Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 18

 

    అతనేమీ అనలేదు.
    "ఏం పలకరేమండి? ఇదేమిటి సాయంకాలం నించి మూగ నోము పట్టేశారు. మౌనవ్రతము పాటించటం మొదలు పెట్టారేమిటి ఖర్మ?"
    అతను ఏమి అనకుండా ఆసక్తిగా పేజీలు తిప్పెయ్యసాగాడు.
    విసుగ్గా పిలిచింది మళ్ళీ "ఏమిటా మౌనం?"
    తలెత్తాడు.
    "మిమ్మల్నే! ఇందాకటి నుంచి అరుస్తోంటే చెవుల్లో దూరనయినా దూరలేదా?"
    "అ"

    "ఆ ఏమిటి? ఆ పిలుస్తుంటే పలకరెందుకో? బాగా వినిపించటం లేదా?"
    "ఎందుకు వినిపించదు. బాగానే వినిపిస్తుంది"
    "మరి సమాధానంయివరే?"
    "ఏమని యివ్వాలి?"
    "అంటే మీకు పుస్తక పఠనంలో పడ్డక నాకేం జవాబు యివాలో కూడా తోచటం లేదన్నమాట?
    ".........."
    "జవాబు చెప్పరేం?"
    "అబ్బ! ఊరుకొందు!.......ఎందుకలా వురికే విసిగిస్తావ్?"
    కోపంగా అంది "కనిపిస్తోంది అప్పుడే"
    "ఏమిటో ఆ కనిపించేది?"
    "అహిష్టం"
    "ఎవరిపైన?"
    "నా పైన"
    నిటారుగా కూర్చుని పుస్తకం మూసి మధ్యన వేలుంచుకుని సూటిగా చూస్తూ అన్నాడు "నీ పైన అహిష్టమా? ఎందుకిలా అంటావ్? శ్రీ......నీపై ఆహిష్టం నాకెందుకు పుడుతుంది? కాదంటే చుడకచుడక యీ పుస్తకం చూస్తూ కూర్చున్నాను. కాబట్టి నీ మాటలు సరిగా వినలేదో ఏమో! అయినా యివేమీ వద్దనుకుని ఓ కూర్చుందామంటే వచ్చినప్పటి నుంచి నీవో పుస్తకం, సరోజా ఓ పుస్తకం పట్టుకని పరిక్షలకి వెళ్ళే వాళ్ళలాగా చదువుతూ కూర్చుంటారాయే. మరి నాకు ప్రోద్దేలా గడవాలి?"
    గలగలా నవ్వింది శ్రీదేవి.
    అతని చేతిలోని పుస్తకాన్ని తీసుకుని మూసి పక్కగా పెట్టేసి అతని చేతుల్ని చెంపలకి ఆనించుకుని గోముగా అంది ప్రేమగా చూస్తూ.
    "మీ కలా యిష్టం లేదని చెప్పేస్తే అప్పుడే మానేద్దునుగా వెధవ పుస్తకాలు! ఎప్పుడూ హత్యలూ, బెదిరింపులు----ఒళ్ళు జలదరిస్తుంది--- అయినా మనసులో ఏదో వుంచుకుని మౌనంగా వున్నారంటే నాకెలా తెలుస్తుంది?"
    "నీకు తెలియదు నిజమే, కానీ నాకై నేను విడమరిచి చెప్పి చదువుకో వద్దని అంటే ఇంకేమయినా వుందా. సత్యాగ్రహం మొదలు పెడతావు."
    "సత్యాగ్రహం మంటే నీళ్ళు నిప్పులు ముట్టుకో కుండాననా? బాబోయ్ మీ యిష్టం మీరేమి చేసినా నాకు సమ్మతమే గానీ అన్నం నీళ్ళు ముట్టకుండా నేనుండలేను."
    చిలిపిగా ఆవిడ అంటుంటే అలా అలా ముద్దుగా మాటాడుతుంటే చిలుకం పట్టుకుని లాలనగా అన్నాడు.
    "సత్యాగ్రహం అంటే నీ వనుకున్నది కాదులే. సత్యాగ్రహం షష్టి తత్పురుషం చెయ్ పోనిలే, యీ డొంక తిరుగుడేందుకు? సత్యాగ్రహం అంటే సత్యభామగారి ఆగ్రహం అని-- అంటే ఏం లేదు, అలుకవహించటం అన్నమాట, అప్పుడు నేను నివద్దకి వచ్చి హిందోళంలో " "మనమరయందలంచి....నీవు దయగన్గోనకుండిన నిల నేర్తునే" అని ప్రార్ధిస్తా నన్నమాట. తర్వాతేమో....అహం,  తర్వాత యిక వద్దులే"
    సంకోచించి అతనాగిపోవటంతో నిండుగా నవ్వేసి అంది "ఎండుకొద్దు? తర్వాత బావుంటుంది, అప్పుడేమో నేను మీరు నా పాదాలకి మొక్కబోతే అయ్యో పతిదేవుడే, పాదాలకి మొక్కవచ్చా అనుకుని నా ఎడమకాలుని పక్కకి తిసుకోబోతాను. కానీ మీరు అలా జరగటంతో నా పాదం ఎలాగూ మీకు తగుల్తుంది. కిరీటం లేదు కాబట్టి బంగారం లాంటి మీ క్రిమ్ పూసిన క్రాఫ్ చెదురుతుంది. తర్వాత నిజంగానే మళ్ళీ హిందోళంలోనే "నను భవదీయదాసుని" అంటూ మొదలు పెడతారు. అప్పుడేమో నేను చీ! చీ! భవదీయదాసుదేమిటండి? బావులేదు "నను భవదీయ ప్రాణపతి" అనండి అంటాను. దాంతో రాజీ....తర్వాతేమో......."
    "తర్వాతేముంది? ఇహ స్క్రీన్ వేసేయ్యటమే" అని దోమతెరని లాగేసి దగ్గరికి లాక్కుని సున్నితంగా చుబిస్తూ అన్నాడు "అబ్బ ఎన్నాళ్ళయింది శ్రీ? మన మిలా మాట్లాడుకుని."
    "రోజు స్వీట్స్ తింటుంటే మొహం మొత్తదూ?"
    "నాకేం మొహం మొత్తదు. నాకు రోజు యీ స్వీట్స్ కావాలి" అని మళ్ళీ అందుకోబోయాడు.
    అతన్నించి తప్పించుకుని అంది "విల్లేదంది మహారాజా! రోజు యీ స్వీట్స్ అందుకుంటూ వుంటే మీకు వీటి రుచి బాగా అలవాటై చివరికి తీయదనమే మరచిపోతారు."
    "లేదులే- అబ్బ ఏమిటి అడ్డంకి" మారం చేయబోయాడు.
    "అబ్బ! ఏమిటా తొందర? కాస్త ఆగండి, మీతో ఓ విషయం చెప్పాలి. అది ముందు వింటేనే తర్వాత పరోపక్రమణ.
    గారంగా అడిగాడు; "స్వీట్స్ తీసుకుంటూ వినటానికి వీలుపడదా?"
    "మరీ చిన్న పిల్లాడిలా ప్రవర్తించకండి. చెప్పేది వినమంటే........బుద్దిమంతుడిలా వినండి. "లేచి కూర్చుని అతన్ని కూర్చోబెడుతూ అంది "మా సరోజా......."
    "అలాగే మీ సరోజ........"
    "అలా చేస్తే ఒప్పుకోను.....యిక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా?"
    "తెలీదు"
    "పక్కింటి బామ్మగారితో చెపుతుంటే విన్నాను."
    సరిగా అదే సమయానికి బాత్ రూమ్ వేపు వెడుతున్న సరోజ తన విషయం ప్రస్తావన వినబడటంతో అప్రయత్నంగా ఆగిపోయింది.
    "మళ్ళీ తయారైంది బామ్మగారు. ఏమని చెప్పుతుంది?"

 Previous Page Next Page