Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 20

 

    "చాలా విషయాల్లో గోప్పభావాలు ఆదర్శాలు చెప్పే నీవు కాకమ్మ కబుర్లు మానేయలేదు అక్కా"

 

    'ప్రకృతి శిక్షించేది మననే కాబట్టి ముందు జాగ్రత్తతో చెప్పను. ఏదయినా రూపా నువు నాకన్నా చిన్నదానివి. ఆవేశం జాస్తి. నిన్ను ప్రేమించవద్దని చెప్పటం లేదు. నీ ప్రేమ పరిక్షకి నిలబడుతుందో లేదో చూసి అప్పుడు జీవితాంతం ప్రేమించు. ఆ రవితో పెళ్ళి విషయం కదుపు. పెళ్ళి చేసుకుంటే తప్ప ఈ సినిమాలు, షికార్లు కుదరవని చెప్పు, పెళ్ళాడటానికి వేనుకాడుతాడనుకో అతడు మోసగాడని తెలిసి పోతుంది. అపుడు నీవు మోసపోయే ప్రమాదం ఉండదు. పెళ్లిదాకా వచ్చినప్పుడు అతను ముఖం తప్పించాడనుకో అతనికి నీపై ఎంత ప్రేముంటుందో మీ ప్రేమ ఎంత బలియమయిందోతెలుస్తుంది కదా! ఈ పని చేయటం తప్ప రూప! ఈ సలహా చెడ్డదా?

 

    "ఊహు"

 

    "కనీసం నామాట అయినా ఆమోదించావు. చాలా సంతోషం. మీ ప్రేమ ఫలించాలనే కోరుకుంటున్నాను మాట తప్పనని నే చెప్పినట్లే చేస్తానని మాట ఇవ్వు రూప"

 

    "నా శ్రేయస్సు కోరేకదా అక్కా! నీవు ఇవన్నీ చెప్పింది. సరే ఇదీ మంచిదే మా ప్రేమకి పరిక్ష పడితే విజయం చేకురుతుందేమోననే తలుస్తాను. అలాగే అక్కా! నీ మాట ప్రకారం ఈరోజు నుంచి ప్రవర్తిస్తాను." స్థిరంగా అంది రూప.

 

    ఆనందంతో సీత కన్నులు తడి అయ్యాయి.

 

    
                                          13

 

    ఈ మధ్య రూప ఇంటి పట్టునే వుంటున్నది. రూప తరచు స్నేహితురాళ్ళ వంకపెట్టి "ఈరోజు సినిమాకి తీసుకెళ్ళారు." ఫ్రెండ్ వాళ్ళింట్లో పార్టీ అయితే ఇంటికి రావటం కాస్త ఆలశ్యం అయింది ఇలాంటి సాకులు చెప్పటం లేదు. చెప్పే అవసరం? కాలేజి వదలంగానే యింటికొచ్చేస్తున్నదామే.

 

    రవి విషయం రూపెమయినా చెపుతుందేమోనని సీత చూసింది రూప ఆ ప్రసక్తి ఎప్పుడూ తేలేదు. కావాలని సీత కదిలించను లేదు "నేచెప్పినట్లు చేసుంటుంది. పెళ్లనంగానే రవి ముఖం చాటేసి ఉంటాడు. రూప గట్టిదిగాబట్టి జరిగినదానికి విచారించక నిజం నాతో చెప్పటం మనస్కరించక మిన్నకుండిపోయింది. ఒకందుకు యిది మంచిదే అయిందేమో నా మాట కాదనకుండా వింది. ప్రేమకి పెళ్ళికి బహుదూరం అని తెలుసుకుంది." రూప గురించి అనుకుంది సీత.

 

    రామచంద్రం బోలెడు సంబంధాలు చూశాడు సీతకోసం. చాలా సంబందాలు రామచంద్రంకే నచ్చక మొదట్లోనే వదిలేశాడు. కొన్ని పూర్తిగా కట్నాల సమస్యతోనే ఆగిపోయాయి. క్రితం రోజుకూడా సీతని ఓ పెళ్ళివారు చుసేళ్ళరు ఆ వచ్చి వెళ్ళినవారి గురించి అంతా చర్చల్లో పడ్డారు.

 

    ఆరున్నర అయింది . ఏడున్నర దాటింది. భోజనాలు చేసే అలవాటు లేదు కాబట్టి వరండాలో తీరిగ్గా కూచున్నారు.

 

    "నిన్నటి పెళ్ళికొడుకు ఎలా మాట్లాడాడో చెప్పనా?" అన్నాడు రాజు.

 

    "ఛత్ నోరు మూసుకో" అన్నాడు రామచంద్రం.

 

    "చెప్పనియ్యి నాన్నా! రాజు ఓసారి చూసినా చాలా చక్కగా వాళ్ళలా అనుకరిస్తాడు." అంది జయ.

 

    "ప్రయోజనం ఏమిటి?" అన్నాడు రామచంద్రం.

 

    "సరదాగా టైమ్ ఎంజాయ్ చేయవచ్చు. ఎప్పుడూ ఏం మాటలుంటాయి" అంది రూప.

 

     "సీత నడుగు" అని తప్పించుకున్నాడు రామచంద్రం దానికి కారణం వుంది. రాజుకి అనుకరణ విద్య వచ్చని తెలుసు. టైము సర్దాగా గడిచిపోతుందని తెలుసు. సీత బాధ పడుకుందేమోనని వద్దన్నాడు.

 

    "చెప్పవా అక్కా!" అడిగాడు రాజు. నిన్న వాళ్ళని చూసినప్పటి నుంచి వాళ్ళ మాటలు రూపము పదేపదే తలుపుకోస్తున్నాయి. వాడిలో వాడే తల్చుకు నవ్వుకుంటున్నాడు. తను నవ్వుకోటమేగాక తనవాళ్ళని నవ్వించాలని వాడి తపన.

 

    "ఊ" అంది సీత.

 

    సీత "ఊ" అనటమే తరువాయి రాజు మొదలుపెట్టాడు.

 

    నిన్న సీతని చూడటానికి వచ్చిన పెళ్ళికొడుకు అంతో ఇంతో అందగాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళమ్మ పాలిచ్చి పెంచిందో ఎరుపు వేసి మేపిందో గాని ఆరడుగుల పొడుగు పెరిగాడు. పొడుగాటి జొన్న కర్రమీద గూడులా వున్న కంకిలా తలకట్టు వుంది. పొడుక్కి తగ్గ లావు లేనందున ఆ పొడుగాడి కాళ్ళతో నడుస్తుంటే అంగలు వంగలు వేసిన నడక పరుగు లేత్తుతూ వుంది. అలాంటప్పుడు గాలికి వుగిపోతున్న ఎదురు బొంగులా అనిపిస్తున్నాడు.

 Previous Page Next Page