"జరిగిందేదో జరిగిపోయింది ఈ కాలంలో అంతా అభ్యుదయాల గురించి చెప్పటం, ఆదర్శాలు వల్లించటమే గాని ఆచరణలో ఎంతమంది పెడుతున్నారు. సమయ మొస్తే ఎంతమంది నిలబడ గలుగుతున్నారు. ఆదర్శమో, ఆవేశమో ఏదయితే నేమి బాబా ఓ మంచి పని చేశాడు. ఓ విడో మెడలో తాళికట్టాడు, ఓ పైసా కట్నం పుచ్చుకోలేదు. బాబా కౌసల్య ఈడు జోడుగా వున్నారు. ఒకరి పెళ్ళికోసం ఇంకొకరు త్యాగం చేస్తూ ఏళ్ళు గడుపుతుంటే ఆ త్యాగం ఫలించకపోతే" బాబా గురించి సీత ఇలానే ఆలోచించింది. బాబా చేసిన పనిలో తప్పు కనిపించలేదు. కాకపోతే ముందుగా చెప్పి చేయటంలో వుండే మంచితనం కనిపించలేదు. కాకపోతే ముందుగా చెప్పి చేయటంలో వుండే మంచితనం కనిపించలేదు. ఏ పనయినా చేసి చెప్పటంలో పెద్దలమీద ఆ గౌరవము తొందరపాటు అన్ని నాకు తెలుసుననే ధీమా కనిపిస్తాయి.
బాబా విషయంలో రామచంద్రం ఆలోచన మరో విధంగా సాగుతున్నది. ,మొదటి నుంచి వీడు తానుపట్టిన కుందేటికి మూడు కాళ్ళ తత్వం. సానునయంగా చెప్పినా వినేవాడుకాదు కోప్పడితే అసలు లక్ష్యం చేసేవాడు కాదు. చిన్న చిన్న ఉద్యోగాలు ఎన్ని చూశాడు తను ఒక్కటి చెయ్యలేదు. అదృష్టం కొద్ది వాడి కోరికే నెరవేరింది. మంచి ఉద్యోగము అయింది. వాడు కోరి న్నమ్మాయినే తను పెళ్ళి చేసే వాడు కదా."
రామచంద్రంకి మళ్ళి కోపం ముంచుకోచ్చిసింది.
"నాన్నా!" అంటూ బాబా ఓ అడుగు ముందుకేశాడు.
"అగక్కడే" రామచంద్రం గట్టిగా అరిచాడు.
బాబా కుర్చుండిపోయాడు.
"మీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది, పుణ్యత్మురాలు. నాన్నని రా బతికే వున్ననురా. కాదు కాదు నేనూ చచ్చిపోయాను అనుకునేగా మాటమాత్రం ముందుగా నాకు తెలియచేయక ఓ యింటి వాడినయి మరి వచ్చావు. నీవు కోరినమ్మాయిని పెళ్ళాడ వద్దనే ముర్ఖుడ్ని కాదునేను, సీత పెళ్ళికాంది నీ పెళ్ళి చేసుకున్నావు మిగతావాళ్ళు ఎలా చస్తేనేమి, సీతని చూడరా? పదముదేళ్ళు నిండా యో లేదో సంసారం భారం మీద పడింది. ఇన్నాళ్ళు అదెలా చేసుకు వచ్చిందిరా. ఈ యింట్లో మీరు తల్లి లేని లోతు తీర్చింది. దాని సుఖం చూడొద్దురా? కోడలు పిల్ల బాగానే వుంది. వాళ్ళ వాళ్ళు కఠినులా? అయితే మీ నాన్నకి తర్వాత చెప్పొచ్చు ముందు తాళికడతావా లేదా అంటే "ఓ...." అని గంగిరెద్దులా తల వూపావన్న మాట నా దగ్గర చూసే నీ మొండి తనం వాళ్ళ దగ్గరకొచ్చేటప్పటికి ఏమయిందిరా? నీ మాటలు నే నమ్మాను మా వాళ్ళని పిలుస్తానంటే వద్దనే దగుల్ బాజీలుండరురా! నీవే....నీవే.... ఈ పెళ్ళికి తొందర పడ్డావు. ప్రతి ఉత్తరంలో నేను సీత పెళ్ళి విషయం రాయటం చూసి తెలివిగా పెళ్ళి చేసుకుని చక్కావచ్చేశావు. నేవ్వేం ఆడపిల్లవిటరా మెడలొంచి ఎవరో నీ పెళ్ళి చేయటానికి, లేక ముందే వెధవ పనేమయినా చేశావా, వాళ్ళు నిన్ను చావగొట్టి చెవులు మూసి పెళ్ళి చేసి పంపారు. ఈ యింట్లో మొదటి శుభకార్యం ఇంటికి పెద్దవాడివి, నే బతికే వున్నాను, వక్క మాట ముందే తెలియజేయనక్కర లెదూ? సరే! నీవేం చేయదల్చుకున్నవో చేసి చూపావు. అలాగే ఎవరి ఆశీర్వాదాలు అక్కరలేదు ఎవరితోనూ సంప్రదింపులక్కరలేదు. నీ మానాన నీవు బతుకు.... ఊ.... వెళ్లు ఇంకానుంచున్నావేం? అలష్యమయితే నా మనసు మారొచ్చు. లేనిపోని చిక్కులపాలవుతావు. సీత పెళ్ళికి డబ్బు కావాలంటాను. ఈ భారం నీకెందుకు వెళ్ళరా చెప్పేది నీకు కాదూ."
రామచంద్రం పిచ్చివాడిలా వాగేశాడు. సీత తండ్రి భుజం పట్టి ఊపుతూ "నాన్నా నాన్నా ఏమిటి కోపం, కాస్త, నిదానించండి అంటూనే వుంది. సీత మాట వినిపించుకోనేలేదు.
బాబాకి మాములుగానే కాస్త తొందర పాటు మాట, ఆవేశం వుంది. తండ్రి, "వెళ్ళు వెళ్ళు" అంటుంటే నిగ్రహించుకోలేకపోయాడు. "ఏ నాడు నన్ను నే చేస్తున్న పనిని మెచ్చుకున్నాడు గనుక ఈనాడు ఈ పని చేసినందుకు ? నిన్ను మెచ్చుకుంటాడు. మీకు నన్ను చూస్తేనే మొదటి నుంచి ని మంట అర్ధం లేని కోపం ఎందుకో నాకర్ధంకాదు ఎందుకైతేనేమి వెళ్ళమన్నారు అలాగే మీ మాట విననని బాధపడకండి. మీ మాట ప్రకారం వెళుతున్నాను. చెప్పినమాట విన్నానని ఆనందిస్తూ కూర్చోండి. పద కౌసల్య" అని కౌసల్య చేయి పుచ్చుకున్నాడు బాబా.
"బాబా! నాన్నతోపాటు నీవు తొందరపడుతున్నవా? అంది.
"సీతా! వాడిదోవన వాడిని పోనియ్యి, వాడిని బతిమిలాడావంటే నా మీద వట్టే" అన్నాడు రామచంద్రం.
"విన్నావుగా సీతా అయన ఒట్టు ఆయనకి అంతయిది అయినా నాకూ వుంది. పౌరుషం, పట్టుదల అదేదో ఆయననే బతిమిలాడు అంటూ బాబా కౌసల్య చేయి పుచ్చుకుని గడప దాటాడు.
అకస్మాత్తుగా జడివానకురిసి ఆగినట్లు, సుడిగాలి వచ్చి పోయినట్లు అయింది. బాబా రాక పోక.
"జరిగిందేదో జరిగినది. అనవసరంగా మాటలు దొర్లాయి మీరు తొందర పడ్డారేమో నాన్నా!" అంది సీత కాసేపాగి.
"వాడు చేసిన పని బాగుందా?" అన్నాడు రామచంద్రం.
సీత పెదవి కదపలేదు.
రూప, జయ, రాజు ముఖ ముఖాలు చూసుకున్నారు.