Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 16


    "ఎవర్రా కన్నా....ఆ మాయలాడి  ఎవరు? నిన్ను ఏం మయచేసిందో?"

    "అదేంటమ్మా అలా అంటావు? మనింట్లో కొత్తగా చేరిన పనిపిల్ల ఊర్వశి గురించే నేను  చెప్పేది."

    ముకుందరావు భార్య ముఖంవ్తెపు తెల్లబోతూ చూశాడు.

    "ఇన్స్ పెక్టర్ అనిల్ చెప్పే పనిపిల్ల ఎవరూ మా ఇంట్లో లేదు. ప్తె పెచ్చు కొత్తగా చేరిందంటున్నాడు. ఎవరిని మేము పనిలో పెట్టుకోక పోతే ఇంకా కొత్తగా ఎక్కడనుంచి  వచ్చిందో నాకు అర్ధంకావడంలేదు" అనిల్ కు ఇంకా  స్వస్ద్హత చేకూరలేదేమోననే బాధతో అతని గొంతులో  వేదనా విచికలో తొంగి చూశాయి.

    "అదేమో నాకు తెలియదు  కానీ ఇన్స్ పెక్టర్ ! ఎవరో  అమ్మాయి  కొత్తగా పనిలో చేరానని చెప్పి నా గదిలోకి వచ్చింది. తీరా దగ్గరకు వచ్చాక ఆమె ముఖం పరిశీలనగా చూస్తే నీలిమ....తరువాత ఏమయిందో నాకు తెలిదు. భయంతో నా కళ్ళు తిరిగిపోవడం వరకే చెప్పదలుచుకున్నది ఇంకేమి లేదన్నట్టు  గడగడా చెప్పాడు అనిల్.

    "నీలిమ అంటే మీ లెక్చరర్ నిలిమే కదూ?"

    "అవును."

    "అయితే ఆమెని చూసి  దడుసుకోవడం ఎందుకు?"

    ఏం చెప్పాలో అర్ధంగాక  అనిల్ బిక్కముఖం వేశాడు.

    "దెయ్యం లా  అనిపించింది. అందుకే భయం వేసింది" ఏదో  ఒకటి చెప్పక తప్పదనిపించి ఖంగారుగా అన్నాడతను.

    "ఎస్! ఐ  గాటిట్ ....ఇప్పుడు  చెప్పావు  సరయిన  సమాధానం మాకు మీ లెక్చరర్ నీలిమ కనిపించడం లేదని  రిపోర్ట్  వచ్చింది. నువ్వేమో  ఆమెని చూసి దెయ్యం అనుకుంటున్నావు. చనిపోయిన వాళ్ళు  మాత్రమే దెయ్యం అవుతారంటరు కదా..... అంటే నీలిమ చనిపోయిందని  నీకు ఖచ్చితంగా  తెలిస్తేనే కడ ఆమె దెయ్యం  అయివుంటుందని  నువ్వు భయపడవలసింది?"

    ధీరజ లేవానెత్తిన పాయింట్ కు అనిల్ గొంతులో పచ్చివెలక్కాయ  అడ్డుపడినట్టయింది.

    "ఏమో ఇన్స్ పెక్టర్! అప్పుడు ఆమె నాకు  దెయ్యంలా అనిపించిందంతే!"

    "అదే....ఎందుకలా అనిపించేందనే అడుగుతున్నాను" రెట్టించిందామే.

    "అంతకుముందు మా ప్రెండ్స్ కు కూడా  నీలిమ దెయ్యమ్తె కనిపించింది. అందుకే  నేనూ అలా అనుకున్నాను."

    మరో అనుమానం వచ్చింది దిరజకు.

    "మీ ప్రెండ్స్ కు కనిపించిన విషయం నీకెలా తెలుసు?"

    "వాళ్ళే చెప్పారు."

    "అంటే -వాళ్ళకు నీలిమ దెయ్యంలా కనిపించిందన్న మాట" ధీరజ సందిగ్ధంగా ప్రశ్నించింది.

    "ఎస్....వాళ్ళు కూడా నీలిమ దెయ్యాన్ని చూసి దడుసుకున్నారు."

    "ని స్నేహితుల పేర్లు ఏమిటి?"

    అనిల్ చెప్పాడు అనుమానంగానే.


    "ముకుందరావుగారు.....మీరిచ్చిన వాల్యుబుల్ ఇన్పర్మేషన్  మా దర్యాప్తుకు ఎంతగానో సహకరిస్తుందని భావిస్తున్నాను. ఎనిహౌ.....ఐయం వెరి ధాంక్ పుల్ ఫర్ యువర్ కో ఆపరేషన్ ."


    ఇన్స్ పెక్టర్ ధీరజ ఎక్కినా పోలిస్ జిఫ్ ముందుకు కదిలింది.


                    *    *    *    *   


    రాత్రి  తొమ్మిది గంటలు....

    ఔట్  హౌస్ లో వుంటున్న వాచ్ మాన్ అబ్బులు కూనిరాగాలు తీస్తూ వంట చేస్తున్నాడు.


    వాస్తవానికి ఆ గెస్ట్ హౌస్  మాజీ మంత్రి గారిదే అయినప్పటికీ ఎక్కవగా  వుపయోగించేది  ఆయన ఎక్తెక పుత్రరత్నం రమేష్ మాత్రమే!

    ఎన్ని తరాలు  తిన్న తారాగణంత ఆస్ధి వుండటం వలన ఎప్పడూ రాజకియలంటూ  ఇంటిపట్టున వుంది  కొడుకును గురించి పట్టించుకొకపోవడం వల్లన్తేతేనేమి రమేష్ లేని  అలవాటంటూ లేకుండా అన్ని అబ్బాయి.

    బెల్లం  చుట్టూ ఈగల్లా రమేష్ పంచన మిత్రబృందం చాలామంది చేరారు.

    తాగుడు, పేకాటలతో పాటు అమాయిల పిచ్చి  కూడా అతనికి ఎక్కవయింది. ఎప్పడూ  స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేయడానికి ఆ గెస్ట్ హేస్ నే కేంద్రంగా  చేసుకున్నాడు.


    తన బిజీలో తను వుండటం  వలన  కొడుకు నిర్వాకం తెలిసినా, ఆ తండ్రి మౌనం వహించాడే తప్పు అది తప్పని మందలించలేదు.

    రమేష్ కు స్నేహబృందం ఎంతమంది వున్నా అనిల్, వెంకట్ లు మాత్రం ప్రాణస్నేహితులు కాగలిగారు. ఎక్కడకు వెళ్ళినా, ఏం చేసినా ముగ్గురూ త్రిమూర్తుల్లా కలిసి  చేయడం అలావాటు చేసుకున్నారు.

    ఆ ముగ్గురు గంటక్రితం ఒకరు తరువాత  ఒకరు  ఫోన్ చేసి.... రాత్రి పడి గంటలకు తాము  గెస్ట్ హౌస్ లో పార్టి చేసుకోబోతున్న విషయాన్నీ అబ్బులుకి చెప్పారు.


    "పార్టి అంటే మందు....మంసం  వంటకాలతోపాటు మగువపోందుకూడా వాళ్ళకి  కావాలని అబ్బులుకు తెలుసు.

    అందుకే, ఘుమఘుమలాడే  వంటకాలను తాయారుచేయడంలో మునిగివున్నాడు అబ్బులు వంట పూర్తఅవ్వగానే హాట్  డ్రింక్స్ కొనుక్కు రావాలి. ఈ లోపు మదనకామరాజులు ముగ్గురు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చాక అమ్మాయిలకోసం వేట ప్రారంభించాలి.

    తను చేయవలసిన పనులన్నింటిని మననం చేసుకుంటున్న అబ్బులు  చెవులకు తనను ఎవరో చిలిచినట్లు అనిపించడంతో బయటకు తొంగి చూశాడు.

    అక్కడ ఎవ్వరూ లేరు....
   
    తలతిప్పిన మరుక్షణంలోనే మళ్ళి తనను ఎవరో పిలిచినట్టు భావన. 

 Previous Page Next Page