"లాటరీల నుంచి-"
"అంటే లాటరీ గెలిచానంటావా?"
"నేను కాద్సార్! నాకొచ్చే పదివేల జీతం లాటరీ వేసి ఒక్క రూపాయ్ చొప్పున యాభయ్ వేల లాటరీ టిక్కెట్లు ప్రతి నెలా అమ్ముతున్నాను- లాటరీ గెలిచినా వాడికి నా జీతం పదివేలు వస్తుంది. నాకు యాభయ్ వేలు-"
ఒక కంజూసీ రిచ్ ఫెలోకి ఒక చిన్న ఆపరేషన్ అవసరమని డాక్టర్ చెప్పాడు. ఏదయినా మంచి హాస్పిటల్లో చేరి ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చాడు డాక్టర్.
నగరంలో అతి తక్కువ ఫీజు తీసుకుంటారని పేరున్న ఓ హాస్పిటల్ కెళ్ళాడతను.
లోపల హాల్లోకి వెళ్ళగానే రెండు బోర్డ్ లు కనిపించాయ్ అతనికి.
వి.ఐ.పి- కామన్ మేన్ అని.
వి.ఐ.పి. అని బోర్డున్న రూమ్ లోకెళ్ళాడతను. మళ్ళీ రెండు బోర్డులు కనిపించాయ్ అతనికి. ఒక దాని మీద ఇన్ పేషెంట్ - ఇంకో దానిమీద అవుట్ పేషెంట్ అని రాసుంది.
ఇన్ పేషెంట్ అని రాసున్న గదిలోకెళ్ళాడతను.
ఆ గదిలో మళ్ళీ రెండు బోర్డులు కనిపించినయ్.
ఆపరేషన్ కేస్- నాన్ ఆపరేషన్ కేస్ అని.
ఆపరేషన్ కేస్ అన్న రూమ్ లోకి వెళ్ళాడతను.
లోపలి మళ్ళీ రెండు బోర్డులు.
ఖరీదయిన డాక్టర్లతో వైద్యం, పేరులేని డాక్టర్లతో వైద్యం అని.
ఖరీదయిన డాక్టర్లతో వైద్యం చేయించుకుందాం అని ఆ రూమ్ లోకెళ్ళాడతను.
మళ్ళీ రెండు బోర్డులు కనిపించినయ్.
ఫుల్ చార్జీలు- నిల్ చార్జీలు అని.
కంజూసీ బుద్ది కొద్ది నిల్ చార్జీలు అని వున్న రూమ్ లో కెళ్ళాడు ఆశగా.
తీరా చూస్తే అది అడుక్కుతినే వాళ్ళ సందు.
"ఇక్కడ బాగా సంపాదించాక హాస్పిటల్ రా" అన్న బోర్డుండదక్కడ.
ఒక సెక్సీ సినీతార బాగా పేరు మోస్తున్న సినిమా డైరెక్టర్ ని పెళ్ళిచేసుకుంది.
చాలా రోజుల్తరువాత ఆమెను ఇంకో సినీతార కలుసుకుంది.
"ఎలావుంది అతన్తో లైఫ్?"
"నా మొఖం లైఫ్! యాక్షన్ అంటూ సెట్లో అరవటమే గానీ ఇంట్లో ఆ పలుకే లేదు. నాకింతవరకూ ఒక్కసారికూడా నెల తప్పలేదు-"
"పిచ్చిదానా! పిల్లలు కావాలనుకున్నప్పుడు- పిల్లల్ని ప్రొడ్యూస్ చేసేవాడిని పెళ్ళి చేసుకోవాలే-"
"అంటే ఎవరతను?"
"ప్రొడ్యూసర్-"
ప్రిన్సిపాల్ సెక్రటరీ హడావుడిగా తన రూమ్ లో కొచ్చి తన సెక్రటరీలనూ ఇంజనీర్లనూ సమావేశపరచాడు.
"మన డిపార్ట్ మెంట్ కి ఎలాట్ చేసిన బడ్జెట్ లో ఇంకా ఆరువేల కోట్ల రూపాయలు మిగిలి ఉంది- ఇదంతా ఒక్క సంవత్సరంలో ఖర్చు చేయకపోతే మనందరికీ చాలా కమీషన్ నష్టం వస్తుంది-"
"మనం ఎలాగూ గోదావరి నదిమీద ఒక బ్రిడ్జి కడదామనుకుంటున్నాం కద్సార్! కట్టేస్తే సరిపోతుంది!" ఒకరు సలహా ఇచ్చారు.
"అయినాగానీ ఇంకా నాలుగు వేల కోట్లు మిగిలిపోతాయ్-"
"అయితే ఓ పని చేద్దాం సార్! బ్రిడ్జిని నదికి అడ్డంగా కాకుండా నదితోపాటు నిలువుగా మన బడ్జెట్ అంతా అయిపోయే వరకూ కడదాం- వచ్చే బడ్జెట్ లో ఆ బ్రిడ్జీని గట్టుకు కలపొచ్చు-"
అందరూ తప్పట్లు కొట్టారు.
"మా అమ్మాయి ప్రపంచ యాత్రకు వెళ్తోంది తెలుసా?" ఫ్రెండ్ నడిగాడు రామానుజం.
"ఏమిటి? ఒంటరిగానే?" ఆశ్చర్యపోయాడు కరుణాకరం.
"అవును! భయమేముంది?"
"కానీ- వయసులో ఉన్న అమ్మాయ్ కదా- చాలా మంది వెంటపడతారేమో-"
"అందుకే ఇరవై ఆరు భాషల్లో 'సారీ! అందుకు నేనొప్పుకోను' అనే వాక్యాన్ని నేర్చుకుంది కదా".
ఒక కాలేజీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్ గారు స్టూడెంట్స్ కి పంటధాన్యాలను గవర్నమెంట్ కొనే పద్దతి గురించి చెప్తున్నారు.
"ఇది చాలా సింపుల్ విషయం! రీతులు తమకు అక్కర్లేని ధాన్యాన్ని తమ పొలాల్లో పండించినందుకు, ఆ ధాన్యాన్ని ఎక్కువ ధరకు- తనకవసరం లేకపోయినా ప్రభుత్వం కొంటుందన్నమాట! అలా కొనటం వల్ల అనవసరంగా పండించిన ధాన్యం మీద రైతులు లాభాలు ఆర్జించి, ఆ లాభాలతో ఇంకా బోలెడు తమకు అవసరం లేని ధాన్యాన్ని పండిస్తారు- ఆ ధాన్యాన్ని తమకు ఏమాత్రం అవసరం లేకపోయినా ప్రభుత్వం ఇంకెవ్వరూ కొననంత ఎక్కువ ధర పెట్టి కొని, ఆ రైతులకు లాభం కలుగజేస్తుందన్న మాట - ఆ లాభంతో రైతులు మళ్ళీ తమకవసరం లేనంత ధాన్యం పండించి.....
ఓ చర్చి ఫాదర్ ఇంటికి హడావుడిగా వచ్చిందొకావిడ.
"ఫాదర్! ఇందాక నేనెంతగానో ప్రేమించే కుక్క చనిపోయింది. దాని అంతిమ సంస్కారం చేస్తారా మీరు?" అడిగిందామె విచారంగా.
ఫాదర్ కి కొంచెం చిరాకు కలిగింది.
"కుక్కలకు అంతిమ సంస్కారం జరపటం అనేది మన కాథలిక్ చర్చిలో ఎప్పుడూ జరగలేదు- ఇక ముందు కూడా జరగదు- ఇంక నువ్వు వెళ్ళొచ్చు-" అన్నాడు అసహనంగా. ఆమె చాలా బాధపడింది.
"అయ్యో! ఒకవేళ మీరు దానికి అంతిమ సంస్కారం జరుపుతే రెండు లక్షల రూపాయలు ఇద్దామనుకున్నాను- మా కుక్క బాంక్ ఎకౌంట్ లో రెండు లక్షల పైనే ఉన్నయ్-"
అనేసి వెళ్ళిపోసాగిందామె.
ఫాదర్ ఉలిక్కిపడి "ఒక్క నిమిషం ఆగమ్మా!" అంటూ అరచి పరుగుతో వెళ్ళి ఆమెను కలుసుకున్నాడు.
"ఆ కుక్క ఎవరి దన్నారు? మీదేనా?"
"అవును-"
"అలాగా! మరి అది కాథలిక్ కుక్క అన్న విషయం చెప్పరేం? భలేవారే! పదండి- అంతిమ సంస్కారం చేసేద్దాం-"
ఇద్దరు ఫ్రెండ్స్ బార్లో కలుసుకున్నారు - చాలాకాలం తర్వాత!
నాలుగో పెగ్ కొట్టగానే ఇద్దరూ మనసులు విప్పి మాట్లాడుకోసాగారు.
"నువ్ ఆమధ్య మొగుడ్ని వదిలేసిన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నానన్నావ్ కదా! మరి మీసంసారం హాపీగా ఉందా బ్రదర్?" అడిగాడొకడు.
"ఉంటే బార్ కొచ్చి ఇలా పెగ్గులమీద పెగ్గులు కొట్టటం ఎందుకు?" విచారంగా అన్నాడు రెండోవాడు.
"ఏమిటి ప్రాబ్లెమ్?"
"ఏం చెప్పను గురూ! పెళ్ళయిన మర్నాటి నుంచీ రోజూ దాని మొదటి మొగుడి గొప్పతనం గురించే మాట్లాడుతోంది-"
"అంతేనా? మా ఆవిడ ఇంకా హారిబుల్! తెలుసా?"
"అంటే? తను కూడా మొదటిభర్త గురించే మాట్లాడుతోందా?"
"అలా మాట్లాడినా ఓకే బ్రదర్ - అది తన నెక్స్ట్ హజ్ బెండ్ గురించి తెగపొగుడుతూ చెప్తోంది-"