Previous Page Next Page 
వెలుగుబాట పేజి 14


    
    కుమార్ మాటలు అబద్ధం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ లో అనఫిషియల్ ఎలా పనిచెయ్యగలడు?
    ఆ దారిన పోతున్న సుందరమ్మ కుమార్ ని చూసి ఆగింది. వికసించిన ముఖంతో దగ్గరగావచ్చి "బాబూ బాగున్నావా? అని పలకరించింది. కుమార్ బోలా మనిషి. కల్లా కపటం లేకుండా మనసులో మాట మాట్లాడేస్తాడు. మీరు బాగున్నారు, రండి కూచోండి, సుందరమ్మ నిజంగానే చాలా బాగుపడింది. సార్ధక నామధేయురాలిలాగా ఉంది. ఖరీదైన చీర కట్టుకొంది. వంటిమీద నగలుకూడా వున్నాయి. వయసు ఎక్కువేమీలేదు. కానీ కుమార్ తో పుత్రవాత్సల్యంతో మాట్లాడుతుంది.
    "అమ్మాయిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావుబాబూ? ఎప్పుడొచ్చావు, ఇక్కడుంటావా ఇంక!"
    "వుండాలనే వుందండీ కాని....."
    "గబగబా తమ సమస్య అంతా చెప్పేసాడు.
    "ఏం చెయ్యమంటారు?" అన్నాడు చివరికి సలహా అడుగుతున్నట్లు.
    పక్క గదిలో ఉండి ఈ మాటలన్నీ  వింటున్న ఝాన్సీ మనసులో ఏదో అసహనం రగిలింది. కొంత విసుగుగా బయటకువచ్చి "ఈ విషయాలన్నీ అందరికీ ఎందుకు చెప్పటం" అంది.
    ఝాన్సీ ముఖంచూసి ఆమె మనసును అర్ధంచేసుకో గలిగిన సుందరమ్మ నవ్వుకొని "అందరికీ ఎందుకు చెబుతాడమ్మా! నాకుమాత్రం చెబుతున్నాడు" అని, పోని నువ్వు చెప్పు, నీ జీతం,  అతని జీతం ఏమిటి? చెరిసగం దేనికి? బాబు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. నీ జీతం ఇద్దరికీ సరిపోదా?" అంది.
    ఝాన్సీ సమాధానం చెప్పకముందే, కుమార్ గభాలున "ఛ ఛ అదెలా? ఆవిడజీతం నేనెలా తీసుకుంటాను" వాళ్ళ కుటుంబంలోనూ చాలా ఖర్చులు.....అన్నాడు. ఝాన్సీ ముఖం ముడుచుకుపోయింది. సుందరమ్మ ఇద్దరి ముఖాలవంకా మార్చి మార్చి చూసి, తనలో తను కొంచెంసేపు ఆలోచించుకొని, "పోనీ, కుమార్ బాబూ నా ఇంట్లో ముందు గది మీకు అద్దెకిస్తాను. అక్కడ మీరు ప్రైవేటు ప్రాక్టీస్  పెట్టుకొని అవసరమైనపుడు ఝాన్సీగారికి సహాయం చెయ్యండి" అంది. కుమార్ పరమానందంతో "థాంక్యూ! సుందరమ్మ గారూ  థాంక్యూ! కాని, మీకు అద్దె అడ్వాన్సుగా ఇయ్యలేను. కొంత సంపాదించాక ఇస్తాను. ఎనీహౌ ఐకెన్ పిక్ అప్. బహుశః పైకిరాగలను. మీకు ఇబ్బందయితే....." అంటూంటే సుందరమ్మ నవ్వి "మీరెప్పుడు ఇయ్యగలిగితే అప్పుడు ఇయ్యండి. ఈరోజే ముందుగది ఖాళీచేయిస్తాను. అవసరమయితే మధ్య తెరకూడా కట్టిస్తాను." అని, ఝాన్సీతో కూడా చెప్పి వెళ్ళిపోయింది. ఈ పరిణామా లేవీ ఝాన్సీకి సుముఖంగా లేవు. ఆమె  మనసంతా ఏదో చేదు మింగినట్టుగా అవుతోంది. కుమార్ ఆమె  దగ్గరగా వచ్చి "ఝన్సీ! నేను నీతోనే ఉండటానికి ఇది బంగారంలాంటి అవకాశం కదూ!" అని నిర్మలంగా అంటుంటే, ఆమె మనసు దూదిపింజలా ఊహల అంచులలోకి తేలిపోయింది. "కాని, కుమార్, ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవటానికి డాక్టరూ, గదీ మాత్రమే చాలా?" అంది.
    పొంగుతున్న ఉత్సహంమీద నీళ్ళు చల్లినట్లుంది. అసలు సమస్య మొదటి సమస్య ముందుకొచ్చింది. "ఐడియా" నవ్వుతూ అన్నాడు కుమార్. ఆ సమయంలోకూడా నవ్వుతూనే వున్నాడు.
    "నేను సైకిల్ మీద ఇంటింటికీ వెళ్ళి ఎవరికైనా జబ్బులుంటే, నిన్ను చల్లినట్లుంది. అసలు సమస్య మొదటి సమస్య ముందుకొచ్చింది. "ఐడియా" నవ్వుతూ అన్నాడు కుమార్. ఆ సమయంలోకూడా నవ్వుతూనే వున్నాడు.
    "నేను సైకిల్ మీద ఇంటింటికీ వెళ్ళి ఎవరికైనా జబ్బులుంటే, నిన్ను కలుసుకోమని చెబుతాను. మనకు తెలుసుగా, ఈ గ్రామంలోవాళ్ళు జబ్బు ముదిరేవరకూ రారు. ఈ రకంగా గ్రామస్థులతో స్నేహం సంపాదించు కొంటాను. అలా పేషంట్స్ ని నావైపు ఆకర్షించుకొంటాను. ఈ లోగా డబ్బు సంపాదించుకొని, ప్రాక్టీస్ ప్రారంభిస్తాను."
    మనసులో పెద్దగా ఆశ కలగకపోయినా, ఉత్సాహంతో "బాగుంది!" అంది ఝాన్సీ.....
    "కాని.....ఝాన్సీ....." సంకోచంతో ఆగిపోయాడు. సర్వస్ గా నవ్వుతూ.
    "ఈలోగా కొంచెం డబ్బు అవసరమయితే అప్పు...." అతడి సౌజన్యానికి కరిగిపోయింది ఝాన్సీ.
    "కుమార్, ఈ ఉద్యోగం నీది, ఈ జీతం నీది. అసలు నేనే....."
    కుమార్ కొంచెం చొరవగా ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుని "ఎప్పటికప్పుడు అక్కడ ఆగిపోతావేం ఝాన్సీ?" అన్నాడు.
    ఆమె తన చేతులు వెనక్కు తీసుకోలేదు.
    "నా భవిష్యత్తు నిర్ణయించుకొనే స్వాతంత్ర్యం నాకింకా  రాలేదు కుమార్! మా అమ్మ అష్ట కష్టాలూపడి నన్ను ఇంతదాన్ని  చేసింది. తమ్ముణ్ణి, చెల్లెల్ని గట్టున పడేస్తే కాని ఆ బుణం తీరదు. అప్పుడుకాని...." అంతేకద! నా పరిస్థితి అలాగే ఉందికదా! నిరీక్షణే అయితే ఫరవాలేదు, ఎంతకాలమైనా ఎదురుచూడగలను."

 

                                                               *    *    *

 

    ఆ మరునాటినుంచే తన కార్యక్రమం ప్రారంభించాడు కుమార్. స్వయంగా వెళ్ళి ఆ శ్రమజీవులను చూస్తోంటే, అతనికి అంతకుముందు తెలియని అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఆ అభాగ్యులు రోగాలను స్వయంగా ఎలా ఆహ్వానిస్తున్నారో అర్ధం కాసాగింది. గొడ్లను చెరువుల్లో కడగడం, అక్కడే బట్టలుతకటం మానరు- అవే తాగటానికి తీసికెళ్తారు. ఎంతమంది ఎన్ని విధాల చెప్పినా  మరుగుదొడ్లు అసలులేవు పెద్దవాళ్ళు చెంబు  తీసుకుని బయటకుపోతారు  కాని, పిల్లలు  ఇళ్ళముందే కూచుంటారు యధేచ్ఛగా విహరించే పందులు అదంతా శుభ్రం చెయ్యవలసిందే! ఇళ్ళ ముందు రొచ్చు, మురికి నీటిగుంటలు తప్పనిసరి. కొందరు ఏ పుణ్యాత్ముల దయవల్ల సంపాదించుకొనేవారో కాని పాచిపోయిన అన్నం, కంపుకొట్టే పులుసూ కూడా తినటానికి సిద్ధపడేవారు తాగుడులాంటి దుర్వ్ససనాలుగలవారు నూటికి తొంభయిమంది. అన్నింటికంటె ప్రమాదకరమైనవి మూఢచారాలు. దేవతలకు మొక్కుబళ్ళు చెల్లించుకొంటారేకాని, టీకాలు వేయించుకోరు. రోగాలు రాకుండా వ్యాధి నిరోధక ఇంజక్షన్ లు ఇచ్చేవారులేరు. పుచ్చుకొనేవారూ లేరు. ఇలా తిరగటం కారణంగా వైద్యుడిగా ఏమంత సేవ చెయ్యలేక పోయినా గ్రామంలో అందరికి సన్నిహితుడయ్యాడు. నిర్మలమయిన అతడి చిరునవ్వు  ఆదరంతో కూడిన అతడి సంభాషణ డాక్టరంటే ఏదో మరోలోకంలోంచి దిగివచ్చాడనే వాళ్ళ భ్రమను పోగొట్టాయి. ఎవరికైనా ఏ కొంచెం సలతగా వున్నా, అశ్రద్ధ చెయ్యనిచ్చేవాడుకాదు కుమార్. అనేక విధాల నచ్చచెప్పి ఆస్పత్రికి పంపేవాడు. అక్కడ ఝాన్సీ ఆదరణకూడా గ్రామవాసుల కెంతో సంతృప్తినిచ్చేది. ఒకప్పుడు రోజుకి ఇద్దరు ముగ్గురూ కంటె రోగులు వచ్చేవారు కారు ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలనుండికూడావస్తున్నారు. క్యూలలో నిలబడవలసి వస్తుంది స్త్రీ, పురుష రోగులు. రోగులు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కుమార్ ఝాన్సీకి సహాయం చేసేవాడు. ఆ గ్రామంలో అందరికీ కుమార్ ఎందుకు సస్పెండ్ అయ్యాడో తెలియటంవల్ల- ఎవరూ కుమార్ తో వైద్యం చేయించుకోవటానికి సంకోచించ లేదు సరికదా, మరింత ఆనందంతో అతని దగ్గరకొచ్చేనాకు, అతనితో మాటాడుతోంటే వాళ్ళకు తమ స్నేహితునితో మాట్లాడుతున్నట్లే ఉండేదికాని, ఎవరో డాక్టర్ తో మాట్లాడుతున్నట్లు ఉండేదికాదు. అంతనిరాడంబరంగా, ఆప్యాయంగా మసిలేవాడు కుమార్.

 Previous Page Next Page