Read more!
Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 1

                                 

                                       

                                 మిస్టర్ క్లీన్
                                                                           ----కురుమద్దాలి విజయ లక్ష్మి

 

                                 

  

    ఎండ మందిపోతున్నది.

 

    మిట్టమద్యాహ్నం, ఎండాకాలం ఆ చెవిలో గాడ్పు ఈ చెవిలో కొడుతుంది.

 

    ఆ సమయంలో

 

    స్టీఫెన్ కాలినడకన ఫైవ్ స్టార్ హోటల్ దగ్గరకు వచ్చాడు, కొద్దిసేపు ఫైవ్ స్టార్  ముందు నిలిచి నోరు తెరుచుకుని పైనుంచి కింద దాకా ఎగాదిగా చూసాడు. అంత పెద్ద హోటల్లోకి వెళ్ళి తినే అదృష్టం తనకి లేదు అన్నట్లు తలపంకించి ప్చ్ ... ప్చ్ ...." అని నాలుకతో పైకే శబ్డంచేసి మళ్ళి ఒకసారి లోపలి దాకాచూపు సారించి ఆ తర్వాత అక్కడ నుంచి కదిలాడు.


    
    మెరిసిపోయే ఫైవ్ స్టార్ హోటల్ పక్కనే మరో చిన్న హోటల్ ఉంది. మురికి ఓడుతున్న నేల, సున్నం పెచ్చులు వుడి పోయిన గోడలు, జిడ్డు ఓడుతున్న కప్పు సాసర్లు గ్లాసులు, ఇక్ష్వాకులం నాటి చెక్క  టేబుల్స్, సరిగ లేని కుర్చీలు ఎటు చూసినా ఎలా తెలపోతూ ఆ హోటల్ కారు చౌకదని తెలిసిపోతుంది. ఎంత చెట్టుకి అంతగాలి అన్నట్టు ఆ హోటల్ కి వచ్చే వాళ్ళు వున్నారు.

 

    అందరూ మేనా ఎక్కేవారయి తే మోసేవారు ఎవరు?


    అందరూ ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్ళగలిగే వారు అయితే చిన్న హోటళ్ళ గతి ఏమిటి?


    
    ఫైవ్ స్టార్ హోటల్ పేరు నరయ్యా.

 

    ఫైవ్ స్టార్ హోటల్ నరయ్యాకి దిష్టి తగలకుండా వుండటానికి దారి పక్కనే అనుకుని దిస్టిపిడకలా వున్నబుల్లి పాత హోటల్ పేరు ఇంద్రభవన్.

 

    ఫైవ్ స్టార్ హోటల్ నరయ్యాని చూసి ఎవరూ నవ్విన పాపాన పోలేదు. గాని హోటల్ ఇంద్రభవన్ చూసి చాలామంది  నవ్వుకునే వారు, ఈగలు దోమలు, బొద్దింకలు జిడ్దోడే సామానులు, వుండేవి ఇంద్రభవన్ లో . ఒక దేముడి ఫోటో పెట్టి రెండో దేముడి ఫోటో పెట్టకపోతే దేముళ్ళకిఎక్కడి కోపం వస్తుందో అని నానా రకాల జాతి దేముళ్ళ ఫోటోలు కౌంటర్ వెనుక గోడకి వేలాడుతూ వుంటారు.

 

    ఏసుక్రీస్తునుంచి ఏడుకొండలవాడి వరకు మహమ్మద్  ప్రవక్త సూక్తులనుంచి గురునానక్ వరకు, కాళీకామ్మవారు కనకదుర్గ అందరూ గోడమీద కలిసికట్టుగా వుంటారు.

 

    ఇంద్రభవన్ హోటల్ పోప్రయిటరు కమ్ మానేజర్అయిన కనకాచారి ముఖం నిండుగా వీభూధి రేకలు కనుబొమల మధ్య పైసా అంత కుంకం బొట్టు. ముక్కు మీదకి ఆంజనేయస్వామి సింధూరం. మెడలో తాయత్తుతో గొలుసు, పంచకంటే మెడలాల్చీ కుడిచెవిలో దోసిన పువ్వు  తులసిదళం రెమ్మ, ఫ క్త్ చాందస్తుడిలా మళ్ళిమాట్లాడితే వేపకాయ అంత వెర్రి వున్నవాదులా వుంటాడు.

 

    స్టీఫెన్ హోటల్ ఇంద్రభవన్ లో అడుగు పెట్టాడు. భుజం మీదనున్న కండువాతో చెమటతో తడిసిన ముఖం మెడను తుడుచుకున్నాడు. ఉస్సురుమంటూ వెళ్ళి మూలగ వున్న ఖాళీ టేబుల్ చూసుకుని అక్కడ కూర్చున్నాడు. మిట్టమధ్యాహ్నం కావడం వల్ల హోటల్లో జనం కూడా పల్చగా వున్నారు.

 

    స్టీఫెన్ నలువైపులా ఒకసారి చూసి జేబులోంచి రూపాయి బిళ్ళ తీశాడు. బిళ్ళని టేబుల్  మిద నిలువున పట్టుకుని గిర్రున తిప్పే కార్యక్రమంలో పడ్డాడు.

 

    స్టీఫెన్ కూర్చున్న టేబుల్ దగ్గరకు జిడ్డోడుతున్న ఓ సర్వర్ వచ్చాడు. స్టీఫెన్ వేషము ముఖం చూసి చాలా నిర్లక్ష్యంగా ముఖం పెట్టి "ఏమి కావాలి?" అన్నాడు.

 

    స్టీఫెన్ వినిపించుకోలేదు.

 

    "నిన్నే ఏమి కావాలి?" ఈ తఫా సర్వర్ కాస్త గట్టిగా అడిగాడు.


స్టీఫెన్ టేబుల్ మిద రూపాయి బిళ్ళ పడేశాడు. "నా దగ్గర ఈ రూపాయి బిళ్ళకాక అరవై పైసలు చిల్లర వుంది. సిగరెట్టుకి వక్క చూరకి సరిపోను పైసలు మిగలాలి. మిగతా డబ్బుతో కప్పు కాఫీ ఏ టిఫిన్ వస్తే ఆ టిఫిన్ తెచ్చి పెట్టు ఇడ్లీ అట్టు వడ....

 

    "ఇంక చెప్పడం చాలు" అన్నట్టు సర్వర్ చేతితో వారించాడు. "నీలాంటి కష్టమర్ .... ఊ ... నాకెందుకులే  తెచ్చిందేదో తిందువుగాని." అంటూ భుజాన వున్న చిన్న  టవల్ ని  స్టీఫెన్ ముఖానే విసురుగా దులిపి వెళ్ళిపోయాడు.

Next Page