూసెన్స్? పెళ్ళయిన సెకండ్ డే నుంచీ చూస్తున్నాను. వంట సరిగ్గా చేయలేదని గొణుగుడు- మేకప్ కోసం గంటలు గంటలు అద్దం ముందు గడుపుతున్నానని ఏడుపు! మీసంగతేమీ పట్టించుకోకుండా టీవీ ముందు కూర్చుంటున్నాననీ న్యూసెన్స్- ఇలా పెళ్ళాన్ని వేధించుకు తినేవాళ్ళకు వ్యతిరేకంగా ఒక 'లా' ఉంది. తెలుసా మీ కసలు?"
"లా" ఉందా ఏమిటా 'లా'?"
"మదర్ ఇన్ లా-"
"మీరు పెళ్ళికి ముందు చాలా సన్నగా, బలహీనంగా ఉండేవాళ్ళు. పైగా ఆర్ధికంగా కూడా చాలా వీక్ గా ఉండేవాళ్ళు- కానీ తర్వాత మీలో మంచి మార్పు వచ్చింది. మంచి ఆరోగ్యం, డబ్బూ అన్నీ సంపాదించుకున్నారు. ఎలా సాధ్యమయిందది?" ఓ అమ్మాయిని అడిగిందామె ఫ్రెండ్.