'హి...హి....హి....హి....' అంటూ అతని వ్తెపు కదిలింది ఆ ఆకారం.
చుట్టూ చిక్కని చీకటి....
ఆ చీకటిని చిల్చుతూ టార్చ్ ల్తెట్ వెలుతురు!
ఆ వెలుతుర్లో దారిచూసుకుంటూ పరుగు పెడుతున్నాడు అబ్బులు.
అతని వెనుకనే భయంగొలిపే ఆకారం....
ఆ ఆకారాన్ని స్పష్టంగా పోల్చుకోగాలిగిన అబ్బులు గజగజా వణికి పోతున్నాడు.
ఆ దెయ్యం ఎవరోకాదు.....
లెక్చరర్ నీలిమ.....
అంటే, దెయ్యమ్తెన నీలిమ తనకోసం వచ్చిందా? ఏమో.....
ఆ మాట తలచుకోవడంతో అతని ప్తెప్రాణాలు ప్తేనే పోయినట్టయ్యాయి. తను ఎటు వెళుతున్నాడో.....ముందు ఏమున్నదో చూసుకోకుండానే కంటికి కనిపించిన దిశగా పరుగుధీస్తున్నాడు అబ్బులు.
ఆ సమయంలో అతను అనుకునేదొక్కటే!
ఎలాగయినా నీలిమ దయ్యంనించి తప్పించుకోవాలి.... ఆమెకు అందనంత దూరంగా పారిపోవాలి.
ఆ ఆశతోనే పరుగు పెడుతున్నాడు.
ఎదురుగా ప్రవారిగోడ కనిపించడంతో బిక్కచచ్చిపోతూ ఒక్క క్షణం ఆగి వేనుదిరిగి చూశాడు అబ్బులు.
అంతవరకూ వెన్నంటి వస్తున్న నీలిమ కనిపించలేదు.
హమ్మయ్య అని ఊపిరి పిల్చుకుంటుండగా అతని చెవులకు 'బుస్' మన్న శబ్దం వినిపించింది.
అనుమానంగా టార్చ ల్తెటు ఫోకస్ చేసి చూసిన అబ్బులు మరో మారు ఖంగుతిన్నాడు.
గోడవారగా పెరిగివుంది ఒక పెద్ద పుట్ట.....
ఎన్నాళ్ళనుంచో త్రాచు పాము ఒకటి దానిలో నివాసం ఏర్పరచుకున్నది.
ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హడావుడిగా వచ్చి తన ప్రశాంతతని భగ్నం చేసిన అబ్బులు దాని కళ్ళకు కనిపించడంతో తోకప్తె కోపంతో లేచి అతన్ని కాటు వేయబోయింది.
ఆ క్షణం లోనే అతడు తన చేతిలోని పొడవ్తేన టార్చ్ ల్తెటుతో దాని తలప్తె కొట్టే ప్రయత్నం చేశాడు.
సరిగ్గా కాటువేయడానికి పడగ క్రిందకు దిగుతున్న సమయంలోనే సూటిగా పోయి అబ్బ్య్లు చేతితోని టార్చ్ ల్తెటు దాని తలను తాకింది.
అంతే.....
ఆ దెబ్బతో రెచ్చిపోయిన త్రాచు క్షణకాలంలో రివ్వున వెనుదిరిగి అతని కాలు ,ఇదా కాటు వేసింది.
అదే సమయంలో చెట్ల తీగలు కళ్ళకు అడ్డుపడటంతో తూలి ముందుకు పడ్డాడు అబ్బులు అలా పడటం సూటిగా పోయి పడగ చితికి గిలగిల్లాడుతున్న త్రాచు ప్తెన పడ్డాడు.
కసికొద్ది ఆ త్రాచు దాని చివరి క్షణాలలో కూడా అతన్ని మరో రెండుసార్లు కాటు వేసి మరి ప్రాణాలు వదిలేసింది.
త్రాచు పాములో కదలికలు ఆగే సమయానికి అబ్బులులో కూడా చలనం లేదు.
సరిగ్గా అదే సమయంలో గెస్ట్ హవుస్ లో ల్తెట్లు వెలిగాయి.
* * * *
బస్సు దిగుతున్న రజనిని చూడగానే సుధాకర్ కళ్ళు సంతోషంతో మిలమిల మెరిశాయి.
రజని కూడా అతన్ని చూడగానే పలకరింపుగా గాలిలో చెయ్యివూపింది.
ఆమెను తీసుకుని పార్కింగ్ ప్లేస్ లో వున్న స్కూటరు వ్తెపు నడిచాడతను.
అతని స్కూటరుప్తె ఇద్దరూ బయలుదేరి టీచర్స్ కాలనిలోని అతని ఫ్లాట్ కు చేరుకున్నారు.
వచ్చిరావడంతోనే తలుపులు మూసి అమాంతం రజనిని కౌగిలించుకుని ముద్దులతో ముంచే త్తేశాడు.
"బావా! ప్లీజ్ ....ఇప్పుడు నాకు మూడ్ లేదు" అంటూ బలవంతంగా అతని కౌగిలినుంచి దూరంగా జరిగింది.
"ఓహొ....మరదలుగారు ప్రయాణ బడలికలో బాగా అలసిపోయినట్టున్నరు. వెళ్ళి స్నానం చేసి రండి....సరసానికి, శృంగారానికి ఇంకా చాలా సమయం వుందిగా.
అవునని కానీ, కాదని కానీ అనకుండా బాత్ రూమ్ కు వెళ్ళింది రజని.
ఆమె అటు వెళ్ళగానే అంతకు ముందే తెచ్చి వుంచిణ మల్లెపూలను బెడ్ నిండా జల్లాడు సుధాకర్ స్పే సెంట్ బాటిల్ తిసి పరుపు మీద, తన బట్టల మీద స్పేచేసుకుని రజని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.
ఇప్పుడు ఆ గదిలో మల్లెపూల పరిమళం, సెంటు ఘుమఘుమలు ఒక దానితో ఒకటి పోటిపడుతున్నాయి.
బాత్ రూమ్ తలుపు తెరుచుకున్నది.
గదిలోకి వస్తూనే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసిన రజని ముఖం సిగ్గుతో ఏరుపెక్కింది.
శోభనపు గదిని తలదన్నేలా వున్నది డబుల్ కాట్ మంచం అలంకరణ.....
మత్తెకించే సువాసనల పరిమళాలు ఆమె ముక్కుపుటాలను సోకి కొన్ని క్షణాలపాటు తన్మయథ్వానికి గురిచేసింది.
"కామన్ డార్లింగ్!"
"ఇదేమిటి బావా....శోభనానికి అలంకరించినట్లు పూలు చల్లావు?"
"నువ్వు వచ్చిన ప్రతిరోజూ నాకు శోభనమే కదా మరదలు పిల్లా?"
"చాల్లే బాబూ! రేపు పెళ్లయ్యాక నేను గుర్తుంటానా?"