Previous Page Next Page 
బెస్ట్ జోక్స్ పేజి 18


    కోర్టులో ఓ సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నాడు ప్రతివాది లాయరు.
    "ఏంటి నువ్ చెప్పేది? ఎక్కడో నాలుగొందల మీటర్ల దూరం నుంచీ నువ్ ఆ వ్యక్తి మర్డర్ చేయటం చూశావా? అంత దూరం నుంచి నీకసలు కనపడుతుందా?"
    "ఎందుక్కనబడదు సార్! కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్న చందమామే స్పష్టంగా కనబడుతూంటే నాలుగొందల మీటర్ల దూరంలో అదెందుకు కనబడదూ-"

    ఒక కంజూసీ యజమాని తన వ్యాపారం బాగా అభివృద్ధి చెందినందుకుతన సిబ్బంది అందరికీ మందు పార్టీ ఇచ్చాడు.
    ఆ కంపెనీలో ఎంతో కాలం నుంచీ సిన్సియర్ గా పనిచేస్తున్నా జీతం పెరగని కృష్ణారావ్ అదే మంచి సమయమని బాస్ దగ్గరకొచ్చాడు.
    "సార్- నేను మన కంపెనీలో చేరి ఇవాళ్టికి ఇరవై రెండేళ్ళు అయింది. నేను రాత్రిం బగళ్ళు విరామంలేకుండా వర్క్ చేశాను. అయినాగానీ దానికి తగ్గట్టుగా మీరు జీతం పెంచలేదు - ఇప్పుడు చూడండి. నా హెల్త్ కూడా పాడైపోయింది-"
    బాస్ అతనిని చూసి జాలిపడ్డాడు.
    "నిజమేనోయ్! నీ హెల్త్ విషయం నేను గమనించలేదనుకోకు- హలో మై ఫ్రెండ్స్! ఈ పెగ్ మనందరం కృష్ణారావ్ హెల్త్ కోసం తాగుదాం- ఏదీ చెప్పండి. ఫర్ ది హెల్త్ ఆఫ్- ....."
    అందరూ "కృష్ణారావ్"అని అరచారు.

    కోట్లకు పడగలెత్తిన ఒక బిజినెస్ మాగ్నెట్ దగ్గర ఓ నమ్మకస్తుడైన నౌకరు ఉన్నాడు. ఆ నౌకరు ఎప్పుడూ కాపిటలిజం ముర్దాబాద్ - కమ్యూనిజం జిందాబాద్ అంటూంటే యజమాని ఎన్నోసార్లు అతనికి కాపిటలిజంలోని లాభాలు,  కమ్యూనిజంలోని నష్టాల గురించి చెప్తూండేవాడు. అయినా నౌకరు అభిప్రాయం మాత్రం మారలేదు. కొంతకాలం తర్వాత సడెన్ గా ఆ నౌకరు కమ్యూనిజం గురించి మాట్లాడటం మానేశాడు.
    "నీ అభిప్రాయాలు మార్చుకున్నావా?" ఆశ్చర్యంగా అడిగాడు యజమాని.
    "అవున్సార్! కాపిటలిజమే మంచిదని నిర్ణయించుకున్నాను"
    "ఎందుకని ఆ మార్పు వచ్చింది?"
    "కిందటసారి మా కమ్యూనిస్టు పార్టీ మీటింగ్ కెళ్ళినప్పుడు మనదేశంలో మొత్తం డబ్బంతా గవర్నమెంట్ లాక్కుని ప్రజలందరికీ సమానంగా పంచుతే మనిషికి పాతిక వేల కంటే ఎక్కువ రాదని తేలింది సార్! మరి నా దగ్గర ఇప్పటికే యాభై వేలు ఉంది. గనుక కమ్యూనిజం వదిలేశా-"

    ఓ మల్టీ నేషనల్ కంపెనీ సేల్స్ ప్రమోషన్ మీటింగ్ కండక్ట్ చేసింది. ఆఖర్లో కంపెనీ బాస్ మాట్లాడాడు.
    "నాకు తెలుసు ఈ రోజుల్లో ఎవరిని మోటివేట్ చేయాలన్నా ఏదొక ఇన్ సెంటివ్ - లేక ఏదొక లాభం చూపించాలి! అందుకే నేనో స్కీమ్ రడీ చేశాను.
    అదేంటంటే అద్భుతమయిన సేల్స్ టార్గెట్స్ అచీవ్ చేసిన వారిలో మొదటి వందమందినీ మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో వారం రోజులు వారికిష్టమొచ్చిన విధంగా గడిపేందుకు అన్ని ఖర్చులూ కంపెనీ భరిస్తుంది"
    "మిగతావాళ్ళ సంగతేంటి?" ఓ సేల్స్ ఆఫీసర్ అడిగాడు.
    మిగతావాళ్ళందరూ కూడా మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో వారం రోజులు ఎంజాయ్ చేయవచ్చు.  వారి ఖర్చులన్నీ కూడా కంపెనీయే భరిస్తుంది. కాపోతే వారు వారి భార్యలతో అక్కడి కెళ్ళాల్సి ఉంటుంది-"

    ఓ పెద్దమనిషి హడావుడిగా ఓ న్యూస్ పేపర్ ఆఫీసులో ప్రకటనలు బుక్ చేసే సెక్షన్ కొచ్చాడు.
    "మా ఆవిడ పెంపుడు పిల్లి ఎక్కడో తప్పిపోయింది. ఇదిగో - ఇదే మా పిల్లి ఫోటో! దీన్ని వెతికి తెచ్చిచ్చినవారికి లక్షరూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించండి"
    ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది.
    "ఏమిటి? ఆఫ్టరాల్ ఓ పిల్లి కోసం అంత డబ్బు ఇస్తారా?"
    "ఆ పిల్లి ఎవడికైనా  దొరికితే  కదా! నేనే దాన్ని నదిలో ముంచేశాను-"

    కాల్ సెంటర్ లో పనిచేసే ఓ అమ్మాయి తన భర్తమీద అనుమానంతో - ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ని ఏర్పాటు చేసింది.
    నెలరోజుల తర్వాత ఆ డిటెక్టివ్ ఆమెను కలుసుకున్నాడు.
    "ఈ నెల రోజుల్లో అతని కదలికలన్నీ కవర్ చేశాను మేడమ్! అతను రోజూ అమీర్ పేట ఏరియాలోని రెండు బార్స్ కీ, యూసుఫ్ గూడాలోని రెండు అపార్ట్ మెంట్స్ కీ నాలుగయిదు రోజులకోసారి వెళ్తున్నాడు-"
    "అయితే నా అనుమానం నిజమే! అక్కడ ఎవత్తెనో మరిగి ఉంటాడు-" అందామె విజయహాసంతో.
    "పొరబాటు పడ్డారు మేడమ్. మీ ఆయన అవన్నీ తిరుగుతోంది - మిమ్మల్ని వెంబడించడానికే-"

    "నా గాళ్ ఫ్రెండ్ శ్రీదేవి కవలపిల్లల్లో ఒకత్తె! నీకు తెలుసా?"
    "ఓ గాడ్! మరి ఇద్దరు కవలల్లో ఎవరు నీ గాళ్ ఫ్రెండో ఎలా తెలుస్తుంది?'
    "ఎందుకు తెలీదు? ఆమె కవల సోదరుడి మూతికి మీసాలు ఉంటాయ్ కదా!"

    "ఏవండోయ్! ఈ ట్రావెల్ బుక్ కొనుకొచ్చాను చూడండి! మనం ఎన్ని అందమయిన ప్రదేశాలు చూసి రావచ్చో ఈ పుస్తకం చెప్తుంది-"
    "నేనూ ఓ బుక్ తీసుకొచ్చాను-అది మనం ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే ఎందుకు ఉండాలో చెప్తుంది-"
    "ఏం పుస్తకం అది?"
    "బాంక్ పాస్ బుక్"

    లాటరీలో కోటిరూపాయలు సంపాదించిన ఓ బీదాడూ, అతని భార్యా హైదరాబాద్ వెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్లో దిగారు.
    భార్య బేరర్ ని పిలిచి అయిదువందల నోటిచ్చి "చిల్లర తీసుకురా!" అంటూ ఆజ్ఞాపించింది.
    "సారీ మేడమ్! మా హోటల్లో అయిదువందల నోట్లనే మేము చిల్లర అంటాం!" అన్నాడు బేరర్ వినయంగా.

    ఒకావిడ కొత్తగా టీవీ కొని ఇంటికి తీసుకెళ్ళింది. మర్నాడే ఆ షాప్ కి ఆమెనుంచి ఫోన్ వచ్చింది.
    "మీరిచ్చిన టీవీలో ఏదో ప్రాబ్లెమ్ ఉంది! వెంటనే టెక్నీషియన్ ని పంపండి!" అందామె.
    "ఇంతకూ ప్రాబ్లెమ్ ఏమిటి మేడమ్?"
    "న్యూస్ ఛానెల్లో న్యూస్ చదివేవాడు ఎక్కడో ఒక మూల నిలబడి మాట్లాడుతున్నాడు. పైగా ఒకటే వణుకుడు-"
    "అది టీవీ ఫాల్ట్ కాదు మేడమ్! వాళ్ళు చదివే న్యూస్ అలాంటిది. కావాలని చిన్న విషయాన్ని కూడా కొండంతలు చేసి వాళ్ళే దడుసుకొని ఛస్తున్నారు-"

    హోటల్లో బేరర్ ఓ కంజూసీ కస్టమర్ ఇచ్చే టిప్ తో విసిగిపోయాడు.
    "మీ కంటే మీ అబ్బాయి నయం సార్! వందకు తక్కువ టిప్ ఇవ్వడు-"
    "ఇస్తాడు బాబూ! ఎందుకంటే వాడికి బాగా డబ్బున్న తండ్రి ఉన్నాడు. నాకలాంటి తండ్రి లేడే మరి!"

    ఆంధ్రప్రదేశ్ లో ఛీఫ్ సెక్రటరీ పోస్ట్ ఖాళీ అయింది. చీఫ్ మినిస్టర్ వెంటనే తన మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేశాడు.

 Previous Page Next Page