Previous Page Next Page 
బెస్ట్ జోక్స్ పేజి 13


    ఓ పెద్దమనిషి హడావుడిగా పోలీస్ స్టేషన్లో కొచ్చాడు.
    "మా పక్కింటతన్తో పెద్ద న్యూసెన్స్ గా ఉందిసార్! రోజూ నాతో పోట్లాట పెట్టుకుంటున్నాడు-" కంప్లెయింట్ చేశాడతను.
    "కారణం ఏమిటి?"
    "మా కుక్క రోజూ న్యూస్ పేపర్ తెచ్చి నాచేతి కందిస్తుందని వాడికి ఏడుపు సార్-"
    "మీకుక్క న్యూస్ పేపర్ తెచ్చిస్తే వాడికెందుకు? కావాలంటే వాడినీ ఓ కుక్కను పెంచుకోమని చెప్పు-"
    "పాయింట్ అది కాద్సార్! మాకుక్క తెచ్చే న్యూస్ పేపర్ వాడిది! నాకసలు న్యూస్ పేపరే రాదు-"

    "ఒరేయ్ మోహన్! నేను జీవితంలో రెండు గొప్ప సత్యాలు తెలుసుకున్నాన్రా!" అన్నాడు రాంబాబు మందుకొడుతూ.
    "అవేమిటో నాక్కూడా చెప్పరా!" ఆశగా అడిగాడు మోహన్రావ్.
    "మొదటిదేమిటంటే అవకాశం అనేది ఒకే ఒక్కసారి మన తలుపు తడుతుంది-"
    "ఆహా! అద్భుతమయిన సత్యం చెప్పావ్ గురూ! మరి రెండోదేమిటి?"
    "మనకు దొరికిన అద్బుతమైన అవకాశాన్ని ఆ తలుపు తట్టిన చప్పుడే సర్వనాశనం చేస్తుంది"

    "ఏమోయ్! మీ షాపులో కుక్క బిస్కెట్లున్నాయా?" ఓ షాపతన్ని అడిగాడు ఓ రోమియో- తన గాళ్ ఫ్రెండ్ ముందు ఫోజుకొడుతూ.
    "ఉన్నయ్ సార్- ఇక్కడే తింటారా? పాక్ చేసి తీసుకెళ్ళి ఇంటి దగ్గర తింటారా?"

    రాత్రి రెండయినా భర్త ఇంకా నిద్రపోకుండా తెగ టెన్షన్తో అటూ ఇటూ పచార్లు చేస్తోంటే భార్యకు మెళుకువ వచ్చింది.
    "ఏమిటి? రెండయినా ఇంకా పడుకోలేదా? ఏమిటి సంగతి?"
    "ఒకటే టెన్షనే! ఇంత టెన్షన్ లో ఇంక నిద్రేం పడుతుంది?"
    "మీకు టెన్షనా? ఎందుకా టెన్షన్?"
    "నీకు చెప్పలేదుగానీ రెండు నెలల క్రితం ఆ ఎదురింటాయన దగ్గర ముఫ్ఫైవేలు అప్పు తీసుకున్నానే! ఆ బాకీ రేపు ఉదయం 9 గం||కల్లా తీర్చేయాలి. నా దగ్గరేమో ఒక్క పైసా లేదు. రేపు మాణింగ్ డబ్బు ఇవ్వకపోతే ఊరుకోనని అతను ముందే చెప్పాడు. ఇప్పుడెలాగో ఏమో అర్ధం కావటం లేదు" వర్రీడ్ గా చెప్పాడా భర్త.
    "ఓశ్- ఈ మాత్రానికే టెన్షన్ పడి నిద్రంతా చెడగొట్టుకోవాలా? ఒక్క నిమిషం ఓపికపట్టండి! నేను సెటిల్ చేస్తా" అంటూ వెళ్ళి ఎదురింటి డోర్ బెల్ మోగించిందామె.
    ఇంటతను కళ్ళు నులుముకుంటూ తలుపు తెరచాడు.
    "చూడండి! మా ఆయన మీకు 30 వేలు రేపు మాణింగ్ తొమ్మిదికల్లా ఇచ్చేస్తానని ప్రామిస్ చేశారంట గదా!"
    "అవును! అయితే ఏంటి?"
    "ఆయన దగ్గర ఒక్కపైసా కూడా లేదు. ఇంకో ఆరునెలల వరకూ బాకీ తీర్చలేరు. ఇదే చెప్తామని వచ్చా!" అనేసి తనింట్లో కొచ్చి తలుపులు మూసేసింది.
    "ఇంక మీరు హాపీగా నిద్రపోండి! టెన్షన్ పడటం- నిద్రపోకుండా రాత్రంతా పచార్లు చేయటం- ఇప్పుడు వాడిపని- ఆర్నెల్ల వరకూ మీకే టెన్షనూ ఉండదు-" అంది నిద్రలోకి జారిపోతూ.

    "మమ్మీ టీవీ రిమోట్ నాకివ్వు మమ్మీ- ప్లీజ్ మమ్మీ"
    "ఎందుకు"
    "నేను కార్టూన్ ఛానెల్ చూస్తా"
    "మీ నాన్న ఉన్నారుగా - వేరే కార్టూన్ ఎందుకింకా?"
    "డాడీని చూసిచూసి బోరయిపోయిందే--రిమోట్ ఇవ్వుమమ్మీ- ప్లీజ్-"
    అర్దరాత్రి రంగారావ్ భోరున ఏడుస్తూ నిద్రలేచాడు.
    "ఏం జరిగింది?" ఖంగారుగా అడిగిందతని భార్య.
    "కలొచ్చిందే-"
    "ఏం కల?"
    "కత్రినాకైఫ్ నాకోసం మనింటి కొచ్చిందంట- నువ్వూ, కత్రినా నాకోసం తెగ కొట్టుకున్నారంట-"
    "కొట్టుకుంటే కొట్టుకుని ఉండొచ్చు- దానికి ఏడుపెందుకు?"
    "ఆ ఫైట్ లో నువ్వే గెలిచావ్ కదే మరి? ఏడ్వకేం చేయను?"
    "పిచ్చివాడా? కత్రినా గెల్చుంటే అది లైఫ్ లాంగ్ ఏడ్చేది కదా?"

    కొత్తగా పెళ్ళయిన నవీన్ కి షర్మిలకూ ప్రతి విషయంలోనూ ఏదొక రాద్దాంతం జరగటం మామూలయిపోయింది.
    "నీకు మంచి కూరగాయలు తేవటం కూడా చేతకాదు- యూ ఆర్ హోప్ లెస్" అంది షర్మిల ఓ రోజు కోపంగా.
    నవీన్ వళ్ళుమండిపోయింది.
    వెంటనే వాళ్ళ పిన్నమ్మను ఇంటికి తీసుకొచ్చాడు.
    "మీ పెళ్ళికి ముందు మా ఇంట్లోకి కావలసిన కూరగాయలన్నీ నవీనే తెచ్చేవాడమ్మా! చాలా మంచి ఫ్రెష్ కూరగాయలు సెలక్ట్ చేసి తెచ్చేవాడు." అంటూ సర్టిఫికెట్టిచ్చి వెళ్ళిపోయిందామె.
    ఇంకోరోజు ఇద్దరూ నవీన్ పాడుతున్న పాట విషయంలో గొడవపడ్డారు.
    "నీకసలు పాడటం రాదు. నీ గొంతు కఠోరంగా ఉంటుంది" అంది షర్మిల.
    వెంటనే తన ఫ్రెండ్ రాజేష్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు నవీన్.
    "నవీన్ ఒండర్ ఫుల్ సింగరండి! మా ఆఫీస్ కండక్ట్ చేసిన లలిత సంగీతం పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాడు" అన్నాడు రాజేష్.
    మరో వారం పోయాక ఇద్దరికీ బెడ్ రూమ్ లో గొడవయింది.    
    "ఎందుకంత లౌజీగా ప్రవర్తిస్తావ్- నీకసలు లవ్ మేకింగ్ కూడా రాదు" అంది షర్మిల చిరాకుగా-"
    ఆ మాటన్నకాసేపటికే ఓ అమ్మాయి డోర్ బెల్ మోగించింది.
    షర్మిల తలుపు తెరిచింది.
    "నేను నవీన్ గాళ్ ఫ్రెండ్ ని! మీ కామెంట్స్ గురించి ఇప్పుడే నవీన్ ఫోన్ చేసి చెప్పాడు. మీరు మరోలా అనుకోనంటే ఓ మాట చెప్తాను- నవీన్ బెడ్ రూమ్ లో చాలా ఎఫిషియెంట్ పర్సనండీ! అంత అద్భుతమయిన లవ్ మేకింగ్ ని నేనింకెక్కడా ఫీలవ్వలేదు-" అందామె.

    "ఏంట్రా? ముఫ్ఫయ్ రోజుల్లో మళయాళం నేర్చుకోండి అనే పుస్తకాలు రెండు కొన్నావెందుకు?"
    "పిచ్చివాడా? పదిహేను రోజుల్లోనే నేర్చుకోవాలని రెండు కొన్నాన్రా-"

    "మన లెక్చరర్ మండే నాడు సీరియస్ గా ఉంటాడు కదా! నవ్వించాలంటే ఏం చేయాలి?"
    "ఆ మాత్రం తెలీదేంట్రా? మండేనాడు నవ్వాలంటే ఫ్రైడే నాడు జోక్ చెప్పాలి. అంతే! వెరీ సింపుల్-"
    "ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఏ ఫ్రైడే జోక్ చెప్పాలో చెప్పు దమ్ముంటే-"

    "ఏంట్రా నీ బాగ్ లో ఏవో మోసుకెళ్తున్నట్లున్నావ్?"
    "యాపుల్స్-"
    "నీ బాగ్ లో ఎన్ని యాపుల్స్ ఉన్నాయో నేను చెప్పగలుగుతే ఒకటి నాకిస్తావా మరి?"
    "ఒకటేం ఖర్మ- ఉన్న రెండూ ఇచ్చేస్తా-"
    "ఓ.కే. అయితే చెప్పేస్తా చూస్కో- నాలుగు యాపుల్స్ ఉన్నయ్ నీ బాగ్ లో-"

 Previous Page Next Page