"అంతా బాగానే వుంది కానీ, ఈ విషయాన్నీ పోలీసులకు తెలియ పరచకుండా ప్రత్యేకించి మహిళా పోలిస్ స్టేషన్ కే ఫోన్ చేసి చెప్పడంలో మీ అంతరార్ధం?" సూటిగా ప్రశ్నించింది దిరజ.
వచ్చినప్పటినుంచి ఆమెలో మెదులుతున్న అనుమానం అది.
"గుడ్ క్వశ్చన్ ....మీరు కాబట్టి ఈ ప్రశ్న వేశారు. రియల్లీ ఐ ఆప్రిసియేట్ యూ!అదే ఇంకోకారయినట్టయితే అసలు ఈ ఆలోచనే వచ్చి వుండేదికాదు పోలీసులకు ఇన్ ఫామ్ చేయవలసిన అవసరంలేని మాట నిజమే. కానీ మీరు లెక్చరర్ నీలిమ గురించి ఎంక్వయిరీ చేస్తున్నట్లు పేపర్లలో చదివాను."
"సో....వాట్? చదివినంతమాత్రాన మీ అబ్బాయి స్పృహతప్పి పోవడానికి నీలిమ అదృశ్యానికి కారణం ఏం వుంది?"
"ఉన్నది మేడమ్! కాబట్టి మీకు ఫోన్ చేశాను."
ఇప్పుడు స్ధిరంగా వుంది ముకుందరావు కంఠం.
అప్పుడు కలిగింది దిరజకు అనుమానం.....
ఏమిటో అది?
"నేను వచ్చేటప్పుటికే అనిల్ కు రెండుసార్లు స్పృహ రావడం_ మళ్ళి తప్పిపోవడం జరిగాయి. స్పృహవచ్చిన ప్రతిసారి లెక్చరర్ నిలిమను కలవరించిన విషయం నేను వచ్చిన వెంటనే డాక్టర్ గారు చెప్పారు. లెక్చరర్ నీలిమ గురించి వీడేమ్తెన వినకూడని సంభాషణ విన్నాడేమో- లేక ఆమెకు సంబంధించిన దృశ్యం ఏదయినా చూసి యిలాంటి స్ధితికి చేరుకున్నా డేమోననే అనుమానంతో మీకు ఇన్ ఫామ్ చేశాను. ఈ విషయం మీ దర్యాప్తుకు సహకరిస్తుందేమోనని మికుఇ ఫోన్ చేశాను."
"సారి ముకుందరావుగారూ."
"ఇట్స్ ఆల్ ర్తెట్ ! ప్రతి చిన్న విషయాన్నీ అంత లోతుగా ఆలోచించగలిగితేనె నరయిన ఫలితాన్ని పొందగలరని విశ్వసించేవాడిని నేను.
మీ ప్రశ్నకు నేనేం వర్రి కావడంలేదు. ముందు నా కొడుకు అనిల్ ఇప్పటి పరిస్ధితికి నీలిమ ఎంత వరకు కారణమో ఆలోచించడి"
ఆయన మాటలకు తెప్పరిల్లి ణ ఇన్స్ పెక్టర్ ధీరజ డాక్టర్ ని సమీపించింది.
"డాక్టర్....అనిల్ పరిస్ధితి ఎలా వుంది? అతను ఇలా అయిపోవడానికి కారణం ఏమ్తే వుంటుందో తెలిసిందా?"
"ఊహించని దృశ్యాన్ని చూడటం వలనా అ టెన్షన్ కు తట్టుకోలేని మెదడులోని నరాలు తీవ్రమయిన ఒత్తిడికి గురయ్యాయి. నౌ హి ఈజ్ ఆల్ ర్తెట్! ఈసారి కళ్ళు తెరిచిన తరువాత ఎప్పటిలానే మాట్లాడతాడు" అన్నాడు డాక్టర్ రొటి గా.
నిమిషాలు దొర్లుతున్నాయి.....
అనిల్ తల్లి జయంతి అయితే అతని బెడ్ దగ్గరే దాదాపు అతనికి అంటుకుపోయినట్టు వుండి పోయింది.
ఆ తల్లి చూపులన్నీ అతని ముఖం మీదనే వున్నాయి.
లెక్చరర్ నీలిమ అదృశ్యనికి, ఆమె స్టూడెంట్ అయిన అనిల్ కు ఉన్న సంబంధం ఏమ్తే వుంటుందో వూహించే ప్రయత్నం చేస్తున్నది ఇన్స్ పెక్టర్ ధీరజ పోలిస్ బుర్ర!
ఏ సంబంధమూ లేనట్టయితే, అనిల్ నోటి వెంట ఈ అపస్మారక స్ధితిలో నీలిమ పేరు రావలసిన అవసరమే వుండదు.
అంటే....నిలిమకు చెందిన ఏదో రసహ్యం అనిల్ కు తప్పనిసరిగా తెలిసి వుండాలి.
అదేమిటో.....ఏమ్తే వుంటుందో?
ఆలోచిస్తున్నదామే!
అప్పడే అనిల్ కనులు భారంగా విచ్చుకున్నాయి.
అతని తల్లితండ్రులు ఆరాటంగా అతన్ని సమీపించారు.
అనిల్ కళ్ళు తెరిచిన వెంటనే బిత్తరపోయాడు.
"మమ్మి ఏమిటి? నాకేమయిందని ఇలా గుమికూడారు?" వెంట వెంటనే ప్రశ్నల వరంపర చేస్తూ ఇన్స్ పెక్టర్ దిరజను చూసి గతుక్కుమన్నాడతను.
ఆమె అప్పుడు సమిపించిందతడిని.
"మిస్టల్ అనిల్! ఆర్ యూ ఆల్ ర్తెట్?"
"ఎస్ ! ఐయమ్ ఆల్ ర్తెట్ బట్- మీరెందుకోచ్చారో నాకు అర్ధం కావడంలేదు" మనసులో ఏదో భీతి తొలుస్తున్న ప్తెకి మాత్రం గంభీరంగా వుండాలని ప్రయత్నస్తూ అన్నాడు.
"అసలు ఏం జరిగిందో చెప్పగలరా?"
అనిల్ కళ్ళలో బెదురు స్పష్టంగా కనిపించింది అప్పుడు.
తనకు ఏమ్తెందో ఒక్కసారిగా గుర్తు వచ్చిందతనికి.
ఆ దృశ్యం తలుచుకోవడంతో అతని గొంతు తడారిపోయింది.
"నీలిమ....నీలిమ దెయ్యం కనిపించింది...." అస్పష్టంగా గొణిగాడతను.
"వ్యాట్....నీలిమ దెయ్యమా?"
దిరజలో విస్మయం.....
"కాదు కాదు....ఊర్వశి ....ఊర్వశి దెయ్యం."
అనిల్ తడబడుతున్నాడు.
"మిస్టర్! నువ్వు మాట్లాడుతున్నదేమిటో నీకు తెలుస్తోందా? ఊర్వశి అంటున్నావు.....కాసేపు నీలిమ అంటున్నావు.....మళ్ళి దెయ్యం అంటున్నావు......అసలు ఏం చూశావు నువ్వు?" విసుగ్గా ప్రశ్నించింది ధీరజ.
"ఊర్వశిని చూసి నీలిమ అనుకున్నాను."
"ఎవరా ఊర్వశి?" ముకుందరావు వ్తెపు తిరిగి ప్రశ్నించింది ధీరజ.
"అదే మాకూ అర్ధంకావడం లేదు" అన్నాడతను అయోమయంగా.