మనుమానంగా బయటకు వెళ్ళి చూశాడు.
ఎవరూ కనిపించలేదు కానీ....కొద్ది దూరంలో వున్న గెస్ట్ హౌస్ చుట్టూ వున్న చెట్లన్ని పూనకం వచ్చినట్టు గాలికి వూగడం చూసిన అబ్బులు ఆశ్చర్యపోయాడు.
ఎక్కడా మనుషుల అలికిడి వినిపించకపోవడంతో తను భ్రమపడి వుంటాననే విషయం అతనికి అర్ధమయింది.
తనపిచ్చి కాకపోతే ఈ సమయంలో తనకోసం ఎవరువస్తారు?
అది తన ఇంట్లోకి వచ్చి పిలిచేవాళ్ళు ఎవరూ వుండదు. ఒకవేళా రావడంమంటూ జరిగితే రమేష్ బాబుగాని....ఆయన మిత్రులుకాని రావాలి. వాళ్ళు వచ్చినా యిలా తన ఇంట్లోకివచ్చి పిలవరు.
బయట కారులోనే వుండి హరన్ మ్రోగించి పెద్దగా కేకపెడతారు.
వంటఇంటి కిటికీ నుంచి బయట వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది.
గాలికి చెట్లు విపరీతంగా విఇగుతున్నాయి.
ఇప్పుడో....ఇంకా సేపట్లోనో వర్షం వచ్చేలావున్నది.
బహుశా ఆ గాలి చప్పదుకు తనను ఎవరో పిలిచారని భావించి వుంటాడు తను.
వండిన పదార్ధాలన్నీ డిష్ లోకి సర్ది మూతలు పెడుతూ, క్షణక్షణానికి మారిపోతున్న వాతావరణాన్ని దిగులుగా చూశాడు అబ్బులు.
ఒకవేళ వర్షం వస్తే రమేష్ బాబు రాడేమో!
వాళ్ళు రాకపోతే బాధేమిలేదు కానీ, వండిన పదార్ధాలు వేస్త అయిపోతాయేమోననే బాధతోపాటు తను పెట్టుబడిపెట్టిన డబ్బు గిట్టుబాటు కాదేమోననే బాధ అతనిది.
వాళ్ళోస్తె అయిన ఖర్చుకన్నా రెట్టింపు గుంజవచ్చు. డబ్బంటే లెక్కచేయని మనస్తత్వం కావడంవలన వాళ్ళు.....తను ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారు.
అలా వచ్చే ఆదాయం పోతుందేమోననే దిగులు ఆవరించుకుందతడ్ని.
వర్షమే కాదు వరదలేవచ్చినా, తుఫాతులేవచ్చినా వాళ్ళు రాకుండా వుండరని....ప్తేపెచ్చు ఇఅలంట్టి సమయంలో ఎంజాయ్ చేయడానికి తప్పు కుండా వాళ్ళు వచ్చితిరతారన్న వాస్తవాన్ని గుర్తింఛలేకపోతున్నాడతను.
ఉన్నట్టుండి కరెంట్ పోయింది.
'చత్....దినవ్వ....పాడు కరెంట్ కూడా ఇప్పడే పోవాలా?' విసుక్కుంటూ తాల్చ ల్తెట్ వున్న అలమరవ్తెపు చీకట్లో తాడుముకుంటూ వెళ్ళాడతను.
అప్పడే యధాలాపంగా తెరిచివున్న కిటికీలోనుంచి బయటకు చూసిన అబ్బులు ఉలిక్కిపడ్డాడు.
ఎవరో టార్చ్ ల్తెట్ వేసుకుని గెస్ట్ హౌస్ వ్తెపు వెళుతున్నారు.
ఆ దృశ్యం చూడడంతో .....ఆశ్చర్యం, అనుమానం రెండూ కలిగాయతనికి.
టార్చ్ ల్తెట్ తీసుకుని గబగబ బయటకు నడిచాడు అబ్బులు.
తనకు తెలియకుండా ఎవరో గెస్ట్ హౌస్ లోకి వెళుతూన్నారు. టార్చ్ ల్తెట్ వెలుతుర్లో లోపలకు ప్రవేశించే పయత్నం చేస్తుంటే - ఇంతకు ముందు తనను ఎవరో రెండుసార్లు పిలిచినట్టు వినిపించడం తన భ్రమ కాదు.
తను ఏం చేస్తున్నాడో వచ్చి చూసి వెళ్ళడం జరిగింది.
అసలు ఎవరతను?
ఎండుకోచ్చాడో?
గెస్ట్ హౌస్ లో ఏం దొరుకుతాయని వచ్చాడో?
టార్చ్ ల్తెట్ తెచ్చుకోవడం చూస్తుంటే, కావాలని అతనే కరెంట్ తీసేసివుండవచ్చు ననిపించిందతనికి. లేకపోతే టార్చ్ ల్తెట్ ఎందుకు తెచ్చువెలుతురు కనిపించింది.
తను లోపలనించి బయటకు వచ్చేలోపే మహా అయితే అతను నాలుగు అడుగులు వేసివుండలి.కానీ, ఇప్పుడు ఆ వెలుతురు గెస్ట్ హౌస్ లో వుండవలసింది పోయి, తోటలో, కనిపిస్తుంది.
గెస్ట్ హౌస్ నుంచి అంత దూరంలో వున్న తోటలోకి ఇంత తక్కువ సమయంలో ఎలా వెళ్ళగలిగాడు.
అసలు ఎలా సాధ్యం?
ఆలోచిస్తూనే తోటవ్తెపు నడిచాడు అబ్బులు.
ముందుకు నడుస్తున్న వ్యక్తి మెల్లగా అడుగులు వేస్తున్నాడో లేక, కావాలని ఆగిపోయదో అదిగాకపోతే తను అబ్బులు అనుసరిస్తున్నాడన్నా విషయం తెలియదోకాని.....అతని టార్చ్ ల్తెట్ వెలుతురు ఒక్కచోటే స్ధిరంగా వుండిపోయింది.
నాలుగే నాలుగు అడుగులు వేస్తే అతనిని అందుకోవచ్చు.
కానీ ,అతను షడన్ గా ఒక చెట్టుచాటుకు చేరుకున్నాడు. దాంతో వేలుతురయితే కనిపిస్తుంది తప్పు మనిషి కనపడడంలేదు.
ఇంతరాత్రివేళ తోటలోకి వచ్చి అతను ఏం చేస్తున్నాడో అర్ధంగాక మరొక రెండు అడుగులు వేశాడు అబ్బులు.
అప్పడే చటుక్కున ఆ వెలుతురు ఆరిపోయింది.
తన చేతిలోని ల్తెట్ ని ఆ చెట్టు వ్తెపు పోకస్ చేశాడు అబ్బులు.
అంతే....
ఆ మరుక్షణంలోనే, ఆ వెలుతురులో కనిపించిణ ఆకారాన్ని చూసి గావు కేక పెట్టాడు.
తెల్లని చీర....
ముఖంనిండా నల్లని కాటుక పూసినట్టు కారునలుపు.
జుట్టు వీరబోసుకుని, పొసవ్తెన చేతులు చాచి, తెల్లని పళ్ళతో భయంకరంగా నవ్వుతున్నది ఆ ఆకారం.
ఆ నవ్వు చూడగానే అబ్బులు వెన్ను జలదరించింది.
'బాబోయ్....దయ్యం' అనుకుంటూ రెండు అడుగులు వేశాడతను.