ఒకటి:______ ట్రేట్మెంటు పద్దతికి మూలసూత్రము పరులయార్తినిగూర్చి ఆపుకోలేని యనుతాపము, ఆ బాధ తనకే కల్గినడా యన్నంత బగపు ఆ యనుతాపము ఆ బాధ తనకే కల్గినదా యన్నంత వగపు. ఆ యనుతాపమే బాదితుల యార్తిని దిర్చును, ట్రేట్మెంటు సలుపువాడు "ఏది! నాప్తె నిమత్రంము ప్రయోగింపు చూత" మను తిరున నుండ రాదు. అట్టిచో నేమియు జరుగదు.
ప్రధమమున శ్రీ శాస్త్రిగా రితరుల బాధనుగూర్చి తపించుతేగాని, అందువలన ప్రయోజన ముండుననిగాని, రోగ నివారణ జరిగినదని గాని గమనించ లేదు. కాని కొన్ని మారులు తివ్రానారోగ్యముచే బాధపడువారిని జూచి శ్రీ శాస్త్రిగారు దుఃఖితు లగుటయు, అతిశిఘ్రముగా వ్యాధి నివారింపబడుటయు గమనించి నిర్హేతుక జాయమానమగు అనుకంపమే సర్వరోగనివారక మని తెలిసికొనిరి.
మఱియు స్వపరభేదములను పాటించినచో ట్రేట్మెంటు పని చేయదు. మానవుల నందఱను నేకకుటుంబముగా జూచు సమత్వబుడ్డి యేర్పడినకొలది ఈ ట్రేట్మెంటు విధాన మద్భుతఫలితముల నిచ్చును. ఈ యోగము ననుసరించువారు పలువురున్నను ని ప్రత్యేకార్హత శ్రీ శాస్త్రిగారికే యబ్బుటకుకారణము వారి అపారకరుణాస్వభావమే కాని ట్రేట్మెంటు చేయువారికి ఆయా రోగుల బాధలు శేరిరకముగా చాయా మాత్రము కల్గుటయు నిజమే. 1926 ప్రాంతములో శ్రీ శాస్త్రిగారు బాహాటముగా, నిత్యకృత్యముగా ట్రేట్మెంటు నవలంబించినపుడు పలువురు మిత్రులి కారణమును జూపి వారింపఁజూచిరట! ఆ నాఁటిధ్యానములో శ్రీ శాస్త్రిగారు తమ గురు దేవులతో నీరీతి విన్నవించిరట___"నిజముగా పరులబాధ తొలంగి ఆ కారణమున నాకు బాధ కల్గినను సమ్మతింతును ఆ తోలంగించునది నేనుకాదు. ణా వెనుక నీవే దాగియున్నావు. సర్వదయామాయుడ వ్తెననివు నావలన పరుల బాధలను తొలగించి నన్ను బాధలో ముంతు వని నేను వేరతునా? ని వెనుక నేను దాగ నేరనా?" ఈ విషయమునే దెలుపుచు శ్రీ శాస్త్రిగారు రచించిన పద్యములు:
స్వామి ఆంతరనిలయా స్వయం వ్యక్తమ్తె వెలయ
నాయజ్ఞానావరణము నాశముఁ జేయు మహాత్మా
నే నను నయదమాధమ నిర్వాహము తొలగించి
నీలో నను గలపుకొని సెగడగదే పరమాత్మా.
నాలో గల వని యెఱుగక నానా బాధల పడితిని
త్రో వెఱిగీతి నిప్పటికి దుఃఖము తిలగెను దేవా,
దేవర ణా కిదేహము దేవళ మ్తె వెలసినది
చక్కగా నెలకోని విశ్వస్వామిత్వము నేఱపగదే!
అద్దమువలే దేహం బిది యమలినముగ జేసికొని
నిద్దపుని తేజము జగదుద్దిప్తము చేయగదే!
అనుక్షణము త్వన్మయతాహ్లాదము హేచ్చేడువిధమున
క్షణక్షణము మన్మయమ్తె జ్వలియింపగదే దేవా!
అహంకారం మమకారము లడగార్చి క్రమక్రమముగ
కరగజేసికొని నీలో కన్నాతండ్రి! గడతెర్చుము.
నాచాటున డాగియె దోబూచులాడు చున్నావా?
చూచితి నిక నే నెమఱ నీచాటున డాగేదను.
వేను కడుగిడ నిక నాథా! వెఱపు జెంద నిక నాథా!
కడతేఱెద నిక నాథా ! కల్యాణం బిక నాథా.
ఆ నాటి నుండి శ్రీ శాస్త్రిగారు దేహమును విడు తుదిక్షణము వఱకు నేకదీక్షతో ననేక భయంకరజాడ్యము లను మాన్చిరి నిజాము గా ట్రేట్మెంటువలన నెట్టి యపకార మ్తెన జరిగియే యున్నచో వారు భౌతిక కాయము నెన్నడో విడియుండవలసినది, క్షయ, జాలోదరము, ఉబ్బసము, మేనింజ్తేటిస్, గుండెజబ్బు, పాముకాటు మున్నగు ఉపద్రవముల నెన్నింటినో వారు చక్కబరచిరి. ఈ యోగ చికిత్సావిధానమున వారికి పాతిక సంవత్సములకు మించిన యనుభావము గలదు. అందు వారే పరమ ప్రామాణికులు!
విశేషించి వారిట్లు చెప్పేడువారు " పరుల యనా రోగ్యములను సవరించు నెడ మన యనారోగ్యములు కూడా తొలగును" అని ఇది మాలో పెక్కు రకు అనుభవపూర్వకముగా విదితమ్తెన విషయము.
"దయగుణము బలవంతముగా తెచ్చి పెట్టుకోనునది గాదు, అది ఆకసమునుండి పుడమిప్తె పడు చల్లని జల్లువంటిది.