Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 12

    అంత సుఖం ఇచ్చిన నీ భాగస్వామితో ఆరాధనతో మాట్లాడాలి. అభిమానంతో పలకరించాలి. ఆత్మీయతతో దగ్గరికి తీసుకోవాలి. నాటకం చివర మంగళం పాడతారే అలాగన్నమాట"

    మరో పది నిమిషాలకి వాళ్ళిద్దరూ బయలుదేరారు.

    "చాలా థాంక్స్ ఆంటీ. గురుదక్షిణగా ఏమివ్వమంటావ్?" అతను ఆమె పక్కగా నడుస్తూ అడిగాడు.
 
    "ఏమిస్తావ్?" తేనె తాగిన తర్వాత మాట్లాడినట్లు ఆమె గొంతు తీయగా వుంది.

    "ఏం ఇమ్మన్నా ఇస్తానాంటీ. అదిగో ఆ కనపడే చందమామ కోసుకొచ్చి నీ తలలో పువ్వులాగా పెట్టమంటావా? అదిగో ఆ మెరిసే నక్షత్రాలను దూసుకొచ్చి నీ జాకెట్ కి అద్దాల్లా కుట్టమంటావా?

    లేక ఆ నీలాకాశాన్ని తెంపుకొచ్చి నీకు చీరలా చుట్టేయమంటావా? ఏం కావాలి ఆంటీ చెప్పు" అతను ఆమెతో ఎంత సుఖపడ్డాడో అతని ఆవేశాన్ని చూస్తూనే అర్ధమవుతోంది.

    "అదేమీ వద్దుగానీ గురుదక్షిణగా ఒకటి మాత్రం కోరతాను" అన్నదామె.

    "అడుగాంటీ"

    "ఈత కొట్టేప్పుడు చేతులూ, కాళ్ళూ రెండూ ఆడాలి. ఏ ఒక్కటి ఆడకపోయినా మునిగిపోతావ్. అలానే బెడ్ లో కూడా -ఏ ఒకటి నిలిచి పోయినా ఆ పిల్ల మునిగిపోతుంది. నీలో నాకు కనబడిన లోపం అదొక్కటే. దాన్ని సర్దుకున్నావంటే నీ పెళ్ళాం సుఖపడిపోయినట్టే. ఆ లోపాన్ని సరిచేసుకోవడమే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ" అందామె.

    అతనికి తన లోపం ఏమిటో తెలిసింది. అతను నవ్వుతూ  "అలానే ఆంటీ"అంటూ ఆమె చేతిలో ఒట్టు పెట్టడానికి ఆగాడు.

    గెచ్చకాయ రంగు సాయంకాలం నల్లటి రాత్రిలోకి మారిపోతోంది. అంతవరకూ తిన్నెలమీద కాలక్షేపం చేస్తున్నవాళ్ళు ఆత్మారాముడ్ని సంతృప్తిపరచడానికి ఇళ్ళలోకి జారుకుంటున్నారు. పిల్లలు దీపాలముందు కూర్చుని లెక్కలో, తెలుగు పద్యాలో బట్టీయం పెడుతున్నారు. నాడారు కొట్లోకూడా జనం పలుచబడుతున్నారు.

    తూర్పునున్న రావిచెట్టు దగ్గర్నుంచి తన ఇంటికి పోతున్న సుబ్బారావుకి గంగాధరం ఎదురుపడ్డాడు.

    "ఏరా! ఆకాశవాణి సుబ్బా! ఎక్కణ్ణుంచి?" గంగాధరం అతన్ని పిలిచి అడిగాడు.

    "రావిచెట్టు దగ్గర్నుంచి. ఆకలేస్తుంటే ఇంటికి వెళదామని బయలు దేరాను"

    "ఏమిటి విశేషాలు?" అన్నాడు.

    "ఆఁ సాయంకాలం జరిగింది నువ్వు వినలేదా శ్రీదేవి మొగుడా"

    "ఏం జరిగిందేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు.

    సుబ్బారావు అతని చేయి పట్టుకుని లాక్కెళ్ళి ఎదురుగావున్న తిన్నెమీద కూర్చున్నాడు. ఆ ఇంట్లో ఎవరూ వుండరు. పాడుబడిపోయిన ఇల్లు అది. తన రహస్యాన్ని చెప్పడానికి అది అనువైన స్థలం.

    తనకు తెలిసిన విషయం ఇతరులకి చెప్పందే నిద్రరాదు సుబ్బారావుకి. అందుకే కడుపులో ఆకలి కేకలేస్తున్నా తనకు తెలిసిన సమాచారాన్ని చెప్పడానికి సిద్దపడిపోయాడు.

    "ఏమిట్రా అంత రహస్యం?"

    "సాయంకాలం మునెయ్య కయ్యదగ్గరున్నాడు. ఆ సమయంలో పశువులు వచ్చి పొలంలో పడ్డాయి. పశువులు మేపుతోంది ఎవరనుకున్నావ్? జలంధర, సుబ్బలక్ష్మీ, శాంతి, మంగ వాళ్ళంతా చెట్టుకింద జేరి ఆడుకుంటూవుండగా పశువులు మునెయ్యకయ్యలో పడ్డాయి. అన్ని పశువులు పొలంలోకివచ్చి తొక్కేయడంతో వాడికి కడుపు మండింది.

    ఆడపిల్లల్ని పిలిచి బండబూతులు తిట్టాడు. ఆ తిట్లకు ఆడపిల్లలకి కోపం వచ్చింది.
 
    " ఏదో ఏమరపాటులో వుండగా నోరులేని జీవాలొచ్చి పొలంలో పడితే నాలుక ఎటు తిరిగితే అలా తిడతావా" అని అమ్మాయిలంతా మునెయ్యను ఉతకడం ప్రారంబించారు.

    సంగటి తినే ఆడపిల్లలు గదా, ఒక్కోగుద్దు గుద్దుతుంటే మునెయ్య కళ్ళుబైర్లు కమ్మాయి. పొలంలో జరుగుతోందికాబట్టి ఎవరూ వచ్చి రక్షించే వీలుకూడా లేదు. పరిగెడదామంటే ఆడపిల్లలకి జడిసి పరిగెత్తడానికి వాడికి మనసొప్పలేదు.

    అప్పుడే వాడికి ఓ ఐడియా వచ్చింది."

    "ఏం చేశాడేమిటి?" అడిగాడు గంగాధరం.

    "వెంటనే మొలకున్న లుంగీ విప్పేశాడు. డ్రాయర్ కూడా లేదు. అంతే -అతన్ని చితకబాదుతున్న ఆడపిల్లలు తమ కోపాన్నంతా మరిచి పోయి ఒకటే పరుగు"
 

 Previous Page Next Page