Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 18

"పోనీ మీ జీవన్ స్నేహితుడు గిరీశం అడ్రసు, ఫోన్ నెంబర్ తెలుసా?"
తెలియదన్నట్లు తలూపింది.
మనోహర్ ట్రంక్ ఎంక్వయిరీ కి పిలిచి, "జీ. ఎస్ గిరీశం హైదరాబాద్ ఫోన్ నంబరు చెప్పగలరా?" అని అడిగి గిరీశం ఫోన్ నంబరు సంపాదించి, అతడికి ఫోన్ చేసి జీవన్ గురించి అడిగాడు.
"జీవన్ ఈరోజు విమానంలో బయలుదేరి భువనేశ్వర్ చేరుకుంటానన్నాడే! అక్కడికి రాలేదా? ఇక్కడ ఉపాహారమైన చేయలేదు" అన్నాడు!
మనోహర్ మౌత్ పీస్ మీద చేయి వేసి అణుని చూసి, "అయనయిక్కడికే బయలుదేరాడట?" అని మళ్ళీ మౌత్ పీస్ లో "దయచేసి మీరు వెంటనే యిక్కడికి రాగలరా!" అన్నాడు.
"ఏం జరిగింది? రాగమాల తప్పిపోయిందా!"
"అవును, మీరు వెంటనే యిక్కడికి వస్తే మాకు సహాయం చేసిన వారౌతారు."
"ఎవరేత్తుకెళ్ళారు? హమేషాయేనా?"
"హమేషాయెవరు?"
తడబడ్డాడు గిరీశం అటునుంచి.
"వెంటనే విమానంలో బయలుదేరి అక్కడికి వొస్తున్నాను" అని ఫోన్ పెట్టేశాడు.
"అటు జీవన్ ఎక్కడున్నాడో తెలియటం లేదు. ఇటూ రాగమాల మాయమైంది. పాప ఫోటో వుంటే యివగలరా?"
ఫామిలి అల్భమ్ తెచ్చి మనోహర్ కొచ్చింది. లివింగ్ రూమ్ లో సైడ్ టేబుల్ మీద తల్లిదండ్రులతో కల్సి వున్న రాగమాలని ఒకసారి చూసి, ఆల్బమ్ తిరగేశాడు మనోహర్.
పాప పుట్టినప్పటి నుంచి, పాకు తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, అడుగులు వేస్తున్నప్పుడు దశల వారిగా తీసిన ఫొటోలన్ని వున్నాయి ఆల్బమ్ లో కాన్వెంట్ లో ప్రైజ్ అందుకుంటున్న రాగమాల ఫోటో తీసుకున్నాడు.
"ఈ ఫోటో కాపీలు రేపటికల్లా వార్తలతో సహా అన్నీ పేపర్లలోను ప్రచురించేలా చూస్తాను. ఆంధ్రప్రదేశ్ లోను, మొత్తం ఇండియాలోనూ వున్న అన్నీ పోలీసు స్టేషన్ లకు మెసేజస్ పంపుతాను. పాంప్లేట్స్ ముద్రించి బస్సుల మీద ట్రైన్స్ మీద అతికించే ఏర్పాట్లు చేస్తాను ప్రస్తుతానికి మనం యింతకంటే చెయ్యగలిగిందేమి లేదు గిరీశం గారు రాగానే నాకు ఫోన్ చెయ్యండి మీ యింటి పరిసరాల్లో మాప్టిలో నా మనుష్యులు తిరుగుతుంటారు భయపడకండి. ఒకవేళ కిడ్నాపర్స్ దగ్గరనుంచి కాల్ ఏదైనా వస్తే నా నంబరుకి ఫోన్ చెయ్యండి." వెళ్ళడానికి లేచాడు మనోహర్. అణు మనసులో ఒక భయంకరమైన ఆలోచన మాటల్లో పెట్టలేనిది మెదడును కుతకుతవుడికిస్తుంది.
మనోహర్ లేచి వెళ్ళబోతుంటే యిహ నిగ్రహించుకోలేకపోయింది.
"ఈ వూళ్ళో హాస్పిటల్స్ అన్నిటిలో ఎంక్వయిరీ జరిపించారా?" ఈ మాటలు మనసు నుంచి బయటికి వచ్చాక దుఃఖాన్ని నిగ్రహించుకోలేక చేతులతో ముఖం కప్పేసుకుంది.
అణు ఇల్లు తీర్ధంలా తయారైంది. ఇంటి నిండా జనం. ఎవరు ఎవరో , ఎవరు ఎందుకొచ్చారో ఎవరు ఎప్పుడూ పోతున్నారో తమకేమి అర్ధం కావటం లేదు. కళ్ళముందు అలుక్కుపోయినట్లుగా అవుతోంది. తన కూతురికి తన సహాయం అవసరం. కూతురికి సహాయపడాలంటే మొదలు తను నిబ్బరంగా వుండాలి. ఈ ఆలోచనే ఆమెను పూర్తిగా చెదిరి పోకుండా కాపాడుతోంది.
"శుభోదయం, "అనుకుంటూ వచ్చాడు గిరీశం చిన్న వి.ఐ.పి. బ్రీఫ్ కేస్ తో మాములు రోజుల్లో అయితే "గుడ్ మార్నింగ్ కి నమస్కారం కాని శుభోదయం కాదు." అని చెప్పి వుండేది అణు.అప్పుడు మాత్రం బ్లాంక్ గా చూసింది. వందన వచ్చి గిరీశాన్ని కూర్చోమని మనోహర్ కి ఫోన్ చేసింది. వెంటనే వచ్చాడు మనోహర్ మోటారు సైకిల్ మీద. గిరీశానికి పొలిసాఫీసర్లని చూస్తే ఎలర్జీ అతడు స్మగ్లర్ కాని గాంగ్ స్టర్ కాని కాడు. కాని బియ్యం పల్లెటుళ్ళ నుంచి సిటీ లో మార్కెట్స్ కి స్మగుల్ద్ చేస్తుంటాడు. లోకల్ పోలీసులకి అతను మముళ్ళు ముట్టజెప్తునే వుంటాడు.
అయినా గిల్టి కాన్షస్ వల్లనేమో కాకీ బట్టలు చూడగానే నెర్వస్ గా ఫీల్ అవుతాడు. మనోహర్ "మా ప్రశ్నలకి మీరు సరైన సమాధానాలు చెప్పాలి అల అయితేనే ఆపదలో చిక్కుకున్న చిన్నారిని కాపాడగలుగుతాము" అన్నాడు.
"చెప్తాను.......చెప్తాను," తడబడుతూ అన్నాడు గిరీశం. రాగమాల తప్పిపోవడం, అందులో తన ప్రమేయం వుండటం, అతనికి బాధగానే వుంది.
మీరు, జీవన్ కలసి రాగని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని గుండాని పంపారా?"
 గొంతు ఒకసారి సకిలించాడు గిరీశం.
"జీవన్, అణువేద గారు విడిపోవటం నాకే మాత్రం నచ్చలేదు. రాగని తిసుకోచ్చేస్తే, ఆమె కోసం అణు వచ్చేస్తుందని ఆశపడ్డాడు జీవన్. ఈ ఆలోచన నాకూ యెంతో నచ్చింది. మా వుళ్ళల్లో నించి పెట్రోల్ భారీ వాహనాల్లో వచ్చే బియ్యాన్ని సరుకు నిలవశాలల్లో దింపటానికి, మా దుకాణానికి పోటిగా చుట్టుపక్కల ఎవరైనా మరొక దుకాణం తెరిస్తే వాళ్ళని బెదిరించడానికి నాకు 'హమేషా' సాయపడేవాడు చెప్పిన పని నమ్మకంగానే చేసేవాడు. అంచేత అతడిని జీవన్ కి సిఫారస్ చేశాను. మరునాడు జీవన్ వచ్చి అతడు చిన్న పిల్లల్ని మానభంగం చేసేవాడని చెప్పేవరకు ఆ విషయం నాకు తెలియదు. పైకి అందరూ పెద్దమనుష్యుల్లాగే కనిపిస్తారు. ఎవరి మనసులో ఏముంటుందో ఎవరు చెప్పగలరు?" మనోహర్ ని చూస్తూ అన్నాడు. మనోహర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి.
"అతడు చైల్డ్ రేపిస్ట్ అని జీవన్ కి ఎలా తెలిసింది?"
"దినపత్రికల్లో ప్రచురింపబడ్డ ఛాయా చిత్రం చూసి తెలుసుకున్నాడు."
"ఆ ఫోటో మీరు పంపిన గుండాదేనా?"
"మీరు మాట సవరించుకోవాలి అతడు గుండా కాదు కనీసం గుండా అని నాకు తెలియదు."
"సరే నేను కొన్ని ఫోటోలు చూపిస్తాను. వాటిలో ఎవరినైనా గుర్తుపట్టగలరేమో చూడండి." ఆల్బమ్ తెరచి వరసగా ఫోటోలు చూపించాడు మనోహర్. ఒక ఫోటో ముసలివాడిది, మరొకఫోటో గెడ్డం సాయబుది, యింకోటి బిచ్చగాడిది, యిలా రకరకాల ఫోటోలున్నాయి. అందులో పాంటు షర్టు తో వున్న ఫోటో చూపించి "ఇతడే మా హమేషా, " అని చెప్పాడు గిరీశం.
మనోహర్ నొసలు చిట్లించి, "మీరంతా చదువుకున్నవాళ్ళు హమేషా, తమాషా లాంటి పిచ్చి పేర్లు చెపితే ఎలా నమ్మారు."
"నమ్మకపోవడానికి ఏముంది? అతడు రోజు మాకు కనబడుతూనే వుంటాడు. చెప్పిన పని జేసి మాట్లాడకుండా డబ్బు తీసుకెళ్తుంటాడు."
"ఒక పసిపిల్లని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని చెప్పబోయే ముందు మంచి చెడ్డలు ఆలోచించక్కరాలేదా?"
 "అనుకోండి కాని యింత మునుగుతుందను కోలేదు."
"మీరెంత తెలివైన వాళ్ళో యిప్పుడే తేలింది. మీరిప్పుడు చూసిన ఫొటోలన్ని ఒక మనిషివే. రకరకాల వేషాలతో ప్రజల్ని మోసం చేస్తుంటాడు. ఇలాంటి స్కొండ్రల్ని చంటి పిల్ల మీదకి ఉసి గొల్పారు మీరిద్దరూ. మీ ఫ్రెండ్ జీవన్ ఎక్కడ?" 

 

 Previous Page Next Page