Read more!
 Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 2

 

    స్టీఫెన్ పెదవులపై చిరునవ్వు కనుపించి కనుపించ కుండా దొర్లి అంతలోనే చటుక్కున మాయమైంది.

 

    మూడు నిమిషాల తర్వాత.

 

    సర్వర్ ప్లేటులో ఒక ఇడ్లీ కొద్దిగా గట్టిచట్ని మంచి నీళ్ళ గ్లాసుతో వుచ్చాడు. నిర్లక్ష్యంగా టేబుల్ మిద ప్లేటుని పెట్టి మింగు అన్నట్లు చూశాడు. వెంటనే వెళ్ళి కాఫీ కూడా తీసుకు వచ్చాడు.


    స్టీఫెన్ ప్లేటులో వున్నసింగిల్ ఇడ్లీ వేపు చూశాడు. ఇడ్లీ మిద కంది బద్దంత ఎర్రటి ముక్క అతికించి వుంది. అది చూడంగానే స్టీఫెన్ కళ్ళు తళుక్కు మన్నాయి.

 

    ఇడ్లీ మిద ఎర్రటి ముక్క అతికించి వుంటే అది గ్రీన్ సిగ్నల్ కి గుర్తు.

 

    స్టీఫెన్ ఒక్క క్షణంలో ఇడ్లీ తిని రెండో క్షణం సగంలో కాఫీ తాగేశాడు. "చెయ్యి కడుక్కోవాలి పంపు ఎక్కడ వుంది?" పల్లెటూరి బైతులా అడిగాడు.

 

    స్టీఫెన్ చేతినిండా అసహ్యంగా ఇడ్లీ పచ్చడి అయి వుంది. తిన్నది ఒక్క ఇడ్లీ చట్ని మాత్రం చేతినిండా అయి వుంది. ఆ చేతి వంక ఎసగింపుగా చూస్తూ "అటు పక్క గదిలో వుంది" అన్నాడు సర్వర్.

 

    స్టీఫెన్ లేచి పక్క గదిలోకి వెళ్ళాడు.

 

    స్టీఫెన్ లేచి పక్క గదిలోకి వెళుతూ ఒక్కసారి హాలునంతా కలయ చూశాడు. చాలాతక్కువ మందివున్నారు. ఎవరి తిండి ద్యాసలో వాళ్ళు వున్నారు. ఓ వేళ ఎవరైనా స్టీఫెన్ ని చూసినా పట్టించుకునే ధ్యాసలో లేరు. ఆ సమయంలో స్టీఫెన్ ధరించిన దుస్తులు గాని ముఖం గాని మళ్ళి చూడబుద్ది కాదు ఎవరికి.

 

    స్టీఫెన్ పక్క గదిలోకి వెళ్ళి ట్యాప్ తిప్పి చేయి కడుక్కున్నాడు. అలా కడుక్కునేముందు చేయి పైకి చాచి గోడమీద చిన్న మరకలావున్న చోట నొక్కాడు. నొక్కిన చోట బటన్ లేదు. కాని కొద్దిమేర ప్రెస్అయి లోపలికి వెళ్ళి మళ్ళి పైకి వచ్చింది. అలాచేస్తే ఎక్కడో బెల్ మ్రోగుతుంది.

 

    స్టీఫెన్ చేయి కడుక్కుని అటునుంచి కిచెన్ లోకి వేగంగా వెళ్ళాడు. ఇంద్రభవన్ సామాన్యమైన హోటల్ కావడంవల్ల పొట్టుపోయ్యిమిదనే టిఫిన్ లు చేస్తుంటారు అక్కడ పొట్టుపొయ్యిలు గోడ కానించి వుంటాయి.

 

    స్టీఫెన్ కిచెన్ లోకి వెళ్ళంగానే పొట్టుపొయ్యి వెనకాతల గోడ చది చప్పుడు కాకుండా జరిగి దారి ఏర్పడింది. కన్నుమూసి తెరిచేలోగా స్టీఫెన్ ఆ దారినుంచి లోపలికి వెళ్ళిపోయాడు. గోడ మళ్ళి కదిలి యధా స్తానంలోకి వచ్చింది. మండుతున్న పోట్టుపోయ్యిలు అలాగే వున్నాయి. పెనంమిధ అట్టు కాలుతూనేవుంది. భాగోడ్\భాగొణిలో బజ్జీలు వేగుతూనే వున్నాయి. కిచన్ లో పనిచేస్తున్నవాళ్ళు ఇదేం పట్టనట్లు, అసలేమి చూడనట్టు వాళ్ళపని వాళ్ళు చేసుకుపోతున్నారు.

 

    స్టీఫెన్ దగ్గరవున్న రూపాయి బిళ్ళ ఆకారంలో ముంమ్మూర్తుల రూపాయి బిళ్ళే కాకపోతే ఈ రూపాయి బిళ్ళమిద ఒక గుర్తు వుంటుంది.

 

    ఆ గుర్తు.

 

    వాళ్ళకి మాత్రమే తెలుసు.

 

    వాళ్ళెవరన్నది డానికి సంబందించిన వాళ్ళకి మాత్రమే తెలుసు.

 

    అండర్ వరల్డ్ కి  సంబంధించిన బ్రూటల్ బాడీస్ వాళ్ళు.

 

                                  2

 

    "ద బోన్ స్టక్చర్ అఫ్ ది మాన్...."

 

    లెక్చ్రర ర్తన దోవన తాను లెస్సన్ చెప్పుకుపోతున్నాడు.

 

    క్లాస్రూ రూమ్ లో చదువుమీద శ్రద్ధవున్న వాళ్ళు వింటున్నారు. లేనివాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. కొందరు కునుకు తీస్తుంటే మరికొందరు ఏదో ఆలోచిస్తూ గోళ్ళు కొరుక్కుంటున్నారు.

 

    ఇంకో అరగంటకి గాని కాలేజి వదిలిపెట్టరు.

 

    మహానంధ, ధైర్య, శ్రీ విద్య వెనక బెంచీలో కుర్చుని ముఖం మాత్రం లెక్చరర్ వేపు పెట్టి గుసగుసలాడుకుంటున్నారు.

 

    "నేను నమ్మను" అంది శ్రీవిద్య.

 

    "మీరు నమ్మిన నమ్మకపోయినా నేను చెప్పింది నిజం" మహానంధ చిరునవ్వుతో జవాబు యిచ్చింది.

 

    వాళ్ళు ముగ్గురు ఒకే కాలేజిలో బియస్సీ చదువుతున్నారు. అంతేకాదు వాళ్ళు ముగ్గురే స్నేహితులు, ఇంకే వరితో స్నేహం చేయరు. వాళ్ళది ఒకేమాట ఒకేబాట. వాళ్ళకి రహస్యాలు అపనమ్మకాలు అసలేలేవు. ఇప్పుడు మాత్రం మహానంధ చెప్పింది శ్రీవిద్య, ధైర్య నమ్మడంలేదు.

 Previous Page Next Page