Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 15


    బయటికి వచ్చానో లేదో వంశీ ఎదురుపడ్డాడు.

 

    "ఎక్కడికెళ్ళావు? ఇంతసేపూ నీ కోసమే చూస్తున్నాను."

 

    "ఎక్కడికి వెళ్ళలేదు. ఏవో చిన్న చిన్న పనులు చూసుకొని వచ్చేటప్పటికి ఈ వేళయింది."

 

    "శివరాత్రి కదా. సినిమాకి చెక్కేశావనుకున్నాను."

 

    "మిత్రులు రమ్మన్నారుగానీ వెళ్ళలేదు."

 

    "రాత్రి జాగరణ వుంటున్నావా?"


    
    "ఆఁ"

 

    "మరి  కాలక్షేపం ఏమిటి? సుగుణావాళ్ళు ఆటలు ఆడటానికి రమ్మంటే బయల్దేరాను. నువ్వూ మాతో జాయినవ్వు. సరదాగా  వుంటుంది."

 

    "అలానే"

 

    ఇద్దరం సుగుణ ఇంటికి వెళ్ళేసరికి అందరూ నాకోసమే వెయిట్ చేస్తున్నారు. వంశీ కూడా రావడంతో వాళ్ళు చాలా ఆనందించారు.

 

    దాక్కునే ఆట మొదలైంది. అందరూ రౌండుగా జేరి తప్పట్లు వేశాము. మొదట సుగుణ భర్త దొంగయ్యాడు. దొంగ అయిన వ్యక్తికి కళ్ళు మూసి అందరూ దాక్కొన్నాక కళ్ళు తెరిచే బాధ్యతను సుగుణ అత్తయ్యకు ఇచ్చాం. ఆమెకు దాదాపు డభ్బై ఏళ్ళుంటాయి.

 

    తన అల్లుడ్ని కూర్చోబెట్టుకుని కళ్ళు మూసింది.

 

    మేమంతా తలో దిక్కుకు పరుగెత్తాం. నేను వాళ్ళింటి వెనుక నున్న గడ్డివాములో దాక్కున్నాను.

 

    కాసేపటికి దొంగ మమతను కనిపెట్టాడని. అందరూ వచ్చేయమణి సుగుణ కేకపెట్టింది. నన్ను ఎవరూ కనిపెట్టలేదన్న ఆనందంతో వచ్చాను. వంశీని చూసి గర్వంగా నవ్వాను.

 

    ఈసారి మమతకు కళ్ళు మూశారు.

 

    నేను తెలివిగా ముసలమ్మ వెనకే నక్కాను. ముసలమ్మ కళ్ళకు కట్టిన చేతుల్ని తీసేశాక మమత వెదకడానికి బయల్దేరింది.

 

    ఈసారి వంశీ దొంగయ్యాడు.

 

    "భలే భలే..... నువ్వు దొంగవన్న మాట" చిన్నపిల్లలూ చప్పట్లు చరిచాను. ఆ ఆట ఆడుతూ నేను చిన్నపిల్లనే అయిపోయాను.

 

    అమ్మావాళ్ళు నాకిష్టం లేకపోయినా మామయ్యకిచ్చి పెళ్ళి చేయడం గానీ, మా ఇద్దరిమధ్యా పేరుకుపోయిన అసంతృప్తిగానీ, నాకింకా పిల్లలు కలగలేదన్న బాధగానీ ఏమీ గుర్తుకు రావడం లేదు. చాలా కాలానికి నన్ను నేను మరిచిపోయాను. నాకింకా పెళ్ళి కానట్లు, సరదాగా  మసక వెన్నెల్లో, స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నట్లుంది.

 

    వంశీ కళ్ళు మూసింది ముసలమ్మ. ఎట్టి పరిస్థితిలోనూ వంశీకి కనబడ కూడదని ఎక్కడ దాక్కోవాలో ఆలోచించాను. మా డాబా సరైన స్థలమనిపించింది.

 

    సుగుణ ఇంటినుంచి నేరుగా వెళ్ళి మా  ఇంటి దొడ్లోకి చేరి అక్కడ  నుంచి వెనక దారిగుండా ముందుకు వచ్చి మెట్లెక్కాను. ఓ మూల ఒదిగి కూర్చున్నాను.

 

    పండరి భజన మెల్లగా విన్పిస్తోంది. వీధుల్లో లైట్లు వుండడంతో పలుచటి వెలుగు చీకటి దేహం మీది పొలుసులా వుంది. ఒక్క పొద్దు నీరసంతో గాలి మెల్లగా వీస్తోంది. ఆకాశంలో అక్కడక్కడా వున్న నక్షత్రాలు శివుని పూజించడానికి దేవతలు ఏరుకొచ్చిన తుమ్మపూల్లా వున్నాయి.

 

    వంశీ వచ్చినా కనబడకుండా వుండడానికి తల వంచుకుని పిట్టగోడ నీడలో కూర్చున్నాను.

 

    అయిదు నిముషాలు గడిచాయి.

 

    ఇక వంశీ ఇక్కడికి రాడని అనుకుంటూ వుండగా ఎవరో నా గడ్డం పట్టుకుని పైకి లేపుతున్నట్లు అనిపించింది.

 

    చివాలున తలెత్తాను.

 

    నా ఎదురుగ్గా మోకాళ్ళమీద కూర్చున్న వంశీ తదేకంగా చూస్తున్నాడు. ఏదో మాట్లాడబోయి అతన్ని చూసి మానుకున్నాను.

 

    అతను నా ప్రమేయం ఏమీ లేకుండానే నా మీదకు వంగి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు.

 

    ఒక్కసారిగా చలించిపోయాను.

 

    విచిత్రమేమిటంటే, నాకా క్షణంలో నా భర్త గుర్తురాలేదు. నేను వివాహితను అన్న విషయమే మరచిపోయాను. అంతకు ముందు ఆట  మొదలు పెట్టినప్పుడు కలిగిన భావనే కొనసాగింది. నాకింకా పెళ్ళికానట్లు సరదాగా మసకవెన్నెల్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నట్లు ఇప్పుడు వంశీ నన్ను ముద్దు పెట్టుకున్నట్లూ తోచింది.

 

    "వంశీ" అన్నాను.

 

    అతను ఏమీ  మాట్లాడలేదు. నన్ను గట్టిగా హత్తుకున్నాడు. ఆ పట్టులోనే నా మీద అతనికున్న మోహం తెలుస్తోంది. అతను వదులుతున్న ఉచ్చ్వాస నిశ్వాసాల్లోనే నామీదున్న కోరిక తెలుస్తోంది. అతని గుండె శబ్దంలోనే ఆవేశ తీవ్రత ఎంతో తెలుస్తోంది.

 

    పిచ్చిపట్టినట్లు నన్ను నలిపేస్తూ ముద్దుల్లో ముంచేస్తున్నాడు.

 

    "ఆ మాధుర్యానికి నా పెదువులు పగడాలై, నా కళ్ళు నీలాలై, నా బుగ్గలు రత్నాలై, నా పాలిండ్లు వజ్రాలై నేనే నవరత్న ఖచిత కిరీటమై అతని తలమీద అలంకారమైనట్లు తోచింది.

 

    ఠక్కున నన్ను వదిలి ఒక్కతోపు తోశాడు. ఎంత లాఘవంగా తోశాడంటే నా జుట్టు ముడి ఊడింది.

 

    వెంట్రుకలన్నీ రెండు చేతుల్లోకి తీసుకుని ముఖంమీద రుద్దుకున్నాడు. ఎంత లాలిత్యంగా రుద్దుకున్నాడంటే ప్రాణంలేని వెంట్రుకలు సైతం పులకరించినట్లు అనిపించింది.

 

    నాముఖం మీద అలానే తలపెట్టి అదిమాడు. ఎంత బలంగా అదిమాడంటే కళ్ళలోని రంగుల కలలన్నీ ఒక్కసారిగా విచ్చుకున్నాయి.

 

    పెదవులపై పెదవులు ఆన్చి వత్తాడు. ఎంత మాధుర్యంగా వత్తాడంటే అమృతాన్ని నింపిన చషకాలు పగిలినట్లు ఎంగిలిమయమై పోయింది అక్కడంతా.

 

    అలానే కిందకు దిగి నా వక్షస్థలం మీద ముఖాన్ని రాశాడు. ఎంత ఆవేశంతో రాశాడంటే యవ్వనాలు పొంగి పరవశించాయి. 'వి' షేప్ లో తెరుచుకున్న అక్కడ పళ్ళతో నొక్కాడు. ఎంత హాయిగా నొక్కాడంటే ఏదో  కావాలన్న ఆరాటం పొగలై సెగలై లేచింది.

 

    అక్కడి నుంచి దిగి నా నడుం మడతలను చేతులతో వత్తాడు. ఎంత  అద్భుతంగా వట్టాడంటే అక్కడ ప్రారంభమైన ప్రకంపనలు శరీరాన్ని ఊపేశాయి. బొడ్డును వెదుక్కుని ముద్దాడాడు. ఎంత థ్రిల్లింగ్ గా వుందంటే సుఖానిచ్చే నాడులన్నీ అక్కడే కేంద్రీకృతమైనట్లు అన్పించింది.

 

    మొదటిసారి పురుషుడ్ని పంచుకుంటున్న అనుభూతి. వంశీ నాకంటే చిన్నవాడనీ, నేను అతనికి అత్తమ్మనవుతాననిగానీ, దాక్కొనే ఆట ఆడుతూ మేమలా చిక్కుకుపోయామనిగానీ అనిపించలేదు. సృష్టి మాధుర్యాన్ని చవిచూడడానికి ఆయత్తమవుతున్న రెండు జీవులమైపోయాం.

 

    దూరంగా పండరి భజన పాట విన్పిస్తోంది.

 

    సుఖం బరువుకి నా కళ్ళు మూతలు పడ్డాయి.

 

    నన్ను వంశీ పూర్తిగా ఆక్రమించుకున్నాడు.

 Previous Page Next Page