Previous Page Next Page 
మోహిత పేజి 18


    "నువ్విప్పుడు, మరేం ఆలోచించకుండా, నందిగామ వెళ్లిపో. రేపు సాయంత్రం నాకు ఫోన్ చెయ్యి. బస్సులో వెళతావా? ట్రైన్ లో వెళతావా?" అడిగాడు భండారీ.

 

    "బస్టాండ్ కు పద!" నీరసంగా అన్నాడు వెంకటయ్య. స్కూటర్ స్టార్ట్ చేశాడు భండారీ. ఆ స్కూటర్ సిటీలోని ఆర్టీసి కాంప్లెక్స్ వేపు దూసుకుపోయింది.

 

    అప్పుడు సమయం సాయంత్రం అయిదూ, నలభై అయిదు నిమిషాలైంది.

 

                                          *    *    *

 

    సాయంత్రం ఆరూ ఇరవై నిమిషాలు......

 

    అకస్మాత్తుగా ఆకాశంలో మబ్బులు అలుముకున్నాయి. సన్నగా  నీటితుంపర ప్రారంభమైంది. కంఠీరవ స్టూడియో....

 

    ఎక్స్ టెన్షన్ ఏరియాలో, కొత్తగా కట్టిన భవనాలు, అక్కడక్కడ విసిరేసినట్టుగా వున్నాయి.

 

    బూడిద రంగు బిల్డింగ్ ముందు ఆటో ఆగింది.

 

    "దిగు పాపా...... దిగు..... దొరగారుండే బంగ్లా ఇదే....." ఆటో దిగుతూ అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

 

    ఇందు ఆటో దిగి, గణేష్ వెంట రాగా, లోనికి నడిచింది.

 

    అంతకుముందే లోనికి పరుగెత్తాడు హెడ్ కానిస్టేబుల్.

 

    విశాలమైన డ్రాయింగ్ రూమ్ దాటాక కుడివేపు మేడమీదకు మెట్లు. ఎడమవేపుకు బెడ్ రూమ్, ఆ పక్కన కిచెన్ రూమ్.

 

    మేడమీద కెళ్ళిన హెడ్ కానిస్టేబుల్, కార్నర్ రూమ్ వేపు నడిచాడు.

 

    ఆ కార్నర్ రూమ్ లో......

 

    ఒకవేపు డబుల్ కాట్, దానికెదురుగా సోఫా, చుట్టూ రంగురంగుల ప్లాస్టిక్ ఛైర్స్ , మధ్యలో పాస్టిక్ టీపాయ్.

 

    సోఫా మీద ఒక పక్కన ఠీవిగా కూర్చున్నాడు రాజేంద్రకుమార్. రెండోవేపు చివర ఫారెస్ట్ దీన్రాజు కూర్చున్నాడు.

 

    వాళ్ళిద్దరికీ ఎదురుగా డబుల్ కాట్ బెడ్ మీద గళ్ళలుంగీ, ఆ పైన  బ్లూ కలర్  స్పోర్ట్స్ బనీస్ తో సి.ఐ. కూర్చున్నాడు.

 

    ప్లాస్టిక్ టీపాయ్ మీద ఫీరెన్ విస్కీ సగం ఖాళీ అయిన పుల బాటిల్ గ్లాసులూ వున్నాయి.

 

    ప్లేట్లలో రకరకాల నాన్ వెజ్ డిషెస్ వున్నాయి.

 

    మనం పదేళ్ళనుంచి ఫ్రెండ్స్. నీ పవర్ నాకు తెల్సు. నా ప్రిస్టేజ్ నీకు తెల్సు. అసలు నాకర్థంకాని విషయం ఒకటుంది. అదేంటంటే ఆ మైత్రేయగాడు నా ఫ్లాట్ లోనే రెడ్ హేండెడ్ గా నీకు దొరికిపోయాడు. అవునా....... పోలీస్ స్టేషన్లో పెట్టావు అవునా..... ఆడు తప్పించుకుని పారిపోయాడంటున్నావ్. మరి ఆడిగురించి పోలీసులు ఏమీ వెతుకుతున్నట్టుగా నాకేమీ అన్పించడంలా..... నువ్వు నాకు చెప్పడంలేదుగానీ ఇక్కడే ఏదో పోలీస్ మిస్టరీ వుందని, నాకు తెలిసిపోతోంది. ఆ రవీంద్రనాథ్ ని ఎవరు మర్డర్ చేశారో నీకు తెల్సు. ఆ మర్డర్  ఆ మైత్రేయగాడు చేశాడా? లేక మోహిత చేసిందా? ఆ మైత్రేయగాడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? మోహితకు, వాడికి వున్న లింకేమిటి? ఆ మైత్రేయగాడికి బ్యాక్ గ్రౌండ్ లో  పొలిటికల్ కనెక్షన్స్ ఏమయినా వున్నాయా? ఇది నా బిజినెస్ కి సంబంధించిన విషయం. పర్సనల్ విషయమని కూడా నీకు తెల్సు. ఎంత కావాలో తీసుకో. ఆ ఇన్ఫర్మేషన్ నాక్కావాలి" సూటిగా సి.ఐ. కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు రాజేంద్రకుమార్.

 

    అతని మాటలన్నీ విన్నాక చిన్నగా నవ్వాడు సి.ఐ.

 

    ఆ నవ్వు వెనక మోహితనై సి.ఐ. కి వ్యామోహం, ఆకర్షణ వున్నాయనే విషయం రాజేంద్రకుమార్ కు తెలీదు. అయిదు నెలలక్రితం మొహితకు రాజేంద్రకుమార్ తో చూసినప్పుడే ఆమె ఆకర్షణలో సి.ఐ. పడిపోయాడని, ఎప్పటికయినా ఆమెను అనుభవించాలనే కోరికతోనే ఆమెకు అన్నివిధాలుగా సహాయం చేస్తున్నాడనే విషయం రాజేంద్రకుమార్ కి ఎప్పటికీ  అర్థంకాదు.

 

    టీపాయ్  మీదున్న గ్లాసుని తీసుకకుని, డ్రింక్ సిప్ చేసి "చూడండి గురూగారూ! మనం మనం  ఒకటని, మనకు తెలుసు. మా డిపార్ట్ మెంట్ లోనూ తెలుసు. మీ దగ్గర న్నెఉ దాయడం లేదు. ఆ మర్డర్ లో మోహిత ప్రమేయం వుందా, ఆ మైత్రేయ ప్రమేయం వుందా అనేది నాకింకా తెలీదు. ఎందుకంటే ఆ మర్డర్ కు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్  బెంగుళూరు నుంచి రావాల్సి వుంది. అలాగే ఆ మోహితకి మైత్రేయకి వున్న రిలేషన్ నాకు తెలీదు. ఏ మాత్రం క్లూ దొరికినా, నేను మీకు హెల్ప్ చెయ్యనా? నేను మీ వాణ్నండీ బాబూ..... నన్ను నమ్మండీ."

 

    రాజేంద్రకుమార్ ఎందుకో సి.ఐ. మాటల్ని నమ్మలేకపోతున్నాడు. అతని ఆలోచనలు ఎక్స్రే కన్నా నిశితమయినవి.


    
    ఎప్పుడైతే మోహితకు తన విషయం తెలిసిపోయిందో ఆమెకివ్వాలనుకున్న ప్లాట్, డబ్బు ఎప్పుడిచ్చేశాడో అప్పటినుంచి ఎడముఖం, పెడముఖంగా వుంటున్న మోహిత చర్యల్ని తను గమనించకపోలేదు.

 

    మధ్యలో రెండుమూడుసార్లు మోహిత, సర్కిల్ ఇన్స్ పెక్టర్ ని కల్సిన విషయం తన దృష్టికి వచ్చినా, పెద్దగా  పట్టించుకోలేదు రాజేంద్రకుమార్.

 

    ఇప్పుడాలోచిస్తుంటే ఏదో బలమయిన అనుమానం అతన్ని వేధిస్తోంది.

 

    సరిగ్గా అదే సమయంలో లోనికొచ్చి సెల్యూట్ చేసిన హెడ్ కానిస్టేబుల్ వేపు చిరాగ్గా చూసి, అంతలోనే అతనికి అప్పగించిన పని గుర్తుకొచ్చి ముఖంమీద చిరునవ్వును పలుముకుని-

 

    "జస్టే మినిట్..... రావుగారూ!" అని చెప్పి రూమ్ లోంచి బయటకొచ్చి "తీసుకొచ్చావా" అనిఒ ఆత్రంగా అడిగాడు సి.ఐ.

 

    "మరి మీరు గెస్టుల్తో ముచ్చట్లాడుతుంటే పని అయినట్టే. పసిపిల్ల..... దార్లోకి తెచ్చుకోటానికే గంట పడుద్ది"  నొక్కిచెప్పాడు హెడ్ కానిస్టేబుల్.

 

    "ఏదీ, ఎక్కడా?" ముందుకొస్తూ తలకెక్కుతున్న మత్తుతో అడిగాడు సి.ఐ.

 

    "మేడమీంచి ఒంగొని తొంగిచూస్తే హాల్లో కూచున్న అప్సరస కనబడుద్ది" అని నవ్వుతూ కిందకు చూడమన్నట్టుగా సంజ్ఞ చేశాడు హెడ్ కానిస్టేబుల్.

 

    అతను చూపించిన దిక్కువేపు చూసి ఒకింత నిశ్చేష్టుడైపోయి-

 

    "ఒరే హెడ్డూ! ఇది పిల్ల కాదురా..... పింగాణీ బొమ్మరా! దీంతో  రాత్రంతా ఆడుకోవాలనుందిరా" అని అనేసి గబగబా రూమ్ లోకొచ్చి రాజేంద్రకుమార్ వేపు చూశాడు అసహనంగా.

 

    అతను లోనికి రాగానే తను బయటకు వెళ్ళిపోడానికి అప్పటికే సిద్ధమయి పోయాడు రాజేంద్రకుమార్.

 

    "అయితే వస్తాను...... అర్జంటు పనుంది. వీలుచేసుకుని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి రా..... కాసేపు కాలక్షేపం చేద్దాం" అంటూ లేచి ఆ రూమ్ లోంచి బయటికొచ్చి టకటకా మెట్లు దిగుతూ, డ్రాయింగ్ హాల్లో కూర్చున్న ఇందువేపు, గణేష్ వేపు ఒకసారి తలెత్తి చూసి సీరియస్ గా బయటికెళ్ళిపోయి జీపెక్కాడు. అతన్ని అనుసరించాడు ఫారెస్ట్ ఆఫీసర్ దీన్రాజు.

 

                                         *    *    *


    
    బెడ్ మీద కాళ్ళూపుకుంటూ సిగరెట్ కాలుస్తూ గణేష్ చెప్పిందంతా విన్నాక-

 

    "మా హెడ్డుకి నువ్వు కావాల్సినవాడివైతే నాక్కూడా కావల్సినవాడివే..... మీరిద్దరూ కాసేపు కింద రూమ్ లో కూర్చోండి. ఈ పిల్లతో నేను మాట్లాడతాను" అంటూ హెడ్ వేపు చూశాడు సి.ఐ.

 

    టేబిల్ మీదున్న స్కాచ్ బాటిల్ని చేత్తో  పట్టుకుని రూమ్ లోంచి బైటకొచ్చి హాల్లో వున్న బెడ్ రూమ్ వేపు నడిచాడు హెడ్ కానిస్టేబుల్.

 

    అతన్ని అనుసరించాడు గణేష్.

 

                                             *    *    *

 

`    ఇంద్రకన్యకు చంద్రలేపనం పూసినట్టుగా ట్యూబ్ లైట్ వెలుగులో జిగేల్ జిగేల్మని మెరిసిపోతున్న ఇందువేపు కళ్ళార్పకుండా చూస్తూ వుండిపోయి కాసేపయ్యాక తేరుకుని-

 

    "ఇందూ! నీకు సోడా కలపడం వచ్చా...." అంటూ తను స్కాచ్ ని గ్లాసులో పోసుకున్నాడు సి.ఐ.

 

    "రాదండీ" చెప్పింది ఇందు వినయంగా.

 

    అప్పుడే గోడ గడియారం ఏడుగంటలు కొట్టింది. తనే డ్రింక్ లో సోడా కలుపుకుని గడగడా తాగేసి, గ్లాసు టీపాయ్ మీద పెట్టి-

 

    "మీ బావని నువ్వు చిన్నప్పటినుండీ ప్రేమిస్తున్నావ్. అతన్ని తప్ప నువ్వు ఇంకెవర్నీ పెళ్ళి చేసుకోవు. అందుకే ఇంట్లోంచి వచ్చేశావు..... కానీ మీ బావ పరారీలో వున్నాడే...... ఎలాగ?" త్రిబుల్ ఫైవ్ సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు సి.ఐ.

 

    "మా బావ మైత్రేయ ఎక్కడున్నాడో మీకు తెలుసు. మీరు నాకు హెల్ప్  చెయ్యాలి" నెమ్మదిగా ఒక్కొక్క ముక్కా అంది ఇందు.

 

    "నాకు హెల్ప్ చెయ్యాలనే వుంది..... కానీ.... మీవాడు..... అదే మీ బావ ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడే" నువ్వుతూ అన్నాడు సి.ఐ. అలా నవ్వడం ఎందుకో ఇందుకు నచ్చలేదు.

 

    "చికెన్..... ఫిష్... ఫ్రాన్స్.... అన్నీ  ఎదురుగా వుంచుకుని ఏమీ తీసుకోవడం లేదేం..... తీసుకో" మరో పెగ్గును తాగుతూ అన్నాడు సి.ఐ.

 

    "బైట తినడం నాకలవాటు లేదండీ!"

 

    "బైట తినడం అలవాటు లేదా? ఇంట్లో తిండే ఇష్టమన్నమాట. భలే..... భలే..... పెళ్లికాక మునుపు నాకు కనబడి వుంటే నిన్ను పెళ్ళాడేద్దును. నీలాంటి టేస్టున్న ఆడదంటే నాకిష్టం. పోనీ కూల్ డ్రింక్ తాగుతావా?" అని అడిగాడు.

 

    తలూపింది ఇందు.

 

    "గుడ్!" అంటూ లేచి, ఫ్రిజ్ వేపు నడిచి, డోర్ తెరచి అందులోంచి పెప్సీ బాటిల్ తీసి, కూల డ్రింక్ ను గ్లాసులో వేసి, కొంచెం కలిపి ఇందు చేతికి అందించాడు.

 

    "డోన్ట్ వర్రీ! మీ బావనీ, నిన్నూ కలుపుతాలే......." అని బెడ్ మీదనుంచి లేచి, సోఫామీద ఆమె పక్కకొచ్చి కూర్చున్నాడు సి.ఐ.

 

    కూల్ డ్రింక్ నెమ్మదిగా తాగుతోంది ఇందు.

 

                                            *    *    *

 

    అరగంటలో ఆఫ్ స్కాచ్ బాటిల్ పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుల్, గణేష్ ఇద్దరూ నిషా తలకెక్కిన హమేషాలో వున్నారు.

 

    "ఒరే గణేషూ! మరో  పావుగంటలో మనకు ఒక కన్నెపిల్ల కేకలు వినిపిస్తాయ్. అంటే శోభనం జరిగిపోద్ది. శోభనం నాటి కన్నెపిల్ల అరుపు ఎంత మజాగా వుంటాదిరా...... ఇయ్యాళ నీకూ శోభనమే. నాకూ శోభనమే.... మా గురువుకీ శోభనమే.... మూడు శోభనాల ముచ్చటయిన రాత్రి" ఉబ్బితబ్బిబ్బవుతూ అలలు అలలుగా నవ్వుతున్నాడు హెడ్ కానిస్టేబుల్.

 

    మందుగ్లాసుని గబుక్కున అందుకుని తాగేసి-

 

    "తప్పురా.... ఆ ఆడకూతురికి న్యాయం సేయండ్రా.... రేపు మా మాహాలక్ష్మి  నన్ను చంపేస్తుందిరా.... పసిపిల్లరా..... తాగుడుకోసం నీ మాట  ఇన్నాను కానీ...... ఒరేయ్ పదరా. మేడమీద కెళదాం పదరా...." అంటూ తాగుడు నిషా, ఇటు మనసులోనిమంచికి మధ్య ఊగిసలాడుతున్నాడు గణేష్.

 

    "మళ్ళీ మొదటికి రాకురా.... తాగు..... తాగు బాగా తాగు. ఇక్కస నువ్వూ నేనే వున్నాం. ఆ పిల్లగురించి మర్చిపో.... ఇయ్యాల్టి నుండి ఆ పిల్ల నీదికాదు..... మన ప్రజలందరిదీనూ..... ఇదిగో! నీకు డబ్బు కావాలా? డబ్బు....." అంటూ జేబులోంచి అయిదువందల రూపాయల తీసి గణేష్ చేతిలో పెట్టాడు హెడ్ కానిస్టేబుల్.

 

    "మేడమీద కెళ్ళొద్దంటారా?" అయిదు పచ్చనోట్లవేపు, రెప్పలు మూసుకుపోతున్న కళ్ళతో అడిగాడు గణేష్.

 

    "మేడమీద కెళతావా? గురుడు గుండెట్టి పేల్చేస్తాడు. ఇలాంటి టైంలో మనదృష్టి మందుమీదే తప్ప మంచంమీద వుండకూడదురా వెర్రినాగన్నా" అంటూ చేతికి మందుగ్లాసు అందించాడు హెడ్ కానిస్టేబుల్.

 

                                            *    *    *


    
    కూల్ డ్రింక్ తాగేడిన ఇందు వంటిమీదకు మత్తు కొండచిలువలా ప్రాకుతోంది.

 

    బైట చినుకులు, దట్టమయిన వర్షంగా మారింది.

 Previous Page Next Page