Previous Page Next Page 
కాలనాగు పేజి 18

    "ఆమె నీ క్లాస్ మేటా?'

    'నేను సరిగ్గా చూల్లేదు నాన్నా!'

    'నీ బెస్ట్ ప్రెండ్ నంది!'

    '.... .... ..."

    'మీరు ప్రేమించుకున్నారట కదా?

    విభ్రాంతుడయ్యాడు ఆదిత్య.

    'పెళ్ళి కూడా చేసుకోవాలన్నారట కదా?

    'అలా అని చెప్పిందా?'

    'ఊఁ"

    'అంతా అబద్దం నాన్నా!'

    'ఆదిత్యా!'గద్దించాడు ధర్మరాజు.అయన ముఖంలో కోపరేఖలు తాండవమాడాయి. "అలా  ఎన్నటికీ అనద్దు. ఏ అమ్మయీ అలా అబద్దం చెప్పదు ప్రేమించుకుంటే ప్రేమించుకున్నామనీ, పెళ్లిచేసుకోవాలని అనుకుందే పెళ్ళిచేసుకోవాలని అనుకుంటున్నామని అబద్దం  కల్పించదు.ఇంత వయస్సు వచ్చింది ఇంత  చదివావు. యూనివర్సిటీ వెళ్ళొచ్చావు  ఇదా వయస్సు నేర్చుకున్నది.

    "స్రీ హృదయం అమృతం. ఆమె అమృతాన్ని పంచిపెడుతుంటే తప్ప అనృతం చెప్పాడు" గంభీరంగా అన్నారాయన.

    ఆదిత్య మౌనం వహించేడు.

    చప్పున జవాబు చెప్పటానికి అతనికి నోరు పెగల్లేదు.

    'ఆదిత్యా!' మళ్ళీ ధర్మరాజే పిలిచాడు." ప్రేమించటం నేరం కాదు. తప్పుకాదు. ప్రేమ ఒక మహాత్తరమైన అనుభూతి. ప్రేమించినా ప్రేమించబడినా అదొక గొప్పయోగం. మామూలూ మనిషులకి ప్రేమ లభించదు."

    'నాన్నగారూ! నేను ప్రేమించాను.'

    'వెరీగుడ్! అలా చెప్పు మూడో క్లాసు కుర్రాడిలా నా ముందు నీ ప్రేమ గురించి చెప్పేకోటానికి భయపడతావేం? నువ్వు పోస్టు గ్రాడ్యుయేటివి, ఇరవై రెండేళ్ళ దాటాయి ఇంకా నా ముందు సంకోచమూ'

    అదికాదు నాన్నగారూ...'

    'చేపద్దు బాబూ! నాకు కారాణాలు అనవసరం! సరళ అంతే ఏంటనుకున్నావ్? ఆమె దేవతా స్రీ...'
    'నా పేరు ఒలూచి... నేను నాగదేవతను'

    ఆమె చెప్పిన మాట గుర్తుకొచ్చింది అడిత్యకి

    'బాబూ! ఆమె తనకై తను మనింటికి వచ్చింది. పన్ను మామగారు అంటూ ప్రేమగా పిలిచింది. ఇంకో విషయం గుర్తుంచ లేదా నువ్వు?' కుతూహలంగా ప్రశ్నించారు ధర్మరాజు.

    'ఏమిటి నాన్నగారూ?'

    'నా చూపు బాగైంది' చప్పున అన్నాడు.

    ఆ మాట విన్న ఆదిత్య హృదయం లయ తప్పింది. క్షణకాలం లాస్యం చేసింది. చప్పున తండ్రి వద్దకి వచ్చాడు.

    అయన అతన్ని ఆప్యాయంగా తడిమారు. అడిత్యకి తెలిసింది. "నా చూపు ఎలా వచ్చిందో తెలుసా?"

    'ఎలా వస్తేనేం నాన్నగారూ! మేం అదృష్టవంతులం. నేనూ అమ్మయీ యిరవై నాల్గు గంటలు ఎంత నరకం అనుభవించామో తెలుసా?'

    నిట్టూర్చారు అయన 'తెలుసు బాబూ! అందుకే ఆ నరకం నుంచి మనల్ని స్వర్గానికి తీసికెళ్ళిన ఆ దేవతా స్రీని_ నీ ప్రెండ్ ని _ నువ్వు ప్రేమించిన అమ్మాయిని_ పెళ్ళి చేసుకోవటానికి యిష్టపడిన ఆ సరాలని_ మన యింటి కోడలిని చేసుకోవాలని నిశ్చయించుకున్నాను_'

    ఆదిత్య గొంతుక్కి అదో అడ్డుపడ్డటైంది.

    అది విన్న అరుంధతి చప్పున అక్కడికి వచ్చింది.

    ఆమె నిమిషం క్రితమే శ్రీధరశాస్రీ యింటి నుంచి తిరిగొచ్చింది. గడపలో నుంచున్న ఆమెకి 'నా చూపు బాగైంది' అన్నా ధర్మరాజు మాటలు వినిపించాయి. దాంతో ఆమె అక్కడే ఆగిపోయింది. ఆమెకి 'నీ భర్తకి త్వరగా చూపు వస్తుంది. నేను యూ క్షణం నుంచే నయగతిరగడ పారాయణం ప్రారంభిస్తాను. రేపటి ఉదయంలోగా లక్షజపం చేస్తాను.ఆయనికి చూపు వస్తుంది' అన్నా శ్రీధరశాస్రీ పలుకులు గుర్తుచ్చాయి... దాంతో ఆగిపోయి అంతా వింది.

    ఆమె అనందం పట్టలేక "ఏమండీ" అంటూ వచ్చింది అక్కడికి.

    'ఆరూ! అన్నారాయన ఆనందంగా

    'మీరు... మీరు... మళ్ళీ చూడగలుగుతున్నారా?"

    'అఁ బాగా, స్పష్టంగా చూస్తున్నాను నిన్ను. నిజం ఆరూ! నేను మిమ్మల్ని మళ్ళీ యిల చూడగలుగుతా ననుకోలేదు....'

    ఆమె కళ్ళలో అనండ బాష్పాలు పొంగేయి. " అంతా దేవిడిదయ" అంది గడ్గాదికంగా.

    'ఆరూ! కళ్ళేలా వచ్చాయో తెలుసా?'

    'ఊహూ మీరు ఏదో అబ్బాయితో చెబుతున్నారు_ పూర్తిగా విన్లేదు స్పష్టంగా తెలీలేదు_' అంది.
    "సరళ అనే వీడి ప్రెండ్ వచ్చింది. మనల్ని చూసేందుకు వచ్చిందట. నా స్థితి చూసి కీస్ తీసుకుని లోపలకి వచ్చింది_ పరిస్థితి చెప్పాను. ఆమె చేతితో విశిష్టమైన వింతైన అరుదైన గరుడరేఖా వుంది_ అంది. స్పర్శతో నా దోషం హరించి దృష్టి వస్తుంది అంది. అలాగే వచ్చింది ఆశ్చర్యంగా విన్నారు.

    'దిసీజ్ ఎబో సైన్స్ అండ్ లాజిక్... ఇది అద్బుతం" అనుకున్నాడు ఆదిత్య, ఏది ఏమైనా అతనికి ఆనందంగా వుంది.

    ధర్మరాజు సంతోషం వర్ణనాతీతంగా వుంది. ఆయనకి సరళ పై చెప్పలేని అభిమానం ఏర్పడిపోయిందని స్పష్టమవుతున్నది.అది భరించలేక పోతున్నాడు ఆదిత్య.

    "ఎవరీ సరళ?

    ఏమితామే కధ?

    నిజంగా అంత అద్బుతాలు గల శ్రీ అబద్దం ఆడుతుందా?'

    'ఆమె దేవతాస్రీ 'అనే తండ్రిమాట వినిపించి, చప్పున గుర్తుకొచ్చినట్టయిందతనికి, అతను నిర్ఘాంతపోయాడు... ఆమె... ఆమె
   
   
                                        17


    అఖండ జ్యోతి వెలిగించి జపం ప్రారంభించారు శాస్రీగారు. కానీ ఆయనకి "దయానం" కుడురతం లేదు. "సమాధి" సిద్దించటం లేదు.మంత్రాక్షారాలు మననమవుతున్నాయి. అంతేకానీ 'మహిమ'కి చైతనయం కలగటం లేదు.

 Previous Page Next Page