Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 19

    "ఊరికే ఆవిడని ఆడిపోసుకోకండి. సరోజ యిక్కడే చదువుకుంటుదట.......కపిరెడ్డి వెంకట రెడ్డి కాలేజిలో సిటు వచ్చిందట.......ఓ యస్పి లో చేరుతోందట."
    "అలాగా- అయితే నీ వుద్దేశం ఏమిటి? ఇక్కడే వుంది చదువుకోమను. నేనేమి అనుకోను......సరోజ నీ కొకటి నాకొకటి కాదు- ఇహ ఏమైనా అనుకోటానికి నాకెవరు లేరుగా"
    "ఎందుకు లేరు? నేనున్నానుగా....." అని ఒక్క క్షణమాగి "అది కాదండీ మీ కిష్టముండదని కాదు. నాకే యిష్టం లేదు.
    నిర్ఘాంతపోయాడు.
    "అదేమిటి? నీకెందుకిష్టం లేదు?"
    "ఎందుకో- అదంటే నాకిష్టంలేదు. అది యిక్కడ చదువుకోవటం నేనొప్పుకోను."
    విసుగ్గా చూశాడు "సరే! కర్మ........ఒకటి మాత్రం నీవు సరిగా చేశావు గనకనా? ఇదేమిటి శ్రీ.....యిలా? అదెలా? నీవు ఎప్పుడూ యింతే నా ప్రాణానికి తెచ్చి పెడుతూ వుంటావ్.'
    "ఎందుకండి అలా బెంబేలుపడతారు. ఇక్కడ మీకేమిటి చిక్కు? మీకేమిటి యిబ్బంది?
    మీరేమి దానితో చెప్పక్కర్లేదులెండి. నేనే చెపుతాను. మీరు ఊరకే మౌనంగా వుంటే సరి,"
    "ఏమని చేపుతావ్?"
    "ఏమన? మీ బావగారికియిష్టము లేదని"
    నివ్వెరపోయి కోపంగా అన్నాడు. "అలాగా ఎందుకు? నీకే యిష్టంలేదని చెప్పరాదూ? నాపై నిందలెందుకు? నాకు సరోజ యిక్కడ వుండటంయిష్టమే."
    "అదే నేను నేననేది........మీ కిష్టమనే నాకిష్టం లేదు. ఆవిడ యిక్కడ వుంటే నేను మీ దృష్టిలో అనను. అందుకే వుండొద్దంటున్నాను."
    బిక్క చచ్చిపోతూ అన్నాడు; "ఇదేమిటి శ్రీదూ, మరీ యింత అన్యాయంగా మాట్లాడుతున్నావే? స్వయానా నీ చెల్లెల్ని యింత మాట అనటానికి నీకు మనసెలా వోప్పింది? చీ! చీ! నీవు యింత నీచంగా వుహిస్తున్నావని అనుకోలేదు."
    "మీ రెంతగా నన్ను నిందించినా పరవాలేదు; నా సంసారంలో మరో స్రీ గాలి కూడా సోకటం నాకు యిష్టము లేదు. నీచంగా ఘోరంగా జరగబోయే వాటిని ముందుగా నీచంగా నైనా సరే వూహించి అవి జరక్కుండా కాపాడుకోవటం మంచిది కదా?"
    "మంచిదే అలాగే నీ యిష్టం- నీవు దేనిలో మాత్రం నా యిష్టం అన్నావ్----సంసారం చక్కగా సాగాలనుకోవటంతో నా నోరు మూత పడుతోంది. అయినా నీవు యీ యింట్లో ప్రవేశించావు అప్పుడే నా యిష్టాలన్ని నీ యిష్టాలయ్యాయి."
    "పడుకుంటున్నారా? అలాగేకానియండి. ఉదయం చెప్పేస్తాను. ఆవిడతో ఏదో నాల్గురోజులుండి వెళితే వెళ్లమని చెపుతాను."
    "మళ్ళీ అదెందుకు?రేపే వెళ్ళమను"
    "నాకా మాత్రం తెలుసులెండి"
    లేచి లైటార్పి బెడ్ రూమ్ లైట్ వేసి బాబుని తెచ్చి దగ్గర పడుకోబెట్టుకుని తన మంచం పై వాలిపోయింది.
    కానీ తన మాటల వల్ల రెండు ప్రాణాలు ఎంతగా క్షోభిస్తున్నాయో ఆమెకేం తెలుసు?
            10
    అన్నవాళ్లు హాయిగానే వుంటారు. కానీ పడ్డవాళ్ళకి మనశ్శాంతి ఎక్కడ? ఎంత ప్రయత్నించినా కళ్ళు మూతలు పడటం లేదు మాధవ్ కి. అతనికి ఆలోచించినకొద్ది బాధఎక్కువ కాసాగింది. కానీ ఆలోచనల్నించి పారిపోదామంటే నిదురరావటం లేదు.
    "ఏమిటి యివిడ వుద్దేశం?"
    తను కనిపించిన ప్రతి ఆడదాని వెంట తగలబడే రకమా? అలా అని యివిడ అనుకుంటోందా? పైగా తననంత చేల్లెల్నే అనుమానిస్తోందా?
    హే భగవాన్! ఏమిటది?
    తనెంత శిలవతో తన చెల్లెలూ అంతే ననుకునే ఆలోచనే రాదా ఆవిడకి? తనే చెల్లెల్ని అంత హీనంగా ఎందుకనుకుంటుంది? దీని వెనుక రహస్యమేమయినా వుందా? ఉహూ అలా వుండదు. తనతో ఏదో దాచదు.
    మరి?
    ఆ 'మరి' కే తనకే అర్ధం దొరకటం లేదు. తమ సంసారాన్ని గురించి ఆవిడకి ఎంతైనా జాగ్రత్త అవసరమే?
    కాదనడు.
    కానీ ఆ అతిజాగ్రత్తలో యివతలి వ్యక్తులు ఎంతగా బాధపడతారో ఉహించదేం?
    నిజంగా చాలా చిత్రమయినవ్యక్తి.
    తనంటే లెక్క చేయదు.
    అది తనకి బాధ కాలేదు. ప్రేమ వున్నప్పుడు గౌరవమఎందుకు? కానీ తనకి ఏది లోటు రానివదు. ఎందునా చింత లేదు తనకి. అన్నిటా ఆవిడదే అధికారం. అయినా అందుకు తనకి విచారం లేదు. అధికారం ఎవరిదయితేనేం. ఆసాధనలో తనకి. కింద లేదు లోటు లేదు.
    ఆ అధికారమేదో ద్యోతకం, కాకుండా సంసారాన్ని నెగ్గించుకు రావాలని ఆవిడ అనుకోదు.
    అక్కడే చిత్రం. అయినా అది తనకు బాధకాదు.
    విసుగ్గా లేచి కూర్చున్నాడు మాధవ్.
    నిదురరాదు.
    ఆలోచనలు తెగవు.
     ఏం చేయాలి?
    లేచి వెళ్ళి టేబిల్ లాంప్ వెలిగించుకుని ఆ మిగిలిన సంచికలు తిరగేస్తూ కూర్చున్నాడు.
    హటాత్తుగా మెలుకువ వొచ్చి లేచి కూర్చుంది శ్రీదేవి.
    టేబిల్ ముందు కూర్చుని సినిమా బొమ్మల్ని అత్యంత ఆసక్తితో చూస్తున్న మాధవ్ ని చూసేసరికి ఎంత పిచ్చి! కొత్త బిచ్చగాడు పోద్దేరుగడట. అలా వుంది. ఎయావ పడితే అదే యావనా? అనుకుని మెల్లిగా లేచి అతని వెనకే వెళ్ళి నిలుచుంది. నిశ్శబ్దంగా చూస్తూ.
    మెల్లిగా ఒక్కో బొమ్మని చూస్తూ చదువుతూ పేజీలు తిరగేస్తున్నాడు మాధవ్.
    ఓ నిమిషం పాటు అలాగే చూస్తూ నవ్వుకుని తమాషా చేయాలనీ కళ్ళు మూసింది.
    హటాత్తుగా ఆవిడ అలా చేయటంలో గాబరా పడ్డాడు.

 Previous Page Next Page