Previous Page Next Page 
బెస్ట్ జోక్స్ పేజి 14


    చాలామంది జంటలకు గ్రూప్ థెరపీ నిర్వహిస్తున్నాడో సైకియాట్రిస్ట్.
    "మీలో ప్రతి ఒక్కరూ ఏదొక విషయం మీదో, వస్తువు మీదో అతిగా ఆశలు పెంచుకోవటం నేను ఈ సెషన్ లో గమనించాను. ఫరెగ్జాంపుల్- ముందు వరుసలో మొదటి కుర్చీలో కూర్చున్నామెకు డబ్బుమీద తెగ కోరిక. అ కోరిక ఎంత ఎక్కువంటే ఆఖరికి తన కూతురిపేరు కూడా ధనలక్ష్మి అని పెట్టుకుంది.
    రెండో కుర్చీలో కూర్చున్నామెకి తిండి మీద ఎడతెగని ప్రేమ - ఆ కోరిక వల్లే తన కొడుకు పేరు నలభీముడు అని పెట్టుకుంది. ఇక మూడో కుర్చీలో కూర్చున్నామెకి నగలమీద ఎంత మోజంటే తన కూతురికి బంగారమ్మ అని పేరు పెట్టింది-"
    అతను కుర్చీలో నాలుగో స్త్రీ వంక చూసేసరికి ఆమె ఖంగారుగా తన కొడుకు చేయిపట్టుకుని "పదరా అరవింద్! మనం వెళ్ళిపోదాం" అంటూ చకచక బయటకు నడిచి, తన భర్త మోహన్రావ్ ని కలుసుకుంది.

    "ఏమిటోయ్ బేరర్- నేను ఆలూ పరోటా తెమ్మని చెప్తే పరోటా తెచ్చావ్ గానీ లోపల ఆలూలేదేంటి సంగతి?"
    "ఎలావుంటుంది? కాశ్మీరీ పులావ్ అంటే పులావ్ లో నిజంగా కాశ్మీర్ ఉంటుందా? అర్ధం లేని మాటలు మాట్లాడకు"

    రామణారావ్ ఆఫీస్ లో ఉండగా సెల్ మోగింది.
    "ఒరే రమణారావ్! నీ పెళ్ళాన్ని కిడ్నాప్ చేశాంరా! మర్యాదగా సాయంత్రం లోపల యాభయ్ వేలు ఇవ్వకపోతే నువ్వింక జన్మలో నీ పెళ్ళాన్ని చూడలేవ్-"
    రమణారావ్ వెంటనే సెల్ ఆఫ్  చేసేసి లోపలి సిమ్ కార్డ్ తీసి ముక్కలు చేసి పారేసి ఆనందంగా డాన్స్ చేయటం మొదలుపెట్టాడు.

    నీలోఫర్ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన పాపాయిని ఓ కుక్క అలవాటు ప్రకారం ఎత్తుకుపోయింది.
    ఆ పాపాయి తల్లి భోరున ఏడుస్తోంటే లేడీ కానిస్టేబుల్ కి ఓదార్చాలనిపించింది.
    "ఏడవకమ్మా! అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూంటాయ్! అంతెందుకు సంవత్సరం కిందట కూడా ఇదే వార్డ్ లో ఇదే కుక్క ఇంకో పాపాయిని ఎత్తుకుపోయింది-"
    ఆ స్త్రీ ఇంకా పెద్దగా భోరుమంది.
    "నాకు తెలుసు- అప్పుడూ నా పాపనే ఎత్తుకుపోయిందది-"
    "అలాగా! అయితే కావాలని కేర్ లెస్ గా ఉన్నందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నా!" అంది కానిస్టేబుల్ ఆమెకు బేడీలు వేస్తూ.

    భర్త : భగవంతుడా! ఈ గయ్యాళి పెళ్ళాంతో నేను వేగలేను- దయచేసి నన్ను నీ దగ్గరకు తీసుకెళ్ళిపో!
    భార్య : భగవంతుడా! మంచి భర్తనిమ్మని నేను కోరిక కోరిక ఎలానూ తీర్చలేదు. కనీసం ఆయన కోరికయినా తీర్చుస్వామీ!

    భర్త : ఏమిటే? రోజూ అడ్డమయినోళ్ళతో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడతావ్- ఇవాళ అరగంటకే ఫోన్ పెట్టేశావేంటి?
    భార్య : అది రాంగ్ నెంబర్ లేండి! అవతల వాళ్ళకేదో అర్జంటు పని ఉందని కట్ చేసేశారు.

    ఓ ముసలాయన కళ్ళ డాక్టర్ దగ్గర కెళ్ళి చూపు సరిగ్గా లేదని కళ్ళ పరీక్ష చేయించుకున్నాడు.
    డాక్టర్ అతనికి ఒక కళ్ళజోడు వేసుకోమని రాసిచ్చాడు.
    "అంటే ఆ మసక కళ్ళజోడు వేసుకుంటాననుకో! అప్పుడు నేను పుస్తకాలూ, పత్రికలూ అన్నీ చదవగలుగుతానా?" అడిగాడాయన.
    "ఇంకా అనుమానమేమిటి? ఏ పుస్తకం అయినా సరే! బ్రహ్మాండంగా చదవగలుగుతావ్!"
    ముసలాయన మొఖంలో ఆశ్చర్యం కనిపించింది.
    "అబ్బ! సైన్స్ ఎంత గొప్ప అభివృద్ధి చెందింది? చిన్నప్పటి నుంచీ ఇప్పటివరకూ చదవటం రాయటం నేర్చుకోకపోయినా ఆ కళ్ళజోడు పెట్టుకుంటే మొత్తం చదవటం వచ్చేస్తుందన్నమాట! అయితే ఓ వంద కళ్ళజోళ్ళివ్వండి!"
    "ఆ! వందా? ఎందుకు?"
    "మన దేశంలో రాజకీయ నాయకులందరికీ ఇస్తాను. వాళ్ళకి చాలా అవసరం"

    చాలాకాలం తరువాత రామారావ్, రంగారావ్ మార్కెట్లో కలుసుకున్నారు.
    "అదేంటి? నువ్ చచ్చిపోయావని ఆ మధ్య మన రామకృష్ణ చెప్పాడే!" అన్నాడు రామారావ్ రంగారావ్ వేపు డౌటుగా చూస్తూ.
    "నేను చావటమేమిటి? నిక్షేపంలా ఉంటేనూ-"
    "ఏమో! నేన్నమ్మలేను! మొదటి నుంచీ నీకు అన్నీ అబద్దాలు చెప్పటం అలవాటు!"
    "అదేంటి? నేను నీకు ఎదురుగ్గా కనబడుతున్నా నమ్మవా?"
    "ఎలా నమ్మను? ఆ రామకృష్ణ ఏం చెప్పినా నూటికి నూరుపాళ్ళూ నిజాలే చెప్తాడు- వాడి మాట నమ్మకుండా ఎలా ఉంటాను?" అనేసి గాల్లోకెగిరి మాయమయి పోయాడు రామారావ్.

    ఒక డాక్టర్ కీ వాళ్ళ ఆవిడకీ పెద్దయుద్దం జరిగింది.
    "ఛ! నీతో ఎలా సంసారం చేస్తున్నానో నాకే తెలీటం లేదు. సరిగ్గా వంట చేయటం రాదు. మాట్లాడటం రాదు. ఆఖరికి ప్రేమ కలాపాలు జరపటం కూడా చేతకాదు! ఓ గాడ్" అని తిట్టి కోపంగా హాస్పిటల్ కెళ్ళిపోయాడు.
    మధ్యాహ్నం పన్నెండింటికి పేషెంట్స్ రష్ తగ్గాక భార్యను సముదాయించాలనే ఉద్దేశ్యంతో ఇంటికి ఫోన్ చేశాడు.
    భార్య చాలా సేపటికి ఫోన్ తీసింది గానీ ఇంకో మొగగొంతు కూడా ఫోన్లో వినపడింది.
    "ఏమిటి? ఇంకెవరిదో గొంతు వినపడుతుంది?"
    "నా పాత క్లాస్ మేట్ ని పిలిపించాను- ఎందుకంటే నాకు ప్రేమ కలాపాలు జరపటం కూడా చేతకాదన్నారుగా మీరు! ఆ విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకోవటం మంచిదనీ....."

    ఒక తిక్కారావ్ ఓ ఎనిమిదంతస్థుల బిల్డింగ్ త్వరత్వరగా మెట్లు దిగి ఆ బిల్డింగ్ పైకి చూస్తున్నాడు.
    "ఏమిటి? అంత హడావుడిగా కిందకు దిగి మళ్ళీ పైకి చూస్తున్నావ్?" అతనిని గమనిస్తోన్న ఓ పెద్దమనిషి అడిగాడు.
    "నేను టెర్రస్ మీద కెళ్ళినప్పుడు నా వాచ్ జారికిందపడింది - దానికోసం చూస్తున్నాను-"
    "పిచ్చివాడా! అదింకా గాల్లో ఎందుకుంటుంది? ఎప్పుడో కిందపడి ఉంటుంది".
    "నువ్వే పిచ్చాడివి! అది అరగంట స్లో! అరగంట అవడానికి ఇంకో పదినిమిషాలుంది-"

    పరమ నికృష్టుడిగా పేరు పొందిన రజనీరావ్ ఎలక్షన్లో నిలబడ్డాడు.
    అప్పటికే ఎన్నికల చిహ్నాలన్నీ ఇండిపెండెంట్ కాండేట్లు లాగేసుకోవడంతో రజనీరావ్ కి రెండే రెండు ఛాయిస్ లిచ్చాడు ఎన్నికల కమీషనర్.
    గాడిద, కుక్క-
    "గాడిదయితే బాగుంటుంది- అది తీసుకుంటాను- ఏమంటారు?" అంటూ అభిమానుల నడిగాడతను.
    "వద్దుబాసూ!" అన్నారు వాళ్ళు.

 Previous Page Next Page