Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 14

మనం ముందుకే వెళ్దాం రా" అని జాని చెయ్యి పట్టుకుని కారు దగ్గరికి వచ్చాడు దైర్యంగా పోలిసుల్ని విష్ చేసి "ఏంటి సార్ విశేషం?" అని పలకరించాడు పోలీసులు యిద్దర్నీ అనుమానంగా చూస్తూ "మీరెవరు? ఎక్కడున్నుంచి వస్తున్నారు? ఆ టిన్లో ఏముంది?" అని ప్రశ్నలడి గారు సుబ్బయ్య నవుతూ, "కొంపదీసి మిమ్మల్ని ఏ సాక్ష్యానికైనా యిరికిం చేస్తారా? ఏమిటి అందుకే మన దేశంలో ఏదైనా  నేరం జరిగినా పోలీసు రిపోర్టు చెయ్యాలంటే భయం. నేరం చేసినవాడ్ని వదిలి పెట్టి రిపోర్టు చేసిన వాణ్ణి పట్టుకుంటారు మీరు.'
"అదిక ప్రసంగాలు కట్టి పెట్టి అడిగిందానికి సమాధానం చెప్పు"
"మేమిద్దరం మా దారిని మేము పోతుంటే ఓ ఆడకూతురు కార్లో పెట్రోలు అయిపొయింది, తెచ్చి పెట్టమని అడిగింది. అబలకి సహాయం చెయ్యడం మా కనీస ధర్మమనుకొని టిన్ పెట్రోల్ పోసుకొని మోసుకొంటూ వచ్చాము ఆ అబలామణికి ఏదేనా చరిత్ర వుందా?"
సుబ్బయ్య మాట్లాడుతున్న ధోరణికి జాన్ తెల్లబోతున్నాడు అతనికి అనుమానంగాను భయంగాను కూడా వుంది. పోలిసాఫీసరు సుబ్బయ్యని పరిశీలనగా చూస్తూ, "అందరికి  వుంటుంది ఒక్కో చరిత్ర అన్నీ బయటపడ్తాయి మీరిద్దరూ యీ సమయంలో ఈ రోడ్డులో ఎక్కడి కేళ్తున్నట్లు?"
"చాగల్లులో మా సిస్టరుకు సీరియస్ గా వుంది అందుకని"
"అందుకని బస్సులోను, రైల్లోను వెళ్ళకుండా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారా?" వెటకారంగా నవాడు పొలిసాఫీసర్.
'ముందు జీప్ లో కూర్చోంది. పోలీసు స్టేషన్ లో అన్నీ సంగతులు తెల్తాయి."
"ఇది న్యాయం కాదు. మేము......"
"ఏయ్ మిస్టర్! ఈ కారు దొంగతనంగా ఎత్తుకొచ్చిన కారు, ఆ అబలామణి ఎవరో డ్రైవింగ్ కూడా వచ్చిన గజదొంగ ఆవిడతో కాంటాక్టు పెట్టుకున్నారు గనుక మీరు స్టేషనుకి వచ్చి తిరవలిందే అక్కడ మీ తప్పెంలేదని మేమనుకుంటే వదిలేస్తాము."
జాన్ గుర్రుగా చూశాడు సుబ్బయ్యని, నిష్కారణంగా పోలీసు చేతుల్లోకి ఈడ్చినందుకు. అంతలో అబలామణి రెండు చేతుల్తోను ఎయిర్ బేగ్స్ మోసుకొచ్చి పోలీసుల ముందు ఎయిర్ బేగ్స్ దన్ మని కింద పడేసి, "ఇన్ స్పెక్టర్! వీళ్ళిద్దరిని అరెస్టు చెయ్యండి. ఎయిర్ బేగ్స్ లో చెత్తకాగితాలు నింపి నన్ను మోసం చేశారు."
"నీ పేరేమిటి? నీవి కారు ఎక్కడ్నుంచి తెచ్చావు? కారు ఇక్కడ వొదిలేసి ఎక్కడి కెళ్ళావు?" ప్రశ్నలు కురిపించాడు ఇన్ స్పెక్టరు. ఆ అమ్మాయి నుదురు బెదురూ లేకుండా నిటారుగా నిలబడి కళ్ళజోడుని స్టయిల్ గా నుదుటి మీదకి లాక్కుని నవుతూ చెప్పింది.
"నా పేరు యమ్మా సితయమ్మ మతసమనయానికి గుర్తుగా ఈ పేరు పెట్టుకున్నాను. ఈ కారు నాదే ఈ కార్లో పెట్రోల్ అతి తక్కువగా పోసి నా బ్రదర్ నన్ను మోసం చేశాడు. వాడ్ని కూడా అరెస్టు చెయ్యాలి. ఈ ఎయిర్ బేగ్స్ చూస్తే నాకేదో అనుమానం తోచి వీళ్ళని పెట్రోలికి పంపి అదిగో ఆ కనపడే గుడిసెల మధ్యకి వెళ్ళి వీటిల్లో ఏముందో చెక్ చేశాను. ఖరీదైన ఎయిర్ బేగ్స్ లో చెత్తకాగితాలు పెట్టి నా బోటి ప్రజల్ని మోసం చేస్తున్న ఈ దుర్మార్గుల్ని కూడా అరెస్ట్ చెయ్యాలి."
నిర్ఘాంతపోయాడు ఇన్ స్పెక్టరు. అతడి సర్విసి లో అనేక మంది నేరస్తులను చూశాడు కానీ ఇలాంటి శాల్తి ఎప్పుడూ తగల్లేదు.
"ఈ కారు పోయినట్టుగా ఓనర్ మాకు రిపోర్టు యిచ్చాడు. అంచేత మీరు జీప్ ఎక్కండి. పోలీసు స్టేషన్ కి రావాలి."
"పోలీసు రిపోర్టు యిచ్చాడా? వెధవకి బుద్ది లేకపోతేసరి. మరి అల్లరి ఎక్కువైపోతోంది. నేను వాడికి పాఠం చేప్తలెండి.'
"అవన్నీ తరువాత. ముందు జీపెక్కండి."
"కారు నాదే నంటే వినిపించుకోవేమయ్యా!"
"అయితే లైసన్సులు వగైరా చూపించు."
"ఏడ్చినట్టుంది. అవన్నీ మగాళ్ళ దగ్గిరుంటాయి కాని ఆడాళ్ళ దగ్గిరుంటాయా! ఆ మాత్రం తెలియదు. పోలీసు ఉద్యోగం చేస్తున్నావు మళ్ళీ."
"నోర్ముసుకుని ముందు జీపులో కూర్చో"
జీపులోకి తొంగి చూసింది యమ్మాసీతాయమ్మా. "మీ వెధవ జీపులో వెనక సీట్లన్నీ దుమ్ము కొట్టుకుని తగలబడ్డాయి. మీ పోలిసొళ్ళుయే చండాలమైనా భరిస్తారు ఆ దుమ్ము తుడిస్తేనే గానీ నేను కూర్చొను."
ఇన్ స్పెక్టరు కోపంతో రగిలిపోయాడు యమ్మా సీతాయమ్మని రెక్క పట్టుకుని జీపులో ఎక్కించబోయేడు కేవుమని అరిచింది. "ఏయ్ ఇన్ స్పెక్టరు నా వొంటి మీద చెయ్యి పడిందంటే నడిరోడ్డు మీద అడకుతుర్ని రేప్ చేశావని దేశంలో వున్న తెలుగు యింగ్లీషు పత్రికలన్నిటికి వార్తలు పంపెస్తాను. దేశంలోని జర్నలిస్టులందరు రెండు రోజుల కోకసారైనా నన్ను వెతుక్కుంటూ వస్తారు సెస్నేషనల్ వార్తల కోసం. కాస్త బెదిరాడు ఇన్ స్పెక్టరు. ఈ మధ్య పోలీసు వాళ్ళని విమర్శిస్తూ వార్తలు ప్రచురించడాన్ని అందరికందరు భలే ఉత్సాహం చూపిస్తున్నారు. చచ్చినట్లు జీపు శుభ్రం చేయించి అందులోకి ఎక్కించాడు.
యమ్మా సీతాయమ్మని, సుబ్బయ్యని చూస్తుంటే వాళ్ళు కింది వర్గం వాళ్ళో హైక్లాస్ వాళ్ళో అర్ధం కావటం లేదు అతనికి. "ఈ మధ్య క్రిమినల్స్ మర్యాదస్తులను మించిపోయిన పెద్దమనుష్యుల్లా వేషాలు వేసేస్తున్నారు. అన్నీ రకాలలో కంటే క్రైమ్  ఫీల్డు లో తెలివి తేటలు నానటికి వృద్ది పొందుతున్నాయి. ఎలాగైతేనేం ముగ్గుర్ని లాకప్ రూమ్ లో పెట్టి మరునాడు మేజిస్ట్రేట్  కోర్టులో హాజరు పర్చారు పోలీసులు. మేజిస్ట్రేట్ కోర్టుకి కారు వొనర్ కూడా వచ్చాడు. అతడు యమ్మా సితయామ్మని చూసి తెల్లబోయి "ఈ అమ్మాయి అప్పుడప్పుడు మా యింటికి వచ్చి మా అమ్మతో మాట్లాడేది. నాకు అక్కలు లేరు" అన్నాడు.
"వీడు చిన్న వెధవ.వీడి కసలెం తెలియదు. మా అమ్మ మొగుడి రెండో పెళ్ళాం నాల్గో మొగుడి రెండో భార్యకి వీడు సయానా కొడుకు అంచేత వీడు నాకు స్వయంగా తమ్ముడు ఆ కారు మీద వాడికెంత అధికారం వుందో నాకు అంతే అధికారం వుంది" బోను గుద్ది చెప్పింది. కారు వోనరు తడబడి బుర్రగోక్కుంటూ, "మా నాన్న గారికి ఇద్దరో ముగ్గురో భార్యల్లాంటి వాళ్ళు వున్న మాట నిజమే కాని వాళ్ళ మొగుళ్ళ సంగతి నాకంతగా తెలియదు. ఏదైనా కారు దొరికింది కాబట్టి కేస్ విత్ డ్రా చేసుకుంటున్నాను." అన్నాడు.
"చిన్న వెధవతో నాకు పేచీ యెందుకు? కారు వాడి దగ్గరుంటేనేం? నాదగ్గరుంటేనేం? ఎప్పుడైనా అవసరమైతే యిలాగే వాడు కుంటాను" ఉదారంగా చెప్పింది యమ్మా సితాయమ్మా మేజిస్ట్రేట్ నవుకుంటూ కేస్ కొట్టేశాడు. మేజిస్ట్రేట్ జాన్ సుబ్బయ్యలని చెత్త కాగితాలు నింపిన ఎయిర్ బేగ్స్ ఎందుకు మోసుకు వెళ్తున్నా"రని అడిగాడు.
"ఏమి లేని వాళ్ళలా కనిపిస్తే కారణం లేకపోయినా పోలీసులు అరెస్టు చేస్తారు.
ఖరిధైనా పెద్దమనుష్యుల్లా కనిపిస్తే అనుమానం వచ్చినా తొందరపడి అరెస్టు చెయ్యరు అందుకని ఖరీదైన బేగ్ల్లో చెత్త కాగితాలు నింపుకుని మోసుకు తిరుగుతున్నాము." చెప్పాడు సుబ్బయ్య నేరస్తులుగా నిరూపించడానికి ఏ ఆధారం లేకపోవడం వల్ల వాళ్ళని కూడా వదిలేసింది కోర్టు.

 Previous Page Next Page