Previous Page Next Page 
మొగలిబాకు పేజి 20

   

   "ఏంటి మేడమ్....నా నిర్ణయం....ఏవిటీ.....నాకంతా తమిళ సినిమా చూస్తునట్టుగా ఉంది....ఏవీ బోధపడడంలేదు......" పిడచకట్టుకుపోయిన గొంతుతో అన్నాడు నారాయణరావు.
   
    "అదేనయ్యా....మరిచిపోయావా.....నీ రూమ్ అడ్రస్ కి ఎన్ని ఉత్తరాలు రాసానయ్యా బాబూ.....ఒక్క ఉత్తరం కూడా అందలేదా" మళ్ళీ ప్రస్నించిందావిడ.
   
    ఆ నిర్ణయమేంటో, ఆ ఉత్తరాల గొడవేంటో అంతా కన్ ఫ్యూజింగ్ గా ఉంది నారాయణరావుకి.
   
    "నే వెళతాను మేడమ్.....నాక్కొంచెం పనుంది....." గబుక్కున వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు. అంతకన్నా వేగంగా ముందుకొచ్చి డోర్ కి అడ్డంగా నిలబడిపోయిందావిడ. అలా ఆవిడ నిలబడి పోవడంతో ఆ డోర్ లోంచి చీమకూడా బయటకు పోవడానికి అవకాశం లేకపోవడంతో షాక్ తినేసాడు నారాయణరావు భయంతో.
   
    ఆవిడ ఏ నిర్ణయం గురించి అడుగుతోందో కూడా అర్ధంకావడం లేదతనికి.
   
    "అందుకే నువ్వంటే నాకు ప్రేమయ్యా.....బాబూ....ఎక్కడున్నాడో మహానుభావుడూ, మా ఆయన పద్దతికూడా ఇదే మోస్తరు......నేను బెడ్ రూమ్ లో వుంటే, ఆయన బాత్ రూమ్ లోనూ, నేను కిచెన్ రూమ్ లో వుంటే ఆయన గార్డెన్ లోనూ ఉండేవారు" సదరు కమలాక్షి భర్త ఉదంతం జ్ఞాపకం తెచ్చేసరికి, ఆవిడ తనని ఎందుకలా ఇబ్బంది పెడుతోందో చప్పున అర్ధమైపోయింది నారాయణరావుకి.
   
    కమలాక్షి భర్తను అందరూ ఉత్తముడనే అంటారు. కానీ ఎవరూ ఆయన్ని ఎప్పుడు చూడలేదు-ఆయన ఫిలాసఫీ ప్రొఫెసర్ గా యూనివర్శిటీలోనే పనిచేస్తూ చేస్తూ సడన్ గా ఉద్యోగమ్మీద, యూనివర్సిటీ మీద ఈ భౌతిక దేహమ్మీద సడన్ గా విరక్తి చెంది, ఒకరోజు అర్దరాత్రి ఖాదీ భండారునుంచి కాషాయాంబరాలు తెచ్చుకున్న వాడై తెల్లవారు జామున వాటిని ధరించి, నిద్రపోతున్న భార్యను అలా వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోయాడట.
   
    ప్రస్తుతం సదరు కమలాక్షి మొగుడు, హృషీకేశ్ లో ఉంటున్నాడని అంటారు.
   
    ఆ భర్త మనసు మార్చుకుని హృషికేశ్ లో ఉంటున్నా డని అంటారు.
   
    ఆ భర్త మనసు మార్చుకుని హృషికేశ్ నుంచి రావాలంటే భర్త్రుకామేష్టియాగమని ఒక యాగాన్ని చెయ్యమని ఎవరో ఒక సాధువుగారు ఆ మధ్య కమలాక్షికి ఏకాంత మందిరంలో ఉద్బోదించారట.
   
    ఆ యాగం చెయ్యాలంటే ఆ భర్తను పోలిన వ్యక్తిని పక్కనే కూర్చోబెట్టుకుని యాగం చెయ్యాలట!
   
    పాపం నారాయణరావులో కమలాక్షి భర్త పోలికలు ఎక్కువగా కనబడ్డాయట.....అప్పటినుంచి అ యాగం చెయ్యడానికి తనతో సహకరించమని కమలాక్షి నారాయణరావుని సతాయించేస్తోంది....అదన్న మాట కథ.
   
    "ఇంతకీ ఆ యాగం చెయ్యాలంటే నేనేం చెయ్యాలంటారు?" ఆమెతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోడానికి అడిగాడతను విధిలేక.
   
    "ఏం లేదు.....ఎప్పుడయితే, ఏ సమయంలో అయితే ఆయన ఇంట్లోంచి బయటికెళ్ళిపోయాడో అంటే తెల్లవారు జామున నాలుగూ నలభై నిమిషాలకు సరిగ్గా మనం యాగం చెయ్యాల్సి ఉంటుందట......పూర్వకాలంలో మట్టిబొమ్మను పెట్టుకుని యాగం చేసేవారు కదా.....ఆ ప్రకారమన్నమాట....."
   
    "అంటే నన్ను మట్టిబొమ్మలా వాడుకుంటారా?"
   
    "అంతే....అంటే....నీలో ఆయన పోలికలు ఎక్కువగా ఉన్నాయి కదా.... అందుకన్నమాట.... ఆ తర్వాత....."
   
    "ఆ తర్వాత అంటే, ఇంకా ఏదయినా వుందా?" అనుమానంగా అడిగాడు నారాయణరావు.
   
    "ఆ తర్వాతే....అస్సలు కార్యక్రమం ఉందయ్యా బాబూ.....తొమ్మిదిగంటలసేపు యాగం చేసాక.....రాత్రి బెడ్ రూమ్ లో పూజ, ప్రదక్షిణాల కార్యక్రమాలు....."
   
    "బెడ్ రూమ్ లో పూజ, ప్రదక్షిణలా.....అంటే?"
   
    "ఎందుకలా భయపడతావ్.....బెడ్ రూంలో పూజలంటే, ఎక్కడున్నా భర్త మనసు మారిపోయి, నా దగ్గరకు వచ్చెయ్యాలనే పూజ. ఆ తర్వాత......సదరు పట్టెమంచం చుట్టూ.....నా భర్తను పోలిన నువ్వు వెయ్యిసార్లు ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది."
   
    "వెయ్యి సార్లయితే నేను తలతిరిగి పడిపోతాను మేడమ్....." ఠారెత్తిన గుండెతో అన్నాడు నారాయణరావు.
   
    "ఈ వ్రతం పూర్తిచేసిన వారంరోజుల్లోపల నా భర్త నా ఇంటి ముందుంటాడని, ఆ సాధువుగారు చెప్పారు. పూర్వకాలంలో ఈ వ్రతాన్ని తాటకి, హిడింబి  లాంటివాళ్ళు చేసారట....."
   
    "తాటకి, హిడింబి వాళ్ళు చేసారా? అంటే రాక్షసవ్రతమా?" ఆవిడ్ని నఖశిఖ పర్యంతం చూస్తూ భయంగా అడిగాడు నారాయణ రావు.
   
    "మొదట్లో వ్రతాలన్నీ రాక్షసులు చేసినవే. ఆ తర్వాత మనవులు చేసారనుకో.....ఇంతకీ వ్రతం ఎప్పుడు చేద్దామంటావ్?" దగ్గరగా వచ్చి, అతని కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తూ అంది కమలాక్షి.
   
    ఇబ్బందిగా ఆ కళ్ళవేపు చూశాడు అంది కమలాక్షి.
   
    ఇబ్బందిగా ఆ కళ్ళవేపు చూశాడు నారాయణరావు.
   
    "ప్రస్తుతం నేనొక చిన్న ఇబ్బందిలో వున్నాను మేడమ్.....కొంచెం టైమిస్తే....."
   
    "టైమూలేదు.....గీమూ లేదు.....రేపు శనివారం చేసేద్దాం ఓ పనయిపోయినట్టుంటుంది" అందామె ఆనందంగా.
   
    ఎలాగోలా అక్కడనుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో నారాయణరావు సరే అన్నాడు తప్పక. అప్పటికే అతని వంటిమీద చెమటలు పట్టేసాయి.
   
    అలా నారాయణరావు హామీ నివ్వడంతో హాయిగా ఊపిరి పీల్చుకుని, సూర్యకాంతం నవ్వులా నవ్వినా కమలాక్షి, డోర్ పక్కకు జరిగింది. దాంతో నారాయణరావు బయటకు వెళ్ళడానికి అవకాశ మేర్పడింది.
   
    గబుక్కున ఆ రూంలోంచి బయటికెళ్ళిన నారాయణరావు ఎదురుగా వస్తున్న సంధ్యను చూసి ఒకింత కలవర పడ్డాడు.
   
    సరిగ్గా అదే సమయంలో లైబ్రేరియన్ కమలాక్షి పైట సర్దుకుంటూ తన రూంలోంచి బయటికొచ్చి, నారాయణరావు వేపు ముసి ముసిగా నవ్వుతూ చూసి, వరండావేపు వెళ్ళిపోయింది.
   
    నారాయణరావు ముఖంవేపు తీక్షణంగా చూస్తున్న సంధ్య బ్రెయిన్ లో అకస్మాత్తుగా ఒక అనుమానం తలెత్తింది.
   
    కమలాక్షి రూంలోంచి నారాయణరావు ఎందుకొస్తున్నాడు? అతని వంటిమీద, నుదుటమీద ఆ చెమట ఏమిటి?
   
    నారాయణరావుకి, ఆ కమలాక్షికి ఏదయినా సంబంధం ఉన్నదేమో?
   
    హమ్మ.....ఆ ఆలోచన ఆవిడ మెదడులో ప్రవేసించగానే సంధ్య ముఖం ఒక్కసారిగా మతాబులా కాంతివంతమైపోయింది.
   
    మొదట చిర్రుబుర్రులాడుతున్నట్లుగా చూసి, ఆ తర్వాత చిరునవ్వు నవ్వుతూ చూస్తున్న సంధ్య నవ్వుకి అర్ధం ఏమిటో తెలీక అల్లల్లాడిపోయిన నారాయణరావు-
   
    అక్కడ ఒక్క సంధ్య మాత్రమే ఉండడం చూసి చేతితో షోగ్గా జుత్తు సవరించుకొని-
   
    "సంధ్యా.....నన్ను కల్సుకోడానికి నువ్వొక్కదానివే వచ్చావంటే దానర్ధం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నా....." అని అనబోయాడు.
   
    కానీ అంతలోనే సంధ్య కుడిచేయి, నారాయణరావు చంపకు చెళ్ళున తగిలింది.
   
    "నిన్ను నేను ప్రేమించడమేమిటి? నేను నిన్ను ప్రేమిస్తున్నానని కల్లోకూడా అనుకోకు.....నీ సంగతి నాకు తెల్సిపోయింది గదా.....నీకు ఇన్నాళ్ళూ బ్రెయిన్ ఒక్కటే లేదనుకున్నాను-ఇప్పుడు కేరక్టర్ కూడా లేదని తెల్సిపోయింది" అనేసి చరచరా వెళ్ళిపోయింది. ఆ కోపంలో ఆమెకు గోడమీద రాతల విషయం మరిచిపోయింది....నారాయణరావుకి కేరక్టర్ లేదనే విషయాన్ని స్టూడెంట్స్ జనరల్ బాడీకి తెలియచేసి, కేరక్టర్ లేనివాడ్ని నేనెలా ప్రేమిస్తానని చెప్పి, ఆ లవ్ గేమ్ నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేసింది సంధ్య ఓకే సమయంలో ఒక ఆంటీని-ఒక నన్ను, ప్రేమిస్తే ప్రపంచం ఎలా నమ్ముతుంది? తమ ప్రేమ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఇదే కమిటీని తను అడగాలి. అయినా ఈ మధ్య కుర్రాళ్ళు ఆంటీల్ని ప్రేమించేస్తున్నారేమిటబ్బా? తమ దగ్గరలేనిది-ఆంటీల దగ్గరేముంటుంది?" అని ఆశ్చర్యపోతూ మోతీలక్ష్మి కోసం అన్నిచోట్లా వెతికింది సంధ్య-కానీ మోతీలక్ష్మి ఆమెకు కనిపించలేదు.
       
                                           *    *    *    *

 Previous Page Next Page