"ఒరేయ్ బావా! ఏయ్ అన్నా!"
కేకలు వినిపించి రోడ్డు మీద పోతున్న జానీ సుబ్బయ్యలు వెనక్కి తిరిగారు. యమ్మా సితాయమ్మ చకచక అడుగులు వేసుకుంటూ వచ్చి వాళ్ళని కలుసుకుంది.
"ఏం తల్లి! మాలో నీకు బావేవారు? అన్నేవరు?" అడిగాడు సుబ్బయ్య.
"ఇద్దరూ మొగాళ్ళతో కలిసి తిరిగేటప్పుడు ఒకళ్ళని బావ అని, మరొకర్ని అన్న అని పిలవాలని మా అమ్మ చెప్పింది. అలా అయితే నే ఎవరికి అనుమానం రాదట. ఎవరు బావో, ఎవరు అన్నో మీరే తేల్చుకోండి. ఎవరు ఏదైనా నాకభ్యంతరం లేదు. మనమంతా ఒకటే జాతి కాబట్టి మికేదన్నా అవసరమైతే సహయం చేస్తానని చెప్పడానికి వచ్చాను ఆఫ్ కోర్సు నా రేటు నాకుంది."
జాన్, సుబ్బయ్యలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఎడంగా వెళ్లి అలోచించుకున్నారు పసిపిల్లని కిడ్నాప్ చెయ్యాలి అదిగాక ఒక డాన్సర్ యింటి నుంచి ఆ పిల్లని ఎత్తుకురావాలి. అంచేత అడతోడు వుంటే మంచిదే ఇది సుబ్బయ్య అభిప్రాయం." ఇది గడుసు పిండంలా వుంది మనల్ని డబుల్ క్రాస్ చేస్తే " అనుమానం వెలిబుచ్చాడు జాన్.
"ఎంతైనా అది ఆడది ఒక్కర్తి మనం ఇద్దరం ఏం చేస్తుంది? రానిద్దాం దానికి పూర్తిగా చెప్పొద్దు. అవసరమైనంత వరకూ చెప్దాం. నేను చూసుకుంటానుగా!" జాన్ కి సుబ్బయ్యలో నమ్మకం పెరుగుతోంది. ఇతను పక్కన వుంటే ఎప్పటికప్పుడు బయటపడేయగలడనే ధీమా వచ్చింది. ఒప్పుకున్నాడు. యమ్మా సితాయమ్మని టాస్ వేసి సుబ్బయ్యని బావగాను, జాన్ ని అన్నగాను నిర్ణయించింది.
"భార్య భర్త విడిపోయారు. తండ్రి కూతుర్ని కిడ్నాప్ చేసి తెచ్చి పెట్టమన్నాడు. బాగానే గిట్టుబాటు అవుతుంది. సందర్భం చూసుకుని అవసరమనిపిస్తే మరింత బాగా గిట్టుబాటు అవుతుందనుకుంటే తల్లిని కూడా బెదరించి డబ్బు గుంజుకోవచ్చు. ఇది మన పని.' వివరించాడు సుబ్బయ్య.
"రంగస్థలం ఎక్కడ? డ్రమేటిక్ గా అడిగింది.
"భువనేశ్వర్" అని నువెం చదువుకున్నావు?' అడిగాడు సుబ్బయ్య.
"బోలెడు జీవితం చదువుకున్నాను"
"ఆ కారు వోనర్ తండ్రికి యెంతో మంది భార్యల్లాంటి వాళ్ళున్నారని నీకెలా తెలిసింది?'
"మనదేశంలో ముసలివాళ్ళకి కష్ట సుఖాలు చెప్పుకోవడానికి యిటీవల యెవరు లేకుండా పోతున్నారు. నేను అలాంటి వొంటరి ముసలమ్మ లేక్కడున్నారో తెలుసుకుని వాళ్ళని పలకరించి వస్తుంటాను. కాఫీ ఫలహారాలు గడిచిపోతాయి. ప్లస్ ఇలాగే దేనికైనా పనికొస్తుంది" నవ్వింది.
"భువనేశ్వర్ దాకా ఇలా ఎక్స్పరిమెంట్ చేస్తూ వెళ్లొద్దు సుఖంగా బస్సుల్లో పోదాం"
"డైరెక్టు బస్ లేదుగా పోనీ ట్రైన్ లో వెళితే" అన్నాడు సుబ్బయ్య.
"రైల్ రిస్క్ ఎక్కడ ప్[పడితే అక్కడ గంటలకొద్దీ ఆపేస్తారు. బస్సు డ్రైవర్ యేది అడ్డొచ్చినా ఆపకుండా రయ్యిన లగించేస్తాడు అంచేత మనం యే గొడవల్లోను చిక్కు పడకుండా బయట పడొచ్చు. కొందరు కండక్టర్లు సీట్లు లేకపోయినా పాసింజర్సుని కూరేస్తుంటారు. అలాంటప్పుడు మనకేదైనా ఛాన్సు దొరికినా దొరకొచ్చు బస్సే బెటర్"
"నేను బస్సులోను రాను ట్రైన్ లోను రాను" ఖచ్చితంగా చెప్పాడు జాన్.
"ప్రస్తుతం పోలిసు వాళ్ళ చూపు మనవాడి మీదున్నట్టుంది. కాస్త బెదురుతున్నాడు గురుడు" అన్నాడు సుబ్బయ్య.
"ఇంతమాత్రానికే బెదురుతున్నవెంటన్నా! మన జాతికె సిగ్గు చేటు. నేను పక్కనుండగా నిన్నే పోలీసోడు ఏం చెయ్యలేడు పద."
అయిష్టంగానే వొప్పుకున్నాడు జాన్. ఇలాంటి పనులు కేలాగైనా వోకరిద్దరి సహాయం తీసుకోక తప్పదు. యమ్మాసీతాయమ్మ అరితెరిందాన్లాగే వుంది బస్ స్టాండ్ కి బయలుదేరబోతుంటే "ఓ క్షణం ఆగండి" అని కాస్త దూరంలో చిన్న సందులో వున్న ఇళ్ళల్లో ఒక యింట్లోకి నడిచింది యమ్మా సీతాయమ్మ పదినిముషాల్లో తమ దగ్గిరకోచ్చి నా మెనిగుర్తుపట్టలేకపోయారు స్నేహితులు. జరి లేని వేంకటగిరి నేతచీర, చేతుల నిండుగా గాజులు, పొడవాటి వాల్జడ. నుదుట పెద్ద కుంకుమ బొట్టు అచ్చు తెలుగింటి యిల్లాలి లాగ వుంది" ఇహ నడవండి " అంది.
ఒకచోట బసు మారుతున్నప్పుడు పోలిసు వొకడు జాన్ ని అనుమానంగా చూసి భుజం మీద చెయ్యి వెయ్యబోయాడు వెంటనే యమ్మాయమ్మ ముందుకొచ్చి, "ఈయన మా అన్నయ్య ఈయన భుజం మీద ఎందుకు చెయ్యేస్తున్నావు> కాకీ బూట్లు తోడుకున్నాగదాని వెధవేషాలేషాలేశావంటే డి.ఏస్.పి గారితో చెప్పి నిన్ను డిస్మిస్ చేయిస్తాను. టెక్ కేర్," అని దబాయించింది. యింగ్లీషులో గడగడ యింగ్లిషు వినిపించేసరికి పోలీసు కానిస్టేబుల్ హడలిపోయాడు. అతడికి యమ్మా యమ్మ మాటల్లో సగమ అర్ధంకాలేదు. జాన్ ని వొదిలేసి వెళ్లిపోయాడు. గర్వంగా నవ్వింది యమ్మాయమ్మ లో గురి యెక్కువైంది. జాన్ కి భువనేశ్వర్ చేరుకున్నారు.
"మకాం ఎక్కడ?" అడిగాడు సుబ్బయ్య "మనకి మకాం ఏమిటి? భువనేశ్వర్ టెంపుల్ దగ్గిర కలుసుకుందాం టెంపుల్ కి అన్నీ చోట్ల నుంచి జనం వస్తుంటారు కాబట్టి మనం ప్రత్యేకంగా ఎవరికి కనిపించం. మనలాంటి వాళ్ళకి గుడి చాలామంచి చోటు అన్నివిధాలా అనుకూలంగా వుంటుంది." చెప్పింది యమ్మాయమ్మ. [పని ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంత్రం గుడి దగ్గర కలుసుకునేలా సంకేతం ఏర్పరచుకొన్నారు ముగ్గురూ.
జాన్ అణువేద రాగమాలల ఫోటోలు యమ్మాకి చూపించాడు అవసరమైన వివరాలన్నీ చెప్పాడు ముగ్గురు మూడు దారుల్లో చిలిపోయారు. యమ్మాయమ్మ నేరుగా డాన్సు స్కూలుకి వెళ్ళి కాదు. పలుకుబడి పరపతి సమాజంలో ఒక గుర్తింపు వున్న వ్యక్తీ ఎంతో జాగ్రత్తగా నిరహించుకోవాలి కార్యాన్ని తరువాత రవీంద్రభవన్ రోడ్డులో వున్న అణువేద యింటి పరిసరాల్ని పరిశీలించుకుంది. అణువేద బంధువులు ఎవరెవరున్నారో విచారించి సుందరేశ్వరరావు చిరునామా సంపాదించింది. ఆ యింటి పరిసరాలు కూడా పరిశీలించాలని వెళ్తుంటే రోడ్డుకి అడ్డంగా ఒక పసిపాప పరిగెడుతోంది.
యమ్మాలో స్త్రీ హృదయం మిగిలిన అన్నీ భావాలని ఆణిచేయగా చటుక్కున ముందుకు పరిగెత్తి కారు కింద పడబోతున్న పసిపాపని చేతుల్లోకి ఎత్తుకుంది. దాదాపుగా కారు మీదకి వచ్చేస్తున్న అనుభూతితో బెదిరిపోయిన పాప యమ్మా మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది. పాపని బుజ్జగిస్తూ "ఎవరమ్మా! నువు? ఎందుకలా పరిగేడుతున్నావు?" అని అడిగింది.