ఉదయం పది గంటల ప్రాంతంలో ముకుందం యింటికివచ్చాడు త్యాగి.
మహల్లాంటి భవంతిని చూడగానే బోధపడింది ముకుందం ఏ స్థాయి పారిశ్రామిక వేత్తో అకార్డి యన్ డోర్, మైదానంలాంటిహాలు, గోడలకుఖరీదయిన పోర్ట్రయిట్స్, అన్నింటిని మించి మెట్లకిబదులుమేడపైదాకా విస్తరించిన ఎస్కలేటర్ అప్ స్టెయిర్ లో స్విమ్మింగ్ ఫూల్...
"వెల్ కమ్" గ్రేకలర్ సూట్ లో వున్న ముకుందం సాదరంగా ఆహ్వానించాడు.
"థాంక్యూ" ముకుందం పర్సనల్ ఛాంబర్ లో అతడికి అభిముఖంగా కూర్చున్నాడు త్యాగి. తనపై యింత ఆసక్తిదేనికో అని అతడు ఆశ్చర్యపోలేదు. ఇలాంటి ఆహ్వానాన్ని ఊహిస్తున్నాడు కూడా.
"చాలారోజుల నుంచి మీ డైనమిజాన్ని గమనిస్తున్నాను" మృదువుగా నవ్వాడు త్యాగి.
"మొన్నెపుడో ముఖ్యమంత్రి రాజారాం గురించి మీరు రాసిన ఆర్టికల్ చదివినపుడే మిమ్మల్ని అభినందించాలనుకున్నాను......కాని......."
అతడివాక్యం పూర్తి కాకముందే అన్నాడు త్యాగి "వారం పదిరోజులుగా చాలా బిజీగా వున్నారనుకుంటాను "ఈ ఉద్యమం ప్రారంభించబడియిప్పటికి పది రోజులైంది. ఆ విషయం మరిచిపోలేదు త్యాగి.
"రైట్...." ఇండస్ట్రియలిస్టుగా ప్రతి నిముషాన్ని ప్రొడక్టివ్ గా మార్చుకునే అలవాటు గలముకుందం యిక్కడి తనవ్యాపార దక్షతని మరచిపోలేదు."బ్రహ్మాజీగురించి మీ ఫోర్ కాస్ట్ నన్ను బాగా ఆకట్టుకుంది"
జవాబు చెప్పలేదు త్యాగి. "మీరేం పుచ్చుకుంటారో చెప్పలేదు" త్యాగిని యింకా ప్లీజ్ చేయాలనుకున్నాడు.
"సారీ మృదువుగా నవ్వాడు "ఏదీ పుచ్చుకునే అలవాటులేదు నాకు."
"సర్ ప్రయిజ్! కనీసం కూల్ డ్రింక్....."
"నోథాంక్స్"
"ఇక్కడ మీకే అవసరమున్నా నేనున్నానని మరిచిపోకండి"
"ష్యూర్"
"చెప్పండి" విషయానికి వచ్చాడు ముకుందం.
"బ్రహ్మాజీపై అంత నమ్మకాన్ని ఎలా ప్రకటించారు?"
"నమ్మకం బ్రహ్మాజీ పైకాదు"
"మరి"
"వెనుకనున్న వ్యక్తుల శక్తిపై......అంతకుమించి డబ్బు కోసం నైతికంగా పతనం కాగల నా చుట్టూవున్న మనుషుల అవివేకంపై.
నివ్వెరపోయాడు ముకుందం.....అసలు త్యాగి అలా అన్నది జర్నలిస్టుగానోవ్యక్తిగా రియాక్టవుతూనో అర్ధం కాలేదు.
అంతకన్నా మరేదో తెలుసుకోవాలనుకుంటూ అడిగాడు "నాకు తెలిసిబ్రహ్మాజీ వెనుక ఏ శక్తి లేదు...." లేకుండా ఎన్ని సంవత్సరాలుమూలన పడివున్న బ్రహ్మాజీలో యిలాంటి కదలికఏర్పడే అవకాశం లేదు."
"ఎవరున్నారనుకుంటున్నారు" త్యాగి శక్తిపై యిక నమ్మకం ఎక్కువవుతుంటే సంచలనాన్ని అదిమిపెట్టుకుంటూ అడిగాడు ముకుందం "మొహమాటంలేదు. చెప్పండి."
"ఈ రాష్ట్రం మాత్రమేకాదు......ఈ దేశం సైతం కేపిటలిస్టులుగా వ్యవహరించబడుతున్న మాఫియా చక్రవర్తుల కబంధ హస్తాలలో చిక్కుకుని వుంది ముకుందం సాబ్. ఇక్కడ ఓట్లు కొనబడతాయి.....ఆ ఓట్లను కొనడానికి డబ్బుని మాఫియాసిండికేట్సు సరఫరా చేస్తుంటాయి......ప్రత్యక్షంగా పాలించేది ప్రజాప్రతినిధులే అయినావాళ్ళని నిర్దేశించేది రాజ్యాంగ ప్రతుల్ని చేతుల్లో పట్టుక్కూచున్న డాన్స్ గా చలామణి అయ్యే వ్యక్తులు. కాబట్టే పార్టీ టిక్కెట్సు సైతం క్రిమినల్స్ కే కేటాయించబడుతున్నాయి. అంటే చీకటి సామ్రాజ్య చక్రవర్తుల దగ్గర వుండే అనుచరులు గద్దె పైకి పంపబడుతున్నారు. ఒక మామూలు గరవ్నమెంట్ ఉద్యోగానికి పోలీస్ ఎంక్వయిరీ అవసరమైన దేశంలో కనీసం రెండు మూడు హత్యలుచేసిన లేక చేయించినవ్యక్తులు అలాంటి పోలీస్ రికార్డు వున్నవాళ్ళు ప్రజా ప్రతినిధులైపోతున్నారు. కాబట్టియిప్పుడు అలాంటిబ్రహ్మాజీవెనుక నేను చెప్పినవ్యక్తుల్లాంటి శక్తులు వుండి వుంటాయన్నది నా బలమైన నమ్మకం"
త్యాగి శ్లేషణకి కాస్త కంగారు పడి ముకుందం నెమ్మదిగా అన్నాడు "మరి యింతతెలిసివుండి బ్రహ్మాజీ లాంటి వాడి గురించి ఎందుకలా ఫోర్ కాస్ట్ చేశారు?"
"నేను చేయకపోయినా చివరికి జరిగేది అదే కాబట్టి....."క్షణం ఆగాడు" అలా రాస్తే తప్ప అతడి వెనుకనున్నశక్తులెవరో తెలుసుకోవడం కష్టం కాబట్టి"
సూటిగా చూడలేకపోయాడు ముకుందం. అసలు తనస్థాయి మనిషిని యింత నిబ్బరంగా అతడు ఢీ కొనటాన్ని వూహించలేకపోతున్నాడు. "పొరపాటు పడ్డారు మిస్టర్ త్యాగి......నేనువట్టి సానుభూతిపరుడ్ని మాత్రమే..."
"ఉన్నవాడు సానుభూతి చూపించాల్సిందిలేనివాడి మీద మిస్టర్ ముకుందం......మీరు ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నది రేపు మీకు అండ అయ్యే ఛాన్సున్నవాడిమీద.....అంటే....ప్రస్తుత ప్రభుత్వం మీరు శాసించగలిగేది కాదు......మీకోట్లని బిలియన్లుగామార్చే అవకాశం యీ ప్రభుత్వం మీకు యివ్వటం లేదు......మీరు కోరినట్టు లిక్కర్ బేరన్ గా మీరు ఎదగలేకపోతున్నారు......ఆ అవకాశం మీ ప్రత్యర్ధి విమలానంద్ చిక్కించుకున్నాడు......మీరుకోరుకున్న కొన్ని ఇండస్ట్రీలకులైసెన్సులు మీ ప్రత్యర్దులకి దక్కాయి"
"నో" ముకుందం మొహంలో రంగులు మారాయి "నేను అందుకోసం యిదంతా చేయడంలేదు. కేవలం ఒఅక్నాడు ఈ జాతి కోసం ప్రాణాలొడ్డిన అల్లూరి సీతారామరాజుమీద మమకారంతో....."
"ప్లీజ్ స్టాపిట్ మిస్టర్ ముకుందం. నన్ను బుజ్జగించడానికి ప్రయత్నించకండి. మీకో సమస్య కావాలి.....అది సెంటిమెంటల్ గా నిరక్షరాస్యులైన వ్యక్తుల్ని కదిలించాలి. దానికోసం ఒక పొట్టి శ్రీ రాముల్నో లేక మరో ప్రకాశం పంతులునో ఎన్నుకునే అవకాశం వున్నా సీతారామరాజునే ఎన్నుకోవడానికి కారణం బ్రిటిషువారు. ఈ దేశానికి వచ్చి క్షమార్పణలు చెప్పడం అసాధ్యమని మీకు తెలుసుకాబట్టి......నిజానికి ఉద్యమంలా పోరాడడానికి ఈ దేశంలో నిరుద్యోగ సమస్య, ఆకలి చావులు, అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం, కులాలసమస్యలు చాలావున్నాయి. అవి నీకు అక్కర్లేదు. అసలు మీరు కోరింది ప్రజలహితం కాదు. ఓ ఉద్యమం ఆ ఉద్యమం ద్వారా యిప్పటి ప్రభుత్వం కూలటం."
ఆవేశంగానే లేచాడు ముకుందం.....త్యాగిని యింటికి పిలిచింది చెప్పించుకోటానికి కాదు......తమ ఉద్యమానికి అనుకూలంగా రాయమని చెప్పటానికి అవసరమైతే అతన్ని కొనేయటానికి. "మిస్టర్ త్యాగి" నిగ్రహంగానే అన్నాడు ముకుందం "ఉడుకురక్తం.......ఇకక్ది సమస్యలు మీకు అర్ధం కావు, అసలు ప్రజలు ఎంత చైతన్యంతో సీతారామరాజు కోసం పోరాడుతున్నారో మీకు తెలీదు."
"చిన్నకరెక్షన్"
"చెప్పండి"
"మీరు అందించిన డబ్బుకో, పట్టించినా మందుకో యింత చైతన్యాన్ని ప్రకటిస్తున్న సోకాల్డ్ ప్రజలు పోరాడుతున్నది సీతారామరాజు కోసం కాదు......బ్రహ్మాజీకి పట్టం కట్టడంకోసం....."
"వెల్......మీరెలా అనుకున్నా నాకు అభ్యంతరంలేదు"
"కరెక్ట్......ఎందుకంటే నిరక్షరాస్యులైన ప్రజలకి తెలుగు పత్రికలేచదివే అలవాటు లేనప్పుడు ఇంగ్లీషుపత్రికలో రాసింది పెద్దగాచేరదని మీకు తెలుసు."
త్యాగికూడా పైకి లేచాడు.
చర్చ అర్ధంతరంగా ముగిసిపోయింది. ముకుందం సభ్యతను పాటించడం మర్చిపోలేదు.
బయటద్వారం దాకా అనుసరించి వీడ్కోలు చెబుతూ అన్నాడు. "వుయ్ విల్ మీటెగైన్ మిష్టర్ త్యాగి"
త్యాగి వెళ్ళిపోయాడు కాని యిదంతా అదే యింటిలోనుంచి గమనిస్తోంది ఓ యువతి. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి బ్రహ్మాజీఅంటూ అబ్జర్వర్ లో యిందుకేరాసాడేమో అని పొరపాటుపడిన ఆమె ఎవరో కాదు- ముకుందానికి ఒక్కగానొక్క కూతురు సౌందర్య.
* * * *
మధ్యాహ్నం రెండు గంటల సమయం. యూనివర్సిటీ లాండ్ స్కేప్ గార్డెన్ ముందు మోటార్ బైక్ ని ఆపిన త్యాగి క్షణం సేపు పరిసరాల్ని గమనించాడు.
రోడ్డుపైవెళ్ళే కార్ల రొదతప్ప పార్క్ లో అలికిడిలేదు. ఫోన్ లో తెలియచేయబడిన సంకేత స్థలాన్ని మననం చేసుకుంటూ మెట్లుదిగి నిర్జనంగా వున్న ప్రదేశంలో ఆగేడు.
బారులుతీరినట్టుగా వున్న మందార చెట్లనుదాటి సిమెంట్ బెంచీని చేరుకుంటుండగా వినిపించింది.
"హల్లో" సౌందర్య నిలబడివుంది అతడికి సమీపంగా.
రెప్పలార్చకుండా చూస్తూ వుండిపోయాడు రెండు లిప్తలపాటు "ఫోన్ చేసిందినేనే."
"నైస్ టు సీ యూ" అనలేదు అనుకున్నాడు ఏకాగ్రతగా గమనిస్తూ.
"నాపేరు సౌందర్య" ఆమె గొంతులో అణువంత అహం.
"చెప్పాల్సినపనిలేదు."