Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 19

"నిజంగా నాకు తెలియదు"
"ఇక్కడ లేక, ఇంటిదగ్గర లేకా, వర్క్ షాపు లోనూ లేక ఏమైపోయినట్లు?"
"ఒకవేళ జలజ గారింట్లో వున్నాడేమో?"
గతుక్కుమంది అణువేద. అప్పటివరకు ఆ పేరు బలవంతాన మనస్సులోంచి వెనక్కు తోస్తోంది.
సాలోచనగా కనుబొమ్మలు పైకెత్తి, " జలజ గారి ఎడ్రస్, ఫోన్ నెంబరు ఏమైనా తెలుసా?" అడిగాడు.
"ఆ అమ్మాయి మొదట విద్యార్ధుల వసతి గృహంలో వుండేది. అక్కడి నుంచి యాజమాన్యం వెళ్ళగొడ్తె మరో యిద్దరు యువతులతో కలసి వేరే గది తీసుకోని వుంటోంది."
"ఆ అమ్మాయికి వెంటనే బయలుదేరి రమ్మని టెలిగ్రాం యివండి."
"వద్దు.......వద్దు" మనసులో ఆక్రోశించింది అణు పైకేమి అనలేకపోయింది. పరిస్థితులోక్కొక్కటి చెయ్యి దాటి పోతున్నాయి. "మేడమ్! మీరు కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి" చెప్పాడు మనోహర్. తన గదిలోకి వెళ్లి కళ్ళు ముసుకోవడానికి ప్రయత్నించింది అణు. "అమ్మా! నిద్ర రావటం లేదు. కధ చెప్పవా" అని మారాం చేస్తున్న రాగ.
"మమ్మీ! లాలీ....లాలీ పాట రికార్డు పెట్టావా?" అని గారాలు పోతూ అడిగే రాగ. చెవి దగ్గర ప్లాస్టిక్ కొడి పొట్ట నొక్కి కుచుమని శబ్దం చేసి చిలిపిగా తనని భయపెట్టే రాగ, తన పాకెట్ మనిలోంచి కాన్వెంటులో కొనుక్కున్న చాక్లెట్ జాగ్రత్తగా దాచి ప్రేమగా తన నోటి కందిచ్చే రాగ- ఎటు చూసినా - ఏమి ఆలోచించకపోయినా- రాగ. కళ్ళు మూసినా , కళ్ళు తెరిచినా రాగ. ఒక్కగానొక్క కుతుర్ను పోగొట్టుకోవడానికి మించిన బాధ లోకంలో ఏ తల్లికైనా వుంటుందా? కనీసం రాగ ఎక్కడైనా బ్రతికి వుందని తెలిస్తే యెంత బాగుండును.
వందన, "స్లీపింగ్ టాబ్లెట్ కావాలా?" అని అడిగింది. "వొద్దు రాగ విషయం నిర్ధారణగా తెలిసేవరకు నేనిలా వుండగలను" చెప్పింది తన్ని తను కుడదిసుకుంటూ . ఫోన్ మోగింది. వెళ్ళి అందుకుంది ఎవరిదో అపరిచిత కంఠం.
"మీరు అనువేద గారేనా?"
"అవును"
"డాన్సర్ అణువేద గారేనా?"
"అవును"
"మీ అమ్మాయి తప్పిపోయిందటగా!"
"అవును"
"ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఎవరో ఏడేళ్ళ అమ్మాయిని కారు వెనక సీటులో పడుకోబెట్టుకుని తీసుకుపోతూంటే చూశాను. మీ అమ్మయిలాగే అనిపించింది. డ్రైవర్ ఎవరో గూండాలాగే కనపడ్డాడు. ఒకసారి వచ్చి వివరాలు చెప్పమంటారా?"
రాగకి సంబంధించిన యెంత చిన్న విషయమైనా వినటానికి ఆరాటంగా వుంది అణుకి. "రండి" అంది వెంటనే.
వందన తెలివైంది. ఆ అమ్మాయి వెంటనే మనోహర్ కి ఫోన్ చేసింది. కాస్సేపటిలో హిప్పి స్టయిల్ లో వున్న యువకుడు వచ్చాడు. రాగకి సంబంధించిన సమాచారాన్ని తెచ్చాడన్న ఆశతో అతడిని మర్యాదగా ఆహ్వానించింది అణు. అతడు దర్జాగా సోఫాలో కూర్చుని, స్టయిల్ గా క్రాపు సర్దుకుని, "మీక్కలిగిన కష్టానికి చాలా విచారిస్తున్నాను మేడమ్! మీ భర్త ఎవరో నాకు తెలియదు కాని, మిమ్మల్ని వొదిలి ఎలా వుంటున్నారో? నా కాశ్చర్యంగా వుంది ఆరకమైన మేన్షివల్రిస్త్స్ అంటే నాకు తగని అసహ్యం" అంటూ లెక్చర్ కొట్టే ఫోజులో ప్రారంభించాడు. అణు ముఖం చిట్లించి అతడి ధోరణి ఆడుకొని "రాగ గురించి ఏం తెలుసో చెప్పండి?"
"కారు వెనక సీటులో పడుకున్న అమ్మాయిని స్పష్టంగా చూశాను పేపర్లో ఫోటో బట్టి మీ అమ్మాయని గుర్తించాను. నా మోటారు సైకిల్ మీద కారుని చేజ్ చెయ్యడానికి ప్రయత్నించాను. కారు కంటే స్పీడ్ గా మోటారు సైకిల్ నడిపి, "స్టాప్" అని అరిచాను డ్రైవర్ నుద్దేశించి. డ్రైవర్ ఒక చేత్తో కారు నడుపుతూనే మరో చేత్తో జేబులోంచి పిస్టల్ తీసి నా
వైపు గురిపెట్టాడు. ఈ వెధవ దేశంలో గుండాలకి తప్ప మామూలు పౌరులకి పిస్టల్ వుంచుకునే అధికారం లేదు అందుచేత విధిలేక తప్పుకున్నాను. అయినా వాడు ఏడేడు లోకాల్లో ఎక్కడున్నా గుర్తుపడ్తాను" ఉద్రేకంగా అన్నాడు. అప్పటికి మనోహర్ వచ్చాడు. అతడు మఫ్టిలో వుండటం వల్ల హిప్పి యువకుడికి అతడేవరైంది తెలియలేదు. తన ధోరణిలో ఆపకుండా కొనసాగిస్తూనే వున్నాడు.
"ఆ కారు ఎటు వెళ్ళిందో చెప్పగలరా?" ఆరాటంగా అడిగింది అణు.
మనోహర్ కల్పించుకున్నాడు.
"కారు వెనక సీటులో వున్నది రాగమాల అని ఎలా గుర్తుపట్టారు?"
"డైలీలో పడ్డ ఫోటోను బట్టి"
"మీరు మోటారు సైకిల్ మీద వెనకాల వస్తున్నానన్నారు. కారుని చేజ్ చేసానన్నారు. వెనక సీటులో వున్న అమ్మాయి ముఖం స్పష్టంగా మీకెలా కనిపించింది?"
తడబడ్డాడు హిప్పి యువకుడు.
"స్పష్టంగా కనబడలేదు ఏడేళ్ళ పాప అనిపించింది. అనుమాన పడ్డాను."
"పట్టపగలు నడిరోడ్డు మీద డ్రైవర్ నీ వైపు పిస్టల్ చూపిస్తే నువు అరచి గోల చెయ్యలేదా? అ రోడ్డు మీద మనుష్యులెవరు లేరా?"
నీళ్ళు నములుతూ "అక్కడ....అప్పుడు......ఎవరూలేరు" అన్నాడతడు.
"పోనీ కారు నెంబర్ నోట్ చేశారా?"
"లేదు"
"మోటారు సైకిల్ మీద కారుని చేజ్ చేసిన మహానుభావులు నంబర్ నోట్ చెయ్యలేదా? ఏయ్ మిస్టర్! కధలు కట్టి పెట్టి నువెవరో ఎందుకొచ్చావో చెప్పు"
"మీరెవరు?"
"సి.ఐ.డి ఇన్ స్పెక్టర్ మనోహర్"
గొంతు పోడారి పోయిందా యువకుడికి.
"సారి సర్! ఈవిడ ప్రఖ్యాత నర్తకి. నేనివిడ ఫ్యాన్ ని ఎన్ని సార్లో పర్సనల్ గా కలుసుకుని మాట్లాడ్డానికి ప్రయత్నించాను వీలు పడలేదు. అందుకని ఈ ఉపాయం ఆలోచించాను."
"గేట్ అవుట్"
తలదించుకుని ఒక్క పరుగున బయటపడ్డాడు హిప్పి యువకుడు.
సోఫాలో కులబదిపోయింది అణువేద.
"మేడమ్! మీరు మీ కూతురి కోసం యెంత ఆరాటపడుతున్నారో అర్ధం చేసుకోగలను. కానీ ప్రతి వోక్కరిని ఆహ్వానించకండి. వయసులో వున్నారు అందంగా వున్నారు. వొంటరిగా వున్నారు. ఇబ్బందులు తెచ్చి పెట్టుకున్న వారౌతారు."

 Previous Page Next Page