Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 13

       

            -: తాళస్వరూపము తెలియుటవల్ల  ఉపాసించుటవల్ల  గలుగు ఫలము :-

   శ్లో!!    తౌర్యత్రికనిదానంచ ! తాళం కాలస్వరూపిణి
    దశ ప్రాణ సమోపేత, యోజనాతి సతత్వవిత్ !!

    తా: నృత్య. గీత, వాద్య, అభినయము, ఆదికారణమైనదియు, దశ ప్రాణములతో  కూడుకొనియుండు. పరమాత్మయను తాళస్వరూపమును, యెవరు తెలుసుకొందురో. వారు సర్వేళ్వర స్వరూపమును తెలిసినవారగుదురు. స్వరూపము రెండుచేతుల  సంజ్ఞ వంటిది, తీరిక, ముక్తాయి. పాట, గాత్రము ,వాద్యము చేయునప్పుడు  *అవులయ"గా  వేయుదురు, ఘోర నరకమును పొందుదురు.

   శ్లో!!    శివశక్తి  ఆత్మపుణ్యం ! యశశ్యం భుక్తి ముక్తదం !
    ధశ ప్రాణాత్మకం తాళం ! యోజనాతి సతత్వవిత్ !!

    తా: శృతిర్మాతా, శృతి తల్లి వంటిది. నాదము తెలుసుకున్నందున ళివ  అనగా  శక్తి స్వరూపము. కీర్తికరంబును  భుక్తి ముక్తి ప్రదంబును దశ ప్రాణ సహితంబునుయగు తాళమును యెవరు తెలియుదురో వారు బాల స్వరూపమగు సర్వేశ్వరుని  స్వరూపము చూడగలుగుదురు. గాన తాళస్వరూపమును యెవరు తెలుసుకొందురో  వార్కి  అనంతపుణ్యమని  భరతజ్ఞుడు వాల్మీకి చెప్పెను.

                                                   -: దేవధాసీయని నాయకీపుణ్యం :-

   శ్లో!!    లోకేదేవేచ వచసాం ! పాదయోర్గతిరుత్తమా !
    తాళేనై వినా తేనస్కలనంతేషు దశ్యతే !!

    తా: లౌకికము, వైదీక, వాక్కుల. పాదము, సంకల్పము. ఈ అయిదింటిచే స్వరూపమాయెను. అదియే పృథ్వి. అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము. ఈ అయిదురు మనోమయం, అన్నమయం. విజ్ఞానమయం, ఆనందమయం. జాతామయం. ఈ మొత్తముచే స్థూలమై శరీరము అవయవము కలిగినందున  పంచేంద్రియములు పుణ్యమని చెప్పబడెను. ఇవియే పంచేంద్రియముల పుణ్యం.

                                                            -: తా ళ శ బ్దో త్ప త్తి :-

   శ్లో!!    తాళ స్తల  ప్రతిష్టాయా. మితిధాతో ప్రయోగతః !
    నృత్తగీతం తధావాద్యం, యతస్తాలే ప్రతిష్టితం !!

    తా: తలప్రతిష్టాయాం, అనుధాతువునకు ఘ, జ ప్రత్యయమువచ్చి, తధృర్ధితాళ, శబ్దము పుట్టెను, ఈ ధాతువు  ప్రతిష్టార్ధకముగ నున్నది. ఇందు గీత, వాద్య, నృత్తములు నెలకొనియుండును, (మరియు)

                                                                 -: తా ళా వ శ్య క త :-

   శ్లో!!    గీత ప్రధానం ప్రవధంతి, నృత్తం; నృత్తప్రధానం !
    ప్రవదంతివాద్యం, నృత్తగీత  వాద్యచయప్రధానం !
    తత్తాళమాద్యం ప్రణమామినిత్యం !!

    తా: అనగా, నృత్తగీత  వాద్యములకు  తాళము  ప్రధానమనియు తాళమేలేకున్న నృత్తగీత, వాద్యములులేవని  తెలియవలయును.
   
                                                        -: తాళ. నృత్తగీత, వాదోత్పత్తి క్రమము :-
     
   శ్లో!!    వాగ్దేవిధృతపల్లకీ  శతముఖోవేణుం, దధత్పద్మజ !
    స్థాలోనిద్రకరో ,రమాభగవతి గేయప్రయోగాన్విత !!
    విష్ణుస్సాంద్ర మృదంగవాదనపటరేవాసమంతా స్తితా !
    స్సేవంతేతమనుప్రదోషసమయే, దేవంమృడానీపతిం !!

    తా: శివతాండవ పమయమున పార్వతి పరమేశ్వరాత్మకముగా  తాళము పుట్టెననియు, దానిని బ్రహ్మదేవుడు ప్రయోగింపగా విష్ణువు ప్రస్థరించెననియు, అప్పుడీ నృత్యగీతాదులు  పుట్టెనని తెలియుచున్నది.

    అట్లు బ్రహ్మదేవునిచే  ప్రతిష్టంపబడి  ప్రస్థరింపబడిన  తాళమే, సప్తతాళములై నూటొక్కతాళంబు లయ్యెనని తెలియవలయును.

        -: తాళ మెరుంగుటవల్ల ఫలములు :-

   శ్లో!!    శివశక్త్యాత్మకం  పుణ్యం యశస్యం, భుక్తిముక్తిదం !
    దశప్రాణాత్మకం తాళం, యోజనాతినతత్వవిత్ !!

    తా: పార్వతి పరమేశ్వర స్వరూపంబును. పుణ్యఫల  స్వరూపంబును. కీర్తి, ముక్తి, భుక్తి ప్రదంబును, దశ ప్రాణయు క్తంబును  అగు తాళము  సెవ్వరెరింగి  నృత్త, గీత వాద్యంబులు  నడుపునో వారు జగదీశ్వరుని  నెరిగినవా రగుదురని తెలియవలయును.
   

                             తాళము  తెలియకున్న  దోషములు :-

   శ్లో!!    గీత, వాద్యం, చ నృత్యంచ, తాళహీనం  నరాజితే !
    త్రౌర్యత్రికం, చాలయేత్పురుషాధమః !!

    తా: తాళహీనముగా నొనరించిన గీత వాద్య నృత్యములు  ప్రకాశింపకపోవుటయేగాక  ఆ విధముగ నొనర్చిన మనుజుడు వంశపరంపరముగ ఘోర నరకమును పొందును.

                       చతురశ్రజాతి  ధృవతాళం (సప్తతాళ లక్షణములు)

                                                                                               అంగసౌంజ్ఞ 1_0_1_1
                                                                                        అంగములు 4. ల_దృ_ల_ల
                                                                         అక్షరములు 14. 4_2_4_4 = 14 అ!!

 Previous Page Next Page