Previous Page Next Page 
డాళింగ్ పేజి 18

 

    ప్రేమ ఒక అనందవాయు సమీరం.
    చల్లటి ఏసీ గదిలో హాయిగా వెచ్చని ఊహల మధ్యన మాధురి
    చటుక్కున ----
    అప్పుడు -
    మాధురికి విమల్ జ్ఞాపకానికొచ్చాడు.
    ఏం చేస్తున్నాడో?
    నిద్ర పోతుంటాడా?
    మాట్లాడితే?
    ఆలోచన రావడంతోనే మాధురి ఫోన్ రిసివర్ని తీసుకుంది.
    నెంబర్ బటన్స్ నొక్కుతుంది.


                                            *    *    *    *

    సోమ్మసిల్లినట్టుగా పడిపోయిన విమల్ కి కూడా ఆ సమయంలో మాదురే జ్ఞాపకానికి వచ్చింది.
    ఏం చేస్తుందో?
    నిద్రపోతుంటుందా?
    మాట్లాడితే?
    ఈ సమయంలో , మాధురితో సరదాగా మాట్లాడితేగాని మనసుకి ఓదార్పు వుండదు.
    అవును.....
    మాధురితో మాట్లాడాలి.
    ఆలోచన రావడంతోనే విమల్ ఫోన్ రిసివర్ని అందుకున్నాడు.
    నెంబర్స్ బటన్స్ నొక్కుతున్నాడు.


                                             *    *    *    *

    ఎంగేజ్ ........ఎంగేజ్.....
    భీమ్.......బీమ్......అని సౌండ్ తప్ప, మరేం లేదు.
    ఇంత రాత్రప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడబ్బా........అనుకుంది మాధురి.


                                               *    *    *    *

    అదే పరిస్థితి విమల్ కి కూడా.
    చెయ్యి నొప్పిడుతోంది.
    మాధురి ఇంత అర్ధరాత్రి ఎవరితో మాట్లాడుతోంది.
    

                                               *    *    *    *

    విసుగొచ్చి , ఫోన్ పెట్టేసింది మాధురి.
    విసుగొచ్చి , ఫోన్ పెట్టేశాడు విమల్.


                                                *    *    *    *

    గబుక్కున లేచాడు. అతను ఆ గదిలో ఉండలేక పోతున్నాడు. ఏ క్షణంలో ఏ ఫోనోస్తుందో ....
    భయం, భయంగా ఉంది.
    పేంటు, షర్టు వేసుకున్నాడు. షూస్ తోడుకున్నాడు.
    గదిలోంచి బైటకు రాబోతూ, ఆగి పోయాడు.
    మళ్ళీ ......ఫోన్.....
    ఆ ఫోన్ శబ్దానికి అతని నరాలు మంచు తగిలినట్టుగా అయిపోయాడు.
    విరామం లేకుండా ఫోన్ మోగుతోంది.
    ఒక్క క్షణం.....
    కోపంగా ------
    అసహ్యంగా ---
    అసహనంగా .....
    ఫోన్ వేపు చూసాడు. తప్పదన్నట్టుగా గదిలోకి అడుగేసాడు.
    రిసీవర్ తీసుకున్నాడు.
    "హలో ......." అన్నాడు చిరాగ్గా!
    ఆ తరువాత తెలిసింది ఫోన్ చేసింది కృష్ణ నందన కాదని. తన తండ్రని.
    "హలో ! డాడీ....మీరా " ఫోన్లో డాడీ జయేంద్రదత్ గొంతు వినబాడటంలో, అంతవరకూ విమల్ లో వున్న చికాకు ఒక్కసారి మాయమైపోయింది.
    "సారీ ఫర్ ది డిస్త్రబింగ్ యూ మై సన్. అరగంట నుంచి ట్రై చేస్తున్నా. ఎవరితో మాట్లాడుతున్నావ్ ...హౌ అర్య్వు."
    జయేంద్రదత్ ఆప్యాయంగా అడుగుతున్నాడు.
    "ఫైన్ డాడీ ....ఎలా ఉన్నారు. ఎప్పుడొస్తున్నారు, మద్రాసు."
    "చెప్పలేను విమల్. పేపర్లో చూసుంటావ్ ......హైకమాండ్ నన్ను పార్టీ పబ్లిసిటీ కమిటీకి చైర్మన్ గా ఎపాయింట్ చేసింది. ఎల్లుండు నుంచి వేరే ప్రోగ్రాముంది."
    చెప్పాడాయన."
    "కంగ్రాట్స్ డాడీ."
    "నీ హెల్త్ జాగ్రత్త. ఇక్కడ మొన్న హోటల్లో నీ లేటెస్ట్ ఫిల్మ్ వీడియోలో చూసాను, బాగుంది. గుడ్ ఫర్ ఫార్మెన్స్. (కీపిటప్. అయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్."
    "థాంక్యూ డాడీ మీ హెల్త్ జాగ్రత్త డాడీ. మరీ ఎక్కువ శ్రమ పడకండి."
    శ్రమలోనే అనందం ఉంది బాబు"
    మరేం మాట్లాడలేదు విమల్.
    "ఎనీథింగ్ మోర్."
    "నధింగ్ డాడీ.....ఎవ్వేరిదింగ్ ఓ.కే."
    "ఎస్.......ఎస్........ బట్ ఒన్ థింగ్ ." ఒక్కక్షణం మౌనం తర్వాత ,
    "కృష్ణానందన పరిస్థితి ఎలా వుందో తెల్సిందా." ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు అయన గొంతు గంబీరంగా మారింది.
    ఆ ప్రశ్నకు విమల దగ్గర జవాబు లేదు.
    ఆ ప్రశ్నకు ఒక్కగానొక్క కొడుకు జవాబు చెప్పాడని జయేంద్రదత్ కు తెల్సు.
    "ఓ.కే. విమల్. నీ ప్రాబ్లమ్స్ ని నువ్వే సాల్వ్ చేసుకునే వయస్సు నీ కొచ్చిందని నాకు తెలుసు. ఏదైనా తెగిపోయే వరకూ లాగితే తర్వాత మనకు మిగిలేది శూన్యమే. ఆలోచించు....మనం అనుకుంటాం కానీ అనుకున్నవన్నీ జరగవు. మనం నడుస్తాం. కానీ .....నడిపించేవాడోకడుంటాడు అవునా......అంచేత మనవల్ల ఎవరూ ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు , గుర్తుంచుకో."

 Previous Page Next Page