'ఏమో! తెలీదు_'
"మామగారు! ఒక వేళ యిది ఏదో సర్పప్రభావమే అయితే యీ దృష్టి దోషాన్ని నేను పోగోడతాను!'
అయన మనస్సులో ఆశ చిగిర్చి, క్షణంలో ఫలించి మళ్ళీ మొలాకేత్తీ, నసలు సాగి, డబ్బా కట్టి,పెరిగి పెరిగి మహావట వృక్షమైంది.
"అమ్మా!" అని పిలిచాడు ఆనందంగా.
"అవినండీ నా చేతిలో గరుఢరేఖ వుంది. చాలా మంది చేతుల్లో గరుఢ రేఖలు వుంటాయి. నా అరచేతిలో మధ్య వెలికి కిందుగా జెవిట రేఖని విభజిస్తూ విద్యారేఖ స్పృశిస్తూ హృదయరేఖకి సమాతరంగా వుంది యీ గరుఢ రేఖ.
మామూలు గరుఢ రేఖ చూస్తే మిన్న గయినా పాడగా దించుకుని ఓడిపోయిన శత్రు సై నికుడిలా వెనక్కి వెళ్ళి పోతుంది పరుగు పరుగున. నా యీ అరచేతిని, అందులోని యీ విశిష్ట గరుఢరేఖని చూడగానే పాము స్తంభించి పోతుంది. పాము కాటేసిన చోట తాకిస్తే విషం బయటకి వస్తుంది పాముకి సంభందించిన ఏ వ్యాధి అయినా స్పర్శ మాత్రాన నయమవుతుంది!" అంది.
"సరళ!' ఆనందంగా పిలిచాడు ధర్మరాజు "నిజంగా నువ్వు నా అదృష్టం కొద్దీ ఇప్పుడో చ్చావమ్మా! అన్నాడు
"మావగారూ నా అరచేత్తో మీ కళ్ళని మృదువుగా టాక నివ్వండి చంద్రకిరణ స్పర్శలగా చందన చర్చలాగా వుంటుందని'
"నాకు చూపు తెప్పించామ్మాయ్! ఆ కంఠంలో అర్దింపు కనిపించింది
'మావగారూ!' పిలిచింది సరళ
'ఏమ్మా?'
'మీరు నాకు మాట యివ్వాలి!'
"ఏమిటమ్మా?" సంశయిస్తూ అడిగాడు
అది మీకు యిబ్బంది కలిగించేది కాదు ఆపద తెచ్చేది కాదు అబ్యంతరకరమైంది కాదు" అంది ముందు కాళ్ళకి బంధం వేస్తున్నట్టుగా అంది సరళ.
'నువ్వు తెలివిగల దానివంమా?' నవ్వేడు ధర్మరాజు. "నాకు అభ్యంతరం లేనిదీ,యిబ్బంది కల్గించినదీ,అపదరానిది అయినా మాట యివ్వటానికి తటపటాయించటం ఎందుకు తల్లీ_ నువ్వు కోరినట్టు చేస్తాను సరేనా?" అన్నాడు భరోసాగా.
"మళ్ళా మాట తప్పకూడదు"
"సరళా! నా పేరు ధర్మరాజు. నేను పూర్వాకద నక్షిత్రం రెండో పాదంలో పుట్టారని ఆ పేర్లు పెట్టలేదు. నన్ను న్యాయంగా, ధర్మంగా నడుచుకో అని చెప్పేందుకే యీ పేరు పెట్టారు మా నాన్న! లక్షల డబ్బు సంపదించేందుకు అవకాశం వున్న ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ లో వావుగా పనిచేసినా, నేను ఏనాడూ లంచం పుచ్చుకోలేదు. లాంచనాలు తీసుకోలేదు!"
అయన మిఖం గంభీరంగా అయిపోయింది.
సరళ ఒక్కసారి పరిశీలనగా చూసింది.
"మీరిచ్చిన మాట వెనక్కి తెసుకోరా?"
"ఊహూ"
అన్నట్టు_యిది మీ చూపురావటానికి దీనికి ముడి పెట్టానని అనుకోరు కదా!" అంది సందేహంగా
"అమ్మా! సరళా! నాకు చూపు వచ్చినా రాకున్నా పర్లేదు. ఇచ్చిన మాట తప్పను_' అన్నాడు స్థిర కంఠంతో,
'మీకు చూపు తప్పక తెప్పిస్తాను'
'థాంక్స్...' పొడిగా అన్నారాయన
ఆమె లేచి నుంచుంది. అయన దగ్గరగా వచ్చింది.
'కళ్ళు మూసుకోండి' అంది మెల్లిగా
కనురెప్పలు మూతపడ్డాయి.
అరవిందం కంటే మృదువైన తన అరచేత్తో అయన కనురెప్పలపై మేలిమేల్లిగా రాసింది ఆ తర్వాత కనురెప్పలు తెరవమని రెండు అరచేతులనీ కళ్ళకి అడ్డంగా మూసింది.
పడి పదిహేను క్షణాలు గడిచాయి.
'కళ్ళు తాటించి తెరవండి!"
రెప్పలు టపటప కొట్టుకున్నాయి. కనుపాపలు వెడల్పయ్యాయి. రేటీనాపై బొమ్మపడింది.
ధర్మరాజుగారు తన ఎదురుగా పద్దెనిమిదేళ్ళ పరువంలో వున్న అందమైన సరళిని చూడగలిగారు.
ఆయన ఆనందంతో 'అమ్మాయ్!' అంటూ పిలిచారు.
'నేనిక్కడే వున్నాను మావగారూ!"
చిరునవ్వుతో సమాధానం చెప్పింది సరళ.
"నేను..నేను... మాములుగా చూడగలుగుతున్నాను' నా చూపు వచ్చేసింది. నువ్వు... నువ్వు... సామాన్యమైన యువతి కాదు. నువ్వో దేవతా స్రీ ని..." అన్నడు ఉద్విగ్న మనసంతో
'అవును.. దేవతా స్రీ నే!' అనుకుంది నెమ్మదిగా
13
శ్రీధరశాస్రీగారు చిరునవ్వు నవ్వేరు.
'నీ కూమారుడు అసాధ్యుడు!' అన్నాడు నవ్వూతునే
"ఏమైంది స్వామీ?" అమ్దావులనగా అడిగింది అరుంధతి. 'ఇప్పుడు నీ కొడుకు ఓ నాగకన్య చేతిలో చిక్కాడు 'అనగానే ఆమె మనస్సు అందోళనకి గురైంది. భర్తకి చూపు కనిపించక పోవటం. యిక్కడికి రావటం రాగానే అయన అలా అనటం ఆమె మనస్సులో ఆందోళనని సృష్టించాయి.
'మీరేం ఫర్వాలేదు 'నింపాదిగా అన్నాడు శాస్రీగారు."నీ భర్తకి, నీ కొడుక్కి ఏ ఆపదా రాకుండా కాపాడే బాధ్యత నాది. మీ యింటిలోవున్న ఆ దోషాలు తొలగించుకొండి. తర్వాత వీలు చూసుకుని శ్రీ రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్ట చేసి రండీ అన్నారాయన.
'అలాగే స్వామీ'
నేను మంత్రించిన ఆవాలు పెడతాను. మీ యింటి చూట్టూ చల్లిమ్చు మంత్రించిన ఇసుక యిస్తాను నీ భర్త పడుకునే మంచం చూట్టూ చల్లు. బాగా వింటున్నావా? అది చల్లిమ్చు. ఇది చల్లు తేడా తెల్సింది కదా మీ యిటికి చాయలకి పాపలు,తేళ్ళురావు. కొన్నాళ్ళకి ఆ అవాల్లో ఏవయినా మొలకెత్తితే అవి కాసేదాకా ఆగండి. అప్పుడు ఆ కసిన ఆవాలు మీకుటుంభానికే వాడుకోండి. ఇక ఎప్పటికీ మీకు శ్ర్పబాద, వృశ్చిక బాధ వుండదు.