"ఎందుకని?"
"నీకూ- ఎన్నికల చిహ్నానికి కొంచెమయినా డిఫరెన్స్ ఉండాలిగా!"
"అలాగా! అయితే మరిప్పుడెలా?"
"ఎలాగేముంది? కుక్కని తీసుకో-"
"కానీ మా మిసెస్ అది వద్దంటోంది!"
"ఎందుకు? కుక్కతో ఏమిటి ప్రాబ్లెమ్?"
"నాకూ, దానికీ తేడా ఎక్కువ ఉండాలి కదా అని అంటోంది-"
ఓ ప్రసాదరావ్ పెళ్ళాంతో హైదరాబాద్ చూడ్డానికెళ్ళాడు. సాయంత్రానికల్లా ఇద్దరూ దుర్గంచెరువు చేరుకున్నారు.
అక్కడికొచ్చే హైటెక్, ప్రేమ జంటల గుంపుల్లో ఇద్దరూ చెరోదారీ అయిపోయారు.
ఆ ఏరియా అంతా భార్య కోసం వెతికి వెతికి చివరకు అలసిపోయి ఆ పక్కనే ఉన్న గుళ్ళోకెళ్ళాడు ప్రసాదరావ్. అది రాములువారి గుడి-
వెంటనే గుళ్ళోకెళ్ళి "రామా! నా భార్య నాకు వెంటనే దొరికేలా అనుగ్రహించు స్వామీ!" అని ప్రార్ధిస్తుంటే ఆ పక్కనే చిన్న గుళ్ళో వున్న ఆంజనేయస్వామి చిరునవ్వు నవ్వాడు.
"ఒరే ప్రసాదరావూ - ఇలా నాగుళ్ళోకి రారా" అంటూ పిలిచాడు.
ప్రసాదరావ్ ఉలిక్కిపడి పిలిచింది ఆంజనేయస్వామే అని కన్ ఫర్మ్ చేసుకుని ఆ గుళ్ళోకెళ్ళాడు.
"నన్ను పిలిచింది నువ్వేనా స్వామీ!" అంటూ ఆంజనేయస్వామిని అడిగాడు.
"అవున్రా! నీ అమాయకత్వం చూస్తోంటే నాకు జాలేస్తోందిరా! నీ భార్య నీకు దొరకాలంటే నువ్వు ప్ర్రార్ధించాల్సింది రాములారిని కాదు! నన్నురా!"
"అదేంటి స్వామి? రాములవారు హెల్ప్ చేయడంటారా?"
"ఒరేయ్ పిచ్చివెధవా! ఆ రాములవారి భార్య సీత కనిపించకుండా పోయినప్పుడు ఆయనకు చేతగాకపోతే ఆమెను వెతికి పెట్టింది నేనే కదంట్రా!
ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదంట్రా నీకూ?"
కొంచెం ఫాస్ట్ టైప్ అమ్మాయికి ఓ రోజు కొంపదీసి నేను తల్లిని కాబోవటం లేదు కదా! అన్న డౌటొచ్చింది.
వెంటనే ఓ లేడీ డాక్టర్ దగ్గరకు పరుగెత్తింది.
"బట్టలన్నీ విప్పేయ్-" అంది లేడీ డాక్టర్.
ఆ అమ్మాయి తెగ సిగ్గుపడిపోతూ "బట్టలన్నీ తీయాలంటే నాకు సిగ్గు డాక్టర్" అంది.
"అదేంటి? ఇంతకుముందు ఎవరూ నిన్ను అస్సలు ఎగ్జామిన్ చేయలేదా?" ఆశ్చర్యంగా అడిగింది లేడీ డాక్టర్.
"చేశారనుకోండి! కానీ వాళ్ళంతా మగవాళ్ళు కదా- లేడీస్ తో ఇదే ఫస్ట్ టైమ్-" ఇంకా సిగ్గుపడుతూ అందాపిల్ల.
ఒక రాజకీయ నాయకుడు ఓ సభలో బ్రహ్మాండంగా ఉపన్యాసం దంచేస్తున్నాడు.
"మీకు తెలుసా? ఒక పిరమిడ్ కట్టటానికి వందల సంవత్సరాలు టైమ్ పడుతుందట"
"అయితే అదికూడా మన హైదరాబాద్ లో ఫ్లై ఓవర్స్ కట్టే కంట్రాక్టరే కట్టి ఉంటాడు-" జనంలోంచి అరచారెవరో.
ఓ అపార్ట్ మెంట్ లో ముందు కారు దిగిన ఓ పెద్దమనిషి పార్కింగ్ ఏరియాలో ఆడుకుంటున్న ఓ కుర్రాడిని పిలిచాడు.
"చూడు బాబూ! ఈ అపార్ట్ మెంట్స్ లో రామనాథం గారి ఫ్లాట్ ఏదో తెలుసా?"
"ఓ తెలుస్సార్- పదండి చూపిస్తా" అంటూ లిఫ్ట్ లో నాలుగో ఫ్లోర్ కి తీసుకెళ్ళి ఓ ఫ్లాట్ చూపించాడు-
"ఇదే సార్! రామనాథం గారి ఫ్లాట్-"
"మరి తాళం వేసి ఉందేమిటి?"
"మనం లిఫ్ట్ కోసం నిలబడి ఉన్నప్పుడు లిఫ్ట్ లోనుంచి బయటికొచ్చింది రామనాథంగారే సార్- తాళం వేసి ఎక్కడికో వెళ్ళినట్లున్నారు"
"అరెరె- మరా సంగతి అప్పుడే చెప్పలేదేం?"
"మీరడిగింది ఆయన ఫ్లాట్ కావాలని కదా! రామనాథం గారు కావాలని అడగలేదు కదా!"
మొదటిసారి అమెరికా నుంచి శెలవులో వచ్చిన కొడుకు తిరిగి వెళ్తోంటే తల్లి ప్రేమగా మట్లాడుతోంది.
"చూడ్రా బాబ్జీ! అక్కడెవత్తినయినా తెల్లదాన్ని ప్రేమించి తిరిగేవు సుమా! ఒకవేళ అలాంటిదేమయినా ఉంటే- ముందే నాకు చెప్పేసెయ్-"
"అలాంటి భయాలేమీ పెట్టుకోకు మమ్మీ! జూలీ తిరిగి డైవర్స్ కూడా ఇచ్చేశాను"
కొత్తగా పక్కింట్లో దిగినావిడ పొరుగింటావిడని కలుసుకోడానికొచ్చింది.
"అబ్బ! ఈ నగిషీ చెక్కిన మట్టి పిడత ఎంతో బావుందండీ! దాన్నిండా ఏమిటి వేశారు-"
"మా అయన బూడిద-"
"అయ్యో! అలాగా! సారీ అండీ! ఎంతకాలమయింది ఆయనపోయి?"
"పోయాడని ఎవరన్నారు? అది ఫ్లవర్ వాజ్ గానీ మా ఆయన దాన్ని యాష్ ట్రేగా వాడుతున్నారు-"
"మైగాడ్! నువ్వు - ఇంత అందగత్తెవి- అలాంటి వాడిని పెళ్ళి చేసుకుంటావని కలలో కూడా అనుకోలేదు షర్మీ!"
"నేను మాత్రం అనుకున్నానా ఏంటి? అతని సంపాదన అలాంటిది మరి-"
"నువ్వెలాంటి వాడిని పెళ్ళి చేసుకోవాలను కుంటున్నావో చెప్తే మా బంధువుల్లో అలాంటి బాచులర్ ని వెతికి చూపిస్తాను" అంది రోజా లయతో.
"నాకు పెద్ద కోరికలేం లేవే! నాక్కాబోయే భర్తకు బాగా సంపాదించేంత తెలివీ- అదంతా నాకిచ్చేసేంత తెలివితక్కువ తనం ఉంటే చాలు!"
"ఇక నుంచీ రాత్రి తొమ్మిదిగంటలకల్లా ఇంటికొచ్చేస్తానని ప్రామిస్ చేశారు కదా - మళ్ళీ నిన్నరాత్రి మీరొచ్చేసరికి ఒంటిగంట కొట్టింది. తెలుసా?"
"అదిగో- అందుకేనాకు వళ్ళుమండేది- రాత్రి తొమ్మిదింటికల్లా ఇంట్లో అడుగుపెట్టాను- గడియారం తొమ్మిది కొట్టబోతోంది- అది మోగటం మొదలెడితే నీ నిద్ర పాడవుతుందని గంటలు కొట్టకుండా ఆపడానికి ప్రయత్నించాను- అయితే అప్పటికే అది ఒక గంట కొట్టేసింది"
అడవిలో దొంగతనంగా వేటాడ్డానికెళ్ళిన రాకేష్ చీకటి పడేసరికి దారి తప్పిపోయాడు. రెండు రోజుల వరకూ దారి కనుక్కోడానికి తిరిగాక సడెన్ గా ఇంకో హంటర్ ని కలుసుకున్నాడు.
"అమ్మయ్య! బ్రతికిపోయాను సార్! రెండు రోజులయింది- దారి తప్పి! తిండీ, నీళ్ళూ అన్నీ అయిపోయాయ్ - ఇంక నేను ఇక్కడే ఫినిష్ అనుకుంటూంటే మీరు కనిపించారు" ఆనందంగా అన్నాడు రాకేష్.
ఆ వ్యక్తి చిరాగ్గా చూశాడు.
"ఏడ్చినట్లుంది! నేను దారి తప్పి నాలుగురోజులయింది"
పార్లమెంట్ లో ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ, చెప్పులు విసురుకుంటూ, నేలమీదపడి కొట్టుకుంటూ మైక్ రాడ్స్ తో యుద్దాలు చేస్తున్న ఎంపీలను శాంతపర్చడానికి స్పీకర్ ఒక అఖిలపక్షం టీంని దేశమంతా తిరిగి ఎంజాయ్ చేసే టూర్ ఏర్పాటు చేశాడు.
హిల్ స్టేషన్సూ, హాలీడే రిసార్ట్సూ, అన్నీ తిరిగాక చివరకు వాళ్ళు ఓ నగరంలోని ఫేమస్ మెంటల్ హాస్పిటల్ కెళ్ళారు.