Previous Page Next Page 
నల్లతంబి పేజి 16

"పెద్దయిన తరువాత ఒక్కసారే క్రమశిక్షణను అలవర్చాలనూకుంటే అదంతా సాధ్యపడే విషయం కాదనే చెప్పాలి. నేరం చేశాడని భావించినప్పుడే అనునయ మార్గాన్ని అవలంబించాలి తప్ప దండన పనికి రాదు. నయమార్గంలోనే వారికి నమ్రత, విధేయత నేర్పించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలు అవిధేయులుగా, క్రమశిక్షణారహితులుగా ప్రవర్తిస్తూ, నేరాలవైపు మొగ్గుతున్నారంటే దానికి కారణం తల్లి దండ్రులే అని నిస్సందేహంగా చెప్పవచ్చు...."
అతను ఒక గొప్ప సత్యాన్ని పరిశోధించి చెప్పుతున్న జ్ఞానిలా తోచాడు ధీరజ్ కు.
"మీలాంటి గొప్ప వ్యక్తిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా వుంది" మనస్పూర్తిగా అన్నాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
"థాంక్యూ! ఎనీవే...ఆ నేరస్తుల గురించి ఏదయినా సమాచారం లభిస్తే మీకు ఇన్ ఫాం చేస్తాను..." అన్నాడు రాజశేఖర్.
అతనిచ్చిన హామీతో సంతృప్తి చెందిన ఇన్ స్పెక్టర్ ధీరజ్ వెళ్ళిపోయాడు.
రాజశేఖర్ మాత్రం సీరియస్ గా ఆలోచిస్తుండిపోయాడు.

                                                *    *    *
ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ.
తమ ఆస్తులను కాపాడుకోవడానికి లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించే విభాగాన్ని సొంతంగా 1854లో కలకత్తా హెడ్ క్వార్టర్స్ గా ప్రారంభించింది. వారిని 'పోలీస్' అని పిలిచేవారప్పుడు.
1870లో 'గవర్నమెంట్ పోలీస్' 'ప్రయివేట్ పోలీస్' అని రెండుగా విభజించి ప్రయాణీకుల భద్రత వంటి కష్టతరమైన పనిని గవర్నమెంట్ పోలీస్ కూ, రైల్వే ఆస్తులను, గూడ్స్ షెడ్ లను, సరకుల యార్డులు మొదలైన వాటిని రక్షించే బాధ్యతను ప్రయివేట్ పోలీస్ కూ అప్పజెప్పారు.
1872లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రెండు పోలీస్ విభాగాలు నిర్వర్తించవలసిన విధులను ఉదహరిస్తూ, పోలీస్ సిబ్బందిని 'క్లాస్ ఎ'....'క్లాస్ బి' అనే రెండు సెక్షన్లుగా విభజించింది. ప్రభుత్వం క్రింద పనిచేస్తూ, నేరాలను అదుపుచేసే బాధ్యతను క్లాస్ 'ఎ' విభాగానికి, గూడ్స్ షెడ్ లను, సరుకుల గోడౌన్ లను, గూడ్స్ బోగీలను, రైల్వే భవంతులు, ఆఫీసులను సంరక్షించడం, కావలి కాయడం క్లాస్ 'బి' విభాగానికి అప్పజెప్పారు. అయితే రైలు స్టేషన్లలోని ఉద్యోగులు తమ విధులను నిర్వహించడానికి అయ్యే ఖర్చును రైల్వేశాఖ భరించవలెనని, వారిపై అజమాయిషీ మాత్రం ప్రభుత్వానికి వుండేలా ఆకమిటీ సూచించింది.
1881లో అంతవరకూ వున్న పద్దతి మొత్తాన్ని మార్చివేస్తూ 'రైల్వే పపోలీస్' పేరిట రైల్వేకి చెందిన పూర్తి బాధ్యతలను ఓకే శాఖకు అప్పగిస్తూ మరొక కమిటీ సూచించింది.
1902-1903లో ఏర్పాటయిన 'పోలీస్ కమీషన్' ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. అదే ప్రస్తుతం మనం చూస్తున్న రైల్వే పోలీస్ స్వరూపం.
ఈ కమీషన్ బాగా ఆలోచించి మూడు ముఖ్యమయిన విధాన నిర్ణయాలను రూపొందించింది. ఒకటి జిల్లా విభాగం. అంటే కొద్దిమందితో కలిసి జిల్లావరకు పనిచేసే రైల్వే సిబ్బంది. రెండవది ప్రావిన్షియల్ విభాగం. రైల్వే సంరక్షణకు చెందిన వివిధ కార్యకలాపాలకు లోబడివున్న విధులన్నీ ఈ ప్రత్యేకమైన్ పోలీస్ విభాగానికి వర్తిస్తాయి. మూడవది రైల్వే నిర్వహణ విభాగం. రైల్వేకి చెందిన మిగిలిన పోలీస్ సిబ్బందితో ఎలాంటి సంబంధం లేకుండా వుండేటటువంటి ప్రత్యేకమైన పోలీస్ విభాగం ఇది.
1921లో పంజాబ్ ప్రభుత్వానికి చెందిన చీఫ్ సెక్రటరీ జె.పి. థాంప్సన్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం రైల్వే పోలీస్ కమిటీని నియమించింది.
ఇండియన్ రైల్వే పోలీస్ పరిపాలనలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలన తీరుతెన్నులను, కనిపిస్తున్న లోపాలను వివరిస్తూ మరింత వున్నతంగా పోలీస్ పరిపాలన వుండడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో పరిశీలన జరిపింది కమిటీ.
పోలీస్ కమీషన్ వివరించిన ప్రొవిన్షియల్ సిస్టమ్ ను తిరిగి సూచించింది ఈ కమిటీ.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రైల్వేలకు హఠాత్తుగా జరిగిన నష్టాలను గూర్చి పునరాలోచించి బాగుచేయతగినట్టి ఫిర్యాదులను పరిశీలించమని అప్పుడు ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా వున్న శ్రీ బి.ఎస్ మల్లిక్ రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు.
రైల్వే పోలీస్ ను రాష్ట్ర పోలీస్ శాఖనుంచి వేరుచేసి ప్రత్యేకమయిన సంపత్తితో యథాతధంగా వుంచామనీ, ఎస్.ఆర్.పి.ని కేవలం జిల్లా రైల్వే పోలీస్ సిబ్బంది వ్యవహారాలకు చెందిన నియామకాలు, బదిలీలు, క్రమశిక్షణ మొదలైన పరిపాలనా సంబంధమయిన అధికారాలకు పరిమితం చేయాలని, పరిమిత సంఖ్యలో పోలీస్ ఆఫీసర్లను కలిగివుండే సి.ఐ.డి. విభాగాన్ని ఏర్పాటు చేయాలనీ, వివిధ ప్రదేశాలకు చెందిన మోసం, దగా, లోతుగా విస్తరించుకునివున్న నేరాలకు చెందిన పరిశోధనలను ఆ విభాగానికి అప్పజెప్పాలని ఆయన సూచించారు.
1962లో జరిగిన పోలీస్ ఇన్ స్పెక్టర్ జనరల్స్ సమావేశంలో హోం మంత్రిత్వ  శాఖతో జరిపిన చర్చల్లో బి.ఎన్. మల్లిక్ సూచించిన సలహాలను ఆమోదించడంవల్ల భారత ప్రభుత్వం రైల్వే పోలీస్ కు నిర్దిష్టమైన రూపాన్ని కలుగజేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీచేసింది.
1966లో అప్పటి రైల్వే మంత్రిగా వున్న డాక్టర్ సుభాష్ సింగ్ నేతృత్వంలో అత్యున్నత స్థాయిలో రక్షణకు సంబంధించిన సమస్యలు, రైల్వేల నిర్వహణను గూర్చి పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన రైల్వే సెంట్రల్ పోలీస్ ఫోర్సును ఏర్పాటుచేయవలెనని ఈ కమిటీ 1968లో రిపోర్టునుసమర్పించింది.
1975 మే నెలలో రైల్వే విధానాలను గూర్చి పరిశీలించమని రైల్వే బోర్డుకు చెందిన రిటైర్డ్ చైర్మన్ శ్రీ కృపాల్ సింగ్ నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈయన గతంలో అత్యున్నత స్థాయి కమిటీ సూచించిన సెంట్రల్ పోలీస్ ఫోర్స్ నియామకాన్ని తిరస్కరిస్తూ రైల్వే పోలీస్ పూర్తి స్వరూపం కూడా అసంబద్దంగా వున్దంటూ, జిల్లా పోలీస్ విభాగాలతో కలిసి పనిచేయాలని తన అభిప్రాయాన్ని తెలియపరిచాడు.
ప్రొవిన్షియల్ విభాగం, జిల్లా విభాగం, రైల్వే నిర్వహణా విభాగం, సెంట్రల్ పోలీస్ ఫోర్సు నియామకాలపై వాటిలో వున్న యోఘ్యతలు, లోపాలను విడమరచి చూసి తగిన యుక్తమయిన సలహాలను తీసుకునే ప్రయత్నం శ్రీ ఆర్.డి.సింగ్ నేతృత్వంలో చర్చించడం జరిగింది.
రైల్వే పోలీస్ కాని, విలేజ్ పోలీస్ కాని సహజ సిద్దంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి విధానాలతోనే వుంది ఓకే విధమయిన ధర్మాన్ని నిర్వర్తిస్తూ వుండాలి. లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షించే సెంట్రల్ రైల్వే పోలీస్ ని ఏర్పాటు చేయడమనేది రాష్ట్రప్రభుత్వ స్వంతంత్రమయిన నిర్ణయం.
జిల్లా పరిధిలో హద్దులను ఏర్పరచడం, కొన్ని జిల్లాలు ఒక డివిజన్ గా రైలుపట్టాల హద్దులుగా కొన్ని కిలోమీటర్ల పరిధి వరకూ మాత్రమే నిబంధనల మేరకు ఖచ్చితంగా వుండేలా ఏర్పరచడం జిల్లా విభాగంలో రైల్వేల నిర్వహణలో ప్రత్యక్షంగా కనిపిస్తున్న లోపాలు.
కదులుతున్న రైళ్ళలో పోలీస్ అధికారులకు లోబడివుండే అనేకమైన నేరాలు జరిగిన సందర్భాలలో స్థానిక సంబంధమయిన సంఘటనల విషయాలలో వారి ఇష్టానుసారంగా ఎక్కువగా వాదనలకు ఆస్కారం లేకుండా వుంటోంది.

 Previous Page Next Page