"ఆధారాలు చూపించేవాడే అయితే పోలీసులకి చెప్పేవాడు. వీడుతెలివయినవాడు కాబట్టే రాయిల్సిందంతారాసి ప్రజలిలా అనుకుంటున్నారంటూ తన అభిప్రాయాన్ని తెలియజెప్పాడు"
పత్రికలకిలాంటి వెసులుబాటు ఒకటుందని తెలీనిమల్లేశు ఆశ్చర్యంలో మునిగి వుండగానేలోపలికి దూసుకొచ్చడు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ సన్యాసిరావ్.....
"సర్....అవతలకొంపలు మునిగిపోతున్నాయ్. రాష్ట్రంలో సీతారామరాజుఉద్యమం తారాస్థాయిని చేరుకుంటుంది.......ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ ప్రజలు ఉధృతంగా పాల్గొని సీతారామరాజు విషయంలో బ్రిటిష్ వాళ్ళు యిక్కడకు వచ్చి క్షమార్పణలు చెప్పాలంటున్నారు......"
మల్లేశానికిదేమిటో అస్సలు అర్ధం కాలేదు. జోక్యం చేసుకునేవాడే కాని తన పొజిషన్ కాస్త బలహీనపడినదని తెలియగానే నిశ్శబ్దంగా వుండిపోయాడు.
"అయితే ఏమిటట" కణతలునొక్కుకుంటూ చతికిలబడ్డాడు రాజారాం.
"బ్రిటిష్ అధికారులు యిక్కడకు రావాలంటారు"
"ఎందుకురావాలి అసలు?"
టాపిక్ ఆగమ్యంగా వుంది. అసహనంగా అటూ ఇటూ పచార్లు చేసాడు.
"ఇది ఓ సంఘ విద్రోహక చర్యగా మేం ఖండిస్తున్నాం."
"మీరు ఖండించడం సరే......కాని యిదిలాగే కొనసాగితే రేపు కేంద్ర ప్రభుత్వానికి మీరు జవాబుచెప్పాలి రావచ్చు."
"అలా అయితే యిందులో విదేశీహస్తముందనితెలియచేస్తాం."
"సర్" ఏరికోరి తనకా పదవిని కట్టబెట్టినా ముఖ్యమంత్రంటే సన్యాసిరావుకి చాల అభిమానముంది "అలా విదేశీ హస్తాలగురించి పాదాల గురించి చెప్పాల్సింది ప్రజలకి, పత్రికలకి.......రేపు పరిస్థితి విషమిస్తే కేంద్రం వూరుకోదు."
"అయితే ఏం చేయాలంటావ్....." కొద్దిపాటి ఖంగారు ధ్వనించింది ముఖ్యమంత్రిగొంతులో. "వాళ్ళుకోరినట్టు బ్రిటిషువాళ్ళని రప్పించమని కేంద్రంపై ఒత్తిడితీసుకురావాలా...."
"ఒత్తిడితీసుకొచ్చినా అదిజరిగే పనికాదు...... ఉద్యమకారులని చట్టరీత్యా నొక్కిపారేయాలి."
"వద్దు" సాలోచనగా అన్నాడు ముఖ్యమంత్రి" తల తోకా లేనియిలాంటి ఉద్యమాల్ని మనం నిరోధించాలని ప్రయత్నిస్తే అది ఆ ఉద్యమానికి మరింత పబ్లిసిటీ యిచ్చినట్టవుతుంది. పట్టించుకోకుండా వదిలేడమే మనం చేయాల్సినపని...."
రెండుచేతులూ కలిస్తే తప్ప చప్పుడు రాదుకాబట్టి ఇలాంటి సమయాల్లో రెండోచేతిని అడ్డం పెట్టకూడదన్న సత్యం రాజారాంకి ఒకనాడు తెలియచెప్పింది పరమహంసే.....రాజారాంయిలానే ప్రవర్తిస్తాడని పరమహంసకి తెలుసు.
అందుకే యిదే అదునుగా ఉద్యమాన్ని తీవ్రం చేసే పథకాన్ని పటిష్టంగా అమలు చేయించాడు.
అంతే....
సరిగ్గా వారం రోజుల నాటికి పరిస్థితి మరింత చేయి దాటిపోయింది.
* * *
మొదటిరోజు వివిధ జిల్లాల్లో చాల మామూలుగా మొదలైన బలహీనవర్గాల వూరేగింపు కొందరు సంఘ విద్రోహక శక్తులకి కాస్త ఉత్సాహాన్ని కలుగచేసింది.
అది రెండోరోజు మరింత విస్తరించిన రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తెన్నులునచ్చని ప్రత్యర్ధిపార్టీలకే పని కల్పించింది.
పబ్లిసిటీఅంటూ వుంటే తప్ప తమకు మనుగడ వుండదనుకున్న చిల్లరమల్లరనాయకులు ఉద్యమకారులతోచేతులు కలిపిసీతారామరాజుపై జరిగిన హత్యను నిరసిస్తూ భారీగా ఉపన్యాసాలనిచ్చారు. ఇలా జరగడాన్ని ముందే వూహించిన పరమహంస వందల సంఖ్యలో ఆడియో కేసెట్స్ ని రిలీజ్ చేయించాడు.
పీడితులపాలిట పెన్నిధిలా ఈ సీతారామరాజు మళ్ళీమళ్ళీ పుడుతూనే వుంటాడు
దళితులకోసం బడుగువర్గాలకోసం పునర్జన్మ నెత్తిప్రభుత్వాల పునాదుల్ని కదుపుతూనే వుంటాడు. నా గుండెల్ని చీల్చేనీ తూటాల దమననీతిని యుగాంతందాకా ఎదుర్కొనేట్టు నాచివరి ఆక్రందనలు నా బలహీనవర్గాల గొంతు నినాదాలుగా, నేలచిమ్మిన నా రక్తపు బొట్టు కోటానుకోట్ల పీడితుల ఉద్యమాలకి స్ఫూర్తిలా రూపాంతరం చెంది నీలాంటిసామ్రాజ్య వాదులగుండెల్లో శతఘ్నల్లా ప్రతిధ్వనిస్తూనే వుంటాయి..."
ఉద్యమస్ఫూర్తి కోసం రికార్డు చేయబడిన యీ కేసెట్స్ పీడిత జనాన్ని ఎంత ఉద్రేకపరిచాయీ అంటే యిలాంటిసీతారామరాజు ఉద్భవిస్తే తప్ప తమ జీవితాల్లో మార్పురాదని బలంగానమ్మేశారు.....అలా నిజాయితీగా నమ్మిన వాళ్ళని ప్రేరేపించడానికి. పరమహంస బ్రహ్మాజీలు నియమించిన జిల్లాప్రతినిధులు కల్లు పోయించి ఖాళీగావున్న మరికొందరి కుహనా నాయకుల్ని నియమించారు.
పరమహంస ప్రోద్భలంతో జిల్లాల్లో టూర్ ప్రారంభించిన ముకుందం తనలాప్రస్తుత ప్రభుత్వం పై అయిష్టత పెంచుకున్న కేపిటలిస్టుల్ని, దెబ్బతింటున్న సారా కాంట్రాక్టర్లని, రాజకీయనాయకుల ఆశ్రితపక్ష పాతంతో పరిశ్రమలకి లైసెన్సులూ టెండర్లూచేజారి ఉక్రోషంగా వున్న పారిశ్రామిక వేత్తల్ని కూడగట్టుకుని ప్రభుత్వం పడిపోవాలీ అంటే ప్రాంతీయంగా వాళ్ళేం చేయాల్సింది ఉద్భోధించడమేగాక రూలింగ్ పార్టీని దుయ్యబట్టడమే ధ్యేయంగా గల పత్రికాధిపతుల్ని కలుపుకున్నాడు.
సంచులతో డబ్బు చేతులుమారుతుంది. క్రిమినల్స్ కి తిరుగులేని అవకాశమైంది. మేధావి వర్గం నిశ్చేష్టులైచూస్తుంటే నిరక్ష్యరాస్యులైనా జనం సీతారామరాజులాంటి మహాత్ముడు అలా మరణించడం దారుణమని అంగీకరించి యీ ఉద్యమానికి లక్ష్యమేమిటో తెలియకపోయినా విరివిగా పాల్గొనటం ప్రారంభించారు.
రాష్ట్రకో ఆర్డినేషన్ కమిటీ ఏర్పడింది ముకుందంప్రేరణపై. అంతేకాదు రాష్ట్ర స్థాయి బంద్ కు పిలుపు యివ్వబడింది.
తనమేధస్సుతో ఉద్యమాన్ని దావానలంగా మార్చగలిగినపరమహంస సైతంవూహించనిస్థాయికి చేరుకున్న బంద్ రోజు ముందు అనుకున్నట్టు ఒక్క విశాఖ జిల్లాల్లోనేగాక సరిహద్దు జిల్లాఅయిన తూర్పు గోదావరిలోనూ కాల్పులు జరిగి మొత్తం పాతికమంది దాకా ప్రాణాలువదిలారు.
సుమారునూట నలభైఆర్టీసి బస్సులు తగలబడ్డాయి. తొమ్మిది చోట్ల రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించబడడంతోబాటు చాలా రైళ్ళురద్దు చేయబడ్డాయి.
బ్రహ్మాజీరంగంలోకి దిగాడు ముందేఅనుకున్నట్టుగా......పథకం ప్రకారం కాల్పులలో మరణించిన వ్యక్తుల్ని అమరవీరులుగా ఉద్ఘాటించడంతోబాటు బ్రిటిషువారు క్షమార్పణలు చెప్పేదాక తనుఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తానంటూ భాగ్యనగరంలో ఓ స్టేట్ మెంటిచ్చి నాలుగురోడ్ల కూడలి దగ్గర టెంట్ వేసుక్కూచున్నాడు.
అప్పటికికొంత అర్ధమైంది ముఖ్యమంత్రి రాజారాంకి...... పూర్తిగా అర్ధమయ్యేట్టుచేసింది అబ్జర్వర్ పత్రికలో త్యాగి రాసినవార్త.
అది....."ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి బ్రహ్మాజీ" త్యాగిపై ముఖ్యమంత్రికేకాదు.
వారంరోజులపాటు ప్రతివిషయాన్నీ కూలంకషంగా గమనించిన సౌందర్యకిద్వేషం ప్రారంభమైందీవార్తతోనే....
* * *