తల నెమ్మదిగా ఆడించింది అరుంధతి. అది ఒక త్రాచు తల వూచినట్ట్లుగా వుంది.
"సర్ప సర్ప మహాసర్ప సర్పరాజ నమోస్తుతే..."
మంత్రాన్ని గట్టిగా పఠించి ఆవాలు పొట్లం కట్టి యిచాడు. ఆ కట్టిన కాగితం గోధుమ వన్నెలో వుంది.
"నమోస్త్వనంతాయ....."
మంత్రాన్ని మరికాస్త గట్టిగా పఠిస్తు ఇసుక పావుట్లంగా కట్టి యిచ్చాడు. ఆ ఇసుక కట్టిన కాగితం నల్లని నలుపు రంగులో వుంది.
'ఈ రెండు పొట్లాలు జాగ్రత్త!'
అలాగే నన్నట్టు తలవూపింది అరుంధతి.
'నీ భర్తకి త్వరగా చూపు వస్తుంది. నేను యీ క్షణం నుంచే నయనగతి రగడ పారాయణం ప్రారంభిస్తాను. రేపటి ఉదయమ్లోగా లక్ష జపం చేస్తాను. ఆయనకి చూపు వస్తుంది. నా వద్ద కాలనాగు యంత్రం వుంది దాన్ని తెచీ రేపు ఆదివారంనాడు మీ యింటి గడపకి బిగిస్తాను.
అరుంధతీ! మంత్రం అబద్దం కాదు. శాస్రం అబద్దం కాదు, దైవం అబద్దం కాదు. ఆపదల్లో ఆర్తిగా దేవుడుని ద్యనిమ్చి, సహస్ర ప్రకారంగా మంత్రజపం చేస్తే సిద్దించని కోరిక లేదు.
అదిగో! అటు చూడు!
అది తాటాకుల గ్రధం! దాన్లో కొన్నిచ్వందల మంత్రాలున్నాయి. కొన్ని వందల రుగ్మతలకి వివారణలున్నాయి' ఎన్నో కోర్కెలు తీర్చు కునేందుకు మంత్రాలున్నాయి.
ఓం నమః కామాఖ్యాదేవీ! అముకీం వశం కురుకురు స్వాహ.
ఇది వశీకరణ మంత్రం! స్రీ వశీకరణ మంత్రం.
అందరికీ అచ్చులో లభిస్తుంది. నిజానికి యీ ముద్రణ యంత్రాలు వచ్చాక మంత్రం తెలిసిన మనిషి దాన్ని అచ్చేసి దేశం మీదికి వదులుతున్నాడు. అదేదో నిది లభ్యమైనట్టుగా అమాయుకులు ఆ మత్రాన్ని నేర్చుకుని దాన్లో చెప్పినట్టుగా 'విధి' ప్రాకారంగానే చేస్తారు.
కానీ కోరికలు తీరవు.
మంత్రం సిద్ధించందే కోర్కెలు ఎలా తీరతాయి?
నిజానికి మంత్రవేత్త అయి, మంత్రసిద్ది పొంది మంత్ర సిద్దించి తీరుతుంది కోరికలు నెరవేరతాయి.
కానీ మనకి అలాటి గురువేక్కడ దొరుకుతాడు?
నిజమైన శిష్యునికి మంత్రదానం చేసేందుకు గురువు వేయికళ్ళతో ఎదురు చూస్తూ వుంటాడు.
కారణం? తన విద్యని ధరాదత్తం చేయకపోతే యీ మంత్రసిద్ధి పొందిన గురువు అధోలోకానికి పోతాడు.
నిజానికి మనిషిని రక్షించేందుకు ఒక్క రామమంత్రం చాలదూ! ద్విజులకి ఒక గాయత్రీ చాలదూ! ఊహూ మ్నవులకి సుళువుగా సుఖంగా మంత్ర సిద్ది కొర్కేసిద్ది కావాలి.
నిజమే! రామమంత్రం భోగభాగ్యులని యివ్వదు. కానీ చిట్టా శాంతిని ప్రసాదిస్తుంది. అరుంధతీ! లోకంలో మనిషికి శాంతికంటే కావలసిందేవుంది? కానీ యిఇనాటి జనం తమకి చిత్తశాంతి కంటే సుఖ బొగల పైనే ఆశ ఎక్కువ అని రుజువు చేస్తున్నారు....
ఇదంతా నీ కెందుకులే!
"వెళ్ళే! నీ కుంటుంబానికి యికేం భయం లేదు"
అరుంధతి నెమ్మదిగా సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
14
"చెప్పమ్మా?"
నవ్వుతున్నాడు ధర్మరాజు.
అతని కెంతో సంతోషంగా వుంది ఎగిరి గంతెయ్యాలని, తనని తీరా నవ్వాలని, డాన్స్ చేయలన్నంత ఉద్వేగంగానూ వుంది.
"ఏం చెప్పమంటారు?"
"నువ్వెవరు? ఎక్కడున్నావ్? నీ తల్లితండ్రులెవరు? మీ నాన్న ఏం చేస్తున్నాడు.నువ్వేం చేస్తున్నావ్? ఏం చదివావ్?"
ప్రశ్నపరంపరకి తడబడింది సరళ
"ఇన్ని ప్రశ్నలా" అనుకుంది
'ఒక అపరిచిత వ్యక్తితో పరిచయం అయితే, ఆ వ్యక్తిని వ్యక్తిగా స్వీకరించలేరా? ఇన్ని అరలు తీయాలా? ఇన్ని విషయాలు చెప్పుకోవాలా? అప్పటికిగాని పరిచయం పూర్తికదా?' అనుకుంది.
'ఊఁ ఏమ్తమ్మ ఆలోచన? కాఫీ తాగుతావా? తీ తాగుతావా? వంటింట్లో రెండు ప్లాస్కులున్నాయి. రెండింటిలో కాఫీ,టీ రెడీగా వుంటుంది. అది మీఅత్తయ్య పద్దతి. ఆఫ్ కోర్స్ నే న్వేర్సిందే అన్నారు.
'ఏమీ వద్దండీ!'
'అయ్యో! అదేమిటి? టీ_కాఫీ ఏం తాగవా?'
"ఊహూ "
' ఐఁపితీయ? సరళా! యూ డోంట్ నో వాట్ యు ఆర్ మిస్సింగ్ అన్నాడు జాలిగా అయినా యూనివర్సీతీలో చదివిన నీకు కాఫీ టీలు అలవాట్లేదా?అడిగాడు నవ్వూతూ.
"ఊహూ "
'పోన్లేఁఓ విధంగా అదృష్టవంతురాలివి!'
ఆమె ఏమీ అనలేదు
'ఇప్పుడు చెప్పు? అమ్మా నాన్న ఎక్కడ?'
'ఇద్దారూ నా చిన్నప్పుడే పోయారండి!మా బాబాయ్ నన్ను అర్దన్ స్కూల్లో వదిలారు. హస్టాల్లో వుండి చదువుకున్నాను' ధర్మరాజు గారి గొంతులో జాలి జాలువారింది.
'ఇప్పుడేక్కడున్నావ్?' అడిగాడు మళ్ళీ '
'ఇక్కడే!' విరగపడి నవ్వరాయన ఆ చమత్కారానికి.
'మొత్తానికి భలేదానివమ్మాయ్!
'పొండి మామగారూ!' తనూ నేవ్వేసింది.
సరే! నీకేం కావాలో అడుగు!